రాత్రి సాక్షి టి.వి.లో సాక్షి సలాం కార్యక్రమంలో సికందరబాద్లోని ఓ శ్మశాన వాటిక (బొందలగడ్డ) లో ఇల్లు లేని చాలా కుటుంబాలు అందులో నివాసముంటున్నారని చూపించారు. వారితో మాటాడించారు. అక్కడి పిల్లలు, స్త్రీలు ఏ భయమూ లేకుండా జీవిస్తున్నా తీరును చూపించారు. వారిలో ఎవరిని కదిపినా గూడులేక మరో మార్గాంతరం లేక ఇక్కడ వుంటున్నామని అన్నారు. వారి పిల్లలు అక్కడి బొమికలు, పుర్రెలతోనే క్రికెట్ ఆడుకుంటున్న తీరు చూసేవాల్లకు మనసువుంటే ఎంతగా బాధపెడుతుందో అనిపించింది. ఎందుచేతనంటే మన దినసరి కార్యక్రమాలలో ఇటువంటి వాటిని షరా మామూలుగా తీసుకునే దళసరి తోళ్ళుగాల్లమైపోయాం కదా? మీకు శవాలు కాల్చేటప్పుడు భయమేయడం లేదా అంటె అంతా లెదని చెప్పారు. కాని చిన్న పిల్లలను తెచ్చేటప్పుడు మాత్రం భయమేస్తుందని ఒక పాప చెప్పడం హృదయాన్ని ద్రవింప చేసింది. దేశంలో లక్షలాది ఎకరాల భూములను నేటికి 500 మంది సెజ్ కంపెనీల వాళ్ళకు ధారదత్తం చేస్తున్న ఈ 63యేళ్ళ వృద్ధ స్వతంత్ర భారతావనిలో సామాన్యుల పట్ల మన రాజాధి రాజులకు వున్న బాధ్యత ఏపాటిదొ అవగతమౌతుంది. కనీసం వుండటానికి గూడు లేని వాళ్లు నేటికి లక్షలాదిగా మిగిలి వుండడం మన దౌర్భాగ్యాన్ని తెలియచేయడం లేదా. లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్ ఎటువైపు వెళుతోందో మనకు అవగతం కావాలి. వున్నవాడు మరింత వున్నతంగాను, లేని వాడు మరింత అధోగతి పాలు కావడానికి మన పాలకుల నిర్వాకం కారణం కాదా. సామాన్యుడు ఏమి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. కాని తమ కుటుంబాలు ఎల్లకాలం పరిపాలనా పగ్గాలు చేపట్టేందుకు కావలసిన ప్రణాలికలు వేసుకోవడానికి కుక్కలకు బొమికలు విసిరినట్లుగా కొన్ని పధకాలను విసిరికొట్టి తమ ఆస్తులను మాత్రం లక్శ్లాగి కోట్ల రూపాయలకు పెంచుకొనేందుకు నిత్యము మార్గాలు అన్వేషిస్తున్నారు. అన్ని పాలక పక్షాలు ఈతీరుగానే సాగుతున్నాయి. ఓట్లనాడు కాట్ల కుక్కలల్ల ఒకడి మీద ఒకడు పడి కరుచుకు చచ్చే వీళ్ళు వారి అవసరం తీరంగానే ఎంత ధైర్యంగా వారు చేస్తున్న రాచకార్యాలన్ని మనలను అడిగి చేస్తున్నట్టుగా ఫోజులు కొడుతూ సామాన్యుల వెతలను ఖాతరు చేయని వీళ్ళకు గుణపాఠం నేర్పేదెప్పుడో. దరిద్రో నారాయణో హరీ అని దరిద్రులను దేవుళ్లను చేసేసే వీళ్ళ కుట్రలను గ్రహించి నారాయణుల౦తా ముక్కంటిలై వీళ్ళను భస్మం చేసేదెన్నడో.
26, జూన్ 2009, శుక్రవారం
17, జూన్ 2009, బుధవారం
చారు బాబు నవ్వాడు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా లాల్ఘర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని వందలాది గిరిజనులు పోలీసు దాడులప్రతిఘటనా కమిటీ గా ఏర్పడి గత నాలుగురోజులుగా స్థానిక సి. పి. ఎం. కార్యాలయాలను తగులబెట్టి ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనపరచుకొని పోలీసులు, ప్రభుత్వ పారామిలటరీ దళాలు రాకుండా రోడ్లాన్నీ దిగ్బంధం చేసినారని వార్తా కధనాలు వస్తున్నాయి. టి. వీ.లలో కూడా చూపిస్తున్నారు. స్థానిక మావోయిస్టు నాయకుడు బుధదేవ్ ను ప్రజల తీర్పుమేరకే హత్యచేసేందుకు మందుపాతర పెల్చామని ఇంటర్వ్యూ ఇచ్చాడు. మార్క్సిస్టు కార్యకర్తల ఆగడాలు పెచ్చరిల్లి, ప్రభుత్వ పోలీసు దళాలు వారికి అండగా నిలవడంతో ప్రజలు ప్రతిఘటన రూపాలను మార్చుకున్నారు. పోలీసు వేధింపులకు నిరసనగా ఇక్కడి గిరిజనులు పీపుల్స్ కమిటీ పేరిట ఉద్యమిస్తున్నారు. ప్రజలు మరో నక్సల్బరీ ఉద్యమం వైపు అడుగులేస్తున్నారు. ఇది ఆహ్వానించవలసిన విషయం. ప్రస్తుత పార్లమె౦టరీ ప్రజాస్వామ్య ప్రభుత్వాల పరిపాలనలో వీటికి ప్రత్యామ్నాయంగా ప్రజల వైపు నిలబడుతున్నడి మావోయిస్టు పార్టీ మాత్రమేనని నిరూపితమవుతో౦ది. ప్రస్తుత పాలక పార్టీలన్నీ వాళ్ల వాళ్ల వ్యాపారాలకు నశ్ట౦ రాకు౦డా ఒప్ప౦దాల మద్య పాలన సాగిస్తూ అమెరికన్ సామ్రాజ్య వాదుల తొత్తులుగా తయారయిన క్రమ౦లో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు రాక తప్పదు. సెజ్ ల పేరుతొ వ్యాపారా సామ౦త రాజ్యాలనేర్పాటు చేసుకు౦టున్న పాలక వర్గాలు రైతా౦గాన్ని వ్యవసాయర౦గ౦ను౦డి తాపి౦చి కూలి జన౦గా మార్చుతూ తమ దోపిడీని నిరాట౦గా కొనసాగి౦చే౦దుకు కోబ్రాలు పేరిట ప్రత్యెక దళాలను తయారు చేస్తూ క్రూర నిర౦కుస చట్టాలను ప్రయోగి౦చడానికి ఉద్యుక్తులవుతున్న క్రమ౦లో ప్రజల ను౦డి మరిన్ని ప్రతిఘటనా పోరాటాలు పెల్లుబుకుతాయి.
(ఆ౦ద్రజ్యొతి లో వార్తకు స్ప౦దనగా)
(ఆ౦ద్రజ్యొతి లో వార్తకు స్ప౦దనగా)
15, జూన్ 2009, సోమవారం
మృగాళ్ళ రాజ్యం
మృగాళ్ళాంటి మగాళ్ళు సంచరించే లోకమిది! నదివీధిలోనైనా, నట్టింట్లోనైనా ... మగువకు రక్షణ లేదని మరోమారు రుజువైంది. రాష్ట్రంలో అబలలపై జరుగుతున్న దారుణాలకు అంతులేకుండా పోతోంది. నిన్నను అనంతపురం, నెల్లూరులలో జరిగిన సంఘటనలు మరీ భయనకంగా వున్నయి. స్త్రీలపై దాడులు మరింతగా మహిళా గృహమంత్రి పాలనలోనే అధికంవడం వారి దురద్రుష్టం. అనంతపురంలొ బహిరంగ మార్కెట్లొ భర్త చూస్తుండగానె ఆటోలొ ఎత్తుకుపోయి అత్యాచారం చేసారు. ఈవిషయాన్ని అటుగా వస్తున్న పోలీసు వారికి చెప్తే అది తమ పరిధిలోని ఏరియా కాదని నిష్కర్షగా, నిర్లజ్జగా వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం. రాష్ట్రాలు దాటి అరెస్టులు, ఎదురుకాల్పులు జరిపుతున్నప్పుడు తమ పరిధి గుర్తుకురాదు వీల్లకి. నెల్లూరులొ తన వాంచ తీర్చలేదని 15 యేల్ల బాలికను కెరోసిన్ పోసి ఒకడు చంపాడు. రోజు రోజుకు మహిలలపై దాడులు పెరిగిన తీరు బట్టి సమాజంలో పెరిగిపోతున్న నేరప్రవృత్తి, మనుషుల మనసులపై సినిమాల, సీరియల్ల ప్రభావం, దబ్బు, అధికారంలతో అమైనా చేయగలమనే ధైర్యం కలుగుతుండడం సమాజానికి మంచిది కాదు. దీనిని అందరూ గుర్తించి జాగరూకత వహించాలి.
13, జూన్ 2009, శనివారం
ద్వంద్వ ప్రమాణాలు
నేడు సమాజంలో ప్రతి విషయంలో ద్వంద్వ ప్రమాణాలు రాజ్యమేలుతున్నాయి. ఉన్నతస్థాయి పదవులు మహిళలకు కట్టబెట్టామని చెపుతున్న రాజకీయ పార్టీలు రోజువారీ జరుగుతున్నా దారుణాల పట్ల చూసీ చూడని ధోరణి అవలంబిస్తున్నాయి. ఒక దళిత మహిళను పార్లమెంటు అధ్యక్ష స్థానంలో కూచోబెట్టిన రోజే అనేకమంది మహిళలపై దారుణాలు జరిగిపోయాయి. అవికూడా రక్షక భటుల సాయంతో జరిగినాయని వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఒక మహిళా హోం మంత్రిగా వెలగబెడుతున్నప్పుడు వరుసగా ఇలాంటి దారుణాలు వెలుగులోకి వచ్చినా సరైన న్యాయం జరిగిన దాఖలాలు లేవు. చాల మామూలుగా శాఖా పరమైన దర్యాప్తులతో సరిపెడుతున్నారు.
అలాగే ఒకవైపు అవినీతి నిరోధక శాఖ వారిని వుసిగోలుపుతున్నట్లు ప్రకటనలు ఇస్తూ మరోవైపు ఎన్నాళ్ళుగానో అవినీతి ఆరోపనలేడుర్కున్న వారిని ప్రమాణ స్వీకార కార్యక్రమాల దగ్గరనుంచి రోజువారి పనులలో కూడా వెంటపెట్టుకు తిరిగుతున్న నాయకమ్మన్యులు మన ఏలికలు. ప్రజలవైపు మాటాడేవారిని తీవ్రమైన హెచ్చరికలతో భయపెడుతూ, మట్టుపెడుతూ తమ గోముఖ వ్యాఘ్రముఖాన్ని రోజూ చూపడం ప్రజల నిస్సహాయతను బయటపెడుతోంది. ప్రజలు తమకు మరో ఐదేళ్లు వరకు బానిసలుగా పడివు౦టారన్న ధైర్యం, ప్రతిపక్షం వారుకూడా ఎన్నికల వరకూ వాళ్ల వ్యాపారాలు కొనసాగాలన్న తమతో కలిసిరాక తప్పదన్న నాజీ ధోరణి ప్రస్ఫుటంగా కనబడుతోంది. దీనిని తొందరగా బద్దలుకొట్టే౦దుకు అంతా సమాయత్తం కావాల్సిన అవసరం వుంది.
నాకు యిష్టమైన వాక్యం
'నేను మట్టిగావడంక౦టే బూడిదగావదానికే ఇష్టపడతాను. కుళ్ళి కృశించి నసించడానికిబదులు నాలోని ప్రతి అణువూ భగ భగ మండే మంటల్లో ఆహుతవాలనుకు౦టాను. మందకొడిగా, ఒక శాశ్వత గ్రహంగా ఉ౦డట౦ క౦టే దేదీప్యమాన౦గా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలనుకు౦టాను. మనిషన్నవాడు జీవించాలి. బతుకీడ్చడం కాదు'.
.....జాక్ ల౦డన్
.....జాక్ ల౦డన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)