ఈ రోజు భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరునవ్వుతో ఉరికొయ్యను ఊగి ఈ దేశ యువతరానికి విప్లవకర సందేశాన్నిచ్చిన కా.భగత్ సింగ్ ౧౦౨ వ జన్మదినం. పంజాబ్ లోని లాయల్ పూర్ జిల్లా (ఇప్పుడు పాకిస్తాన్లో వుంది), ఉ.9 గం.లకు జర్రానవాలా తాలూకా బంగా గ్రామంలో కిషం సింగ్ – విద్యావరి దంపతులకు 1907 వ సం.లో జన్మించాడు.
భగత్ సింగ్ కుటుంబమంతా స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారే. భగత్ సింగ్ జన్మించిన మూడేళ్ళకే లాహోర్ సెంట్రల్ జైలులో తీవ్ర నిర్భంధం అనుభవించి క్షయ వ్యాధికి గురై 32 ఏళ్ళ చిన్న వయసులోనే తన చిన్నాన్న స్వర్ణ సింగు మృతి చెందారు. వీరి ఆశయాలను వంటబట్టించుకొని చిన్న నాటినుంచే భారత దేశ స్వేచ్చా స్వాతంత్ర్యాలను కలలు కంటూ పెరిగిన వాడు.
విధ్యార్ధి దశలోనే 1921 సెప్టెంబరులో గాంధీ పిలుపునందుకొని కాలేజీనుంచి బయటకు వచ్చేసాడు. తన రాజకీయ జీవితంలో కొంతకాలం అతివాద దుందుడుకు చర్యలకు పాల్పడినా మార్క్సిస్టు రచనల అధ్యయనంతో భారత దేశంలో కూడా రష్యా దేశం వలే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కార్మిక వర్గ విప్లవాన్ని కాంక్షించాడు.
తొలుత బ్రిటిష్ పోలీసు వాడి దెబ్బలకు లాలాలజపతి రాయ్ మరణించడంతో ప్రతీకారంగా సాండర్సును మట్టుపెడతాడు. తరువాత నాటి చెవిటి ప్రభుత్వానికి ఈ దేశ ప్రజలనుభవిస్తున్న నిర్భంధాన్ని, దారిద్ర్యాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నంలో నాటి పార్లమెంటులో పొగబాంబులు వేసి స్వచ్చందంగా అర్రెస్టు కావడం ఆయన జీవితంలోముఖ్య ఘట్టాలు. 1926 లో లాహోర్ లో నౌజవాన్ సభ స్తాపించి యువకులను విప్లవ పథం వైపుgగానడిపించాడు. తరువాత 1928 లో హిందూస్తాం రిపబ్లికం అసోసియేషం సైనిక విభాగం హిందుస్తాన్ రిపబ్లికన్ ఆర్మీని ప్రారంభీంచి దానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టడం , ఆగస్టు 8 నాడు ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదాన౦లో జరిగిన హెచ్ ఆర్ యె సమావేసంలో స్వాతంత్ర్యాన్ని ,సోషలిజాన్నీ భరతదేశపు లక్ష్యాలుగా ప్రకటిచడ౦తో నాటి కాంగ్రెసు వాదులకు కంటగింపయింది. ఏప్రిల్ 8, 1928 నాడు ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేసి, ఎర్ర కరపత్రాలు పంచి స్వచ్చందంగా అరెస్టు కావడం.
భగత్ సింగ్ తాను రాసిన అనేక వ్యాసాలు, ఉత్తరాల ద్వారా తాను నాస్తికున్నని సోషలిస్టు విప్లవకారుడుగా నిరూపించుకున్నాడు.నిరంతరం జైలులో కూడా కా.లెనిన్ రచనలు అధ్యయనం చేసేందుకు తద్వారా భారత దేశవిముక్తి పోరాటాన్ని నడిపించెందుకు ఆసక్తి చూపారు. రష్యా దేశానికి పరిశీలకునిగా తన మిత్రుడ్ని పంపించాడు.
దీనివలన ఆయన బ్రతికి వుంటే ఈదేశపు స్వాతంత్ర్య కాంక్ష విప్లవ పథం వైపుగా నడిచి కార్మిక వర్గ తిరుగుబాటుగా రూపాంతరం చెంది తమ వ్యాపార వర్గ పునాదులు పెకలింపబడతాయని భయపడిన నాటి బ్రిటిష్ మరియు భారత పెట్టుబడిదారీ వర్గం తమ ఏజెంటు అయిన గాంధీ ద్వార కనీస ప్రజాస్వామిక వత్తిడి రాకుండా జాగ్రత్త పడి ఇర్విన్ ఒడంబడికను కుదుర్చుకొని అదే నెలాఖరులో రహస్యంగా ఉరితీయించింది. ఇది చరిత్ర చెప్పిన నెత్తుటి నిజం. గాంధీలో దాగివున్న వ్యాపార వర్గ అనుకూల వాది ఈ సంఘటనతో బయటపడ్డాడు.
కా. భగత్ సింగ్ చూపిన విముక్తి మార్గం నేటికీ సజీవమై ముందుకు సాగుతున్నది. నేడు ఎందరో యువ కిశోరాలు తమ నెత్తుటి త్యాగాలతో భగత్ సింగ్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వారికి మన విప్లవ జోహార్లు అర్పిద్దాం. ఇంక్విలాబ్ జిందాబాద్.