స్మృతిలో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్మృతిలో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఫిబ్రవరి 2014, బుధవారం

దేవుడిపై యుద్ధం ప్రకటించావా?


దేవుడిపై యుద్ధం ప్రకటించావా?

సరే
....

నీ దగ్గర ఆయుధమేముంది?

కలం
...

యిది చాలా ప్రమాదకమైనది

ఉరితీయండి వీడ్ని
...

అత్యంత ప్రమాదకరమైన ఆయుధం
మనసులలోకి దూసుకు పోయే ఆయుధం
...

మతమా నువ్వు మరణిస్తే కానీ
మానవత్వం బతకదు
...

రాజ్యమా నువు సమాధి అయితే కానీ
ప్రపంచం వికసించదు
...

హాషిం షబానీ
నీ మెడ ఎముక విరిగినా
నీ పాళీ విరగలేదు

నీ మరణం చిరస్మరణీయం

(ఇరాన్ లో మైనారిటీ అరబ్ జాతీయుల హక్కుల కోసం పోరాడిన కవి హాషిం షబానీ నిజాద్ ని మూడేళ్ళు బంధించి చిత్రహింసలకు గురిచేసి జూలై 2013 లో ఉరితీసారని చదివి)

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కా. చాయారాజ్ అమర్ రహే


విప్లవ కవి సిక్కోలు గొంతు జనసాహితీ వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ చాయారాజ్ ఈ రోజు ఉదయం 8.30 గం.ల ప్రాంతంలో శ్రీకాకుళంలో తుదిశ్వాస విడిచారు. ఆయన రచనలు శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం), గుమ్మ (కొండ కావ్యం), దర్శని (కావ్యం), నిరీక్షణ (దీర్ఘ కవిత), మట్టి నన్ను మవునంగా ఉండనీయదు (కవితా సంపుటి) బుదడు (కావ్యం). మొన్న 18న ఆయన రచన 'కారువాకి' (నవల) శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఇవన్నీ ఆయన ఉద్యమాలలో తనను తాను ఆవిష్కరించుకునే క్రమంలో రాసిన కవిత్వం.

బుదడు కావ్యంలో చివరిగా చాయారాజ్ గారన్నట్టు " కవీ! మృత్యువు నీకు బంధువు, నీ కోర్కె ప్రకారం నిన్ను విశ్వ సౌందర్యంలోనికి ఒంపేస్తుంది. ఉషస్సులలో, సంజలలో, ఎండ్లల్లో వెన్నెల్లో ఇంకిపోతావు. అనంతమైపోతావు. ఎందుకూ మిగలవు. ఎవరికీ తగలవు. " మృత్యువు అతనికి ప్రియురాలు. అతడ్ని ధ్వంసం చేస్తుంది. మళ్ళీ మళ్ళీ పునర్ నిర్మిస్తుంది. ఒక అసంతూప్రి స్థితిని సంతృప్తపరిచేందుకు - ప్రేరణ ప్రతీకార చర్యలే జనన మరణ నిజాలు".

నిజమే. చాయారాజ్ మాస్టారుని మృత్యువు కేన్సర్ రూపంలో తనను కబళించినా మనందరిలో తన స్ఫూర్తిని మిగిల్చిన కావ్యాలాపన ద్వారా మనల్ని పునర్నిర్మించే మరో కార్యసంబంధమైన పనిలోకి ఈ మట్టిలోలోపలికి ఇంకిపోతూ ఇగిరిపోతూ అమరులయ్యారు.

జోహార్ కా.చాయారాజ్ జోహార్
మీ ఆశయాలను కొనసాగిస్తాం..

9, ఆగస్టు 2013, శుక్రవారం

ఆగస్ట్ - 9...


ఆగస్ట్ 9.. గత పదిహేనేళ్ళుగా అంటే 1998 నుండి నన్ను వెంటాడే రోజు.. గుండెనంతా దు:ఖం పట్టి జ్ఞాపకాలన్నీ తెరలు తెరలుగా కనుల ముందు కదలాడే రోజు. ఒడిసా రాష్ట్రంలోని కోపర్ డంగ్ అటవీ ప్రాంతంలోకి ఆంధ్రా గ్రే హౌండ్స్ ప్రవేశించి తెల్లవారుఝామున గ్రామాన్నంతా చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆదివాసీ చిన్నారులను, వారి పశు సంపదను కూడా గురి చూసి కాల్చి బీభత్సంగా ఆధునిక ఆయుధాలతోను గ్రైనేడ్స్ తోను దాడి చేసి 13 మంది అప్పటి పీపుల్స్ వార్ పార్టీ కళీంగాంధ్ర నాయకత్వాన్ని హత్య చేసారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా హెలికాప్టర్లనుండి వెతికి కాల్పులు జరిపిన సంఘటన ఇదే. ఒక పోలీసు స్టేషన్ పరిధి దాటి కేసు నమోదు చేయని శాఖ ఇలా వేరొక రాష్ట్ర భూభాగంలోకి చొరబడి కాల్పులు జరిపి హత్య చేయడం న్యాయస్థానంలో ప్రశ్నించినా జవాబు రాలేదు. ఇదీ ఈ రాజ్యంలోని నాలుగు కాళ్ళ న్యాయం. సరిహద్దులు చెరిపేసిన ఎదురుకాల్పులుగా కోపర్ డంగ్ మొదలయింది. 

ఏ ఆదివాసీ ప్రజల స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ఈ దేశ విముక్తి ముడిపడి వుందో వారిని ప్రలోభ పెట్టే ఆదివాసీ మేళాలను వ్యతిరేకిద్దాం. 

ఆదివాసీ పోరాటాలకు సంఘీభావం తెలియజేద్దాం. 

అమర వీరుల ఆశయాలను కొనసాగిద్దాం. 

29, జూన్ 2013, శనివారం

నల్ల సూరీడు..




















 నువ్వలానే గుర్తు నాకు
చూపులలో విస్ఫులింగాలను ప్రతిఫలిస్తూ
పిడికిలెత్తి పోరాట పతాకాన్నెత్తి పట్టినట్టు...

చీకటి ఖండంలో వెలుగులు నింపే
నీ యుద్ధ దరహాసం మెరుస్తున్నట్టు...

ఎందుకో
మరల మరల
అదే మాట మండే సూరీడు మండేలా
అంటూ గుండెల్లో పోటెత్తావు...

కానీ

పాతికేళ్ళు చీకటి కొట్లో దాచిన
వాడి జాత్యహంకారం నీకో శాంతి బహుమతినిచ్చినప్పుడు
చాచిన నీ చేతులు అంటే కోపమొచ్చింది...

నిన్నో స్టాంపును జేసి ఉమ్మినంటించే
వాడి కుట్రను నవ్వుతూ స్వీకరించావని
కోపమొచ్చింది...

అయినా
ఎప్పటికీ నల్ల సూరీడంటే
గుర్తుకొచ్చేది నువ్వే నువ్వే...

(మండేలాకు ప్రేమతో)


18, జులై 2012, బుధవారం

కా.గోరు మాధవరావు అమర్ రహే...

అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధమ అధ్యక్షునిగా పనిచేసిన కా.గోరు మాధవరావు గారు రోజు సాయంత్రం తన స్వంత గ్రామం జింకిభద్రలో (సోంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా) అస్వస్థతతో కన్నుమూసారు. ఆయన తన జీవిత కాలమంతా విప్లవ ప్రజా పంథానే నమ్మారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం నుండి మొదలైన ఆయన విప్లవాచరణ తరువాత కొండపల్లి సీతారామయ్య గారి నేతృత్వంలోని పీపుల్స్ వార్ పార్టీలో క్రియాశీలకంగా విప్లవాచరణలో తన సహచరిణితో పాటుగా పాల్గొన్నారు. తరువాత జరిగిన పరిణామ క్రమంలో మావోయిస్టు పార్టీ ఆద్వర్యంలో కూడా అదే తీరున ఉద్యమాలకాలంబనగా కృషి చేసారు. పార్టీ ప్రచురణలైన దిక్సూచీ ప్రచురణలకు చిరునామాగా ఆయన అడ్రసునే వుండేది.

ఎన్ని రకాలుగా నిర్బంధాలు అమలు చేసినా అకుంఠిత దీక్షతో, నిబద్ధతతో విప్లవం పట్ల దృఢ నమ్మకంతో చివరి వరకు వున్నారు. పోలీసులు ఆయనను ఆ వయసులో కూడా పిలిచి భ్రమలలో ముంచెత్తే ప్రయత్నంగా అనేక మార్లు కౌన్సిలింగ్ నిర్వహించే ప్రయత్నంచేస్తే వారికి తిరిగి విప్లవాచరణ గురించి చెప్పి వచ్చిన ఉద్యమాభిమాని కామ్రేడ్ గోరు మాధవరావు.

ఎనభై ఏళ్ళు వచ్చాయి యింకా మీరు సమావేశాలకు హాజరు కావడం, సందేశాలివ్వడం ఎలా సాధ్యమవుతుంది కామ్రేడ్ అని ఎవరైనా అంటే నాడు నాటు తుపాకులతో మొదలైన ప్రస్థానం ఆరోజుల్లో వర్షం పడితే పేలని తుపాకులతో నానా అవస్థలు పడిన కాలం నుండి నేడు అత్యంతాధునిక ఆయుధాలు కలిగిన ప్రజా గెరిల్లా సైన్యంగా రూపాంతరం చెందినాం కదా మనం యింతకంటే స్ఫూర్తి ఏం కావాలి నాకనేవారు. ఎల్లప్పుడూ ఒకే రకమైన ఆలోచనతో, భారత దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవానికి తన వంతు ఆచరణతో కృషి చేసిన కా.గోరు మాధవరావు గారి విప్లవాచరణ అందరికీ ఆదర్శప్రాయం..

5, ఆగస్టు 2011, శుక్రవారం

కా.సరోజ్ దత్తా స్మృతిలో...


ఈ దేశ ప్రజల విముక్తి కొరకు ప్రాణాలర్పించిన మొదటి రాష్ట్ర కమిటీ నాయకుడు (అవిభక్త సి.పి.ఐ.ఎంల్ పార్టీ), కవి, రచయిత కా.సరోజ్ దత్తా అమరుడైన దినం.

కా.సరోజ్ దత్తా వెస్ట్ బెంగాల్ లోని జెస్సోర్ లోని భూస్వామ్య కుటుంబంలో పందొమ్మిది వందల పద్నాలుగు లో జన్మించారు. కలకత్తా యూనివర్శిటీలో ఇంగ్లీషులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాక అమృతబజార్ పత్రికలో నలభైల ప్రాంతంలో చేరారు. ఆ తరువాత పూర్తికాలపు కార్యకర్తగా భారత కమ్యూనిస్ట్ పార్టీలో 'స్వాధీనత' సంఘంలో చేరారు. 'పరిచయ్' అనే సాంస్కృతిక పత్రికకు సంపాదకునిగా కూడా పనిచేసారు.

అరవై రెండులో కా.సరోజ్ దత్తా కా.చారుమజుందార్ను జైలులో కలిసారు. ఆ తరువాత సిపిఐ నాయకత్వపు డెంగీ సిద్ధాంతానికి వ్యతిరేకిస్తూ మార్క్సిస్ట్ పార్టీలో అరవై నాలుగు చీలిక సందర్భంగా చేరారు. కానీ ఈ నయా రివిజనిస్ట్ నాయకత్వం అనుసరిస్తున్న కృస్చేవ్ మార్గాన్ని వ్యతిరేకించి సుశితల్ రాయ్ చౌదరి, అసిత్ సేన్ వంటి వారితో కలిసి మార్క్సిస్ట్ లెనినిస్ట్ స్టడీ సెంటర్ ను నయా రివిజనిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసారు. ఆ తరువాత నక్సల్బరీ పోరాట ఉధృతితో మార్క్సిస్ట్ పార్టీ బహిష్కరణకు గురయ్యారు.

ఎఐసిసిఆర్, సిపిఐ ఎం.ఎల్. పార్టీల ఏర్పాటుకు కా.సరోజ్ దత్తా ముఖ్యభూమిక పోషించారు. కా.చారుమజుందార్ నాయకత్వాన్ని బలపరుస్తు, పార్టీ అంతర్గత సైద్ధాంతిక చర్చలలో ప్రధాన భూమిక వహించారు.

పందొమ్మిది వందల డెబ్భై ల ప్రాంతంలో రాజ్యానికి మోస్ట్ వాంటెడ్ ప్రజా నాయకుడుగా మారారు. వారికి ప్రధాన శతృవుగా ప్రజల పక్షాన పోరాడే ముఖ్య నాయకుడిగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించారు. రాజ్యం ఆగస్ట్ ఐదో తారీఖున డెబ్భై ఒకటో సం.లో కా.సరోజ్ దత్తా ను రహస్యంగా పిరికిపందలా చంపింది.

దేశబ్రతి పత్రికలో 'పత్రికార్ దునియార్' అని రాసిన పత్రం ఎం.ఎల్. రచనలలో గొప్పరచనగా నేటికీ గుర్తింపబడుతోంది..

ప్రజా నాయకుడైన కా.సరోజ్ దత్తా ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవి. అమర్ రహే కా.సరోజ్ దత్తా...




10, జులై 2011, ఆదివారం

తెలుగు వీర రత్నమా..




తెలుగు వీర రత్నమా

వెంపటాపు సత్యమా

ఆదిభట్ల కైలాసం
అందుకోండి జోహార్లు...

(జూలై-10 అమరులైన దినం)

20, మే 2011, శుక్రవారం

స్వప్న పథికుడు..


కలలు అంతా కంటూ వుంటాం!
కానీ అవి కంటి రెప్పల కావలే కరిగిపోతుంటాయి...

గుండె నిండా నిబ్బరంతో
చివరి రక్త బొట్టు వరకు వాటి
సాకారం కోసం కత్తిమీద సాము చేసే
కలల ధీరులు కొద్దిమందే!

నీ జాతి జనుల బానిసత్వ
విముక్తి కోసం
నువ్వెత్తి పట్టిన ఝెండా రెపరెపలకోసం
నువ్వే మందుపాతరైన క్షణాన
శతృవు ఉక్కు పిడికిలిని
విధ్వంసం చేసిన కాలం
చరిత్రలో నీ నెత్తుటి సంతకం...

కాల మేఘాలు కమ్మిన వేళ
నీ తుపాకీ నిరంతరం గర్జిస్తూనే వుండాలన్న
నీ ఆశయం నీ మీసం వెనకాల
దాగిన నీ చిర్నవ్వు...

ప్రభాకరా నీ ఉదయం
కోసం ఆర్తిగా నీ జాతి
యావత్తూ నిలబడిందీ నేలమీద....

(తమిళ పులి ప్రభాకరన్ ద్వితీయ వర్థంతి సందర్భంగా)

31, డిసెంబర్ 2010, శుక్రవారం

మరపు రాని మనకాలం వీరుడు సద్దాం





నవ్వుతూ
తలవంచక
గుండెల్నిండా ఊపిరితో
ఎత్తిపట్టిన చాతీతో
నిటారుగా నిలిచిన వెన్నెముకతో
కాలు తన నేలపై గట్టిగా అదిమి పట్టి
శతృవు గుండెల్లో బెదురుపుట్టిస్తూ
తన జాతి పరువుకోసం,
పంతం కోసం ఒక్కడై,
తను ఒక్కడే వీరుడై,
కోల్పోయిన దానిని చివరి నిమిషంలో
అంతటా జేజేలు ద్వారా పొందిన
ఒకే ఒక్క వీరుని మరణం
ది గ్రేట్ సద్దాం హుస్సేన్ అబ్ద్ అలి మజ్ది తిక్రితి
మన కాలం వీరుడు...
అందుకో మా జోహార్లు సద్దాం

అగ్ర రాజ్యపు దురహంకారానికి నిలువెత్తు సాక్ష్యం
నీ నేలపై ఒలికిన లక్షలాది మంది క్రొన్నెత్తురు
దాని పాపం ఊరికే పోదులే..
ఈ కుహనా ప్రజాస్వామ్యవాదులు,
స్వేచ్చావాదులు
నీ నవ్వు ముందు బలాదూర్ కాకపోరు
నువ్వెత్తి పట్టిన మొండి ధైర్యమే మాకు ఆదర్శం
అబ్బురపరిచిన నీ మొక్కవోని ధీరత్వం
ఎప్పటికీ ఈ నేలపై స్వాతంత్ర్య కాంక్ష
కలిగిన వారి చేతిలో
ఝెండాగా ఎగురుతూనే వుంటుంది..
బాగ్ధాద్ నెలవంక సాక్షిగా
ఇది శాశ్వతం, సత్యం..
(సరిగ్గా నాలుగేళ్ళ క్రితం నిన్నటి రోజున సద్దాం పాశ్చాత్య దురహంకారుల చేతిలో ఉరితీయబడ్డాడు)

2, డిసెంబర్ 2010, గురువారం

డిసెంబర్ రెండు



డిసెంబర్ రెండు
భారత విప్లవోద్యమ చరిత్రలో ఈ రోజు

చరిత్రను అటూ ఇటూగా విడదీసిన రోజు

పీడిత ప్రజల విముక్తి కోసం,

సమసమాజ నిర్మాణంకోసం,
సామ్రాజ్యవాద కబంద హస్తాలనుండి భారత దేశ విముక్తి కోసం
తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్న విప్లవ నాయకులను
కుట్రతో
, కుతంత్రంతో

అత్యంత కిరాతకంగా హత్యచేసి ఉద్యమాన్ని
తుడిచి పెట్టేసామన్న సంబరం
పాలక హంతక ముఠాలకు మిగలనివ్వని రోజు
వారి చావుతో కోల్పోయింది ముగ్గురినే కానీ

వేలాదిగా మారిన విముక్తి సైన్యం ఏర్పాటుకు తోవతీసిన రోజు

వీరుడు మరణిస్తే వేలాదిగా పుట్టుకొస్తాడన్నదానికి కొండ గుర్తు...

అందుకే డిసెంబర్ రెండు
నెత్తుటితో ఎగరేసిన ఝెండా గుర్తు..
(కా.శ్యాం, మహేశ్, మురళి ల అమరత్వాన్ని గుర్తుచేసుకుంటూ)
వారి అమరత్వంపై వివరణ చూడగలరు

23, నవంబర్ 2010, మంగళవారం

పౌరహక్కుల పురుషోత్తం అమర్ రహే..


పౌరహక్కుల పురుషోత్తంగా జనం గుండెల్లో దాగిన పురుషోత్తం హత్యగావి౦పబడి నేటికి దశాబ్దం అయింది. కానీ ఆయనను హత్యచేసినవాళ్ళు నేటికీ గుర్తింపబడలేదు. ఇదే రోజు ఆయనతో మా జిల్లాలో హక్కుల కార్యకర్త అరెస్టు గురించి ఆయనతో మాటాడిన గంటలోనే గుర్తుతెలియని (పోలీసుల అండతో) కిరాతక హంతక ముఠా ఆయనపై కత్తులతో దాడి చేసి ఆయన ఇంటికి దగ్గరలోనే హత్య చేసారన్న వార్త. హక్కుల కార్యకర్తలపై వరుసగా దాడులు జరిగాయి ఆ పాలనలో. గొ౦తులేని వారి తరపున నిలబడి రాజ్యాన్ని ప్రశ్నించడం నేరంగా మార్చిన రోజులు అవి. ప్రజల తరపున మాటాడే వారిని లేకుండా చేయడం ద్వారా భయానక వాతావరణాన్ని కల్పించి తమ నిరంకుశ పాలనను కొనసాగించే ప్రయత్నం చేసారు నాయుడుగారు. రాజ్యం, పోలీసుల అండతో ప్రైవేటు హ౦తక ముఠాలు తయారై బహిరంగ హత్యలు చేసాయి. నేటికీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ హత్యలెవరు చేశారన్నది పాలక వర్గం గుర్తించలేదు.

ఆంధ్ర
ప్రదేశ్ పౌరహక్కుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఆయన రాష్ట్రంలో నాడు ఏమూల జరిగిన హక్కుల ఉల్లంఘనలపైనైనా వెంటనే స్పందించేవారు. తను హక్కుల కార్యకర్తగా, కమ్యూనిజాన్ని నమ్మిన వ్యక్తిగా తన జీవన విధానాన్ని నిబద్ధతతో సాగించి ఉద్యమకారులకు ఆదర్శ మూర్తిగా నిలిచిన పురుషోత్తంకు జోహార్లు..

28, అక్టోబర్ 2010, గురువారం

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన జతిన్ దాస్ స్మృతిలో..



తొలినాటి స్వాతంత్ర్య వీరులలో చెప్పుకోదగిన వారు జతిన్ దాస్. జైలులోని అసౌకర్యాలపై, అసమానతలపై పోరాడుతూ ఆమరణ దీక్ష చేస్తూ 63వ రోజు నాడు అమరుడైన ఏకైక ఖైదీ జతిన్ దాస్.

జతిన్ దాస్ కోల్ కతాలో అక్టోబర్ 27, 1904లో జన్మించారు. అనుశీలన్ సమితి అనే బెంగాలీ విప్లవ సంస్థలో పని చేసారు. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నారు. 1925 లో తను బి.ఏ.చదువుతున్నప్పుడు తన రాజకీయ అభిప్రాయాలపై బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి మెమెన్సింగ్ జైలులో ఉంచగా నాటి జైలు పరిస్థితులపై ఆమరణ దీక్ష చేయగా జైలు సూపరింటేండెంట్ క్షమాపణ చెప్పడంతో ఇరవై రోజుల తరువాత దీక్ష విరమించారు. ఆ తరువాత షహీద్ భగత్ సింగ్ నకు బాంబు తయారు చేసిచ్చిన కారణం చూపి లాహోర్ కుట్రకేసులో జూన్ 14, 1929న అరెస్ట్ చేసారు.

నాటి లాహోర్ జైలులోని ఘోర పరిస్థితులపై మిగతా విప్లవకారులతోపాటు తాను జూలై 13, 1929 నాడు మొదలుపెట్టిన ఆమరణ దీక్షను పట్టుసడలకుండా చివరివరకు కొనసాగించి, తీవ్రనిర్బంధ పరిస్థితులనెదుర్కొని సెప్టెంబర్ 13, 1929 న అమరుడైనాడు. ఆయన పార్ఠివ దేహాన్ని లాహోర్ నుండి కలకత్తాకు రైలులో తరలించగా వేలాది జనం నీరాజనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. జతిన్ దాస్ అంధించిన పోరాట స్ఫూర్తిని నేటి యువతరం అందిపుచ్చుకొని దేశం కోసం నేడు మరో స్వాతంత్ర్య పోరాటాన్నే జరపాల్సి వుంది. ఆయన జన్మదినం నిన్న జరుపుకొని నివాళులర్పించిన అనేక మంది యువతరానికి కృతజ్నతా పూర్వకంగా ఈ సంస్మరణ..

ఆమరణ దీక్షకు, పోరాట స్ఫూర్తికి నిర్వచనమైన కా.జతిన్ దాస్ అమర్ రహే..

24, ఆగస్టు 2010, మంగళవారం

షహీద్ రాజ్ గురును స్మరించుకుందాం



ఈ రోజు షహీద్ రాజ్ గురు జన్మదినం. భారతదేశ విముక్తి కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి అర్పించిన నాటి యువకిశోరాలను స్మరించుకొనడం నేటి తరం బాధ్యత. వారి త్యాగాలను మరువకుండా వుండటం ద్వారా మనల్ని మనం నిరంతరం చెక్ చేసుకునే ఓ కార్యం గుర్తెరిగి వుంటుంది. వారి ఆశయాలు నేటికీ సజీవంగా వుండి, వారి పోరాటాన్ని కొనసాగించుతూన్న నేటితరం వారిని అక్కున చేర్చుకోవడం వారికి నిజమైన నివాళి.

జోహార్ కా.రాజ్ గురు..
ఇంక్విలాబ్ జిందాబాద్..

13, మార్చి 2010, శనివారం

చిన్నఆరుట్ల చరిత్ర -అల్లం నారాయణ



ఆంధ్రజ్యోతినుండి సేకరణ. కొంతమంది ప్రశ్నలకు యిందులో సమాధానాలున్నాయి.

11, ఫిబ్రవరి 2010, గురువారం

అవిశ్రాంత విప్లవ పథికుడు కా. ఐ.వి.మాస్టారు

IV

ఐ.వి.గా, ప్రకాశ్ గా, మాస్టర్ గా ఎన్నెన్నో రంగాలలో ఎంతోమందికి ఆప్తుడైన ఐ.వి.సాంబశివరావు కవి, కథకుడు, అనువాదకుడు, సిద్ధాంత కర్త, ఉద్యమకారుడు, కార్యకర్త, విప్లవోద్యమ నాయకుడు, విశేష జీవితానుభం,లెక్కకుమించిన రంగాలలో ప్రజ్న, అతి సున్నితమైన హృదయం, పసిపిల్లవాడి మనసు, కఠినమైన క్రమశిక్షణను పాటించిన వ్యక్తిత్వం, విరసం, అఖిలభారత విప్లవ సాంస్కృతిక సమితికి సంస్థాపక సభ్యుడు, నాయకుడు, సుబ్బారావు పాణిగ్రాహి వారసత్వాన్ని అక్షరాల ఆచరించిన కవియోధుడు. యిదంతా ఆయన వ్యక్తిత్వం గురించి విరసం ప్రచురించిన ఐ.వి స్మృతులు అన్న పుస్తకం వెనక అట్టపై వున్న అక్షర సత్యాలు.

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంకు దగ్గరలోని పిరిడి గ్రామంలో 1937, ఫిబ్రవరి 11 న  జన్మించిన ఐ.వి రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ పూర్తిచేసి, ఢిల్లీ, హైదరాబాదులలో రిసెర్చ్ ప్రాజెక్టులలో పనిచేస్తూ శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తితో విరసం సంస్థాపక కృషిలో పాల్గొన్నారు. విరసంలో సభ్యుడిగా, కార్యవర్గసభ్యుడిగా క్రియాశీలంగాపనిచేస్తూ  విజయవాడ లయోలాకాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ పూర్తికాలం కార్యకర్తగా అజ్ణాత జీవితాన్ని ఎంచుకున్నారు.. 1997 ఫిబ్రవరి 28 న కాన్సర్ వ్యాధితో కన్నుమూసేనాటికి 23 సం.ల విప్లవోద్యమ జీవితంలో సామాన్యకార్యకర్త స్థాయి నుంచి నాయకత్వ స్థాయి వరకు ఎన్నో ఆటుపోట్లకు గురయ్యారు.అయిన స్థైర్యంగా ఆఖరివరకు నిలిచి అందరికి ఆదర్శప్రాయుడయ్యారు. కె.ఎస్.నాయకత్వం మార్పు తరువాత పొరపాటు అవగాహనతో నాయకత్వం 60 సం.ల దగ్గరలో ఆయనకు సామాన్య కార్యకర్త స్థాయికి ఒక ఏడాది పాటు డిమోట్ చేసినా మొక్కవోని విప్లవాభిమానంతో తన ఆచరణ ద్వారా నలుగురికీ ఆదర్శంగా నిలబడి తిరిగి కేంద్ర స్థాయి నాయకత్వానికి చేరుకున్న ఏకైక విప్లమూర్తి కా.ఐ.వి.

కా.ఐ.వి.ని పరిచయమున్నవారు ఆయన పాటించిన మానవ సంబంధాల విలువలను, ఆప్యాయతను మరిచిపోలేరు.అలాగే ఆయన సాహిత్య రంగంలో చేసిన అవిరళ కృషికూడా. స్వీయరచనలతో పాటు అనువాద రచనలో ఒక మంచి వరవడిని చూపెట్టిన సాహితీ కృషీవలుడు. ప్రపంచంలో మరెక్కడా ఐదు సంపుటాలు మించి లభించని మావో రచనలు మరో నాలుగు సంపుటాలుగా పాఠకులకు అందించే కృషికి దోహదం చేసారు. మారుపేర్లతో అనేక రచనలు చేసారు.రహస్యోద్యమ కార్యకర్తగా తనుచేసిన సైద్ధాంతిక కృషి యింకా వెలుగు చూడాల్సి ఉంది.

తియానన్మెన్ స్క్వేర్ లోని అమరవీరుల స్థూపంపై వున్న ఆంగ్ల గీతాన్ని ఇంద్రవెల్లి మృతవీరుల స్మారకస్థూపంపై చెక్కగా దానిని మిత్రులు క్రాంతిలో ప్రచురించాలని అనుకుని శ్రమ పడుతుండగా రెండు నిమిషాలలో కొట్టివేతకూడా లేకుండా దాన్ని అనువదించారు. అది

కొండగోగులు ఎరుపు కొండలే ఎరుపు

కొండలలోఅన్నల అమరత్వమెరుపు

అన్నలకు దండాలు అంతకంటే ఎరుపు..

మరో అనువాద కవిత:

ఈ మబ్బు వీడి వెలుగు రవ్వలు కురవాలని

ఈ వలత్ ఎంచుకు చరిత్ర బైట కురకాలని

మౌనం యీ సంకెలను చేదించుకోవాలని

తప్పెట మోతల్ రణన్నినాదం

విగ్రహాలను మేల్కొల్పాలని

నేలచ్చాయా సుందర దేవత

అందమైన అందెల సవ్వడితో ప్రత్యక్షం కావాలని

ఆకాశం ఎదురు చూస్తోంది.

మూలం – ఫైజ్ అహమ్మద్ ఫైజ్ .

(విప్లవోద్యమ శిఖరం అమరుడు కా.ఐ.వి. మాస్టారి జన్మదిన సందర్భంగా వారి స్మృతిలో)

1, అక్టోబర్ 2009, గురువారం

60 ఏళ్ళ చైనా విప్లవ స్మృతిలో…


1949 అక్టోబర్ 1 వ తేదీనాడు చైనా గణతంత్ర స్థాపన సగర్వంగా సత్య నిష్ఠతో ప్రకటిస్తూ మావో-సే-టుంగ్ ఒక సందేశాన్నిచ్చాడు. సామ్రాజ్యవాద ఉచ్చునుండి నాల్గవ వంతు మానవాళి విముక్తికి సంబంధించిన, శతాబ్ధాల తరబడిగా సాగిన మధ్యయుగాల ఫ్యూడల్ అణచివేతనుండి 60 కోట్లమంది ప్రజలు సాధించిన స్వేచ్చకి సంబంధించిన సందేశమిది. తమ సామ్రాజ్యవాద యజమానుల అండదండలతో కేవలం ఒక పిడికెడుమంది పాలకులు సాగిస్తుండిన నిరంకుశ పాలననుంచి, అమలుచేస్తుండిన అణచివేతనుంచి, సృష్టిస్తుండిన పేదరికంనుంచి యావత్ చైనా ప్రజలు సాధించిన విముక్తికి సంబంధించిన సందేశమిది. ఈ చారిత్రక సందర్భంగా మావో ఏమని ప్రకటించారంటే " చైనా ప్రజలు లేచి నిలుచున్నారు " అని! ఈ ఘనవిజయంతో ప్రపంచం మొత్తంలో మూడవ భాగం సోషలిస్టు శిబిరంలో అంతర్భాగమైంది!

చైనా విప్లవ 60 వ వార్షికోత్సవ సందర్భంగా ఆ మహా విప్లవ ఘనవిజయాలలో కొన్నింటిని జ్నప్తికి తెచ్చుకుందాం! న్యాయదృష్టి, సమత్వ దృష్టితో ఉత్తేజితులైననాడు మనిషి ముందు అవతరించగల మహదవకాశాలను చేపెట్టిన విజయాలవి. మార్క్సిజం-లెనినిజం జనబాహుళ్యం లోకి చొచ్చుకుపోయిననాడు అది చోదక శక్తి కాగలుగుతుందనే దానికి సజీవ నిదర్శనం చైనా విప్లవం! ఈ మహత్తర ప్రయోగంలో స్వర్గాలు ఒక్కసారిగా తలక్రిందులైనాయి! ' అనంతులు ', ' అవినాశులు' అనిపించుకునే దేవతలంతా కట్టకట్టుకు భూమిపై వాలారు! పాతుకుపోయిన విలువలు, సాంప్రదాయాలనేవన్నీ పెకళించబడి
బూడిదయ్యాయి! తలక్రిందులుగావ్రేళ్ళాడుతుండిన ఆర్థిక,రాజకీయాల్ని వాటి కాళ్ళపై సవ్యంగా నిలబెట్టడం జరిగింది. ఇలాంటి ఈమహాకల్లోలం ద్వారా, ఈ తీవ్ర అవ్యవస్థ ద్వారా ఒక సముజ్వల నూతన వ్యవస్థకి అంకురార్పన జరిగింది. అదే సోషలిస్టు వ్యవస్థ. ఒక నూతన మానవ సృష్టికి పిండోత్పత్తి ప్రారంభమైంది. ఆమనిషే కమ్యూనిస్టు!

ఈ గొప్ప విప్లవం తిరగదోడబడే అవకాశాలకి సంబంధించి మావో నిరంతరాయంగా చేస్తూవచ్చిన హెచ్చరికలకిది నిదర్శనంగానే ఈరివిజనిస్టు విద్రోహంవుంటుంది. శతాబ్ధాల తరబడిగ ామనుషుల్లో పాతుకుపోయిన బూర్జువా వ్యవస్థ, బూర్జువా విలువలు,బూర్జువా ప్రాపంచిక దృక్పధం అనేవి ప్రజల మస్తిష్కాలలో చెరిగిపోనివిగా వుంటూ ప్రభావితం చేస్తూనే వుంటాయి గనుక, వాటితో నిరంతరాయంగా, నిర్విరామంగా పోరాడుతూనే వుండాలనే లెనినిస్టు అవగాహనకి నిదర్శనంగాను దాన్నిస్అమ్ర్ థించేదిగానే వుంటుంది - ఈరివిజనిస్టు పునరుథ్థానం. ఈ విద్రోహానికి ఖచ్చితంగా దానికుండే కారణాలు౦టాయి.విధానాలలో వుండే కొన్ని బలహీనతల్లోనే ఈకారణాలని చూస్తే సరిపోదు! అంతకంటే మరింత ముఖ్యంగా – ఇలాంటి ఈ ప్రయోగం మొట్ట మొదటిది అయిన కారణంగా దాని అపరిపక్వతలోనేఅది తిరగదోడబడగల కారణాలు, బలహీనతలు సైతం అంతర్భూతంగా వుంటాయి. కనుక దీన్నుంచి పాఠాలనేవి ఖచ్చితంగా తీసుకోవాలి! అప్పుడు మాత్రమే, రాగల శతాబ్ధిలో కమ్యూనిస్టులు,గత విప్లవానుభవాల నుంచి, ప్రత్యేకించి చైనావిప్లవానుభవాలనుంచి సంపద్వంతమవుతూ, బలపడుతూ పురోగమించడానికి సాధ్యమవుతుంది.

చైnనావిప్లవానంకి సంబంధించినచ్హ్ ఎప్పుకోదగ్గ విజయాలనiి,అలానే అది తిరగదోడబడడానికి దారితీసిన కారణాల్ని కూడా మరోసారి గణన చేసుకోవడమనేది అనేక విధాల ప్రయోజనకరం! ముందుగా చెప్పుకోదగ్గది – సోషలిస్టు పునాదులన్నీ కూలిపోవడంతో సోషలిజంభవితవ్యానికి సంబంధించిన నైరాశ్యం అనేది చోటు చేసుకూంది. ఈ నైరాశ్యానికి తక్షణ పరాజయాలవ్ ఆస్తవికతలో కొంత పునాది వుంది. ఇకరెండోది ఏమంటే ఉన్నత సాంకేతిక ప్రచారోధృతితోను దానికి తోడువ్ ఇనిమయ సంస్కృతి వ్యామోహంలో చిక్కుకుపోయి సిధ్ధాంతాన్ని, సదాశయాల్నiి,నూతన వ్యవస్థ స్థాపనకి సంబంధించిన సదవకాశాల్ని తిరస్కరించే ధోరణిఅం ఏది ప్రబలి పోవడం; వెనుకడుగువ్ ఏసిన కమ్యూనిస్టు ఉద్యమంలో బలమైన రివిజనిస్టు ధోరణులు ప్రబలి పోవడం అవి చైనా విప్లవ అంతర్జాతీయ ప్రాముఖ్యతని,అది ప్రోది చేసిన సంపదని, మావో ఆలోచనా విధానాన్ని లేక మావోయిజాన్నివ్యతిరేకించడం అనేది మూడవ కారణం; నాల్గవ కారణ ఏమంటే-మావోయిస్టులలో సైతం తలెత్తిన పెడధోరణి- అదేమంటే ఈమహత్తర చైనా విప్లవానుభవానికి కేవలం నోటిమె చ్చుకోలుదనాన్ని ప్రదర్శించడం లేdదాదాన్ని ఒంటెత్తువాద నినాదప్రాయానికి కుదించేస్తూ తద్వారా భవిష్యత్ కమ్యూనిస్టు ఉద్యమాలకి అది మార్గదర్శక అనుభవంగaావుండగల దాని ప్రాధాన్యతని నిరాకరించడం. ఇక ఐదవది చివరిది అయిన కారణం ఏమంటే-చైనా విప్లవ నిర్ధిష్ట విజయాలకి సంబంధించిన, సోషలిస్టు నిర్మాణ నిర్ధిష్ట విజయాలకి సంబంధించిన వాస్తవికతని మరుగుపర్చడానికి పనిగట్టుకు ప్రయత్నించే బూర్జువాలు, రివిజనిస్టులు మరeీప్రత్యేకించి సూకల్డు సామాజికఅ అచరణ వాదులుgగాఊరేగే ప్రభుత్వ యేతర సంస్థలు ( N.G.O.) లు పాటించే ఈ కుట్రపూరిత నిశ్శబ్ధాన్ని చేది౦చాల్సి ఉండటంగా అది జరగక పోవడం. తక్షణ అవసరంరీత్యా కూడా ఇందుకు పూనుకోవాలి.

(శ్రామికవర్గ ప్రచురణలు ‘ చైనావిప్లవ స్మృతిలో’ నుండి గ్రహించినవి.)

28, సెప్టెంబర్ 2009, సోమవారం

భారత విప్లవాకాశంలో వేగుచుక్క కా.భగత్ సింగ్ జన్మదినం


రోజు భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరునవ్వుతో ఉరికొయ్యను ఊగి దేశ యువతరానికి విప్లవకర సందేశాన్నిచ్చిన కా.భగత్ సింగ్ ౧౦ జన్మదినం. పంజాబ్ లోని లాయల్ పూర్ జిల్లా (ఇప్పుడు పాకిస్తాన్లో వుంది), .9 గం.లకు జర్రానవాలా తాలూకా బంగా గ్రామంలో కిషం సింగ్విద్యావరి దంపతులకు 1907 సం.లో జన్మించాడు.

భగత్ సింగ్ కుటుంబమంతా స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారే. భగత్ సింగ్ జన్మించిన మూడేళ్ళకే లాహోర్ సెంట్రల్ జైలులో తీవ్ర నిర్భంధం అనుభవించి క్షయ వ్యాధికి గురై 32 ఏళ్ళ చిన్న వయసులోనే తన చిన్నాన్న స్వర్ణ సింగు మృతి చెందారు. వీరి ఆశయాలను వంటబట్టించుకొని చిన్న నాటినుంచే భారత దేశ స్వేచ్చా స్వాతంత్ర్యాలను కలలు కంటూ పెరిగిన వాడు.

విధ్యార్ధి దశలోనే 1921 సెప్టెంబరులో గాంధీ పిలుపునందుకొని కాలేజీనుంచి బయటకు వచ్చేసాడు. తన రాజకీయ జీవితంలో కొంతకాలం అతివాద దుందుడుకు చర్యలకు పాల్పడినా మార్క్సిస్టు రచనల అధ్యయనంతో భారత దేశంలో కూడా రష్యా దేశం వలే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కార్మిక వర్గ విప్లవాన్ని కాంక్షించాడు.

తొలుత బ్రిటిష్ పోలీసు వాడి దెబ్బలకు లాలాలజపతి రాయ్ మరణించడంతో ప్రతీకారంగా సాండర్సును మట్టుపెడతాడు. తరువాత నాటి చెవిటి ప్రభుత్వానికి దేశ ప్రజలనుభవిస్తున్న నిర్భంధాన్ని, దారిద్ర్యాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నంలో నాటి పార్లమెంటులో పొగబాంబులు వేసి స్వచ్చందంగా అర్రెస్టు కావడం ఆయన జీవితంలోముఖ్య ఘట్టాలు. 1926 లో లాహోర్ లో నౌజవాన్ సభ స్తాపించి యువకులను విప్లవ పథం వైపుgగానడిపించాడు. తరువాత 1928 లో హిందూస్తాం రిపబ్లికం అసోసియేషం సైనిక విభాగం హిందుస్తాన్ రిపబ్లికన్ ఆర్మీని ప్రారంభీంచి దానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టడం , ఆగస్టు 8 నాడు ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదాన౦లో జరిగిన హెచ్ ఆర్ యె సమావేసంలో స్వాతంత్ర్యాన్ని ,సోషలిజాన్నీ భరతదేశపు లక్ష్యాలుగా ప్రకటిచడ౦తో నాటి కాంగ్రెసు వాదులకు కంటగింపయింది. ఏప్రిల్ 8, 1928 నాడు ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేసి, ఎర్ర కరపత్రాలు పంచి స్వచ్చందంగా అరెస్టు కావడం.

భగత్ సింగ్ తాను రాసిన అనేక వ్యాసాలు, ఉత్తరాల ద్వారా తాను నాస్తికున్నని సోషలిస్టు విప్లవకారుడుగా నిరూపించుకున్నాడు.నిరంతరం జైలులో కూడా కా.లెనిన్ రచనలు అధ్యయనం చేసేందుకు తద్వారా భారత దేశవిముక్తి పోరాటాన్ని నడిపించెందుకు ఆసక్తి చూపారు. రష్యా దేశానికి పరిశీలకునిగా తన మిత్రుడ్ని పంపించాడు.

దీనివలన ఆయన బ్రతికి వుంటే ఈదేశపు స్వాతంత్ర్య కాంక్ష విప్లవ పథం వైపుగా నడిచి కార్మిక వర్గ తిరుగుబాటుగా రూపాంతరం చెంది తమ వ్యాపార వర్గ పునాదులు పెకలింపబడతాయని భయపడిన నాటి బ్రిటిష్ మరియు భారత పెట్టుబడిదారీ వర్గం తమ ఏజెంటు అయిన గాంధీ ద్వార కనీస ప్రజాస్వామిక వత్తిడి రాకుండా జాగ్రత్త పడి ఇర్విన్ ఒడంబడికను కుదుర్చుకొని అదే నెలాఖరులో రహస్యంగా ఉరితీయించింది. ఇది చరిత్ర చెప్పిన నెత్తుటి నిజం. గాంధీలో దాగివున్న వ్యాపార వర్గ అనుకూల వాది సంఘటనతో బయటపడ్డాడు.

కా. భగత్ సింగ్ చూపిన విముక్తి మార్గం నేటికీ సజీవమై ముందుకు సాగుతున్నది. నేడు ఎందరో యువ కిశోరాలు తమ నెత్తుటి త్యాగాలతో భగత్ సింగ్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వారికి మన విప్లవ జోహార్లు అర్పిద్దాం. ఇంక్విలాబ్ జిందాబాద్.

20, ఆగస్టు 2009, గురువారం

శోకపల్లి కంట నీరు తుడిచేదెవ్వరు


విశాఖ ఏజెన్సీలో గల జి.మాడుగుల మండలం సుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి గిరిజన మహిళలు పదకొండు మందిపై ఇదే రోజు రెండువేల ఏడవ సం.లో గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారని వారు బహిరంగంగా తమ గోడు వెళ్ళబోసుకున్నా నాటి నేటి ముఖ్యమంత్రి కనీసం వారి పట్ల సానుభూతి చూపలేదు సరికదా వారిని తిరిగి పోలీసు చర్యలను అడ్డుకున్నారని అన్యాయంగా కేసులలో ఇరికించి కోర్టుల చుట్టు తిప్పుతున్నారు. ఇది గుడ్డి ప్రభుత్వం, మేము సిగ్గు విడిచి చెప్పుకున్నా మాకు న్యాయం జరగలేదని నేటికి బాధిత మహిళలు వాపోతున్నారు. ఇక బయట తిరగలేక గ్రామానికే పరిమితం కావాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆనాడు వారు అలా చెప్పుకున్నందుకు కులపెద్దలు వేసిన తప్పు ఐ.టి.డి.ఏ.ద్వారా కొంత నగదును ప్రభుత్వం చెల్లించింది. ఇది నేరాంగీకారం కాదా? గిరిజన మహిళలయినందున వారి పట్ల ఎవరికీ సానుభూతి తప్ప జరిగిన అన్యాయానికి తగిన శిక్ష పోలీసులకు పడేట్లు చేయడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. వారి ఓటు శాతం తక్కువయినందున వారి పట్ల తగిన పరిష్కారంనకు కృషి జరుగలేదు. ఎన్నికల వాగ్ధానాలు తప్ప అమలుకు కృషి జరగలేదు. వాకపల్లి గిరిజన మహిళల శోకాన్ని ఆపేదెవరు? వారి కంట నీరు ఆగేదెన్నడు.

17, జులై 2009, శుక్రవారం

కారంచేడు - దళిత ఉద్యమంనకు దిక్సూచి


కారంచేడులో జూలై పదిహేడు, పందొమ్మిది వందల ఎనభై ఐదు నాడు ప్రారంభమైన ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్ సామాజిక చరిత్రలో మెయిలు రాయిగా నిలిచింది. తోలకిరివానకు ఏరువాక సాగి పంట మొలకేత్తల్సిన వేళ గ్రామ దళిత రైతు డొక్కలో బరిసె పోట్లతో నెత్తుటి ఏరులు పారించిన భూస్వాముల దాష్టీకానికి తగిన గుణపాఠ౦ నేర్పే౦దుకు దళిత చైతన్యం ముందుకు కదిలింది. ఎన్నో యుగాలుగా తమ కాలి కింద చెప్పుగా పడివున్న మనిషి చైతన్యంతో ముందుకు వచ్చి ప్రధాన జీవన స్రవంతిలో కలిసేందుకు వేసిన ముందడుగు ఫ్యూడల్ ప్రభువుల కళ్ళల్లో కారం చల్లినట్లయ్యింది. దాంతో ఏదో ఒక సాకుతో వారిని బలిగోనాలని వేచి చూసి తమ రక్త దాహాన్ని తీర్చుకొన్నారు. వారికి మద్దతుగా నాటి వారి కుల ప్రభుత్వం అండగా నిలవడంతో మరింత చెలరేగిపోయారు. నాడు హతులైన తేళ్ళ మోషే, తేళ్ళ ముత్తయ్య, తేళ్ళ యెహోషువా, దుడ్డు వందనం, దుడ్డు రమేష్, దుడ్డు అబ్రహాం మొదలైన వారు దళిత జాతికి స్పూర్తినిచ్చి అమరులైనారు. దళితుల ఆత్మా గౌరవ ఉద్యమం కారంచేడు నెత్తుటి నుంచే పుట్టింది. ఇది తరువాతి ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. భారత సామాజిక ఉద్యమాలలో కులం యొక్క ప్రాధాన్యతను చాటిచెప్పింది. మన న్యాయస్థానాల తాత్సార న్యాయాన్ని బయట పెట్టింది. దళితుల అణచివేతలో అన్ని వర్గాల వారిది ఒకే మార్గమని తేట తెల్లం చేసింది. నాటి ప్రజా యుద్ధ పంద తన తీర్పుతో బాధిత తల్లుల కడుపు కోతను కొంతైనా తీర్చగలిగింది. కానీ, నేటికీ ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు నిత్యము జరుగుతూనే వున్నాయి. నిన్నను కర్నూలు జిల్లాలో రుద్రవరం మండలం, ఎల్లావత్తుల గ్రామ దళిత రైతులపై అటవి శాఖాధికారులు చేసిన దాష్టీకం శిక్షించ దగ్గది. వారికి విచారణ పేరుతొ తీసుకుపోయి మీసాలు పీకి బూతులు తిట్టి గ్లాసుల్లో మూత్రం పోసి తాగమన్నారు. ఇవి నేటి ఆధునిక సమాజంలో జరుగుతున్న ప్రభుత్వ గూండా చర్యలు కావా? ఇలా చెప్పుకుంటూ పొతే రోజు మన కళ్ళ ముందే ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. నేటికి కులహంకారుల దాష్టికం చలామణి కావడం మన సమాజ దౌర్భాగ్యం. వీటిని కారంచేడు, చుండూరు, వేంపెంట ఉద్యమాల స్ఫూర్తితో తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం వుంది.