1, అక్టోబర్ 2009, గురువారం

60 ఏళ్ళ చైనా విప్లవ స్మృతిలో…


1949 అక్టోబర్ 1 వ తేదీనాడు చైనా గణతంత్ర స్థాపన సగర్వంగా సత్య నిష్ఠతో ప్రకటిస్తూ మావో-సే-టుంగ్ ఒక సందేశాన్నిచ్చాడు. సామ్రాజ్యవాద ఉచ్చునుండి నాల్గవ వంతు మానవాళి విముక్తికి సంబంధించిన, శతాబ్ధాల తరబడిగా సాగిన మధ్యయుగాల ఫ్యూడల్ అణచివేతనుండి 60 కోట్లమంది ప్రజలు సాధించిన స్వేచ్చకి సంబంధించిన సందేశమిది. తమ సామ్రాజ్యవాద యజమానుల అండదండలతో కేవలం ఒక పిడికెడుమంది పాలకులు సాగిస్తుండిన నిరంకుశ పాలననుంచి, అమలుచేస్తుండిన అణచివేతనుంచి, సృష్టిస్తుండిన పేదరికంనుంచి యావత్ చైనా ప్రజలు సాధించిన విముక్తికి సంబంధించిన సందేశమిది. ఈ చారిత్రక సందర్భంగా మావో ఏమని ప్రకటించారంటే " చైనా ప్రజలు లేచి నిలుచున్నారు " అని! ఈ ఘనవిజయంతో ప్రపంచం మొత్తంలో మూడవ భాగం సోషలిస్టు శిబిరంలో అంతర్భాగమైంది!

చైనా విప్లవ 60 వ వార్షికోత్సవ సందర్భంగా ఆ మహా విప్లవ ఘనవిజయాలలో కొన్నింటిని జ్నప్తికి తెచ్చుకుందాం! న్యాయదృష్టి, సమత్వ దృష్టితో ఉత్తేజితులైననాడు మనిషి ముందు అవతరించగల మహదవకాశాలను చేపెట్టిన విజయాలవి. మార్క్సిజం-లెనినిజం జనబాహుళ్యం లోకి చొచ్చుకుపోయిననాడు అది చోదక శక్తి కాగలుగుతుందనే దానికి సజీవ నిదర్శనం చైనా విప్లవం! ఈ మహత్తర ప్రయోగంలో స్వర్గాలు ఒక్కసారిగా తలక్రిందులైనాయి! ' అనంతులు ', ' అవినాశులు' అనిపించుకునే దేవతలంతా కట్టకట్టుకు భూమిపై వాలారు! పాతుకుపోయిన విలువలు, సాంప్రదాయాలనేవన్నీ పెకళించబడి
బూడిదయ్యాయి! తలక్రిందులుగావ్రేళ్ళాడుతుండిన ఆర్థిక,రాజకీయాల్ని వాటి కాళ్ళపై సవ్యంగా నిలబెట్టడం జరిగింది. ఇలాంటి ఈమహాకల్లోలం ద్వారా, ఈ తీవ్ర అవ్యవస్థ ద్వారా ఒక సముజ్వల నూతన వ్యవస్థకి అంకురార్పన జరిగింది. అదే సోషలిస్టు వ్యవస్థ. ఒక నూతన మానవ సృష్టికి పిండోత్పత్తి ప్రారంభమైంది. ఆమనిషే కమ్యూనిస్టు!

ఈ గొప్ప విప్లవం తిరగదోడబడే అవకాశాలకి సంబంధించి మావో నిరంతరాయంగా చేస్తూవచ్చిన హెచ్చరికలకిది నిదర్శనంగానే ఈరివిజనిస్టు విద్రోహంవుంటుంది. శతాబ్ధాల తరబడిగ ామనుషుల్లో పాతుకుపోయిన బూర్జువా వ్యవస్థ, బూర్జువా విలువలు,బూర్జువా ప్రాపంచిక దృక్పధం అనేవి ప్రజల మస్తిష్కాలలో చెరిగిపోనివిగా వుంటూ ప్రభావితం చేస్తూనే వుంటాయి గనుక, వాటితో నిరంతరాయంగా, నిర్విరామంగా పోరాడుతూనే వుండాలనే లెనినిస్టు అవగాహనకి నిదర్శనంగాను దాన్నిస్అమ్ర్ థించేదిగానే వుంటుంది - ఈరివిజనిస్టు పునరుథ్థానం. ఈ విద్రోహానికి ఖచ్చితంగా దానికుండే కారణాలు౦టాయి.విధానాలలో వుండే కొన్ని బలహీనతల్లోనే ఈకారణాలని చూస్తే సరిపోదు! అంతకంటే మరింత ముఖ్యంగా – ఇలాంటి ఈ ప్రయోగం మొట్ట మొదటిది అయిన కారణంగా దాని అపరిపక్వతలోనేఅది తిరగదోడబడగల కారణాలు, బలహీనతలు సైతం అంతర్భూతంగా వుంటాయి. కనుక దీన్నుంచి పాఠాలనేవి ఖచ్చితంగా తీసుకోవాలి! అప్పుడు మాత్రమే, రాగల శతాబ్ధిలో కమ్యూనిస్టులు,గత విప్లవానుభవాల నుంచి, ప్రత్యేకించి చైనావిప్లవానుభవాలనుంచి సంపద్వంతమవుతూ, బలపడుతూ పురోగమించడానికి సాధ్యమవుతుంది.

చైnనావిప్లవానంకి సంబంధించినచ్హ్ ఎప్పుకోదగ్గ విజయాలనiి,అలానే అది తిరగదోడబడడానికి దారితీసిన కారణాల్ని కూడా మరోసారి గణన చేసుకోవడమనేది అనేక విధాల ప్రయోజనకరం! ముందుగా చెప్పుకోదగ్గది – సోషలిస్టు పునాదులన్నీ కూలిపోవడంతో సోషలిజంభవితవ్యానికి సంబంధించిన నైరాశ్యం అనేది చోటు చేసుకూంది. ఈ నైరాశ్యానికి తక్షణ పరాజయాలవ్ ఆస్తవికతలో కొంత పునాది వుంది. ఇకరెండోది ఏమంటే ఉన్నత సాంకేతిక ప్రచారోధృతితోను దానికి తోడువ్ ఇనిమయ సంస్కృతి వ్యామోహంలో చిక్కుకుపోయి సిధ్ధాంతాన్ని, సదాశయాల్నiి,నూతన వ్యవస్థ స్థాపనకి సంబంధించిన సదవకాశాల్ని తిరస్కరించే ధోరణిఅం ఏది ప్రబలి పోవడం; వెనుకడుగువ్ ఏసిన కమ్యూనిస్టు ఉద్యమంలో బలమైన రివిజనిస్టు ధోరణులు ప్రబలి పోవడం అవి చైనా విప్లవ అంతర్జాతీయ ప్రాముఖ్యతని,అది ప్రోది చేసిన సంపదని, మావో ఆలోచనా విధానాన్ని లేక మావోయిజాన్నివ్యతిరేకించడం అనేది మూడవ కారణం; నాల్గవ కారణ ఏమంటే-మావోయిస్టులలో సైతం తలెత్తిన పెడధోరణి- అదేమంటే ఈమహత్తర చైనా విప్లవానుభవానికి కేవలం నోటిమె చ్చుకోలుదనాన్ని ప్రదర్శించడం లేdదాదాన్ని ఒంటెత్తువాద నినాదప్రాయానికి కుదించేస్తూ తద్వారా భవిష్యత్ కమ్యూనిస్టు ఉద్యమాలకి అది మార్గదర్శక అనుభవంగaావుండగల దాని ప్రాధాన్యతని నిరాకరించడం. ఇక ఐదవది చివరిది అయిన కారణం ఏమంటే-చైనా విప్లవ నిర్ధిష్ట విజయాలకి సంబంధించిన, సోషలిస్టు నిర్మాణ నిర్ధిష్ట విజయాలకి సంబంధించిన వాస్తవికతని మరుగుపర్చడానికి పనిగట్టుకు ప్రయత్నించే బూర్జువాలు, రివిజనిస్టులు మరeీప్రత్యేకించి సూకల్డు సామాజికఅ అచరణ వాదులుgగాఊరేగే ప్రభుత్వ యేతర సంస్థలు ( N.G.O.) లు పాటించే ఈ కుట్రపూరిత నిశ్శబ్ధాన్ని చేది౦చాల్సి ఉండటంగా అది జరగక పోవడం. తక్షణ అవసరంరీత్యా కూడా ఇందుకు పూనుకోవాలి.

(శ్రామికవర్గ ప్రచురణలు ‘ చైనావిప్లవ స్మృతిలో’ నుండి గ్రహించినవి.)

22 కామెంట్‌లు:

  1. చాలా బాగా రాసారు. అయితే అరవై ఏళ్ల విప్లవ స్మృతి ప్రభావం తో 49 ని 69 గా పేర్కొన్నారు. 1969 ని 1949 గా మార్చండి.

    రిప్లయితొలగించండి
  2. రాజన్న గారికి బ్లాగు సందర్శించి నా తొందరపాటును గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. "సామ్రాజ్యవాద ఉచ్చునుండి నాల్గవ వంతు మానవాళి విముక్తికి సంబంధించిన, శతాబ్ధాల తరబడిగా సాగిన మధ్యయుగాల ఫ్యూడల్ అణచివేతనుండి 60 కోట్లమంది ప్రజలు సాధించిన స్వేచ్చకి సంబంధించిన సందేశమిది."

    చైనా ప్రజలనడిగితే తెలుస్తుంది వాళ్లకున్న స్వేచ్చ ఎంతో ;)

    రిప్లయితొలగించండి
  4. మరి మనదేశంలో కూడా సామాన్య ప్రజలకున్న స్వేచ్చ ఏపాటిదో కదా? నాటి ఫ్యూడల్ వ్యవస్థ నుండి విముక్తి చెందిన తరువాత మావో అనంతరం వారు మరల నయా పెట్టుబడిదారీ వ్యవస్థ నిరంకుశ పాలనకు గురయినారు. అమెరికా వాడికి అక్కడ స్వేచ్చ కనిపించదు. వాడి మానవ హక్కుల సంఘాల లెక్కలు చూడకండి. నిజానికి వారు అంత కౄరమైన పాలనలోనే వుంటే ఈపాటికే ఎన్నో తిరుగుబాట్లు వచ్చేవి, పిల్లినయినా తలుపులు మూసి కొడితే వూరుకుంటుందా? ప్రజల కంట్రిబ్యూషం లేకుండా సోకాల్డ్ ప్రగతిని సాధించి నేడు అమెరికానే చాలెంజ్ చేసే స్థితిలో వుంటారా?

    రిప్లయితొలగించండి
  5. కలలు బాగుంటాయి, అందులోనూ పగటి కలలు ఇంకా బాగుంటాయి, ఎందుకంటే, అవి మనకిష్టమైనట్టుగా కనొచ్చు కనుక ;)

    రిప్లయితొలగించండి
  6. మన దేశంలోని సెంట్రల్ జైళ్ళూ, సబ్-జైళ్ళలోని ఖైదీలలో అత్యధికులు పేదవాళ్ళే. డబ్బున్న వాడు నేరం చేస్తే బెయిల్ ఇచ్చేసి పేదవాడిని మాత్రం లోపల తోస్తారు. ఇలాంటి అప్రజాస్వామిక దేశంలో సాధారణ ప్రజలకి స్వేచ్ఛా?

    రిప్లయితొలగించండి
  7. కలలు కనే తీరిక, స్వేచ్చ లేని జీవులు ఈ దేశంలో చాలా వున్నాయి. అందుకే కలలు కని సాకారం చేసుకోమన్నారు మన కలాం. సాకారం కేం ఖర్మ, కనడానికి నిద్ర పట్టని వారెందరో? దేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోతున్నాం అని తమను, తమ వాళ్ళనే ముందుకు తీసుకుపోయే నాయకులే వున్నారు. విజన్లు ప్రవచించి తమ వ్యాపార విజన్లతో ప్రజల ఆస్థులను కొల్లగొట్టిన వారెందరో? వీటిని అడ్డుకునే ప్రయత్నమాత్రం చేస్తున్న వాళ్ళను మూలాలనుండి ధ్వంసం చేసే పథక రచనలు చేస్తున్న వారి కార్యాచరణను గమనించండి.

    రిప్లయితొలగించండి
  8. మీరు తియాన్మెన్ ఊచకోతని మర్చిపోయినట్టున్నారు ;)

    రిప్లయితొలగించండి
  9. తియానన్మెం ఊచకోతను మరిచిపోలేం. కాని ఆ అన్రెస్ట్ వెనక అమెరికా వాడి సపోర్ట్ లేదంటారా? దానిని ఖండిస్తూనే మరి మన దేశంలో ఇందిర హత్య ముందు తరువాత శిక్కుల ఊచకోత, శ్రీలంకలో శాంతిపరిరక్షణ పేరుతో తమిళులపై దాడి, గుజరాత్ లో మంస్లిముల ఊచకోత ఇది గెనోసైడ్ కాదా, ఒక జాతినే నిర్మూలించే కార్యక్రమాలు, అంతెందుకు విజయవాడలో రంగా హత్య తరువాత జరిగిన ప్రాణ-ఆస్తి నష్టాలు, సి.ఎం.మార్పుకొరకు సృష్టింపబడ్డ మతకలహాల మారణహోమం, నేడు మావోఇస్టుల నిర్మూలణ పేరుతో దండకారణ్యంలో జరుగుతున్న ఆదివాసీ మారణకాండ మన ప్రజాస్వామ్య స్వేచ్చా స్వాతంత్ర్యాలకు గుర్తులా? ప్రశ్నించే వాడిని ఏదో ఒక విధంగా అణచే చీకటి చట్టాలు మన విధ్వంసకర అభివృద్ధి నమూనాలు, సెజ్ లు, ప్రాజెక్ట్ ల పేరుతో నిర్వాసితులను చేస్తున్నా నోరుమెదపని(లేనితనం) దేనికి చిహ్నాలు. ఇదికాదా నియంతృత్వం.

    రిప్లయితొలగించండి
  10. "తియానన్మెం ఊచకోతను మరిచిపోలేం. కాని ఆ అన్రెస్ట్ వెనక అమెరికా వాడి సపోర్ట్ లేదంటారా?"

    సరే, అయితే పాకిస్థాన్, బంగ్లాదేశ్ మద్దదుతో మన భూభాగంలో అరాచకాలు సృస్టిస్తున్నవాళ్లని ఊచకోత (మనవాళ్లు) కోస్తే మీరు దాన్ని సమర్ధిస్తారా?

    రిప్లయితొలగించండి
  11. ఆ నెపంతో ఇప్పటికే ఎంతోమంది అమాయకులను బూటకపు ఎంకౌంటర్లు చేస్తున్నారు. మనకు కనిపించే పాకిస్తాం వెనుక మద్ధతుదారును గుర్తించండి. వాడి చంక మన నాయకులూ ఎక్కి ఊరేగుతున్నారు. ఉగ్రవాదం అణచివేత పేరుతో పరాయిదేశాల భూభాగంలో తిష్ట వేసి వారి జీవన హక్కులను కాలరాస్తుంటే ప్రతిఫలం ఆ రూపాన్ని తీసుకుంటుంది. అంతర్జాతీయ ఉగ్రవాది అగ్ర రాజ్యమే. వాడి వ్యాపారాలకు అడ్డులేకుండా చేసుకోవడం కోసం ఈ ప్రచారం.

    రిప్లయితొలగించండి
  12. ఇలా పిడికిళ్లు పైకి లేపే బదులు ఆ శక్తితో ఏదైనా పనికొచ్చే పని చెయ్యండి సార్, మనదేశం దానంతలదే బలపడుతుంది.

    పనికి బద్దకించేవాళ్ల మాటలివన్నీ! దయచేసి పనికొచ్చే పనులుచెయ్యండి, యువకుల బుర్రలు పాడుచేసి సోమరిపోతుల్ని చెయ్యకండి, సోమారి దేశాన్ని చెయ్యకండి.

    రిప్లయితొలగించండి
  13. సూర్యుడుగారూ మీ సూచనకు ధన్యవాదాలు. పనిలేనితనంతో ఎవరి బుర్రలు పాడుచేయడంలేదు. యువకుల బుర్రలు పాడుచేసే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి ప్రతి క్షణం, వారిని సరైన దారిలో ఆలోచింప చేసే చర్చలకు మీ లాంటి వారు దూరం చేయడం వలన వారు అనేక ప్రలోభాలకు లోనయి సినిమాలు, పబ్ లకు, ప్రేమల పేరుతొ ఏసిడ్ దాడులకు పాల్పడుతూన్నారు. చదివే కాలంలో బయటి ప్రపంచం తెలీక, చదివాక డబ్బు సంపాదన యావలో పడి సమాజాన్ని పట్టించుకోకుండా తయారయ్యిందీ తరం, అందుకే రాజకీయ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్ల పరమయింది ఈ దేశం, నా సమాధానాలు నచ్చకపోతే మీరనుకున్న ఆలోచనలు చర్చించండి. వెటకారాలకు పోతారెందుకు. ప్రొఫైల్ను దాపెట్టుకుని.

    రిప్లయితొలగించండి
  14. మూడు ఇంగ్లిష్ సినిమాలు కాపీ కొట్టి తీసిన మగధీర సినిమాని హిట్ చేసినవాళ్ళది నిజమైన పనిలేనితనం కాదా? జనాన్ని సోమరిపోతుల్ని చేసేవి సినిమాలు, ఆట లాంటి టి.వి. షోలు కదా. మేము జనాన్ని సోమరిపోతులుగా మారుస్తున్నామా?

    రిప్లయితొలగించండి
  15. సరైన దారిలో ఆలోచింపజేసే చర్చలా? ఇదీ జోకంటే!

    అమేరికా ఇరాక్ ని ఆక్రమించుకున్నదాని గురించి కాకిగోల చేస్తారు గానీ, చైనా అక్రమించుకున్న కాశ్మీరు గురించి ఒక్కడూ మాట్లాడడు కదా :)) టిబెట్ సంగతేమిటో మరి? ఒక్క కమ్యూనిష్టు దేశద్రోహైనా దానిగురించి మాట్లాడతాడా?

    చైనాలో విప్లవం రాలేదా? ఛా! టైనన్మేన్ స్క్వేరులో రెండూవేలమందిని ఊచకోత కోసింది అమేరికా కదా? చైనాకి ఏ పాపమూ తెలియదు. అంతేనా?

    ఒక రాజీకపార్టి - ఒక కులాన్ని మరో కులం మీదకి ఉసిగొలుపుతుంది - మరొకటి మత పరంగా - మీరేమో లేనివారిని ఉన్నవాళ్ళ మీదకి ఉసిగొలుపుతారు అంతేగా? వాళ్ళు ఇసక తక్కెడ, మీ బధ్ధకపు కమ్యూనిష్టులు పేడ తక్కెడ.

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. నేడు మావోఇస్టుల నిర్మూలణ పేరుతో దండకారణ్యంలో జరుగుతున్న ఆదివాసీ మారణకాండ మన ప్రజాస్వామ్య స్వేచ్చా స్వాతంత్ర్యాలకు గుర్తులా?
    _________________________________________________

    మరే! ఆదివాసీలమీద అంత ప్రేమ మీ కమ్యూనిష్టులకి తగలడితే వాళ్ళని హ్యూమన్ షీల్డులుగా మీరు ఎందుకు వాడూకుంటున్నట్టో? వాళ్ళ వెనకాల దాక్కుని, (మీ భాషలోనే చెప్పాలంటే ప్రోఫైల్ని కప్పి పెట్టి) పోలీసులమీద దాడి చెయ్యడం హీరోఇజం కదా. మీగుళ్ళు తగిలితే పోలీసులు చస్తారు, వాళ్ళ గుళ్ళు తగిలితే ఆదీవాసీలు చస్తారు. మీ డబ్బులు మీకొచ్చేస్తాయి. దావూద్ ఇబ్రహీం గేంగులకీ మీకు తేడ ఏమిటో మరి??

    ఒక ఆదర్శం, ఒక మంచి అలోచనతో మొదలైన నక్సల్ ఉద్యమాన్ని పనీ పాటా లేని బధ్ధకస్తులు భ్రస్టుపట్టించిన వనం ఎవడూ మర్చిపోడూ




    టియన్మెన్ వెనకాల అమేరికా వాడి హస్తం ఉంది కాబట్టీ ఎంతమందిని చంపినా పరవాలేదు. ఐ యస్ ఐ సాయంతో ఇక్కడ ప్రజలని చంపుతున్నవారిని మాత్రం ఏమనకూడదు. అంతేగా మీ లాజిక్?



    మీ కమ్యూనిష్టు సోదరుడు ప్రవీణే అన్నడూ నా బ్లాగులో, నన్ను వ్యతిరేకించేవారి మీద ఎంత అసభ్యమైన దాడి జరిగినా నాకు ఫరవాలేదు అని. అక్కడే మీ రెందు నాల్కల ధోరణి అర్ధమవుతుంది. చైనా వాడు ఎన్ని వెధవపనులు చేసినా పరవాలేదు - కానీ అదే పని అమేరికా చేస్తే తప్పు.



    కమ్యూనిష్టులు ఎంతమంది అమాయకులని చంపినా పరవాలేదు, పోలీసులూ చేస్తేనే అది తప్పు

    అసలు వివరాలు దాచిపెట్టి మారుపేర్లతో చెలామణి అవుతూ ప్రజలని చంపడం తప్పుకాదు, సూర్యుడు తన వివరాలు చెప్పకపోతే మాత్రం నేరం ...ఆహా ఓహొ!

    రిప్లయితొలగించండి
  19. పనీ పాటా లేని బద్ధకస్తులెవరు. ఉద్యమం ఆవిర్భావంనుండి ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకొని వున్నవారే విప్లవ కార్యాచరణలో వుంటున్నారు. వారికి సమాజాన్ని దోచుకునే ఉద్దేశ్యం లేకనే ఉద్యోగాలో, రాజకీయాలో లేక కాంట్రాక్టర్లగానో మారి మీరనుకుంటున్నా దేశ సేవ లేక పనులు చేసే కార్యాలు చేపట్టలేదు. తమ నిండుప్రాణాలను పనంగా పెట్టి ఈ దేశ విముక్తికి పోరాటం చేస్తున్నారు, నిన్న కాక మొన్న అరెస్టు అయిన కోబాడ్ గాంధీ స్టడీ ప్రొఫైల్ ను చూడండి, (ఆయన సహచరి అనూరాధా గాంధీ సెరెబ్రల్ మలేరియాతో అడవిలోనే చనిపోయింది)వీళ్ళిద్దరూ ఉన్నత తరగతికి చెందిన వారే. అలాగే అమరుడు పటేల్ సుధాకర్ రెడ్డి. మీకు ఉదా.లతో చెప్పాల్సిన పనిలేదు. వ్యతిరేకిద్దామన్న మొండితనం తప్ప తెలుసుకుందామనే తత్వం మీలో లేనట్లు కనిపిస్తోంది, మార్తాండపై మీ దాడి ఇక్కడ చేదామనా? ఈ దేశంలో కమ్యూనిస్టులే లేకపోతే ఏనాడో జనాన్ని పూర్తిగా దోచుకునేవారు. ప్రశ్నించే వాళ్ళు మీలో ఎంతమంది వున్నారు.

    రిప్లయితొలగించండి
  20. ప్రశ్నించే వాళ్ళు మీలో ఎంతమంది వున్నారు
    ____________________________

    For one, I am and I AM QUESTIONING THE HONESTY OF THE COMMUNISTS!

    రిప్లయితొలగించండి
  21. ప్రశ్నించే తత్వం ఉంటే ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తున్న కోట్లకి కోట్లు అప్పులు ఎవరి ఆస్తులు అమ్మి తీరుస్తారో ప్రభుత్వాన్ని అడగండి? ఉచిత విద్యుత్ ఇస్తే ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇవ్వదు అని చంద్రబాబు నాయుడు అన్నాడు. రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ప్రకటించినా ఉచిత విద్యుత్ రాత్రి పూట మాత్రమే సరఫరా చేశాడు. వరల్డ్ బ్యాంక్ లో పెట్టుబడులు పెట్టేది అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు. ఆ దేశాలు పెట్టుబడిగా పెట్టిన డబ్బునే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలోని దేశాలకి అప్పులుగా ఇచ్చి వడ్డీలు వసూలు చేస్తారు.

    రిప్లయితొలగించండి
  22. ఆ ప్రశ్నలు అడిగేవారు అడిగారు కూడా. నేను అడుగుతోంది కమ్యూనిష్టులని. ప్రశ్న కి ప్రశ్న సమాధానమా?

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..