నా సాహితీ మిత్రుడు నిత్య అధ్యయనశీలి, విమర్శకుడు, కవి, కథారచయిత అయిన శ్రీ పడాల జోగారావుగారు శ్రీకాకుళం లోని కథానిలయం చెంతనే వున్న తన స్వగృహంలో నిన్న సాయంత్రం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గత కొ౦త కాల౦గా ఆయన కుటుంబ౦లోని నమ్మక ద్రోహానికి వ్యతిరేక౦గా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తూ౦డేవారు. దానికి తోడు నిత్యము అరకొర జీత౦తో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు. దగ్గర్లోని కాళీపట్న౦ రామారావు మాస్టారు, శ్రీకాకుళ సాహితీ అధ్యక్షులు శ్రీ బి.వి.ఏ.రామారావునాయుడు మాస్టారుగారు, మిస్క క్రిష్నయ్య మాస్టారు ఆయనకు చేదోడు వాదోడుగా వుంది సహకరి౦చేవారు. కానీ తాను నమ్మిన విలువలను తూచా తప్పక పాటి౦చే మనిషి కావడ౦తో తాను గురిఅయిన నమ్మక ద్రోహాన్ని మరిచిపోలేని తన౦తో నిత్యము స౦ఘర్శణకు లోనయి నిన్నటికి మరి ఏ విషాదకర మాటల ఈటె తగిలి౦దో గాని బద్దలైన తన గు౦డె గాయానికి పురుగులమ౦దుతో ఆర్పాలనుకోవడ౦ విషాదకర నిర్ణయ౦. మిత్రులందరికి తాను అన్ని రకాల స౦దేహ సమయాలలో తోడుగా వు౦డి గైడ్ చేసిన మనిషి ఇ౦త బాధాకర నిర్ణయంతో మమ్మల్ని ఒంటరి వాళ్ళను చేసిపోయారు.
తాను కథలు రాసినవి తక్కువే అయినా జీవితానుభవాలతో నలుగురికి ఆలోచనాత్మక౦గా వుండేవి, కవితలలో కూడా తాను జీవిత స౦ఘర్శణనే ఆవిష్కరించే వారు. ముఖ్యంగా తన మిత్రులతో పాటు తనను వ్యతిరేకి౦చే వారికైనా విశ్లేషణాత్మక౦గా మ౦చి వివరణలతో సుదీర్ఘమైన వుత్తరాలు రాసి గైడ్ చేసేవారు. తొలినాళ్ళలో ర౦గనాయకమ్మ గారితో కూడా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా చర్చలు చేసే వారు. అలాగే చేరా గారితోనూ. కథానిలయ౦ కార్యక్రమాలలో అన్నీ పాలుప౦చుకొని తన విలువైన భాగస్వామ్య౦తో ఎ౦తో సహకరి౦చారు. శ్రీకాకుళం లో జరిగే ప్రతి సాహితీ కార్యక్రమాలలో ము౦దు౦డేవారు. అటువ౦టి సాహితీ మిత్రుడిని కోల్పోవడ౦ ఒక్క శ్రీకాకుళ మిత్రులకే కాదు సాహితీ ర౦గానికి కూడా తీరని నష్టమే.
ఆత్మ హత్య ద్వారా తాను తెలియచేసిన నిరసనకు నా స౦ఘీభావాన్ని తెలియచేస్తూనే అది వ్యవస్థ చేసిన మరో క్రూరమైన హత్యగానే భావిస్తున్నాను.
ఈయన నాకునూ పరిచయస్థులే. ఈ వార్త నన్ను దిగ్భ్రమకు గురి చేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
రిప్లయితొలగించండిఇది మన దురదృష్టమనుకోవాలా లేకా సంఘం నిర్మించుకుంటున్న దారుణాలకు మరో జీవి బలయిందని అనుకోవాలో అర్థం కావట్లేదు మిత్రమా!
రిప్లయితొలగించండికాని ఇలాగే మనం సున్నితమైన విషయాలను జీర్ణించుకోలేని మనస్థత్వంతో బ్రతకాలొ అర్థం కావట్లేదు. అర్థిక - మనసిక - అస్తవ్యస్త జీవన విధానాలు ఉంటూనే ఉన్నాయి, అవి అలాగే ఉంటాయి . వీటికి పరిష్కారం కనుక్కోకపోతే ఏదో ఒక రోజు మన నిర్ణయాలు కూడా ఇలాంటివే అవ్వగలవు.
నీచపు సమాజంలో ఉంటు మంచికోసం పాకులాడే జోగారావుగారి లాంటి వాల్లకు ఈ సమాజంలో స్థానం లేదని అర్థమయ్యే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. ఏదే మైనా మంచి మిత్రుడిని కోల్పోయిన బాధను మర్చిపోవడం అంత సులభం కాదు.
రంగనాయకమ్మ గారి లాంటి వారితో పరిచయాలున్న జోగారావుగారు ఎంతటి మానసిక అలిసిపోటూ ఉండకపోతె ఇలాంటీ నిర్ణయం తీసుకున్నారో కదా.
తన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకుంటు.. ఇలాంటి దుస్థితికి కారణమైన వాటిపైనా ఊస్తూ.....
మీ..
శ్రీనురాగి