కడప జిల్లా మైదుకూరులోని సైయింట్ జోసెఫ్ పాఠశాలలో పిల్లలు తెలుగులో మాట్లాడితే వారి మెడలో నేరస్థులులా ఐ నెవెర్ స్పీక్ తెలుగు అని రాసివున్న బోర్డులు వేలాడదీయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఇది ఆ యాజమాన్యం తప్పేనా? తల్లిదండ్రులుగా మన బాధ్యత లేదా? ఆ విధంగా చేయడం ఆ టీచర్ చేసిన తప్పే అనుకుందాం. కానీ అమ్మ, నాన్న అనడమే నేరంగా వారి వీపును చీరేసే తల్లిడండ్రులు ఎంతమంది లేరు. అలా అనడాన్ని చిన్నతనంగా భావించే వారు ఎంతమంది లేరు.
హాయిగా ఆట పాటలతో చదువు నేర్చుకోవాల్సిన వయసులో వారిపై మనం మోపుతున్న కేజీల భారం నేరం ఎవరిది? ఎన్ని ఎక్కువ పుస్తకాలు కొనిపిస్తే ఆ కాన్వెంటే బాగుందనుకోని వారెవరైనావున్నారా? ఎంత తీరిక లేకుండా హోం వర్కులిస్తే వారే అత్యంత శ్రద్ధతో చెప్పినవారనుకుంటాం. ఇది పిల్లలపై వేస్తున్న మానసిక వత్తిడి గురించి ఆలోచించేమా ఎప్పుడైనా? ఏదైనా సంఘటన జరిగేటప్పుడు ప్లే కార్డులు పట్టుకొని రోడ్లపై రావడమే కాని వారిలో ఎంతమంది నిజానికి ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు మీడియంలో చదివించేవారున్నారు. వార్తా చానళ్ళకునిన్న ఏ మసాలావార్తా లేకపోవడంతో ఇదో పెద్ద చర్చనీయాంశంగా మలుచుకొని కాలంగడిపేసారు.
నిజానికి పిల్లల మన:స్తత్వ శాస్త్ర నిపుణుల ప్రకారం బాల్యంలో ప్రాధమిక స్థాయిలో పాఠ్యాంశాల బోధన వారి మాతృ భాషలో జరిగితే అది వారి విజ్ఞాణ వికాశానికి సృజనాత్మకతను పెంచేందుకు దోహద పడుతుంది. దీనిని పట్టించుకున్న వారు లేరు. నేడు మన ప్రధాన మంత్రి నుండి చాలా మంది నాయకులు, అత్యున్నత స్థానాలలోవున్న వారంతా నూటికి 90 శాతం మంది గ్రామీణ ప్రాంతంనుండి వచ్చిన వారే. నాడు ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో చదువుకున్న వారే? మరి వారికి ఇంగ్లీ షు భాషా ప్రావీణ్యతలేదా? అంతెందుకు ఉత్తరాంధ్రా వెనుకబడిన ప్రాంతానికి చెందిన తెలుగు సాహితీ దిగ్గజాలైన మహాకవి గురజాడ, మహాకవి శ్రీశ్రీ, రోణంకి అప్పలస్వామి, చాసో, పతంజలి మొ.న వారు ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ చేసారు? వారు చదవని ఆంగ్ల సాహిత్యంవుందా? భాషనేర్చుకోవాలన్న శ్రద్ధ వుంటే అది కష్టంకాదు. బలవంతంగా రుద్దుతూన్న మనం తాలిబాన్లకు తీసిపోతామా?
పోటీ ప్రపంచం పేరుతో మన ఆత్మన్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకునేందుకు పిల్లలపై అధిక భారంతో పాటు మానసిక వత్తిడిని పెంచి వారిని డబ్బు సంపాదించే యంత్రాలుగా మార్చుతున్న మనదే ఈ నేరం. దీనికి తోడు కొత్తగా సక్సెస్ స్కూళ్ళ పేరుతో ఒకటో తరగతినుండే్ ఆంగ్ల మాధ్యమంలో బోధించమని శాసనాలు చేస్తున్న ప్రభుత్వానికి భాగస్వామ్యంలేదా? కార్పొరేట్ విద్యా వ్యాపారులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెస్తున్న నాయకమ్మన్యులదే ఈ నేరం కాదా? పాపం పసివాళ్ళు.
"అత్యున్నత స్థానాలలోవున్న వారంతా నూటికి 90 శాతం మంది గ్రామీణ ప్రాంతంనుండి వచ్చిన వారే."
రిప్లయితొలగించండి"బలవంతంగా రుద్దుతూన్న మనం తాలిబాన్లకు తీసిపోతామా?"
baaga raasaaru..
Meeru raasina aakari para lo vishayaalu OSHO ni gurthu chesaayi...
maraithe baala kaarmikula sangathi kooda cheppakkarledu..
kaani evvarinee kadapakunda nenu kooda paroksham gaa prothsahisthunna vaadine ayyanu..
maarpu kaavali.. andarilo..
సరిగ్గా చెప్పారు
రిప్లయితొలగించండిhttp://newjings.blogspot.com/2009/10/blog-post_27.html
శివచెరువు మరియు మనోహర్ గార్లకి నా గోడును విన్నందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిdeenilo amma naannala thappu kooda chaala undi...
రిప్లయితొలగించండిpillalu englishlo mummy ani pilisthe pongipothunnaru kondaru mathru moorthulu....
atuvanti vaallaku kanuvippu kaavaali...
www.tholiadugu.blogspot.com
నేను ఇంగ్లిష్ మీడియం విద్యకి వ్యతిరేకం కాదు కానీ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ లో ఇంగ్లిష్ సరిగా నేర్పిస్తున్నారనుకోను. ఇంగ్లిష్ లో మాట్లాడాలని రూల్ పెడతారు కానీ దగ్గరుండి ఇంగ్లిష్ నేర్పించరు. అందుకే పిల్లలు తెలుగులో మాట్లాడి ఫైన్లు కట్టడం లేదా మెడలో బోర్డులు పెట్టుకోవడం జరుగుతుంది. నేను చదివినది ఇంగ్లిష్ మీడియమే. నా కంటే వయసులో పదేళ్ళు పెద్దైన ఇంకో ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్ కి నాకు వచ్చినంత ఇంగ్లిష్ కూడా రాదు. నేను ఇంగ్లిష్ లో పంపిన ఒక మెయిల్ అతనికి అర్థం కాకపోవడం వల్ల తెలుగులో పంపమన్నాడు. ఇంగ్లిష్ మీడియం పేరుతో స్కూళ్ళు లాభసాటి వ్యాపారం చేస్తున్నాయనేది మాత్రం నిజం.
రిప్లయితొలగించండితెలుగు నేర్చుకుంటే, ఉద్యోగాలు రావు అనేది వట్టిమాట. ఒక్క ఇంజనీరింగ్‌లో తప్ప, అదీ ఈ మధ్య కాలంలో వచ్చిన సాఫ్ట్‌వేర్‌లో మాత్రమే. కమ్యూనికేషన్ స్కిల్సూ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఇలా అదీ ఇదీ అని చెప్పి బలవంతంగా రుద్దబడింది. నిజానికి మనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీషోడికి ఎక్కడున్నాయి. రైలెక్కి ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్ దిగిపోయేలోపు, కొత్తవాళ్ళని పరిచయం చేసుకోని, వచ్చే వారం ఏ విషయమూ కనుక్కొని ఫోన్ చెయ్యమంటారా అని పెళ్ళి సంబంధాలు మాట్లాడే టైపు మనము. ఇంగ్లీషోడు ఎప్పుడూ రిజర్వుడు గా ఉంటాడు.
రిప్లయితొలగించండిఇక ఉద్యోగాల విషయానికొస్తే, మా కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో చాలామంది H.R. లు, మనం ఇంగ్లీషులో వ్యక్తీకరించలేనప్పుడు, హిందీలోనో లేదా తనకు, మనకు ఒకే భాష వస్తే అదే భాషలోనే అభిప్రాయాలను వ్యక్తపరచమంటుంటారు. ఒకవేళ మన భాషలో మనం చక్కగా సమాధానాలు చెప్పినప్పుడు, వీడికి ఇంగ్లీష్ రాదే అని పక్కకు పెట్టిన సందర్భాలు నేను ఎప్పుడూ చూడలేదు. పైగా ఇంటర్వ్యూ అయిపోయి సెలక్టయి పోయిన తర్వాత మా ఫ్రెండ్సు, మామా! ఇంటర్వ్యూ హిందీలో చేశాను మామా లేదా ఇంటర్వ్యూ తెలుగులో చేశాను మామా అని గొప్పగా చెప్పుకుంటుంటారు.
కార్తీక్ నిజమే కదా? మనం మారతామా?
రిప్లయితొలగించండిప్రవీణ్ ప్రైవేటు కాన్వెంటులు వీధికొకటి పుట్టుకొచ్చి వ్యాపారం లాభసాటిగా సాగుతోంది. అక్కడి చదువులు అంతంత మాత్రమే అయినా అదో ఫ్యాషన్ అయిపోయింది. ప్రావీణ్యం వున్నవారున్నారా లేరా అన్నది చూడడంలేదు. దీని వలన పిల్లలు ఎంత ఇబ్బందికి లోనవుతున్నారో గ్రహించడంలేదు. భాష నేర్చుకోవడానికి కాన్వెంటు చదువులే అక్కరలేదు శ్రధ్ధ వున్నవాళ్ళకి.
నాగ ప్రసాద్ నిజం చెప్పారు. అంతెందుకు మన భారతీయ సినిమాలో వైవిధ్యనటనా సామ్రాట్ కమల్ హాసన్ చదివింది 9th class. ఆయన మాటాడేట్టు ఇంగ్లీషోడు మాటాడ్డేమో అనిపిస్తుంది. ఇంగ్లీషు పిచ్చిలో పడి మాతృభాషను మృతప్రాయం చేయడం నేరం..
రిప్లయితొలగించండిఇక్కడ నా బాధ ఏటంటే..
రిప్లయితొలగించండిఒక నిర్ధిష్ట ప్రమాణాలు, నియమాలు టీచర్లు పెట్టుకోవటమ్లేదు. కోరికలు గుర్రాల్ల పరిగెడుతున్న తల్లిదండ్రులు పెడుతున్నారు. నేను ఒకటొ తరగతిలో నేర్చుకోని సబ్జక్టులు ఇపుడు పిల్లవానికి నేర్పాల్సివస్తోంది. మాకివి కావాలి.మీ దగ్గరున్నాయా ? అని అడిగి మా సేవలని బలవంతంగా లాక్కునే తల్లిదండ్రులతో ఒక టీచరు ఎంత క్షోభని అనుభవిస్తున్నాడో..ఎవరికి తెల్సు. ఇష్టమ్లేని పనిని చేస్తూ మానసికంగా ఎంత మధన పడిపోతూంటాడో ఎవరు అర్ధం చేసుకుంటారు. ఇది ఒక వైపు..
మరో వైపు ...ఇంకా ఏదైనా చెయ్యండి. మరింత ఇన్నోవేటివ్ గా ఉండాలి. మనం చేసేది మనదే ప్రధమం గా ఉండాలి. మరింత జనాకర్షణ సబ్జక్టులు పెట్టండి. ఇవిగో ఇటువంటి మానేజ్మెంట్ వత్తిళ్ళలోంచి పుట్టుకొచ్చినవే..
జి.కె.,మోరల్ సైంసు, వేదిక్ మాథ్స్, అబాకస్ ఐఐటి ఇంకా..ఇంకా..ఇంకా...
అందరికి కనిపించేది..వ్యాపారం లాభసాటిగా సాగుతోంది..కాని
అంతర్గతంగా మనుగడ కోసం పోరాటం ఎవరికి కనబడదు..
విదేశీ ఉద్యోగ వ్యమోహం వదలేంతవరకూ...ఇది ఇంతే..
కార్తీక గారు సమస్యని కొంత వరకూ అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు.
ఇంగ్లిష్ మీడియం విద్యార్థులందరికీ ఇంగ్లిష్ సరిగా రాదు అనేది ఎంత నిజమో, తెలుగు మీడియం విధ్యార్థులలో కూడా చాలా మందికి తెలుగు సరిగా రాదు. ఒక సారి నా ఆఫీస్ లో UPS కాలిపోయింది. ఒకతను ఎలా కాలిపోయింది అని అడిగాడు. కరెంట్ ఒడిదుడికులు వల్ల కాలిపోయింది అని చెప్పాను. అతనికి అర్థం కాలేదు. పవర్ ఫల్క్సుయేషన్స్ వల్ల కాలిపోయింది అని చెప్పాను. అది కూడా అర్థం కాలేదు. ఆ తెలుగు మీడియం స్టూడెంట్ కి ఇటు తెలుగు సరిగా రాదు, అటు ఇంగ్లిష్ సరిగా రాదు. రేపు అతను ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేసేవాడు ఇంగ్లిష్ లో ఏదో అడుగుతాడు. అప్పుడు అతను ఏమి సమాధానం చెపుతాడు?
రిప్లయితొలగించండినాగప్రసాద్ గారు చెప్పినది నిజమే. భావ వ్యక్తీకరణకు భాషాజ్ఞానం ఉండాలి. ఆంగ్ల భాషొక్కటే భాష కాదు. ఆంగ్లేయులు గడిచిన రెండు మూడు శతాబ్ద కాలం వారి సామ్రాజ్యాన్ని ప్రపంచ నలమూల అన్నీ ఖండాలలో విస్తరించారు. అందుచేత ఆంగ్ల భాష ప్రభావం అన్నీ చోట్ల ఉంటున్నది. అందుకని అందరూ ఆంగ్లమును మాత్రమే గొప్ప భాషగా, వారి మాతృభాషను చులకనగా చూడరాదు.
రిప్లయితొలగించండివర్మ గారు మీకో విజ్ఞప్తి, వ్యాఖ్యా వ్రాసేటప్పుడు మా open id ను కూడా వాడి వ్యాఖ్య వ్రాసే సౌలభ్యం కల్పించగలరు అని మనవి.
సాయి ప్రవీణ్ చాలా రోజులకి. నేను అది గమనించలేదు. ఇప్పుడే మార్చాను. మీ సూచనకు థాంక్స్.
రిప్లయితొలగించండిమాతృభాషను మరిచిపోయే స్థాయికి మనం తీసుకుపోబడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలలో కూడా సక్సెస్ స్కూళ్ళపేరుతో ప్రాథమిక స్థాయినుండే ఆంగ్లమాధ్యమంలో పాఠాలు చెపుతున్నారు. దీనివలన మరికొద్ది రోజులలో తెలుగు కనుమరుగుకాక తప్పదు. ఇప్పటికే కార్పొరేట్ కళాశాలలో మార్కుల ఓరియెంటేషన్ తో తెలుగును విడిచిపెట్టి సంస్కృతాన్ని చెపుతున్నారు. స్కోరింగ్ పట్ల వున్న మమకారం మనలను ఎటువైపు తీసుకుపోతుందో. పాపం పిల్లల పసి హృదయాల గాయం మాన్పేదెన్నడో.