మన విశ్వ విద్యాలయాలలో నేడు అలముకున్న ఒక నిస్పృహ వాతావరణం పోవాలంటే వాటిని కొద్దికాలం మూసేయడమే మంచిదని నా విన్నపం. ఎందుచేతనంటే అవి నేడు ఎందుకూ పనికిరాని మురికి కూపాలుగా తయారయ్యాయి. కులగజ్జి ఆచార్యుల కనుసన్నలలో పనికిమాలిన సబ్జెక్టులపై డాక్టరేట్లివ్వడానికి తప్ప నేడు వాటి వలన సమాజానికి నిజంగా ఏమీ ఉపయోగం జరగడం లేదు. వాటినుండి ఏ కొత్త ఆలోచన కానీ, సృజనగానీ కొన్నేళ్ళుగా రూపొందడంలేదు. అటు సాంఘిక శాస్త్ర అంశాలపట్లగానీ, సైన్సు అంశాల పట్లగానీ ఒక కొత్త అంశం కనుగొన్న పాపాన పోలేదు. ఎంతసేపూ స్నాతకోత్సవ జాతర నిర్వహించి తైతక్కల సినిమావాళ్ళకు, రౌడీ రాజకీయనాయకులకు డాక్టరేట్లు అమ్ముకుంటూ కోట్ల కొలది ప్రజా ధనాన్ని చాన్సలర్లు, పీఠాధిపతులు మింగేయడానికి పనికి వస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు వేటలో పడ్డ పనికిమాలిన యువతకు భోజనాల బోర్డింగ్ లుగా మారిపోయాయి. కెరీరిజం మోజులో తన చుట్టూ జరుగుతున్న సామాజిక దోపిడీని పట్టించుకున్న తీరిక లేని వెధవలను తయారుచేస్తున్నాయి. గత ఇరవై యేళ్ళుగా యువత ఎందుకూ కొరగాకుండా జీతగాళ్ళుగా మార్చే సాధనాలుగా తయారయ్యాయి. సామాజిక రుగ్మతలకు కారణాలను అణ్వేషించి, వాటినుండి బయటపడే మార్గాన్ని ప్రజలకు నిర్దేశించే ఉపకరణంగా ఉండవలసిన విద్యా విధానాన్ని భ్రష్టుపట్టించిన ఈ కులగజ్జి కూపాలను కొంత కాలం మూసేస్తే కడుపుమండిన వాళ్ళైనా దానికి కారణాలను వెతికే పనిలో పడతారని నా ఆలోచన. లేకపోతే ఈ రాచకురుపు వలన సమాజానికి తీవ్రమైన నష్టమే తప్ప లాభం లేదు. నెత్తురు మండే శక్తులు నిండే యువత రావాలి. ఆనాడే ఈ దేశం, ఈ సమాజం బాగుపడుతుంది.
ఏకీభవిస్తున్నాను.
రిప్లయితొలగించండి-- తాడేపల్లి
great great great.... chala baga chepparu.
రిప్లయితొలగించండిMostly agree. But dont you think that the Universities are the mirror images of the society itself?
రిప్లయితొలగించండిఏ పీఠాదిపతుల గురించి మాట్లాడుతున్నారు మీరు ?
రిప్లయితొలగించండితాడేపల్లిగారు మీవంటి పెద్దవారు ఏకీభవించినందుకు చాలా సంతోషంగా వుంది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిజీవనిగారు మీ మెప్పుపొందినందుకు ఆనందంగా వుంది. థాంక్స్.
మలక్ పేట్ సార్ I agree with you, but I think that the Universities will guide the Society in better way. Otherwise there is no use. Thanks for your kind comment.
మంచుపల్లకీ సార్ ప్రతి యూనివర్శిటీలలో తిష్ట వేస్తున్న కుల పీఠాధిపతుల గురించి. తప్పా. చాన్నాళ్ళకి నామీద soft గా వేసారు బాణం. Thank you.
మీ అందరికీ జవాబులు వెంటనే ఇవ్వలేకపోయినందుకు sorry. computer repair వలన మరియు పని వత్తిడి కారణంగా.
కర్నాటకలొ పీఠాదిపతులు చాలా ఎక్కువ.. కంచి పీఠాదిపతి అలా.. బెంగలూరు లొ కొన్నాళ్ళు వుండటం వల్ల నాకు అలా అర్దం అయినది.. వాళ్ళకి యూనివర్సిటిలకి సంబందం ఎమిటొ అర్ధం కాలేదు..
రిప్లయితొలగించండిదీంట్లొ నిజం లేకపొలేదు.. నేను కాంపస్ లొ చదవలేదు కాబట్టి పెద్ద తెలీదు.. వినడమే తప్ప..
correct gaa chepparu meeru.....
రిప్లయితొలగించండిwww.tholiadugu.blogspot.com
నిజాలను ఒప్పుకోక తప్పదు ఎంత చేదుగా ఉన్నా..
రిప్లయితొలగించండిఉస్మానియా యూనివర్సీటీని చూసి కూడ ఆమాట అంటున్నారా.
రిప్లయితొలగించండిఈ పోస్టు రాసింది నవంబరు నెలలో. కొన్నేళ్ళుగా నిశ్శభ్ద నీరవ ప్రపంచంలో వున్న విశ్వవిద్యాలయాలపట్ల రాసాను. నేడు కొలిమంటుకున్న సందర్భంలో మరల విద్యార్థి లోకం ఉద్యమాల బాట పట్టి సమాజానికి శస్త్ర చికిత్సమొదలుపెట్టిన సమయంలో తప్పక అభినందిద్దాం.
రిప్లయితొలగించండి