2, అక్టోబర్ 2009, శుక్రవారం

గాంధీ - దాగిన మరో కోణం


మోహం దాస్ కరం చంద్ గాంధీ, జాతిపితగా, మహాత్మాగా మనకందరికీ తెలిసిన కోణం. కానీ అందరికీ సుపరిచితమైన ఆ ఆహార్యం వెనుక దాగిన నగ్న సత్యాలు అనేకం.

నిజానికి గాంధీ ఏనాడూ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం చేయలేదు, ప్రజల ఆగ్రహం పతాక స్థాయికి చేరి బ్రిటిష్ పాలకులు ఇరకాటంలో పడ్డ నాడు ఆ పోరాట రూపాన్ని వదులుకునేందుకు కూడా వెనకాడలేదు. ఇందుకు చౌరీ చౌరా సంఘటన జరిగినంతనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేసారు. అలాగే బొంబయి రేవు కార్మికులు సమ్మెకు మధ్ధతుగా మన సైనిక దళాలు కూడా సమ్మె చేసేందుకు వెనుకాడని పరిస్థితి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుండి భద్రంగా తప్పుకునేందుకు అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయించాడు. ఇలా ఈ దేశం అర్ధ వలస, అర్థ భూస్వామ్య వ్యవస్థగా మారడానికి సహకరించి సామ్రాజ్యవాదుల ఏజెంటుగా నమ్మిన బంటు పాత్రను అత్యంత నమ్మకంగా పోషించాడు.

అసలు కాంగ్ర్రెసు పార్టీ ఆవిర్భావమే బ్రిటిష్ పాలకులకు అణుగుణంగా జరిగింది. కాంగ్రెసు పార్టీ వ్యవస్థాపకుడు ఎలెం ఓక్టాలియా హ్యూం ఒక బ్రిటిష్ ఉన్నతాధికారి. పార్టీ ఆవిర్భావ పరిస్థితి నాటి (1885) భయంకర కరువు పరిస్థితులు లోలోపల రగులుకొంటూ పైన నివురుగప్పిన నిప్పులావున్న భారతీయుల అసంతృప్తి, ద్వేషమూగ్రహించిన హ్యూం అప్పటి వైస్రాయి డఫరిం దగ్గరకెళ్ళి పరిస్థితిని వివరించాడు. ఆ సూచన ఇలా వుంది:

“ భారత దేశంలో బద్దలవటానికి సిద్ధంగావున్న సాయుధ విప్లవాన్ని అడ్డగించడానికి ఒకే ఒక మార్గం వుంది. ప్రజలముందు చట్టబద్దమైన ఉద్యమాన్ని ఉంచుదాం. ఆఉద్యమంలో ప్రజలు పాల్గొని చట్టబద్దంగా తమ అసంతృప్తిని ప్రకటిస్తారు. దాన్ని బట్టి ప్రజలనాడి ప్రభుత్వానికి అర్థమవుతూ వుంటుంది. ఇలాంటి ఉద్యమాన్ని ప్రారంచించడం వల్ల బ్రిటీషు ప్రభుత్వానికి సహకరించే ఉన్నతవర్గాల భారతీయులు నాయకత్వ స్థానాన్ని అలంకరించి ప్రజల్ని విప్లవ మార్గం నుంచి తప్పించి చట్టబద్ధమైన ఉద్యమంవైపు లాగుతారు. అప్పుడు ఆ ఉద్యమం పైన బ్రిటీషు ప్రభుత్వం గట్టిపట్టును కలిగివుంటుంది.’ (యశ్ పాల్ రాసిన రామరాజ్యం – పేజీ 69).

దోపిడీవర్గాలకి దురాలోచనే కాక ఎంతటి దూరాలోచనా! జాతీయోద్యమాన్ని కాంగ్రెసు పార్టీ, గాంధీ ఇలానే నడిపించారు.

అయినప్పటికీ 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉవ్వెత్తునసాగటం, మధ్యతరగతి యువకులు బ్రిటీషు ముష్కరుల పైన దాడులు చేయటం జరిగింది. పత్రికలలో వ్యాసాలు రాసినదానికే బాల గంగాధర తిలక్ కు 6 సం.ల కఠిన కారాగార శిక్ష విధించిన బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా బొంబాయి కార్మికులు హర్తాళ్ళ్, బంద్ లు నిర్వహించి రాజకీయాల్లోకార్మికులు క్రియాశీలక పాత్ర నిర్వహించే కాలం వచ్చిందనే హెచ్చరిక చేసారు. ఈ అసంతృప్తిని పక్కదారి పట్టించగల సమర్ధవంతమైన నాయకత్వం, బ్రిటీషు పాలకులకి దేశీయ భూస్వామ్య దళారీ బూర్జువాలకీ అవసరమయింది.

దక్షిణాఫ్రికాలో బ్రిటీషు పాలకులకి వ్యతిరేకంగాపోరాడిన ‘ జూలూ ‘ జాతి రైతుకూలీల పోరాటంలోనూ, బోయర్ యుధ్ధకాలంలోనూ, మొదటి ప్రపంచ యుద్ధం లోనూ బ్రిటీషువారికి తోడ్పడంలో ప్రాణాపాయ స్థితిని తెచ్చుకోడానికి కూడా వెనుకాడనిప్రభుభక్తిని గాంధీ ప్రదర్శించాడు.(భారదేశంలోని ఇంగ్లీషు వారందరికీ – గాంధీ బహిరంగ లేఖ అధారం). తమకు కావలసిన వాడు ఇతడే అని గుర్తించారు.

ఉదా: బీహార్ లోని చంపారం లో నీలిమందు రైతుల పోరాటాన్ని సంస్కరణవాద ఊబిలోకి లాగటం, రౌలత్ చట్టానికి, జలియన్వాలా బాగ్ దురంతాలకు వ్యతిరేకంగా సాగిన ప్రజల ఆందోళన హద్దులు దాటుతోందని నిలిపివేయటం జరిగింది.

సామ్రాజ్యవాదుల ఎడల భారత ప్రజల అసంత్రుప్తి తీవ్రత ఎంతలా వుందంటే ఏ కొద్దొ రాయితీలు పొందే ఉద్యమానికి పిలుపునిచ్చినా లక్షలాదిగా తరలి వచ్చే వారు. ప్రజా పోరాట జ్వాలను చల్లార్చటానికి ఆఉద్యమాన్ని అడ్డుకట్ట వేయడానికి గాంధీ ‘ శాంతి ‘ మంత్రం జపించి వారి పునాదులను కాపాడే వాడు. అందుకే వారికి మహాత్ముడయ్యాడు.

1931 లో గాంధీ స్వభావాన్నిగూర్చి స్టాలిన్ చెప్పిన మాటలు “ భారతదేశం, ఇండోచైనా, ఇండోనేషియా, ఆఫ్రికాఖండంలోని దేశాల్లోని విప్లవ పోరాటాలని కసాయి బూర్జువా పరిపాలకులు రక్తపుటేరుల్లోముంచారు. కౄరమైన హింసావిధానం ద్వారా అక్కడి ఉద్యమాల్ని అణచడానికి ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నాలు రెండు రకాలుగా జరిగాయి. ఒకటి – తుపాకీ ద్వారా విప్లవోద్యమాన్ని అణచడము , రెండవది – గాంధీ లాంటి వ్యక్తి ద్వారా విప్లవోద్యమాన్ని పక్కదారి పట్టించడమూ!”

అలాగే వైస్రాయి ఇర్విన్ రైలు పేలిపోయే విధంగా విప్లవకారులు బాంబులు పెడితే అవి పేలినా వైస్రాయి క్షేమంగా బయటపడ్డందుకు చాలా సంతోషించాడు. ఈచర్యను ఖండిస్తూ కాగ్రెసు సభలలో తక్కువ మెజారిటీతో తీర్మానాలు చేయించుకుని ప్రభుభక్తిని చాటుకున్నడు.. విప్లవ కారులను నిందిస్తూ ‘ కల్ట్ ఆఫ్ ది బాంబ్ “ అనేవ్యాసం రాసాడు. దీనికి జావాబుగా వారు ‘ ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ “ రాసి అందులో గాంధీ స్వభావాన్ని ఇలా పేర్కొన్నారు:

“ కాంగ్రెసు ప్రజలలోస్వాతంత్ర్య ఇచ్చను కలిగించిందని మేమూ ఒప్పుకుంటాం. అయితే అంతటితో కాంగ్రెసు బాధ్యత తీరిపోలేదు. దేశానికి కాంగ్రెసు చేయవలసినది ఎంతో వుంది. కానీ ఆసంస్థ మీద దళారీరాజకీయాలను అభిమానించే నాయకుల ప్రాబల్యం ఎక్కువైంది. కాంగ్రెసు చెప్పే అహింస విదేశీ పాలకులతో రాజీ బేరాలకు దిగడానికి ఒక సాకుగా తయారయ్యింది.”

గాంధీ-నెహ్రూల నాయకత్వం భగత్ సింగు తదితరుల ఉరిశిక్ష రద్దుకు సీరియస్ గా ప్రయత్నించనిది దళారీ రాజకీయాల కారణంగానే. కరాచీలో నెహ్రూ అధ్యక్షతన జరగనున్న కాంగ్రెసు సమావే్సానికి (మార్చి 25 1931 న) ఏ అడ్డంకీ రాకుండా వుండేందుకు భగత్ సింగు, రాజగురు, సుఖదేవ్ ల ఉరిని 23 రాత్రి 7.30 ని.లకి ( చట్టానికి వ్యతిరేకంగా రాత్రి ఉరితీయరాదు) అమలుచేయించాడు.

ఈదేశప్రజలలో మత మౌఢ్యాన్ని పెంచడానికి తాను అనుసరించిన సనాతన ధర్మం, మత మార్పిడుల పట్ల వ్యతిరేకత తోడ్పడ్డాయి.

హి వాజ్ ఏక్టెడ్ ఏజ్ ఏన్ ఇన్విజిబిల్ ప్రొటెక్టర్ టు ది బ్రిటిష్ రాజ్ ఎండ్ ఇండియన్ బూర్జువాజీ.

(ఈ వ్యాసం రాయడానికి ‘ నా నెత్తురు వృధాకాదు ‘ పుస్తకంలోని వ్యాసాలను ఆధారం చేసుకున్నాను.)

15 కామెంట్‌లు:

  1. చాలా బాగా రాసారు సర్, మంచి information collect చేసారు . thankyou . keep writing more about gandhi. నేను కూడా ఒక బ్లాగ్ రాసాను గాంధీ మీద. వీలు కుదిరితే చూడండి.
    http://anvvapparao.blogspot.com/2009/10/blog-post.html

    రిప్లయితొలగించండి
  2. అప్పారావు శాస్త్రి గారు ఇలా వచ్చి కామెంటినందుకు ధన్యవాదములు. తప్పక మరిన్ని పంచుకుందాం...

    రిప్లయితొలగించండి
  3. కుమార్‌ గారూ,

    మీరు రాసిన విషయాలు చక్కగానే వున్నా, ఎన్ని అచ్చు తప్పులో అందులో. చాలా వున్నాయి అచ్చు తప్పులు. అంతేగాక, మీ వాక్య నిర్మాణం చాలా క్లిష్టంగా వుంది. సరళ వాక్యాలు రాస్తే చెప్పే విషయం ఇంకా చక్కగా అర్థం అవుతుంది కదా? భాష విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం అనిపిస్తోంది. లేకపోతే, మీరు ఎంత మంచి విషయాలు చెప్పినా, అవి సరిగా అర్థం గాకుండా పోతాయి. అర్థం చేసుకుంటారని భావిస్తాను.

    రిప్లయితొలగించండి
  4. కుమార్ గారు ,
    గత కొంత కాలంగా మీరు రాస్తున్న పోస్టులను - జరిగిన తప్పుడు సంఘటనలను తీవ్రంగా ఎండగట్టే విధానం చాలా బాగుంది ,
    సాధారణంగా చాలా మందికి నోటుపైన కాక దాని వెనకాల ఉన్న గాంధి కనబడడు, తిప్పి చూపే వరకు ఇలా మీలా...!!
    అభినందనలు మిత్రమా. అందరి కళ్ళముందు పాత నిజాలను అతికిస్తూ రెపరెపలాడిస్తున్నందుకు.. కొన్ని విషయాలు ఇప్పటికే తెలిసినా తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. కమలగారూ మీ సూచనను పాటిస్తాను. నోట్సులో పేర్కొన్న వ్యాఖ్యాణాలు అలానే రాయడం మూలంగా వచ్చిన ఇబ్బంది. టైపు చేసేటప్పుడు అచ్చు తప్పులు వస్తున్నాయి. మరల దిద్దుదామంటే నెట్ బిల్లు పెరుగుతోంది. అయినా మీ అభిమాన పూర్వక సూచనల్ను తప్పక పాటిస్తాను.

    రిప్లయితొలగించండి
  6. శ్రీను ఏదో మీ అభిమానం. నేను కొత్తగా చెప్పేదేముంది. పాత ప్రచురణలలో చదివిన విషయాలే. వీటిని అందరికీ అందుబాటులో వుంచరు కదా? అలాగే మనకూ తెలుసుకోవాలనే ఇంటరెస్టు వుండదు. పాఠ్య పుస్తకాలకే పరిమితమవుతాం. మార్కులు-రాంకుల యావ తప్ప ఇప్పుడు ఆలోచనలు వికసించే చదువు కూడా లేదు. మీకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  7. గాంధీ భగత్ సింగ్ ఉరి శిక్షని సమర్థించాడని వ్రాసిన ఒక పుస్తకాన్ని ఇండియాలో నిషేధించారు. గాంధీని విమర్శిస్తూ అంబేద్కర్ వ్రాసిన పుస్తకాలని మాత్రం నిషేధించలేదు. ఆ పుస్తకాలు మార్కెట్ లో ఉన్నాయి కానీ ఇంగ్లిష్ పుస్తకాలు కొని చదివే స్థోమత ఎంత మందికి ఉంది? గాంధీని విమర్శిస్తూ తెలుగులో రంగనాయకమ్మ, కత్తి పద్మారావు గార్లు పుస్తకాలు వ్రాసారు.

    రిప్లయితొలగించండి
  8. ప్రవీణ్‌ శర్మ గారూ,
    ఎందుకు ఆ తెలిసీ తెలియని మాటలు రంగనాయకమ్మ గారి రచనల గురించి? రంగనాయకమ్మ గారు తన పుస్తకాల్లో, ముఖ్యంగా "యజ్నం మీద రెండు వ్యాసాలు" అన్న పుస్తకంలో, మరియూ "దళిత సమస్య ....." అన్న పుస్తకంలో. గాంధీని విమర్శించారు. కానీ గాంధీని విమర్శిస్తూ పుస్తకాలు రాయలేదు.
    మీరు రాసినది కరెక్టు కాదు. తేడా అర్థం అవుతుందని తలుస్తాను.

    రిప్లయితొలగించండి
  9. దళిత సమస్య పరిష్కారానికి పుస్తకంలో గాంధీ పై విమర్శలు వ్రాయడానికి కారణం గాంధీ గురించి నిజాలు దళితులకి తెలియచెయ్యడానికి. కేవలం అంబేద్కర్ గురించి వ్రాసి గాంధీ గురించి నిజాలు చెప్పకపోతే ఆ పుస్తకానికి అంత ప్రాధాన్యత ఉండేది కాదు. అందుకే ఆ పుస్తకాన్ని గాంధేయవాద వ్యతిరేక రచన అన్నాను.

    రిప్లయితొలగించండి
  10. ప్రవీణ్‌ గారి దబాయింపు చూసి ఎంత నవ్వు వచ్చిందో! రంగనాయకమ్మ గారి రచనలన్నింటిలోనూ నాస్తికత్వాన్ని సమర్థిస్తూనే వుంటారు కాబట్టీ, ఆవిడ రచనలన్నీ నాస్తిక రచనలే నన్న మాట, ఏ విషయం ప్రధానంగా తీసుకుని పుస్తకం రాసినప్పటికీ, ప్రవీణ్‌ గారి దబాయింపు ప్రకారం. ఒకరు ఒక రచన చేస్తే, అందులో ప్రధాన విషయం ఏమిటీ అని చూసి, ఆ రచనని ఆ కేటగిరిలో పెట్టాలనేది ప్రాధమిక ఇంగిత జ్నానం. ఆ పుస్తకంలోని ముఖ్య విషయం దళిత సమస్య. దానికి అంబేద్కరూ చాలడు, బుద్దుడూ చాలడు, మార్క్సు కావాలీ అనేది ముఖ్య సారాంశం. దాంట్లో గాంధీ మీద విమర్శలున్నాయి కాబట్టీ, ఆ విమర్శలు అంబేద్కరు రాసినవి పరిశీలించడానికి ముఖ్యం కాబట్టీ, వాటికి గాంధీ వ్యతిరేక రచనలు అని ముద్ర వెయ్యడం ఎంత వరకూ సమంజసం? దీనర్థం ఆ విమర్శలు గాంధీకి వ్యతిరేకం కాదని అర్థం కాదు. ఒక చిన్న విషయం అర్థం చేసుకోవడానికి ఇంత దబాయింపు అనవసరం.

    రిప్లయితొలగించండి
  11. దళిత నాయకులు కూడా తెలియక తెలియక గాంధీ విగ్రహాలకి దండలు వెయ్యడం చూస్తే గాంధీ దళితుల్లో కూడా పాపులర్ ఫిగర్ అయ్యాడని అర్థం అవుతుంది. అంబేద్కర్ దళిత ఉద్యమం కంటే ప్రైవేట్ ఆస్తికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అంబేద్కర్ వ్రాసిన తొలితరం రచనలు చదివిన వాళ్ళకి ఈ విషయం తెలియకపోవచ్చు. అతను రాజకీయంగా ఎదిగిన తరువాత సమయంలో వ్రాసిన రచనలు చదివితే విషయం అర్థమవుతుంది. ఈ విషయం చెప్పడానికి రంగనాయకమ్మ గారు దళిత సమస్య పరిష్కారానికి పుస్తకం వ్రాసారని నాకు తెలుసు. నేను మార్క్స్, ఎంగెల్స్ ప్రబోధించిన గతితార్కిక చారిత్రక భౌతికవాదం చదివాను. గతితార్కిక చారిత్రక భౌతికవాదంలోని ప్రతి అంశం అన్ని రకాల సంప్రదాయ భావాలని విబేధించేదే. ఈ తత్వశాస్త్రం గాంధేయవాదాన్ని కూడా విబేధిస్తుంది. 1970లలో నక్సలైట్ ఉద్యమకారులు చైనా ప్రభావంతో గాంధీ విగ్రహాలని పేల్చి వేసేవారు కాబట్టి నక్సలైట్ ఉద్యమం కూడా గాంధేయవాద వ్యతిరేక ఉద్యమం అనగలను. దళిత సమస్య పరిష్కారానికి పుస్తకం గాంధేయవాద వ్యతిరేక రచన అనడంలో ఆశ్చర్యం లేదు. లాజికల్ గా ఆలోచిస్తే రంగనాయకమ్మ గారి రచనలతో పాటు చలం గారి రచనలు కూడా గాంధేయవాద వ్యతిరేక రచనలే. గాంధేయవాదం మనిషిలో ఉన్న కొద్దిపాటి చైతన్యాన్ని కూడా హరించే వైరాగ్యాన్ని ప్రబోధిస్తుంది. అందుకే చలం గారి అభిమాని అయిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారు అన్నారు "చలం గారు లేకపోతే తెలుగు సాహిత్యం గాంధేయవాదం లాంటి వైరాగ్య వేదాంతాలతో కూడా కుళ్ళిపోయేది" అని.

    రిప్లయితొలగించండి
  12. ఫిబ్రవరి నెలలో "గాంధీ మహాత్ముడి కుల గజ్జి" అనే టైటిల్ తో నేను ఒక పోస్ట్ వ్రాసాను. అప్పట్లో ఆ పోస్ట్ గురించి గొడవ కూడా జరిగింది.

    రిప్లయితొలగించండి
  13. చారిత్రాత్మకంగా చాలా మోసపూరితమైన వ్యాసం.

    రిప్లయితొలగించండి
  14. "గాంధీ మహాత్ముడి కుల గజ్జి" టైటిల్ తో నేను గతంలో వ్యాసం వ్రాసినప్పుడు మహేష్ చేసిన విమర్శలు నాకు గుర్తున్నాయి. అంబేద్కర్ గాంధీని విమర్శించాడని అంగీకరిస్తూనే విమర్శలకి దారి తీసిన నిజాలని మహేష్ అంగీకరించలేదు.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..