కోనసీమ తరువాత కొబ్బరికి పేరుగాంచిన ఉద్దాన వనం అదృశ్యం కానుందా? ఇందుకు శ్రీకాకుళం జిల్లా, సోంపేటను ఆనుకొని వున్న బీల ప్రాంతంలో నిర్మాణం కానున్న థర్మల్ ప్లాంటు కారణం కానుందా? అవుననే అంటున్నారు అక్కడ పరిశోధనలు గావించిన మేధావులు, పర్యావరణ నిపుణులు. ఎందుచేతనంటే దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన రీసెర్చ్ కేంద్రం నేరీ (National Environment Engineering Institute) వారు 5 పవర్ ప్లాంటు ప్రాజెక్టులపై రీసెర్చి చేసి తెలిపిన వాటిలో మన రామగుండం ప్లాంటుకూడా వుంది. అక్కడ నిర్వాసితులలో సుమారు 5 కి.మీ.ల పరిధిలో ఉండే ప్రజలు అత్యధిక శాతం మంది శ్వాస కోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారని నిర్ధారించారు. అది 1000 మె.వా.పవర్ ప్లాంటు. ఇక్కడ నిర్మించ తలపెట్టింది 2640 మె.వా.ది. మరి ఇక్కడి పరిస్థితి ఎంత భయానకంగావుండబోతుందో ఊహించుకొని ప్రజలు భయపడుతున్నారు.
అలాగే ప్రాజెక్టు నిర్మాణవలన వందలాదిగ్రామాలు నిర్వాశితులవుతారు. పంట పొలాలు నాశనం కాబడతాయి. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టు, నదీజలాలు కలుషితం కాబడతాయి. థర్మల్ వ్యర్థ పదార్థాలతో సముద్ర జలాలు కలుషితం కాబడి అపార మత్స్యసంపద నాశనం అవుతుంది. వేలాదిమత్స్యకార కుటుంబాలు రోడ్ల పాలవుతాయి. సుమారు 10 కి.మీ.ల పరిధిలో భూగర్భజలాలు పూర్తిగా కాలుష్యమయిపోతాయి. వీటికి ఉదా.గాపరవాడలోని థర్మల్ ప్రాజెక్టు చుట్టూ ఉన్న ప్రాంతాలనే ఉదహరిస్తున్నారు.
ప్రాజెక్టు నిర్మాణంనకు ప్రభుత్వం ఇప్పటికే 11 వందల ఎకరాల బీల భూమిని కంపెనీకి అమ్మేసింది. సుమారు 12 వేల కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న ఈప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేకుండానే్ జనవరిలోపనులు ప్రారంభిస్తామని నాగార్జున కంస్ట్రక్షంస్ ప్రకటించింది. ఇటువంటి పరిశ్రమలు స్థాపించాలంటే ముందుగా ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం నిధులతో greenbelt ఏర్పాటు చేయాలి అంటే సుమారు 3 లక్షల మొక్కలు నాటి వాటిలో బతికున్నవెన్ని అవి ఏదశలో వున్నాయో నివేదించాలి. కానీ నిబంధనలన్నీ గాలికొదిలి ప్రాజెక్టును చేపడుతున్న వైనం ప్రజలను ఉద్యమ బాట పట్టిస్తోంది.
ప్రజలను అన్ని విధాలుగా నిర్వాశితులను చేసే ఈ థర్మల్ ను వ్యతిరేకించే ఉద్యమాన్ని ప్రజాస్వామికవాదులు, మీధావులు, పర్యావరణ ఉద్యమకారులు మద్దతు తెలిపి వారి జీవన పోరాటానికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నా.
(ఆంధ్రజ్యోతి దినపత్రిక 05-10-2009 లోని వార్త అధారంగా)
సముద్రపు కెరటాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే టైడల్ విద్యుత్ కేంద్రాలు కట్టాలని డిమాండ్ ఉంది. టైడల్ విద్యుత్ వల్ల కాలుష్యం రాదు. భూమిలో బొగ్గు నిల్వలు అంతరించిపోయినా విద్యుత్ ఉత్పత్తి సాధ్యమే. మరి టైడల్ విద్యుత్ కేంద్రాలు కట్టకుండా కాలుష్యకారకాలైన థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎందుకు కట్టడం?
రిప్లయితొలగించండిప్రజల మాన ప్రాణాల పట్ల ఏనాడూ బాధ్యత వహించలేదు ఈ రాజ్యం. వ్యాపార బేహారులదీ రాజ్యం. తీవ్రమైన ప్రతిఘటనతోనే వీళ్ళ కళ్ళు తెరిపించాలి.
రిప్లయితొలగించండికుమార్ గారు & ప్రవీణ్ అన్నాయ్...
రిప్లయితొలగించండిఈ క్రిందివి చదివి నా ప్రశ్నకి సమాదానం చెప్పండి.
1. థర్మల్ విద్యుత్ కేంద్రం - + విద్యుత్ చౌక , + సాదారణ లేబర్ కి ఎక్కువ ఉద్యొగాలు( విద్యుత్ కర్మాగారం లొ మరియు బొగ్గు గనులలొ ), -కాలుష్యం ఎక్కువ, - బొగ్గు సప్ప్లయ్ వున్నత వరకు
2. జల విద్యుత్ కేంద్రం - + విద్యుత్ చౌక , + కాలుష్యం లేదు, - వర్షాలు లేక పొతే ఉత్పత్తి వుండదు, అన్ని చొట్ల కట్టడం కుదరదు
3. న్యూక్లియర్ - + విద్యుత్ చౌక , + సాదారణం గా కాలుష్యం వుండదు, - సాదారణ లెబర్ కి వుద్యొగాలు తక్కువ, + ఎప్పుడయినా ప్రమాదం జరిగితె నస్టం జన నస్టం ఎక్కువ
4. మిగతావి - సౌర శక్తి , విండ్ పవర్, + కాలుష్యం వుండదు, - సాదారణ లేబర్ కి ఉద్యొగాలు చాలా తక్కువ, - విద్యుత్ ఖరీదు (సామన్యుడు ముఖ్యం గా రైతులకు అందుబాటులొ లేని ఖరీదు)
5. టైడల్, జియో లాంటివి ఇంకా ప్రయొగ దశల్లొనె వున్నాయి.. అంటే అవి ఇంకా ఖరీదు అన్నమాట
ఇప్పుడు నా ప్రశ్న
- పైన ఇచ్చిన ప్లస్ లు మైనస్ లు చదివి , మనకి ఎది బెస్టొ మీరు చెప్పండి.
ప్రజల అవసరాలను సాకుగా చూపి వారిని అనారోగ్యం పాల్జేయాల్సిన అవసరం ఏమిటి. నష్టాలను తగ్గించే ఉత్పత్తిని చేపట్టవచ్చు కదా? బొగ్గు గనులు ఆ ప్రాంతంలో లేవు.ముడిసరుకు పుష్కలంగా వున్న చోట ఇటువంటి ప్రాజెక్టులు నిర్మిస్తే బాగుకానీ ఎక్కడో వున్న ఉద్దానం ప్రాంతంలో నిర్మించి ప్రజల ఆయురారోగ్యాలను కొల్లగొట్టకూడదు కదా? అలాగే ఉద్యోగావకాశాలు ఏవీ నిర్వాశితులకెక్కడా కల్పించబడటం లేదు. పర్యావరణం దెబ్బతినడం మూలంగా జరుగుతున్న నష్టాలు చూస్తున్నాం. అలాగే బొగ్గు నిల్వల పరిస్తితి ఏమిటి. వీటికి ప్రత్యామ్నాయాలు లేవా? జలవిద్యుత్ చౌకగా ఉత్పత్తి చేయొచ్చన్నప్పుడు సముద్రంలో కలుస్తు వృధా అవుతున్న నీటిని మనం ఇంతవరకు సవ్యంగా వినియోగంలోకి తెచ్చుకున్న పని మొదలుకాలేదు. దీనికి ప్రాంతీయ వాదాలు మూలంగా ఏ ప్రాజెక్టులు పూర్తికాలేదు. వాటిని చేపడితే మరింతగా విద్యుత్ అవసరాలు తీరుతాయి కదా? పారిశ్రామికీకరణ, ఉద్యోగాల పేరుతో వారిని నిర్వాసితుల్ని చేయొచ్చా? నాకూ అంతగా తెలీదు. మీకు తెలిసిన విషయాలు చెప్పండి.సందేహాలను మీ ముందుంచుతాను. చర్చిద్దాం.
రిప్లయితొలగించండిబావుంది.. నాకావాల్సిన సమాదానం రాలేదు.. ఒకే.. మీకొసం నాకు తెలిసిన విషయాలు కొన్ని.
రిప్లయితొలగించండి>> బొగ్గు గనులు ఆ ప్రాంతంలో లేవు.ముడిసరుకు పుష్కలంగా వున్న చోట ఇటువంటి ప్రాజెక్టులు నిర్మిస్తే బాగుకానీ ఎక్కడో వున్న ఉద్దానం ప్రాంతంలో నిర్మించి ప్రజల ఆయురారోగ్యాలను కొల్లగొట్టకూడదు కదా?
@@ బొగ్గు గనులు ఒక A అనే ప్లేస్ లొ వున్నాయనుకొందాం.. మనకి విద్యుత్ వాడకం B అనే ప్లేస్ లొ వుంది. మనకి మూడు మార్గాలు వున్నాయి. ఒకటి విద్యుత్ కేంద్రం A లొ పెట్టి అక్కడినుండి B కి విద్యుత్ రవాణా చెయ్యాలి. రెండవది A నుండి బొగ్గు రవాణా చేసి B లొ విద్యుత్ కేంద్రం కట్టాలి. మూడోది ..A కి B మద్య ఇంకొ ప్లేస్ చూసి అక్కడికి A నుంది బొగ్గు తీసుకువచ్చి.. అక్కడనుండి B ki విద్యుత్ రవాణా చెయ్యాలి. ఆ పాయింట్ ఎక్కడ వుంటే తక్కువ ఖర్చు అవుతుందా చుస్తారు. బొగ్గు రవాణా ఖర్చు, విద్యుత్ రవాణా ఖర్చు , ప్లాంట్ పెట్టెదగ్గర లేబర్ ఖర్చు , ఇంక బోల్డు పేరామీటర్స్ ని బట్టి ఆ ప్లేస్ డెసిడ్ చెస్తారు. ఈ మద్యలొ ఏ లాలూ లాంటివాళ్ళొ ఖర్చు ఎక్కువయిన పర్లేదు మా బీహార్ లొ ప్లాంట్ వుండాలి అంటే రైల్వె ప్లాంట్ లా అక్కడికి పొతుంది అది వెరే విషయం.
>> అలాగే బొగ్గు నిల్వల పరిస్తితి ఏమిటి.
@@ అందొళన కరం
>> జలవిద్యుత్ చౌకగా ఉత్పత్తి చేయొచ్చన్నప్పుడు సముద్రంలో కలుస్తు వృధా అవుతున్న నీటిని మనం ఇంతవరకు సవ్యంగా వినియోగంలోకి తెచ్చుకున్న పని మొదలుకాలేదు.
@@ దీనికి ప్రంతీయవాదాలే కాదు చాలా డబ్బు పెట్టుబడి కావాలి. వీటికి రిజర్వాయర్స్ కట్టాలి. మళ్ళి రిజర్వాయర్స్ వల్ల కలిగే పర్యావరణ నష్టానికి సమాదానం చెప్పాలి.
>> పారిశ్రామికీకరణ, ఉద్యోగాల పేరుతో వారిని నిర్వాసితుల్ని చేయొచ్చా
@@ అన్ని సందర్బాలలొ ఒకే సమాదానం వుండదు. సెజ్ ల కొసం పచ్చటి పొలాల్ని నాశనం చెయ్యడానికి మాత్రం పూర్తి విరుద్దం .
@@ ఇప్పుడు మనం ఉత్పత్తి చేసె విద్యుత్ ని బట్టి చుస్తే ఇంకొ 10 సం లొ తీవ్ర విద్యుత్ కొరత వుంటుంది. దానికి తగ్గట్టుగా ఉత్పత్తి చెయ్యడానికి మనదగ్గర సరియిన ప్లానింగ్ లేదు. మీకు అంతగా నచ్చకపొవచ్చు కానీ మనకి అణువిద్యుత్ మాత్రమె పరిష్కారం. మన ప్రభుత్వం ఎప్పుడు అది ఆచరణ లొ పెడితే అప్పుడు పరిస్తితి కొంత మెరుగవ్తుంది. ఇంకా ప్రబుత్వం సౌర , వాయు విద్యుత్ ఉత్పత్తి చేసేవళ్ళకి ప్రత్యేకమయిన రాయితీ ఇవ్వాలి. జర్మని లొ ఇంట్లొనుండి సౌర విద్యుత్ ఉత్పత్తి చేసి తిరిగి గ్రిడ్ కి ఇస్తే మీకు సదారణ విద్యుత్ రేట్ కి డబల్ మీకు చెల్లిస్తారు.
@@ ఇక మనం చెయ్యల్సింది విద్యుత్ ని పొదుపుగా వాడటమే..
అంత వరకూ ఈ కిందవి సరిగ్గా అమలయ్యేలా చూడాలి.
రిప్లయితొలగించండి" ఇటువంటి పరిశ్రమలు స్థాపించాలంటే ముందుగా ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం నిధులతో greenbelt ఏర్పాటు చేయాలి అంటే సుమారు 3 లక్షల మొక్కలు నాటి వాటిలో బతికున్నవెన్ని అవి ఏదశలో వున్నాయో నివేదించాలి."
మంచు పల్లకి గారికి మీరు అత్యంత సహనం కనబరిచి మంచి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను కోరుకున్నది ఇటువంటి చర్చనే. ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునేట్లు వుంటే బాగుంటుంది. ఒకరికంటే ఒకరు తెలివైనవాళ్ళం అని కొన్ని చోట్ల కామెంట్ల రూపంలో దాడులు చేస్తున్నారు. అది నాకు నచ్చదు. తెలియని విషయాన్ని తెలుసుకోవడం నా నైజం. అసలే నేను సందేహాల్రావుని.
రిప్లయితొలగించండిమరి మన చర్చలో బొగ్గు నిల్వలు కూడా ఆందోళనకరమే, అలాగే పచ్చని పంట పొలాలు నాశనమయితే మన ఆహార నిల్వలగురించి కూడా ఆలోచించాలి, అలాగే ఇటువంటి సెజ్ లనేర్పాటు చేసేటప్పుడు వాళ్ళిచ్చే మామ్మూళ్ళ కక్కూర్తి తప్ప మన రాజకీయ నాయకత్వం, అధికార గణం ప్రజల గురించి ఆలోచిస్తోందా? ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలు ఎన్ని జబ్బులు, రొష్టులకు ్గురవుతాయి. అక్కడ వున్నది అధిక శాతం పేద ప్రజానీకం, వారి బాగోగులు గురించి ఎవరిక్కావాలి. అభివృద్ధి ప్రజలను నాశనం చేయకూడదు. ఇప్పటికే మన సముద్రజలాలలో పాశ్చాత్యుల పారిశ్రామిక వర్ధ పదార్థాలతో నింపుతున్నా నోరుమెదపట్లేదు మనం. అడిగే వాళ్ళకి నూకలు చెల్లిపోతున్నాయి. మరి మన పరిస్థితి ఇలా కావల్సిందేనా. మన అభివృద్ధి నమూనా మారాలి. ప్రజా సంక్షేమాన్ని కోరేలా వుండాలి. ఇప్పటికే పర్యావరణ్ సమతుల్యం దెబ్బతిని అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టికి గురౌతున్నాం. వీటన్నింటిపై సమగ్రమైం శాస్త్రీయ దృష్టితో అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా మన పథకాలు వుండాలి. ఇది అత్యాశే.
విద్యుత్ పొదుపుగా వాడాలంటారు, పట్టణాలలో డబ్బున్న మారాజులు, మంత్రులు, అధికారులు విలాసవంతమైన భవనాలకు వినియోగమవుతున్న విద్యుత్ ఎంత? వందలాది గ్రామాలు నేటికీ చీకటిలోనే మగ్గుతున్నాయి. వీటిని కూడా దృష్టిలో వుంచుకోవాలి.
ఏమైనా మీకు థాంక్స్.
Manchupallaki,
రిప్లయితొలగించండిThermal power plant at this stage will bring in more hazards than advantages. The ash is very dangerous. When we already have the nuclear deal in place, why do we need this pollutant plant?
Thank You Malakpet gaaru. charchalOki vachchinamduku.
రిప్లయితొలగించండిమంచి విషయం మీద చర్చ పెట్టేరు...
రిప్లయితొలగించండి2. జల విద్యుత్ కేంద్రం - + విద్యుత్ చౌక , + కాలుష్యం లేదు, - వర్షాలు లేక పొతే ఉత్పత్తి వుండదు, అన్ని చొట్ల కట్టడం కుదరదు -- ఇది స్టేట్ లెవెల్ లో కాకుండా సెంట్రల్ లెవల్ లో జరిగితే బాగుంటుందేమో... సముద్రం లో కలిసి నిరుపయోగమయ్యే నీళ్ళు వాడుకోవచ్చు కదా..
4. మిగతావి - సౌర శక్తి , విండ్ పవర్, + కాలుష్యం వుండదు, - సాదారణ లేబర్ కి ఉద్యొగాలు చాలా తక్కువ, - విద్యుత్ ఖరీదు (సామన్యుడు ముఖ్యం గా రైతులకు అందుబాటులొ లేని ఖరీదు) -- లేదండీ ఈ రకమైన విద్యుత్ వుత్పాదన లో ప్రారంభ లో పెట్టూబడి ఎక్కువ కాని recurring గా వుపయోగించేప్పుడూ తక్కువే అవుతుంది ఖర్చు... వుద్యోగాల కోసం ప్రాణాలకు ముప్పు తెచ్చుకోము కదా..
ఇప్పుడు మనం ఉత్పత్తి చేసె విద్యుత్ ని బట్టి చుస్తే ఇంకొ 10 సం లొ తీవ్ర విద్యుత్ కొరత వుంటుంది. దానికి తగ్గట్టుగా ఉత్పత్తి చెయ్యడానికి మనదగ్గర సరియిన ప్లానింగ్ లేదు. మీకు అంతగా నచ్చకపొవచ్చు కానీ మనకి అణువిద్యుత్ మాత్రమె పరిష్కారం. మన ప్రభుత్వం ఎప్పుడు అది ఆచరణ లొ పెడితే అప్పుడు పరిస్తితి కొంత మెరుగవ్తుంది. ఇంకా ప్రబుత్వం సౌర , వాయు విద్యుత్ ఉత్పత్తి చేసేవళ్ళకి ప్రత్యేకమయిన రాయితీ ఇవ్వాలి. జర్మని లొ ఇంట్లొనుండి సౌర విద్యుత్ ఉత్పత్తి చేసి తిరిగి గ్రిడ్ కి ఇస్తే మీకు సదారణ విద్యుత్ రేట్ కి డబల్ మీకు చెల్లిస్తారు. --అణు విద్యుత్తు అంత గా సర్వత్రా ఆమోదయోగ్యమవ్వక పోవచ్చు అని నా అభిప్రాయం..
Nuclear radiation is more dangerous than thermal ash. Thermal power stations can be constructed in the areas where plenty of water is available. Thermal power stations need large quantity of water to accelerate steam turbines. Gonamarigedda area in Srikakulam district has salt water creeks (తెలుగులో ఉప్పుటేర్లు లేద బీల గెడ్డలు అంటారు). If salt water is used for accelerating steam turbines in thermal plant, turbines will get dusted with salt and those turbines may run slow. Thermal power stations use the water that is demineralised using acid. Demineralising salty water is difficult compared to demineralising river water.
రిప్లయితొలగించండిKumar garu,
రిప్లయితొలగించండిActually you have initiated a very good discussion. People are split 50-50 on this discussion.
My vote is for Solar Energy. Dont need 1200 croes, just give 12 crores to a dedicated group from an Institute like IISc , they will work wonders.
By the way - My bad - I assumed that you would be as aggressive as that Martanda guy, but looks like you are a real sensible person. If I came across too aggressive on you, then have my apologies. Didnt mean to hurt ya!
1. కొత్తగా కట్టే విద్యుత్‌కేంద్రాలకు బొగ్గును ఏ ఆస్ట్రేలియానుంచో దిగుమతి చేసుకుంటారు. మనకున్న బొగ్గు వనరులు (నాణ్యత పరంగా) సరిపోవు. శ్రీకాకుళంలో రాబొయే మూడు పెద్ద కేంద్రాలకు (మూడేనా?) కూడా బొగ్గును బహుశా దిగుమతే చేసుకుంటారు లేదా ఏ ఒరిస్సానుంచో తెచ్చుకుంటారు. మన సింగరేణి నుంచి బహుశా రాదు.
రిప్లయితొలగించండి2. రామగుండంలోని కేంద్రం చిన్నదేమీకాదు. దాని సామర్థ్యం సుమారు 2600 మెగావాట్లు. కట్టడమే 2100 మెగావాట్లుగా కట్టారు. తరవాత మరో 500 పెంచారు.
3. మనకు తేలిగ్గా, చవగ్గా, ఏడాది పొడుగునా నమ్మకంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కావాలి. జలవిద్యుత్తు మీద ఆధారపడలేం. ప్రకృతిపై చాలా ఎక్కువగా ఆధారితం. నదుల్లో నీళ్ళ లభ్యత నిలకడగా ఉండడంలేదు -కారణాలు బోలెడున్నాయి. పైగా తాగునీళ్ళు, సాగునీళ్ళు -ఆ తరవాతే వెలుగునీళ్ళు. సౌర,కెరటాల,.. వగైరా విద్యుత్తులు ఇంకా పరిశోధన, ప్రయోగాత్మక ఉత్పత్తి స్థాయిలోనే ఉన్నాయి. సౌరవిద్యుత్తులాంటివి బాగా ఇనెఫిషియెంటు, మనం వాడుకునేందుకు అందుబాటులో ఉండేంత తక్కువ ఖర్చులో దొరకడంలేదు. అణువిద్యుత్తు - చవకే. కానీ రాజకీయాల ప్రభావం చాలా ఉంది. (పైగా, పనిచేసినంతకాలం బానే ఉంటుంది. తేడా వస్తేనే..! కాకపోతే ఇందులోకూడా ఒక అనుకూలమైన సంగతుంది..తేడా ఒకేఒక్కసారి వస్తుంది, పదేపదే రాదు. :) ) ఏదేమైనా ఇది మనకున్న రెండో ఉత్తమ విద్యుత్‌మార్గం.
4. పర్యావరణకాలుష్యం: ఎందులోనైనా ఇది ఉంటుంది. కాకపోతే తాపవిద్యుత్తులో కాలుష్యం ఎక్కువ. ప్రభుత్వం పెట్టిన నిబంధనలు నిష్ఠగా అమలు చేస్తే కొంతవరకు కాలుష్యాన్ని నిరోధించవచ్చు. అసలు ప్రభుత్వనేతలే సమస్య కాబట్టి మనకు మరో దిక్కులేదు -ఉద్యమం తప్ప. "నిబంధనలన్నీ గాలికొదిలి ప్రాజెక్టును చేపడుతున్న వైనం ప్రజలను ఉద్యమ బాట పట్టిస్తోంది." ఉద్యమం చెయ్యకపోతే వాళ్ళాపనులు చెయ్యరు. విజయవాడలోని వీటీపీయెస్ కాలుష్యాన్ని బాగానే నియంత్రిస్తుంది.
థర్మల్ విద్యుత్తు విషయంలో మరో ముఖ్యమైన విషయం ఒకటి చూడాలి మనం.. వాటి నిర్మాణానికి పెడుతున్న ఖర్చు. ఎన్టీపీసీ పెట్టే ఖర్చుకంటే, ఈ ప్రైవేటు వాళ్ళు పెట్టేది ఎక్కువగా ఉంటుంది. ఏ అమెరికా కంపెనీకో చైనా కంపెనీకో ఇచ్చే కన్సల్టెన్సీయే దానికి కారణం.
"ముడిసరుకు పుష్కలంగా వున్న చోట ఇటువంటి ప్రాజెక్టులు నిర్మిస్తే బాగుకానీ ఎక్కడో వున్న ఉద్దానం ప్రాంతంలో నిర్మించి ప్రజల ఆయురారోగ్యాలను కొల్లగొట్టకూడదు కదా?" - :) మన ఊరు, మన ప్రాంతం బాగుండాలని కోరుకోడంలో తప్పులేదులెండి.
మలక్..మీరు చెప్పేంది కరేక్టే.. కానీ థర్మల్ ప్లాంట్ల వల్ల వచ్చే కాలుష్యం పూర్తి గా కంట్రొల్ చెయ్యలంటే అప్పుడు యునిట్ ఖర్చు మళ్ళి పెరిగిపోతుంది. జల విద్యుత్ పక్కన పెడితే మనకు రెండు మార్గాలు వున్నాయి. అణు మరియు థర్మల్. అణు విద్యుత్ కర్మాగారాలు కి కావలసిన రెయాక్టర్స్ , మరియు దాని టెక్నాలజి కి మనం విదెశాలమీద అదారపడాలి. దానికి ఒక ప్రత్యెకమయిన లొకషన్ వుండాలి. ఇవి దాని లిమిటేషన్స్. సొ మనం పూర్తిగా ఒకే టైప్ మీద డెపండ్ అవ్వకూడదు. మనకున్న బొగ్గు నిల్వలకి , అవి ఎంతకాలం ఈ థర్మల్ స్టెషన్ కి సప్ప్లయ్ చెయ్యగలవ్, అప్పటికి ఆ ప్లాంట్ బ్రేక్ ఈవన్ అవుతుందా.. ఇవన్ని చూసె కానీ ప్లాంట్ ఒకే చెయ్యరు . ప్రాబ్లెం ఎక్కడ వస్తుంది అంటే కాలుష్యాం , దాని అఫ్ఫెక్ట్ మీద మనకు సరైన అవగాహన , ముందు చూపు లేదు. లంచాలకి కక్కుర్తి పడి ఎలా వున్నా ఒకే చెసెస్తున్నారు. ముఖ్యంగా మనకి వున్నన జన సాంద్రతకి అది చాలా ప్రాబ్లెం అవుతుంది.
రిప్లయితొలగించండిప్రబుత్వం ముందు చెయ్యల్సినది కాలుస్యం మీద ద్రుస్టి పెట్టడం. అల్టర్నేటివ్ ఎనర్జి కి ప్రొత్సాహం అందిచడం. విండ్ , సొలర్ మీద మరింత రెసేర్చ్ చెయ్యలి. (మన ఇండియన్ కంపెని సుజ్లాన్ విండ్ ఎనర్జి లొ ప్రపంచం లొనే మంచి స్తానం సంపాదిచింది. )
"పట్టణాలలో డబ్బున్న మారాజులు, మంత్రులు, అధికారులు విలాసవంతమైన భవనాలకు వినియోగమవుతున్న విద్యుత్ ఎంత" ఇది కరెక్ట్. విద్యుత్ పొదుపు మొదలవ్వల్సినది అక్కడ. ఇప్పుడు విద్యుత్ వాడే మెత్తాన్ని బట్టి యునిట్ రేట్ వుంది. అంటే 200 లోపు యూనిట్లకు యునిట్ 2 రూ అని 200- 300 మద్య యూనిట్ 4 అని అలా.. అదే సరిపోదు. ఉదాహరణకి మహరాస్త్ర లొ కొన్ని చొట్ల ఇంట్లొ బాత్ టబ్ వుండకూడదు. ఎందుకంటే ఒక బత్ తబ్ నీళ్ళతొ ఒక పదిమంది స్నానం చెయ్యచ్చు. లేక ఒక 20 మంది కి మంచినీరు దొరుకుతుంది. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ వుండాలి. (సేం కాదు .. అలాంటివి) . ఇంక విద్యుత్ చౌర్యం గురించి చెప్పక్కర్లేదు.
విద్యుత్ చౌర్యం అనగానే అందరు ముందు పాతబస్తి మీద పడతారు కానీ , దానితొ పొల్చ్చుకుంటే ఫాక్టరీలు దోచుకునే విద్యుత్ చాలా రెట్లు ఎక్కువ.
కొన్ని గ్రామాలకి ఇంకా కరెంట్ రాలేదు అన్నారు. కొంత ప్రబుత్వ నిర్లక్ష్యం ఒప్పుకుంటాను. కానీ మీరు ఇంకొ విష్యం కూడా అలోచించాలి. ఎక్కడొ కొండల్లొ ఒక 500 మంది వుండే పల్లె కి ట్రాన్స్మిషన్ లైన్ వెయ్యలంటే చాలా ఖర్చు .. దానికొసం ఇప్పుడు ప్రబుత్వం కేవలం ఆ గ్రామానికే సరిపడే సొలర్ పవర్ ప్లాంట్ ని కట్టాలని చూస్తొంది. చూద్దాం అదేప్పుడు అమలులొకి వస్తుందొ..
మలక్ - BTW.. I visited your Schenectady plant few years back. you know that is second the biggest plant under ONE roof in US after Boeing.
మన వైజాగ్ NTPC కి కూడా ఒరిస్సా కిరండొల్ నుండే బొగ్గు వస్తుంది అనుకుంటా.. అణు విద్యుత్ కర్మాగారాల్లొ మీరు అనుకుంత రేడియెషన్ ఎమీ రాదు. కాకపొతే చెర్నొబిల్ లాంటి సంఘటనలు జరిగితే మాత్రం నస్టం బారిగా వుంటుంది. అదీ ప్రాణ నస్టం.
రిప్లయితొలగించండి@ భావన గారు -
సౌర శక్తి , విండ్ పవర్ విషయం లొ మీరు చెప్పింది కారెక్ట్. ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ, రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. మన ఇంటికి కావల్సిన 2-3 కిలొ వాట్ సొలార్ పవర్ యునిట్ కి పదిలక్షలు పెట్టుబడి పెట్టాలంటే కస్టం కదా.. సొలార్ బారి లెవెల్ లొ పెట్టాలంటే కుదరదు. ప్రస్తుతం మన ప్రబుత్వం బాగా రెమొట్ గా వుండే గ్రామాల్లొ లొకల్ సొలార్ పవర్ స్టాషన్స్ పెడుతుంది . విండ్ పవర్ ప్రస్తుతం బాగానే వుంది. మన ఇండియా కంపని సుజ్లాన్ మంచి ప్రగతి లొ వుంది.
ఇంకొ మాట ఇవి అబివ్రుద్ది చెందాలంటే ప్రబుత్వం ఈ పవర్ ఉపయొగించే వారికి రాయితీ ఇచ్చి ప్రొత్సహించాలి (విదేశాల్లొ లాగ) .
జల విద్యుత్ - ఇది పని చెయ్యలంటే నీరు ఒక యెత్తునుండి పడాలి , లేక మంచి ఫొర్స్ లొ వెల్లాలి. అందుకని నీల్లున్న ప్రతిచొటా జల విద్యుత్ కర్మాగారం కట్టలేం. కొన్ని స్ట్రాటజిక్ ప్లేస్ లొ మాత్రమే వీలు అవుతుంది. ఇంకొ విషయం గుర్తుపెట్టుకొండి. జల విద్యుత్ + నీటి నిల్వ కొసం , రిజర్వాయర్ లు కట్టలంటే , చాలా ప్లేస్ కావాలి ,, అప్పుడు కూడా మనం పర్యవరణ సంఘలనుండి నిరసనలు వింటాం.
@ చదువరి గారు
విజయవాడలోని వీటీపీయెస్ కాలుష్యాన్ని బాగానే నియంత్రిస్తుంది. - ఇది కరక్ట్ ..
@ Malak -
Research is going on in almost all IITs and IIsc since last 20 years. IIT Bombay is leading in this research at this point. solar power plant can be divided in to two parts. one is solar panel which converts light in to dc current and electronic circuit which converts dc current to ac power. IITs succeeded in tracking the maximum power point (means take maximum power from solar panel all the time) and improving second stage electronics part. But not much break through in reducing the cost of solar power panel.
Most of the private companies are seriously working on this to capture the solar power industry in developing countries by reducing the cost.
శ్రీ మంచుపల్లకీ ప్రారంభించిన యీ చర్చలో, పాలుపంచుకున్న అందరికీ, ఆశీర్వాదాలతో......(ఆశీర్వదించే వయసే నని నాభావన.) ప్రస్తుత దేశకాలమాన పరిస్తుతులలో రోజు రోజుకూ విద్యుత్ వినియోగం ప్రతి యింట్లోనూ విపరీతంగా పెరుగుతూ,వుత్పత్తి తరిగిపోతున్న వేళ. యీ అత్యవసర స్తితిలో,యీ చర్చను ప్రారంభించినందుకు మంచుపల్లకీకి అభినందనలు.,విషయపరిగ్నానం తో జరిగినందుకు చాల సంతోషం.
రిప్లయితొలగించండియీ లింకు అందించిన మంచు పల్లకి కి ధన్యవాదాలు.
.భావనగారి వాదన, మలక్ పేట వారి వాదనా కూడ సబబుగా వున్నాయ్. మంచు పల్లకి వారు వుంచిన నెగెటివ్ పాయింట్స్ లో వుద్యోగాలు తక్కువవుతాయి అన్నారు. నేను ఏకీభవించను.యిప్పటివరకూ భారత్ లో లేని సోలార్ విద్యుత్ పరికరాల కర్మాగారాలు స్మాల్ స్కేల్ పరిశ్రమలుగా ఇబ్బడి ముబ్బడిగాపెరిగే అవకాశం వుంది,ఆపరంగా సాంకేతిక విద్యా సంస్థలు అన్ని స్థాయిలలో పెరుగుతాయి ,ఆ విధంగా వుద్యోగాలు పెరుగుతాయి. సోలార్ విద్యుత్ వల్ల యింతకు ముందున్న విద్యుత్ కర్మాగారాలేమీ మూత వేయనక్కరలేదు కదా.......అదీ కాక రైతే విద్యుదుత్పత్తి చేసుకునేలా ప్రభుత్వాలు ,సోలార్ కిట్లు యిస్తే అతనే వుత్పాదకుడు, వినియోగదారుడూ. సమస్య ప్రాధమిక పెట్టుబడి. క్రొత్తగా నిర్మించాలనుకొనే విద్యుత్ ప్రోజెక్టులకయ్యే ద్రవ్యాన్ని యీ సోలార్ కిట్స్ సరఫరాకు వినియోగించ వచ్చు.దేశ వ్యాప్తంగా ఒకే సారి యేర్పాటు చేయనక్కరలేదు. క్రమేణా యీవిధానాన్ని అన్ని ప్రాంతాలకూ విస్తరించ వచ్చు.
అదీకాక భారత్ భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ వుత్పత్తి చేసి సరఫరా చేయాలనుకోవడం రాబోయే కొన్ని దశాబ్దాలవరకు సాధ్యం కాకపోవచ్చు. (ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్తితులలో,) ఆర్ధిక పరంగా ఆత్మ హత్యా సద్రుశమే కావచ్చు. గ్రిడ్ సరఫరా అవసరం లేని విధంగా,ప్రస్తుతం గ్రుహావసరాల విద్యుత్ అవసరాలకు విద్యుత్ ను వారినే వుత్పత్తి చేసుకోగలిగిలా ప్రోత్సాహకాలిచ్చి,ప్రోత్సహించగలిగితే...
వ్యవసాయ, గ్రుహావసరాలకు వినియోగించే విద్యుత్తు భారీ మొత్తంలో మిగుల్చుకొని యితర పారిశ్రామిక, ప్రయాణాసాధనాలకై వినియోగించ్కోవచ్చు. సరఫరాకొరకు మౌలిక సదుపాయాల అవసరం లేనిది ఒక్క వికేంద్రిత సోలార్ విద్యుత్ వుత్పాదన మాత్రమే.... సరఫరా కొరకు మౌలిక సదుపాయాల (ట్రాన్స్మిషన్. మరియూ డ్స్త్రిబ్యూషన్)పై పెట్టే పెట్టుబళ్ళు యీ ప్రక్రియలో తగ్గించు కోవచ్చు.... , క్రొత్త ప్రోజెక్టులనిర్మాణానికి వెళ్ళకుండా ఆడబ్బుతో యింటింటికో సోలార్ సెట్ అందించవచ్చు..అభినందనలతో ...నూతక్కి
యీ చర్చలో, పాలుపంచుకున్న అందరికీ, ఆశీర్వాదాలతో. ప్రస్తుత దేశకాలమాన పరిస్తుతులలో రోజు రోజుకూ విద్యుత్ వినియోగం ప్రతి యింట్లోనూ విపరీతంగా పెరుగుతూ,వుత్పత్తి తరిగిపోతున్న వేళ. యీ అత్యవసర స్తితిలో,యీ చర్చకువూతమిచ్చినందుకు మంచుపల్లకీకి అభినందనలు., చర్చవిషయపరిగ్నానం తో జరిగినందుకు చాల సంతోషం.
రిప్లయితొలగించండియీ లింకు అందించిన మంచు పల్లకి కి ధన్యవాదాలు.
.భావనగారి వాదన, మలక్ పేట వారి వాదనా కూడ సబబుగా వున్నాయ్. మంచు పల్లకి వారు వుంచిన నెగెటివ్ పాయింట్స్ లో వుద్యోగాలు తక్కువవుతాయి అన్నారు. నేను ఏకీభవించను.యిప్పటివరకూ భారత్ లో లేని సోలార్ విద్యుత్ పరికరాల కర్మాగారాలు స్మాల్ స్కేల్ పరిశ్రమలుగా ఇబ్బడి ముబ్బడిగాపెరిగే అవకాశం వుంది,ఆపరంగా సాంకేతిక విద్యా సంస్థలు అన్ని స్థాయిలలో పెరుగుతాయి ,ఆ విధంగా వుద్యోగాలు పెరుగుతాయి. సోలార్ విద్యుత్ వల్ల యింతకు ముందున్న విద్యుత్ కర్మాగారాలేమీ మూత వేయనక్కరలేదు కదా.......అదీ కాక రైతే విద్యుదుత్పత్తి చేసుకునేలా ప్రభుత్వాలు ,సోలార్ కిట్లు యిస్తే అతనే వుత్పాదకుడు, వినియోగదారుడూ. సమస్య ప్రాధమిక పెట్టుబడి. క్రొత్తగా నిర్మించాలనుకొనే విద్యుత్ ప్రోజెక్టులకయ్యే ద్రవ్యాన్ని యీ సోలార్ కిట్స్ సరఫరాకు వినియోగించ వచ్చు.దేశ వ్యాప్తంగా ఒకే సారి యేర్పాటు చేయనక్కరలేదు. క్రమేణా యీవిధానాన్ని అన్ని ప్రాంతాలకూ విస్తరించ వచ్చు.
అదీకాక భారత్ భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ వుత్పత్తి చేసి సరఫరా చేయాలనుకోవడం రాబోయే కొన్ని దశాబ్దాలవరకు సాధ్యం కాకపోవచ్చు. (ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్తితులలో,) ఆర్ధిక పరంగా ఆత్మ హత్యా సద్రుశమే కావచ్చు. గ్రిడ్ సరఫరా అవసరం లేని విధంగా,ప్రస్తుతం గ్రుహావసరాల విద్యుత్ అవసరాలకు విద్యుత్ ను వారినే వుత్పత్తి చేసుకోగలిగిలా ప్రోత్సాహకాలిచ్చి,ప్రోత్సహించగలిగితే...
వ్యవసాయ, గ్రుహావసరాలకు వినియోగించే విద్యుత్తు భారీ మొత్తంలో మిగుల్చుకొని యితర పారిశ్రామిక, ప్రయాణాసాధనాలకై వినియోగించ్కోవచ్చు. సరఫరాకొరకు మౌలిక సదుపాయాల అవసరం లేనిది ఒక్క వికేంద్రిత సోలార్ విద్యుత్ వుత్పాదన మాత్రమే.... సరఫరా కొరకు మౌలిక సదుపాయాల (ట్రాన్స్మిషన్. మరియూ డ్స్త్రిబ్యూషన్)పై పెట్టే పెట్టుబళ్ళు యీ ప్రక్రియలో తగ్గించు కోవచ్చు.... , క్రొత్త ప్రోజెక్టులనిర్మాణానికి వెళ్ళకుండా ఆడబ్బుతో యింటింటికో సోలార్ సెట్ అందించవచ్చు..అభినందనలతో ...నూతక్కి
డియర్,మంచుపల్లకీ,ఆశీర్వాదాలు.
మిడి మిడి గ్నానంతో, నాబోటి ఓ సామాన్యుడు వ్రాసిన అభిప్రాయానికి ఓ శాస్త్రవేత్తనుంచి స్పందన !.సంతోషం. బాబూ.
ప్రజా ప్రయోజనాలకొరకు దీర్ఘకాలిక కార్యక్రమాల కొరకు, ప్రభుత్వాలు తాము చేసే పనులకు వెచ్చించే ,ప్రతి రూపాయికీ ,అణాపైసలతో వడ్డీ లెక్కించుకుంటూపోతే, యే పనులూ చేయలేవు. ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చే అప్పుల్లో ప్రజాప్రయోజనాలకు నిర్మాణాత్మక,వుత్పాదక కార్యక్రమాలకు చేరేది చాలా తక్కువ మొత్తం.
మిగిలింది యేమౌతున్నదన్న విషయం ప్రజలంతా యేకకంఠంతో ప్రశ్నించవలసిన అవసరం వుంది. అది వేరే సబ్జెక్ట్.
నా ప్రతిపాదనలోప్రభుత్వాల మీద పడే భారం ,పెరుగుతున్నభారీ ప్రాజెక్టుల,మొత్తాలతో, వాటి పై వడ్డీ లెక్కిస్తే ఆ వడ్డీ తోనే సబ్సిడీ ధరలకు సోలార్ కిట్ల పంపిణీలో వినియోగించవచ్చు. అదీ కాక యిందులో వినియోగదారుల/వుత్పత్తిదారుల భాగస్వామ్యం కూడా కల్పించ వలసి వుంటుంది. దీర్ఘకాల ప్రయోజనాలకొరకు,
ప్రభుత్వాలూ, ప్రజలూ,పారిశ్రామిక వినియోగదారులూ వారి వారి అవసరాల కణుగుణంగా సూర్య శక్తిని వుత్పత్తి చేసి వినియోగించుకోగలిగితే క్రొత్తగా విద్యుత్ ప్రోజెక్టులు కట్టవలసి న అవసరం వుండకపోవచ్చు. నేను చెప్పిన ప్రతి పాదనల వల్ల, ట్రాన్స్మిషన్ కొరకు ప్రత్యేకించి ఖర్చులు చేయవలసిన అవసరం వుండదు.కనుక నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వం భరించవలసిన అవసరం వుండదు.
మంచు పల్లకీ వారికి , నా అభ్యర్ధన యేమంటే, భారత దేశం వంటి వుష్ణ దేశాల్లో ఆరు గంటల వ్యవధిలో ఒక చదరపు అడుగు సోలార్ ప్యానెల్ ఎంత విద్యుదుత్పత్తి చేయ గలదు? దానిని ఎలా స్టొర్ చేసుకోగలం?యే యే ప్రయోజనాలకు వాడుకో గలం? దానికి నిర్మాణానికి (అన్ని పరికరాలతో ,దిగుమతి ఖర్చులతో కలిపి)ఎంత ఖర్చు అవుతుంది వంటి విషయాలపై , సబ్జెక్ట్ పై కమాండు వున్న మీ బోంట్లు, బ్లాగరు భొనగిరి అడిగినట్లు , ప్రజల అవగాహనకై ఓ వ్యాసం వ్రాయమని నా అబ్యర్ధన.
నావరకు నేను( నాలాటి వారెందరో ), లైటింగుకు,ఫ్యానులకు 2KW/h, నీళ్ళు వేడి చేయడానికి2Kw/h,యిస్త్రీ వగైరాలకు2Kw/h,నీటి పంపులకు, స్ప్రింక్లర్లకు2Kw/h, వేసవిలో ఏసి కొరకు 6kwh , verasi 15kwh విద్యుత్ వాడుతాను. భారత దేశంలో నా స్వంతంగా సోలార్ పవర్ యూనిట్ పెట్టుకోవాలంటే మీ కున్న అవగాహనను బట్టి ఎంత ఖర్చు చేయాల్సి రావచ్చు ?యిత్యాది విషయాలపై ఓ వ్యాసం ప్రచురించండి, ప్లీజ్.
నూతక్కి గారికి స్వాగతం. చాలా రోజుల తరువాత చర్చలోకి వచ్చినా మంచి విషయాలతో మొదలుపెట్టారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచర్చ మళ్ళీ ఇక్కడకి వచ్చిందని నేను గమనించలేదు.
రిప్లయితొలగించండిమీకు తెలిసిందే అయినా మళ్ళి ఇంకొసారి గుర్తుచేస్తున్నా..మనం వాడే విద్యుత్ ఎ.సి. రకం కావున విద్యుత్ వుత్పత్తి చెయ్యడానికి అవసరమయ్యె ఇంధనం నిల్వ చెయ్యగలం కానీ ఎ. సి. విద్యుత్ ని చెయ్యలేం. ( డి. సి. రకం విద్యుత్ ని నిల్వ చెయ్యొచ్చు.. మరి ఎ.సి ఎందుకు అంటే అది చాల పెద్ద టాపిక్) . అందువలన మనం చాలా సొలార్ విద్యుత్ ప్లాంట్లు వున్నా, మిగతా ప్లాంట్ సామర్ద్యం తగ్గించలేం.. ఎందుకంటే రాత్రి, లేక అంతగా వెలుతురు లేని వేళ ఈ మిగతా పవర్ ప్లాంట్లు మనకి విద్యుత్ సరఫరా చెయ్యాలి. అందుచేత సొలార్ ప్లాంట్లు వున్నా మిగతావి మాములే.. ఇంక ఎక్కడ మనకి బెనిఫిట్ అంటే మిగతా ప్లాంట్లకి వాడే అంధనం అదా చేసి కేవలం సొలార్ అందుబాటులొ లేనప్పుడే వాడుకొవచ్చు. అదే నూతక్కి గారు చెప్పేది .
భారత దేశం వంటి వుష్ణ దేశాల్లో సొలార్ నుండీ ఎక్కువ విద్యుత్ రాబట్టొచ్చు అన్నది ఒక అపోహ.. సూర్యరశ్మి (లైట్) వేరు వెడి (రేడియేషన్) వేరు. బెంగలూరులొ వాడే సొలార్ హీటర్లు సూర్యుడు నుండి కేవలం వేడి ని గ్రహించి నీళ్ళని వేడి చేస్తుంది.. అలాంటివి మన దెశం లొ ఎక్కువ సామర్ద్యం తొ పనిచెస్తాయి. కానీ సొలార్ పేనల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చెయ్యడానికి ఈ వెడి ఉపయొగపడదు. సొలార్ పానల్స్ సూర్యరశ్మి (లైట్) ని విద్యుత్ గా మారుస్తుంది. ఇంకా చెప్పలంటే వేడి ఎక్కువ వుంటే దానీ ఎఫ్ఫిషన్సి తగ్గుతుంది.. ఈ పానల్స్ ఖరీదు ఎక్కువ మరియు ఇవి మన దేశం లొ ఉత్పత్తి కావడం లేదు.
ఈ విషయమై శాస్త్రవిజ్ఞానం బ్లాగులొ కొన్ని టపాలు వున్నాయి. త్వరలొ నాకు తెలిసినది ఒక పోస్టుగా రాస్తాను,.. బహుశా అదే నా మొదటి పొస్ట్ అవుతుందెమో
నూతక్కి గారు - మీరు చెప్పిన విద్యుత్ వినియొగం ఎనర్జి లొ వుంది.. అంటే ఒక రోజుకొ లేక ఒక వారానికొ మీరు వుపయొగించే ఎనర్జి అన్నమాట. మనం ఎంత కర్చు అవుతుంది అని లెక్కవెసినప్పుడు కావల్సినది పవర్. మీరు చెప్పిన లెక్క నాకు అర్ధం అయ్యింది.
*** స్పెల్లింగ్ తప్పులు క్షమించండి