6, డిసెంబర్ 2009, ఆదివారం

బాబ్రీ మసీదు విధ్వంసం - హిందూ ఫాసిజానికి పరాకాష్ట



బాబ్రీ మసీదును కూల్చి 17 సం.లు పూర్తయిపోయినా నేటికీ దోషులు ఎవరో తెలిసినా కనీసం వారిని తాకేందుకు భయపడుతున్నది ఈ దేశ ఓటుబ్యాంకు రాజకీయం. అయోధ్యలో మొదటినుండి కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే టెన్షన్ క్రియేట్ చేయడం జరిగింది. రాముని జన్మ స్థలంగా అక్కడే పది పదిహేను చోట్ల పూజా స్థలాలు వెలిసాయి. ఇదమిధ్దంగా కూడా తెలీని దానికోసం ఒక చారిత్రక కట్టడాన్నే కూల్చి మైనారిటీ మతస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేసి వారి ఉనికిని సహించలేని స్థితికి తీసుకువచ్చారు. ఆనాటి కుట్రలో ప్రధానమంత్రిగా కూచున్న రాములోరి భక్తుడి అండదండలు లేకుండా, కళ్యాణరాముడొక్కడే చేయగలడా? స్వాములు, మతపెద్దల సలహాలకు తలొగ్గి, ఆనాటి సంఘటనకు ఆలంబనగా కూచున్నది ఎవరో జనానికి తెలుసు. కానీ మాటాడే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. రథయాత్ర పేరుతో శవయాత్రలను ఉధృతంగావించినవారిని వదిలివేసారు.

ఈ దేశ ముస్సోలిని, హిట్లర్ ల వారసులు అద్వానీ, మోడీలు. అధికారం పొందడానికి ప్రజల మనోభావాలతో, ఉద్రేకాలతో ఎలా చెలగాట మాటాడాలో బాగా తెలిసినవారు. వేలాదిమంది హత్యకు బాధ్యులు. వీరికి శిక్షపడిన నాడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం వుందని ఋజువు అవుతుంది. అది కలే.

25 కామెంట్‌లు:

  1. హిందూదేశంలో నున్న గుడులన్నింటినీ, అందులో విగ్రహాలను కూడా వదలకుండా తలలు/కాళ్ళు/ చేతులు నరికిన చరిత్ర మహా అయితే ఓ 500 - 600 సంవత్స్రారాల క్రితానిదేమో. అది ముసల్మాన్ల ఫాసిజానికి గుర్తు కాదా? అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?

    రిప్లయితొలగించండి
  2. ayya kuhana medhavulu, okkasaari chritra choodandi.evaru fascistulo, mathonmadhulo tlustundi. Kevalam matham kosam prapanchamulo maarana kaanda chesinadi evaru? vere matham antaene visham kakkedi evaru. Ae matham vaallu vunta Chechenya, September 11, Bosnia Spain, Indonesia, Bali, England Russia china etc., lo bomb blasts avuthunnayi.janam chastunnaru.Inka ee kuhana medhavulu hindu fascism antunnaru. hindu fasicstlu enni bombulu vaesaaru. entha mandini champaaru.ee desallo blasts chesarru.konchem sheppandi pseudo secularist gaaru

    రిప్లయితొలగించండి
  3. గుజరాత్ మారణకాండ, మాలెగావ్ పేలుల్లు, ఢిల్లీలో సిక్కుల ఊచకోత, ఒరిస్సాలో క్రైస్తవ మిషనరీలపైదాడులు-గిరిజన గూడేల కాల్చివేత ఇలా చాలా వుంది శ్రీరాం గారు. ముస్లిం చక్రవర్తులు దాడులు చేసారని ఇప్పుడు మీరు చేస్తారా? పాలక వర్గాల హింసను కొనసాగిస్తారా?

    రిప్లయితొలగించండి
  4. హిందూ దేవాలయాలని కూల్చిన ఔరంగజేబు, మహమద్ ఘజనీ లాంటి వాళ్ళు పోయి మస్జీద్ లని కూల్చేవాళ్ళు అధికారంలోకి వచ్చారు. మత హింస చెయ్యడానికి ఏ మతోన్మాది అయితేనేం?

    రిప్లయితొలగించండి
  5. సిక్కుల మీద 84 లొ జరిగిన దాడులను స్సపూర్ట్ చెసే ఒక్క హిందువు ని చూపించు.. సిక్కులు దెశం కొసం ఎంత త్యాగం చేసారొ , కుటుంబాలని కూడా వదిలేసి ఎంతమంది సరిహద్దుల్లొ మన దెశం కొసం పొరాడుతున్నరొ ఎవన్ని ప్రతి హిందువుకి తెలుసు.. ఆలాంటి సిక్కు సొదరలను హిందువులు ఎన్నటికి ద్రొహం చెయ్యరు.. గౌరవం తగ్గానియ్యారు. మీ మిడి మిడి జ్ఞానం తొ అనవసరం గా హిందువులకి సిక్కులకి మద్య లేని చిచ్చు పెట్టకండి..

    రిప్లయితొలగించండి
  6. హిందువులమీద పడి ఎడవడానికి వీళ్ళకి దొరికిన రోజు ఈ రోజు.. ఈలెక్కన మిగతా దాడులు చూస్తే మిగిలిన 364 రొజులూ హిందువులు బ్లాక్ డే లుగా జరుపుకొవాలేమో..

    గుజరాత్ మారణకాండ ని ప్రెరేపించిన ట్రైన్ దహనం గురించి మాట్లాడరు.. ఒరిస్సాలొ దాడులకు ను ప్రెరెపించిన క్రైస్తవ టెర్రరిస్టుల చేసిన హత్యలు , స్వామిజిలను చంపిన ఘొరాలు కనపడవు.. డిల్లీ లొ జరిగిన సిక్కుల మీద అన్యాయలకు హిందువులకి సంబందం ఎమిటొ తెలీదు.. ప్రతిరోజు దెశాంలొ ఎంతొ మంది అమాయకులు చనిపొతున్నా, నేరం రుజువయినా నేరస్తులకి శిక్ష అమలు చెసే దమ్ము లేదు.. జైళ్ళలొ పెట్టి పందిని మేపినట్టు మేపుతున్నారు..

    ముస్లిం చక్రవర్తులు ఎంత వెదవలొ మనకెందుకు.. ఒక్కసారి ప్రపంచం లొ చుడన్నా. ఎవరు టెర్రరిస్టులో.. బాంబు దాడులు చుడన్నా ఎవడు ఫాసిస్టొ..

    ఈ రోజు బాబ్రి మసీదు కుల్చెసారని ఎడుస్తున్నవ్.. అది రామాలయం కూల్చి ఆ ప్రదెశం లొ కట్టెరన్న జ్ఞానం నీకు లేదా.. ముస్లిం టెర్రరిస్టులమీద 364 పొస్ట్లు రాయన్న.. అప్పుడూ నీకు హిందువులమీద రాసె హక్కు వస్తుంది..

    రిప్లయితొలగించండి
  7. మీరు చెప్పే గుజరాత్ మారణకాండ లో భోగీలో తగలడిన హిందువులకేమన్నా స్థానముందా? డిలీ ఊచకోత అంటున్నారే, మరి కాశ్మీర్ లో వేల సంవస్తరాలుగా ఉంటూ మెడబెట్టి బయటకు కట్టుబట్టలతో బయటకు తోలబడిన వేలమంది (లక్షల మంది కూడానేమో) హిందువల కేమయినా స్థానముందా? ఒరిస్సాలో క్రిస్తవ మిషనరీ అంటున్నారు మరి అదే ఒరిస్సాలో కాల్చివేయబడిన హిందూ సాధువుల ప్రాణాలకు మీ కుహానా మేతావులు అంతే విలువ ఇస్తారా?

    పాలక వర్గాల హింస అంటున్నారు, శామ్యుల్ రెడ్డి, శొనియమ్మ అండతో చేసిన హింస కూడా హిందువల హింసా, కిరస్తానీల హింస మీ డిక్షనరీ లో?

    సారీ, మీ కుహానా మెతావులు ద్రుష్టిలో పౌరహక్కులు, పౌరులు అంటే కిరస్థానీలు, ముస్లింలు, నక్స్లైట్లు మాత్రమే కదా , మర్చి పోయాను లేండి, కానీయండి, కానీయండి.
    కిరస్తానీ మిషనరీలు, నక్సలైట్లు, ముస్లింలు మాత్రమే సుఖినోబవతు.

    రిప్లయితొలగించండి
  8. There was no Loss of life in Ayodhya on the day that structure was pulled own ... in contrast, the Maoists killed more people than all other Terrorists put together.

    రిప్లయితొలగించండి
  9. అయోధ్య వివాదంలో హిందువుని నిందించే ముందు మరో కోణంలో ఆలోచించండి...

    రిప్లయితొలగించండి
  10. బాగా చెప్పారు. మన దేశంలో ఎంక్వయిరీ కమ్మీషను రిపొర్టు లు వచ్చే లోపు ముద్దాయిలు ముసలి వాల్లయి చనిపోతారు. ఆ తరువాత రిపొర్టు ను పర్లమెంటులో పెట్టాలా వద్దా అనేది మరో డిస్కషన్.

    అలా షవ యాత్రలు చేసి వేల మంది చావు కు కారనమయిన అద్వానీ తరువాత హోం మంత్రి అయ్యాడు.

    ఎప్పుడో బాబర్ చేసిన దానికి, అది కూడా ఎలంటి అధారం లేకుండా ఇప్పటి కట్టడాలను కూల్చడాని సమర్ధించే వాల్లను ఏమనాలి? ఇలా సమ్ర్ధించే వాల్లు ఉన్నంత వరకూ జనాన్ని రెచ్చ గొట్టే వాల్లు ఉంటారు. ఈ రధ యాత్రలు చేసే వాల్లు వాటి సాకుతో ఓట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తారు, అమాయక వెర్రి జనం రధ యాత్రల్లో ప్రానాలు పోగొట్టుకుంటారు.

    రిప్లయితొలగించండి
  11. కుహనా సెక్యులరిష్టులు, కమ్యూనిష్టు విద్యావేత్తలు వ్రాసిన టెస్ట్ బుక్స్, పత్రికలు చదువుకుని పెరగడంవల్ల మనం అంతా ఈ కుహనా సెక్యులరిజాన్నే నమ్ముతున్నాం.
    నేను కూడా అయోధ్య వెళ్ళకముందు ఆ విధ్వసం తప్పనే అనుకునేవాడిని.
    కాని అక్కడకువెళ్ళిన తరువాత మన రాముడికి ఈ దుస్థితి ఏమిటి అని అనిపించింది?
    సోమనాథ్ ఆలయం నిర్మించినట్టే రామాలయం నిర్మిస్తే తప్పేంటి?
    అయితే గుజరాత్ లో ముస్లిం లమీద జరిగిన మారణకాండను మాత్రం నేను సమర్ధించను.
    ఏ మతం వాళ్ళనయినా చంపే హక్కు ఎవరికి లేదు.

    రిప్లయితొలగించండి
  12. ఒక్క మాటలో చెప్పాలంటే " ఈ మతాభిమానం, దేవుని కోసం మారణ హోమం కేవలం ఎంట్రీ లెవెల్ వరకే"( అంటే lay man వరకే) ఆపైన అంతా వోట్ల కోసం రాజకీయ పాట్లు. నమ్మినా నమ్మక పోయినా ఇది నిజం

    రిప్లయితొలగించండి
  13. @ ప్రవీణ్ శర్మ : కరెక్టు గా చెప్పారు . ఏమయిపోయారు రెండు వారాల నుంచీ

    రిప్లయితొలగించండి
  14. బొనగిరి గారు.. గుజరాత్ లొ జరిగిన దురద్రుస్టకర సంఘటనలు కి ముందు జరిగిన , అసలు గుజరాత్ అల్లర్లకి కారణమయిన ట్రైనుడు హిందు కార్యకర్తల దహనన్ని మరిచిపొయారు.. అసలు అది ఎందుకు జరిగిందొ .. ఎవరి ప్రొద్బలం తొ జరిగిందొ .. ఎవడూ మాట్లాడడు.. మన క్రైస్తవ మీడియా మాఫియా ఎప్పుడూ దానిగురించి పట్టించుకొలేదు.. ఆ తరువాత జరిగిన ఘొరాలమీద మట్లాడటానికే సమయం సరిపొవడం లేదు మరి.

    రిప్లయితొలగించండి
  15. ఎన్నో బౌద్ధారామాలను, జైనుల ఆలయాలను హిందు రాజులు కూలదోయడమో, వారినొ తొలగించి హిందు దేవతా విగ్రహాలను ప్రతిష్టించడమో చేసారని చరిత్ర చెబుతోంది. తిరుపతి కూడా ఒక జైన తీర్థంకరుని విగ్రహమేనని చెప్తారు. ఇది మతాహంకారం కాదా?

    మంచుపల్లకి కరెక్టుగా చెప్పారు ఆ తరువాతి ఘోరాలమీద మాట్లాడటానికి సమయం నిజంగానే చాలదు. గోధ్రా దుర్ఘటన వెనక కుట్ర ఉంది. గుజరాత్ దాడులు ఒక ప్రణాలికతో అప్పటికి రెండు సం.లు ముందుగా వ్యూహం చేసారు. ఆయుధాలు కూడబెట్టారు. ముస్లింలకు వ్యతిరేకంగా పుస్తకాలు, కరపరత్రాలు పంపిణీచేసారు దుర్గావాహిని పేరుతో, ఇంకా ఎన్.ఆర్.ఐ.మార్వాడీ మిత్రులు కోట్లాది రూపాయలు నిధులు సమకూర్చారు. ఇలా దాని వెనక నేపథ్యం చాలా వుంది.

    రిప్లయితొలగించండి
  16. అప్పారవు శాస్త్రిగారు ధన్యవాదాలు. మతాన్ని మనుషులకు మానసిక స్వాంతన నిచ్చేదిగా వున్నంతవరకు ఆరాధించొచ్చు. దీనివలన ఎవరికీ ముప్పులేదు. సోవియట్ రష్యా(అప్పట్లో కూడా), చైనాలలో కూడా మతాచారాలపై నిషేధం లేదు. కానీ రాజకీయనాయకులకు ఓట్లకోసం చిచ్చుపెట్టే ఆయుధంగా తయారయ్యిందానిని వ్యతిరేకించాలి.

    రిప్లయితొలగించండి
  17. మిత్రులారా కోట్లాదిమందిగా మెజారిటీ జనాభా కలిగిన వారి గురించి అందరూ మాటాడుతారు, కానీ మైనారిటీ వారి బిక్కుబిక్కుమంటూ బతికే వారి గురించి మాటాడే వారిపై అసహనం వద్దు. మతాన్ని పక్కనపెట్టి మానవత్వం పంచుదాం.

    ఉగ్రవాదమంటారా అమెరికా వాడికంటే ఈ ప్రపంచంలో పెద్ద ఉగ్రవాది లేడు. లక్షలాదిమంది ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా ప్రజల మృతికి కారణం వాడే కదా? అందుకు వారు ప్రత్యామ్నాయంగా అదే మార్గాన్ని ఎంచుకున్నారు. అలాగని ఉగ్రవాదాన్ని సపోర్టు చేయడంకాదు. అమాయక ప్రజలు బలికావడాన్ని అందరం ఖండించాల్సిందే. వాటివెనకవున్న పెద్దన్నను నిలవరించాల్సిందే.

    రిప్లయితొలగించండి
  18. వర్మ గారూ కొంపదీసి మీరుగానీ కమ్యూనిస్టా ఏంటి? సారీ, మరీ గట్టిగా తిడుతున్నాననుకుంటే మన్నించండి, మీరు రాసిన వాక్యాలు చూసి మిమ్మల్ని కమ్యూనిస్టని అనుకోక తప్పలేదు. కింది వాక్యాలు చూడండి..

    ముందు ఇలా అన్నారు..
    "..కానీ రాజకీయనాయకులకు ఓట్లకోసం చిచ్చుపెట్టే ఆయుధంగా తయారయ్యిందానిని వ్యతిరేకించాలి."

    ఒక్క వాక్యం కూడా కాలేదు, వెంటనే చూడండి ఎలా అన్నారో..

    "మిత్రులారా కోట్లాదిమందిగా మెజారిటీ జనాభా కలిగిన వారి గురించి అందరూ మాటాడుతారు, కానీ మైనారిటీ వారి బిక్కుబిక్కుమంటూ బతికే వారి గురించి మాటాడే వారిపై అసహనం వద్దు. మతాన్ని పక్కనపెట్టి మానవత్వం పంచుదాం."

    మరీ ఇంత అవకాశవాదమా? ఓపక్కన మతాన్ని రాజకీయాల్లోకి లాగొద్దంటూనే మైనారిటీ వాదాన్ని నెత్తికెత్తుకుంటున్నారు. హిందూ వ్యతిరేకతను డప్పుగొడుతూ, మైనారిటీ మర్కటాన్ని నెత్తికెత్తుకుని ఆటాడుతున్నారు. మీరాడుతున్న ఈ కోతులాట వోట్ల కోసం కాకపోతే మరెందుకో చెప్పండి.

    ఇలాంటి సిగ్గులేని నాటకాలు ఆడేది కమ్యూనిస్టులే! హిందూ వ్యతిరేకమనే ఏకైక ఎజెండా కలిగిన కమ్యూనిస్టులు, రెండు నాలుకల కమ్యూనిస్టులు, మసక దృష్టిగల కమ్యూనిస్టులు, ప్రసిద్ధమైన పిడివాదాన్ని పెంచి పోషించే పాచిపళ్ళ కమ్యూనిస్టులు మాత్రమే చేస్తారు. అందుకనే అలా అన్నానుగానీ, మరో ఉద్దేశంతో కాదండి. ఒకవేళ మీరు కమ్యూనిస్టే గనక కాకపోతే, అంత పెద్ద తిట్టు తిట్టి మిమ్మల్ని అవమానించినందుకు మన్నించండి.

    రిప్లయితొలగించండి
  19. "మైనారిటీ వారి బిక్కుబిక్కుమంటూ బతికే వారి గురించి మాటాడే వారిపై అసహనం వద్దు." - ఏంటి మాస్టారూ.. మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారా? ఏ దేశం గురించి మాట్టాడుతున్నారు మీరు- పాకిస్తానా? బంగ్లాదేశా? ఇండొనేసియానా? అరబ్బు దేశాలా?

    -సందేహం లేదు, మీరు కమ్యూనిస్టే!

    కాదూ, నేను కమ్యూనిస్టును కాను, నేను మాట్టాడుతున్నది మనదేశం గురించే అని అంటారా.. భారతదేశంలోని జమ్మూకాశ్మీరు రాష్ట్రంలో మైనారిటీల గురించి మీకేం తెలుసో చెప్పండి. 1900 నాటికి అక్కడ హిందువుల జనాభా ఎంతో, 1947 నాటికి ఎంతో, ఇప్పుడెంతో చెప్పండి. జనాభాలో ఆ మార్పులెందుకొచ్చాయో చెప్పండి. ఢిల్లీ నుంచి హై. దాకా అనేకానేక ఊళ్ళలో అడుక్కు తింటున్న స్వదేశీ కాందిశీకుల గురించి మీకేం తెలుసో రాయండి.

    రిప్లయితొలగించండి
  20. "మిత్రులారా కోట్లాదిమందిగా మెజారిటీ జనాభా కలిగిన వారి గురించి అందరూ మాటాడుతారు" ఎవరు మాట్లాడరో చెబ్తారా? లెఫ్టిస్ట్ మీడియానా, లౌకిక వాదులు అన్న ముసుగువేసుకొన్న కేవలం మైనారిటీ వాదులా, పౌరహక్కుల సంఘాలు అన్న ముసుగువేసుకొన్న కేవలం మార్కిస్ట్ కోసమే పెట్టిన సంఘాలా?

    బిక్కు బిక్కుమని బతుకుతున్న మైనారిటీ అంటున్నారు ప్రాణాలు అరచేతపట్టుకొని బతుకుతున్న కాష్మీరీ హిందువా మైనారిటీ, గడపకు 600 వోట్లు రిజిస్టర్ చేసి, దొంగ కనెక్షన్లు పెట్టుకొని, వాటిజోలికొస్తే తలలు తెగుతాయి అని అందరినీ బెదెరించే పాతబస్తీ ముస్లిమా మైనారిటీ?

    ప్రాణాలకు మైనారిటీ, మెజారిటీ అంటూ రెండురకాల విలువలు కట్టే హక్కు కుహానా లౌకికవాదులుకు ఎవరిచ్చారు?

    నీ మతం కంటే నా మతం గొప్ప అని, ప్రలోభాలు పెట్టటానికి వచ్చిన క్రైస్తవ మిషనరీ ప్రాణం, ఓ హిందు సాధువు ప్రాణం కంటే ఎలా గొప్పది అయ్యింది పౌరహక్కు సంఘాలు అని చెప్పుకొనే మె"తా"వులకు?

    దానినే ప్రశ్నిస్తున్నాము కాని, మీరు తప్పులను ప్రశ్నించటాన్ని మాత్రం కాదని గుర్తించండి!! తప్పు ఎప్పుడూ తప్పే, ఒకడి ప్రాణం తీసే హక్కు ఇంకోకడికి లేదు, అది పోలీసు అయినా, నక్సలైట్ అయినా!!

    రిప్లయితొలగించండి
  21. నిస్సంకోచంగా ముస్లిం దేశాల వారు చాలాపెద్ద మారణకాండ సృష్టించారు ప్రపంచం మొత్తంలో.
    తప్పనిసరిగా ముస్లిం లు మారి తీరాలి, లేకపోతె మనతోపాటు వాళ్ళూ చస్తారు, చస్తున్నారు

    ఉన్నాడో లేడో తెలియని రాముడి గురించీ అల్లా గురించీ జనం కొట్టుకు చావడం నాకు తెలిసిన ఒక nonsense

    నిలువ నీడనిచ్చిన ఏ భూ ప్రదేశమైనా ఒకటే, ఇక్కడ పుట్టాం కనుక భారత దేశం మీద ప్రేమ, "దేశం కోసం ప్రాణాలు అర్పించడం" అనే వాదన అర్ధం లేనిది.

    మరొక దేశం లో పుట్టి ఉంటే భారత దేశం అంటే ఇంతే ప్రేమ ఎవరికైనా ఉంటుందా?
    ఏది నిజమో ఏది అబద్ధమో రాముడు ఉన్నాడో లేడో కూల్చిన జననానికి అక్ఖర్లేదు, దాన్ని సమర్ధించిన అధికారులకి అక్ఖర్లేదు, ఇప్పటికీ రామ జన్మభూమి అని ఏడ్చే జనానికి sense లేదు.

    రిప్లయితొలగించండి
  22. చదువరి గారూ కమ్యూనిస్టులంటే అంత ఉక్రోషం ఎందుకు.. నిజానికి కమ్యూనిస్టుగా పిలవబడుతున్నవారెవరూ దాని పూర్తి అర్థంలో లేరు. మీ చేత ఆ తిట్టు తిట్టించుకున్నందుకు గర్వపడుతున్నా. మహాకవి శ్రీశ్రీ మరోప్రస్థానంలో ఇప్పుడే ఇక్కడే కవితలో ఇలా చెప్పారు..
    నువ్వో
    సైంటిస్టువి కావాలంటే ఆర్టిస్టువి కావాలంటే ముందుగా కమ్యూనిస్టువి కావాలి
    మంచి కమ్యూనిస్టువి కావాలి, నువ్వు భూమరామత్ చెయ్యాలంటే లేమి హజామత్ చెయ్యాలంటే ముందుగా కమ్యూనిస్టువి కావాలి, ....
    ఇలా సాగుతుందీ కవిత. ఇదే నా ఆదర్శం.

    జమ్మూ కాశ్మీర్లో పండిత దోపిడీ కుటుంబాలు పారిపోయాయి. సామాన్యులెవరూ వదిలివేయలేదు. అక్కడ జరుగుతున్న సైనిక చర్యల గురించి ముందుగా అధ్యయనం చేయండి. వాటిపై చాలా పరిశోధనలు వచ్చాయి. మీ జాగాలో పక్కింటివాడి పాదుపాకితేనే ఒప్పుకోలేని మీరు? వాళ్ళ భూమిలో మారణకాండ సృష్టిస్తే ఊరుకుంటారా? ఆ మాత్రం ప్రతిఘటించరా? చరిత్రను అధ్యయనం చేయండి. కాశ్మీరీలను అటు పాకిస్తాన్ ఇటు భారత్ లు పావులుగా వాడుకుంటున్నాయి. మద్యలో రావణ కాష్టాన్ని రగిలిస్తున్నది అమెరికా. ఇదంతా మనకు కనిపించని రాజకీయ కుట్ర మిత్రమా.

    రిప్లయితొలగించండి
  23. క్రిష్ణగారూ మీరూ అలానే మాటాడుతున్నారు. పౌరహక్కుల సంఘాలు కేవలం మార్క్సిస్టులకోసమైతే మొన్న బాలగోపాల్ చనిపోయినప్పుడు అంత స్పందనరాదు. ఏమిజరిగినా, ఎవరు అన్యాయమైపోయినా మాటాడే చైతన్యం లేని మనలాంటి మధ్యతరగతి వారినుంచే పుట్టుకొచ్చాయి. ఎంతోమంది అబలలు వరకట్నపు జ్వాలలలో మాడిమసైన కాలంలో వారిగురించి తీవ్రంగా పోరాడింది వారే, లాకప్ డెత్ లలో చనిపోయిన చిల్లరదొంగలు మొదలు ఉద్యమకారులవరకు ప్రశ్నించింది వారే. ఈ మద్యకాలంలో సాధించుకున్న సంస్కరణ చట్టాల వెనక వారి కృషి వుంది. ప్రశ్నించే వారు లేకపోతే ఇంకా అధ్వాన్నంగా వుండేది రాజ్యవ్యవస్థ. సిద్ధాంతపరమైన బేధాలుంటే అది వేరే చర్చ. కానీ ప్రశ్నించే వారి నిజాయితీని శంకించొద్దు. దేనినైనా ప్రయోజన కారణంగా అంచనాలు వేసే వారిని పక్కన పెడదాం.

    అసలు క్రైస్తవ మిషనరీలును ఎవరు ఆహ్వానించారు. ఆనాటి హిందూ రాజులే కదా? వారి మద్యనున్న గొడవలకు ఆసరాగా వారికి చోటునిచ్చారు. మన సమాజంలోని అసమానతలను వారు వాడుకున్నారు. మతమూ వ్యాపార సరకు అయ్యింది. దీనికి ఏదీ మినహాయింపుకాదు.

    రిప్లయితొలగించండి
  24. అభిమతం మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. ధన్యవాదములు. ఈ మద్య ఉద్యోగ రీత్యా సెల్ సిగ్నల్ కూడా అందని గిరిసీమలలో వుండి మిత్రులందరి స్పందనలకూ దూరమయ్యాను. అందరికీ కృతజ్నతలు.

    రిప్లయితొలగించండి
  25. కెక్యూబ్ గారి కమ్యూనిస్టే. అతని రచనలు కార్మిక వర్గం వైపే ఇంక్లైన్ అయ్యి ఉన్నాయి. కార్మికవర్గ విప్లవకారునికి తాను కార్మికవర్గ విప్లవకారుడినని చెప్పుకోవడానికి సిగ్గు ఎందుకు?

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..