మార్త హర్నెకర్ ఒక సామాజికవేత్త, రాజకీయ
శాస్త్రవేత్త. పత్రికా రచయిత్రి, ఉద్యమకారిణి. 1960వ దశకం చివరిలో ఆమె
రచించిన ' The Basic Concept of Historical Materialism ' అనే పుస్తకం
ప్రచురించిన తర్వాత లాటిన్ అమెరికాలోని మార్క్సిస్టు వామపక్షం ఆమె రచనలను
అత్యంత విస్తృతంగా చదవటం మొదలయింది. బొలివేరియన్ విప్లవాన్ని (సైమన్
బొలివర్ అనే వెనిజులా తత్వవేత్త ఆలోచనలతో, ఉత్తేజంతో ముందుకు వచ్చిన విప్లవ
సిద్దాంతం) బలంగా సమర్థించుతూ మార్తా హర్నేకర్ అనేక రచనలు చేసారు. ఈ
పుస్తకం 'Re building of the Left' అనే పుస్తకానికి అనువాదం తెలుగులో ఆశాలత
గారు చేసారు. సంగం మీడియా గ్రూపు వారి ప్రచురణ. మిత్రులు Rajendra Prasad Yalavarthy
గారు నాకు ఈ పుస్తకాన్ని పరిచయం చేసారు. వారికి ధన్యవాదాలు. మార్క్సిజం పై
ఓ కొత్త ఆలోచనా ధారను మనకందించే ఈ పుస్తకం పూర్తయ్యాక మళ్ళీ మాటాడుకుందాం.
మీరూ చదవండి. విశాలాంధ్ర, ప్రజాశక్తిలలో దొరుకుతుంది.
marta harnekar gurinchi vaama paksham nutana prapancham gurinchi telipinanduku tahnks.
రిప్లయితొలగించండిhttp://www.googlefacebook.info/