అలిపిరి దాడి కేసులో నిందితులపై సాక్ష్యాధారాలు లేవని సిట్ అధికారి చెప్పినా తిరుపతి సెషన్స్ జడ్జి వాటిని పట్టించుకోకుండా నిందితుల వాంగ్మూలాలను నామమాత్రంగా విని శిక్ష వేయడం ఈ తీర్పు రాజకీయ తీర్పుగానే పరిగణించాల్సి వస్తుంది. దర్యాప్తు అధికారి యిచ్చిన సాక్ష్యాన్ని కూడా వినని కోర్టులుగా రాజకీయ నాయకుల మాటే తీర్పుగా వెలువరించడం ఇటీవల సాధారణమవుతోంది. ఈ దేశంలో కాసింత మిగిలిన ఆశ కూడా ఇలా డబ్బు పాలు కావడం అధికారానికి దాసోహమవడం దారుణ పరిణామం. ఈ తీర్పు వెలువరించిన సమయం కూడా నాటి బాబు పర్యటనకు దగ్గరైన కాలం ఒకటే కావడం యాధృచ్చికం కాదని తెలుస్తోంది. రిటైరయ్యాక అధికార పార్టీలు ఇచ్చే పదవులు ఇటీవల కేరళ గవర్నర్ గా నియమితుడైన న్యాయాధీశులుంగారిని చూస్తే మనకు వీరి పట్ల గౌరవముండాల్సిన పనిలేదని అవగతమవుతోంది. 'న్యాయదేవత'??? కళ్ళే కాదు చెవి ముక్కూ నోరు కూడా కుట్టేస్తున్నారా? ప్రజాస్వామిక వాదులంతా మాటాడాల్సిన సమయమిది.
ప్రజాస్వామ్యం గురించి ఎంత ఆవేదన పడుతున్నారూ!
రిప్లయితొలగించండిన్యాయవ్యవస్థకు పడుతున్న దుర్గతికి ఎంత వాపోతున్నారూ!
దర్యాప్తు అధికారి సాక్ష్యాలు లేవన్నాడా. అందుచేత నేనా మీకు ఆయన మాటలు విశ్వసనీయం అయ్యాయి?
ఒకవేళ దర్యాప్తు అదికారులు సాక్ష్యాలు గనుక చూపి ఉంటే అవి ప్రభుత్వం తయారు చేసుకున్న సాక్ష్యాలూ, పనికిరావూ అని మీరు ఆక్రోశం వెలిబుచ్చేవారేగదా?
తుపాకీ గుళ్ళతో దేశాన్ని పరిపాలించాలీ అని కలవరించే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే వింతగా ఉంది లెండి.
మీకు మీరే న్యాయాధికారులుగా ఊళ్లమీదబడి ప్రత్యర్థులనీ, అమాయకప్రాణులనీ కూడా పట్టుకొని మీ మార్కు ప్రజాకోర్టులలో పరమకిరాతకంగా తుపాకీన్యాయాలు ప్రసాదిస్తూనే ఈ రోజున దేశంలోని న్యాయవ్యవస్థకు ఇబ్బందులు వస్తున్నాయని వాపోతున్నారా. భలే!
అసలు చంద్రబాబు మీద మీరు హత్యాప్రయత్నమే మీపంథాలో చేయలేదనీ వాదించగలరు లెండి.
లేదా చంద్రబాబు బ్రస్తికుండటమే ప్రజాద్రోహం అని కోర్టులు తీర్పులివ్వాలనీ కోరగలరు లెండి.
మీరు మీ సహచరులకే సహచరులు కాని ప్రజలకు కాదు.
ఈ సంగతి అందరికీ తెలుసు.
మీకూ బాగా తెలుసు.
యుద్దం యుద్ధ మూలాల్ని తవ్వి పోయడానికే అన్న మావో మాట ఇప్పటికీ చెప్పదలచుకున్నాను మీకు.
తొలగించండితుపాకీ గుళ్ళతోను తుపాకీల పహరాల మధ్య తిరుగుతున్నది ఈ దేశ నాయకమ్మన్యులే సారూ?
ప్రజలంటే మీ దృష్టిలో ఎవరో కానీ అణగారిన బడుగు వర్గాలకు సహచరులమే వారికి సహచరుడనే.
మీ పాలక ప్రభువులు నియమించిన దర్యాప్తు అధికారి మాటే మీరు వినలేదన్నది మీ భయాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని తెలియజేస్తోంది. అప్పుడప్పుడు మీ బొమికలకు ఆశపడని అధికారులవలన మీకీ చెడ్డ పేరు వస్తోంది.
మీరిలా స్పందించినందుకు ధన్యవాదాలు శ్యామలీయం గారూ...