ఖండిద్దాం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఖండిద్దాం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జులై 2012, గురువారం

మన ఇంట్లో పేలినా నోర్మూసుకోవాల్సిందే!!

http://media2.intoday.in/indiatoday/images/stories/maoists-crpf_350_071212041049.jpg
మన కేంద్ర గృహ మంత్రివర్యులు ఎటువంటి సంకోచం లేకుండా అబద్ధాలాడడంలో ఆరితేరిన వారు అని మొదటి నుండీ నిరూపించుకుంటునే వున్నారు. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అటు తెలంగాణా విషయంలో గానీ యిటు బూటకపు ఎన్ కౌంటర్ల విషయంలో గానీ నిస్సిగ్గుగా అబద్దాలాడడంలో ఆరితేరిన వారు. కళ్ళముందు తొమ్మిది మంది బాలల మృత దేహాలు వుంచుకొని కూడా అది ఎదురు కాల్పుల సంఘటన అని, ఆత్మ రక్షణార్థం చేసారని బాసగూడ సంఘటనపై నొక్కి వక్కాణిస్తూనే వున్నారు. అటుతన సహచర గిరిజన శాఖా మంత్రి తన దగ్గర అది ఎదురు కాల్పుల సంఘటన కాదని ఋజువులున్నాయని, స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా అది నిర్ద్వందంగా ఎదురు కాల్పులు కావని చెపుతున్నా ఈయన తన ధోరణిలో చెప్తూ మరింతగా ప్రజలపై సైనిక దాడులకు ముందుకు వస్తున్నారంటే ఈ కార్పొరేట్ న్యాయ సహాయకుడైన హోం మంత్రి తన పితృ వారసత్వాన్ని, భావజాల వర్గ స్వభావాన్ని ఎంతగా చూపుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. దీని వెనక దాగిన మల్టీ నేషనల్ కంపెనీల కుట్ర, సామ్రాజ్య వాద తొత్తులవుతున్న మన పాలక వర్గాల తాబేదారీ తనం అర్థం చేసుకొని ప్రజాస్వామ్య మేధావి వర్గాలు యిటువంటి సైనిక చర్యలను ఖండించాల్సిన అవసరముంది. లేక పోతే అదే తుపాకీ మన ఇంట్లో పేలినా నోర్మూసుకోవాల్సిందే!!

30, జూన్ 2012, శనివారం

మళ్ళీ నెత్తురోడిన చింతల్నార్ (Basaguda)



చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బాసగూడ అటవీ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగిన సైనికదాడిలో ఇరవై రెండు మంది ఆదివాసీలు చనిపోయారు. ఈ దాడిలో పాల్గొన్నది సైనిక విభాగమైన కోబ్రా, పారామిలటరీ, స్థానిక రిజర్వ్ విభాగాలకు చెందిన దళాలు. వీరు మావోయిస్టులతో సమావేశమైన ఆదివాసీ ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేసి చంపివేసారు. చనిపోయినవారిలో మహిళలు, తొమ్మిది సంవత్సరాల బాలిక, పదకొండేళ్ళ బాలుడు కూడా వున్నారు. వీరంతా గ్రామంలోని భూసమస్యపై చర్చించుకుంటున్న సందర్భంలో మావోయిస్టులను మట్టుబెట్టేందుకు సిద్ధమైన సైనిక బలగాలు అక్కడికి చేరుకుని గ్రామస్తుల నుండి ప్రతిఘటననెదుర్కొనలేక విచక్షణారహితంగా ఆధునిక ఆయుధాలతో దాడి చేసి ఇంతమంది ఆదివాసీలను పొట్టనబెట్టుకున్నారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు వారంతా మావోయిస్టులేనని పాతపాటనే పల్లవిస్తున్నారు.

స్థానిక విలేకర్లు, ప్రజాస్వామిక వాదులు, స్వామి అగ్నివేష్ ఈ ఎదురుకాల్పులపై యిచ్చిన వివరణ ప్రకారం ఈ దాడి విచక్షణారహితంగా పాశవికంగా ఆదివాసీ ప్రజలపై జరిగిన సైనికదాడిగానే పరిగణిస్తున్నారు. దీనిపై కేంద్రం కూడా వెంటనే వివరణ ఇవ్వలేకపోయినదంటే మరణించింది ఆదివాసీ ప్రజలు కనుకనే.

ఇలాంటి సైనిక దాడులతో స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారిని వెళ్ళగొట్టి అక్కడి సహజ వనరులను ఎమ్.ఎన్.సి.లకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే గుర్తించాలి. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ హాకల పేరుతో సొంత బిడ్డలపైనే సైనిక దాడులకు ఎగబడుతున్న దళారీ కార్పొరేట్ పాలక వర్గాల దమన నీతిని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి.

కోట్లాది రూపాయలను ఈ ఆపరేషన్లకు ఖర్చు చేస్తున్న పాలక వర్గం స్థానిక ఆదివాసీ ప్రజల హక్కులను గుర్తించి వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చుకునేందుకు వారికి అవకాశమిస్తూ సహజ వనరులు, భూములపై వారి హక్కులను గుర్తించి తోడ్పడాల్సిందిగా ప్రజాస్వామిక వాదులు, మేధావులు వత్తిడి తేవాల్సిన అవసరముంది. కానీ ఈ అధికార బధిరాంద లంచగొండి అవినీతి స్కాముల దళారీ కార్పొరేట్ పాలక వర్గాలకు ఇవేవీ వినిపించుకునే మనసు లేదన్నది అందరికీ తెలిసిన విషయమే..


వార్త

6, జూన్ 2012, బుధవారం

ఈ దేశానికి పట్టిన చీడ ఎవరు??

దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నకార్పొరేట్ రాజకీయ నాయకులు వారి అడుగులకు మడుగులొత్తుతూ జీ హుజూర్ అంటు బానిసల్లా బతుకుతూ సొంత ఇంటి లాభం చూసుకునే స్వార్థ ఐ.ఎ.ఎస్.లు, వీరిద్దరికీ కాపు కాస్తున్న దళారీ న్యాయవ్యవస్థ వీళ్ళ వలన ఈ దేశం ఎంతగా అతలాకుతలమవుతుందో అందరికీ ఎరుకే.

ఏదో గొప్ప నీతిమంతుడి ఫోజుతో మధ్యతరగతి అవకాశవాద మనఃస్తత్వాన్ని సొమ్ము చేసుకొని అధికారంలోకొచ్చేద్దామని కలలు కంటూ రాజకీయాల్లోకొచ్చిన పాత చెదపురుగు లోక్ సత్తా పేరుతో పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ నిన్న గనులు దోచినోల్లు నక్సలైట్ల కంటే ప్రమాదకారులని స్టేట్మెంటు ఇవ్వడం చూస్తుంటే ఈయన గారి సామాజిక రాజకీయ ఆర్థిక అవగాహన ఏపాటిదో తెలుస్తోంది.
ఈ దేశానికి నక్సలైట్ల వలన ప్రమాదమా ఇలా దోపిడీ దారుల కొమ్ము కాసే ప్రభుత్వాధికారులవలన ప్రమాదమో ప్లెబిసైట్ నిర్వహిస్తే తెలుస్తుంది జనవాణి. వీళ్ళేదో దేశంలో తెలివైన వారిగా ఫోజు కొడుతూ విపరీతంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, కుల పొగరు చూపుతూ , అధికారంలో వున్నన్నాళ్ళు రాజభోగాలనుభవిస్తూ, ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకుపోయే వర్గం. వీరి వత్తాసు లేకుండా ఏ రాజకీయ నాయకుడూ దోచుకుపోలేడు. అధికారంలో వున్నవాడి కొమ్ము కాస్తూ తమకేదీ జరగదన్న ధీమాతో తామేదో దైవపుత్రులులా మిగిలిన వారిని హీనంగా చూసే ఈ దేశ ప్రధాన పాలక అధికార గణం ఏపాటి నీతి మంతమయినదో అందరికీ తెలిసినదే.
అవినీతిని రూపుమాపే పేరుతో ఈయన ఇంతవరకూ చేసిన ఉద్యమాలేపాటివో, గోడ మీది పిల్లివాటంలా వుంటూ తన పబ్బం గడుపుతున్న మాజీ గారు ఏదో పేపర్లలో కనబడ్డం కోసం ప్రకటనలివ్వడం తప్ప ఈయన చేస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం ఏమీ లేదింతవరకు..
ఈ దేశ సహజవనరులను కాపాడేందుకు ప్రాణాలొడ్డి పోరుతూ బానిస వ్యవస్థను రూపుమాపుతూ సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా అహర్నిశలూ పోరాడుతున్న నిజమైన దేశభక్తులైన నక్సలైట్ల పట్ల ఈయన వైఖరిని ఖండిస్తున్నా..

24, నవంబర్ 2011, గురువారం

చిదంబరం గ్రూపునకు మమత చెల్లించిన కప్పం..




రోజు సాయంత్రం వరకు ఫాసిస్ట్ పాలకవర్గం దాచిన వార్త కిషన్జీ హత్య. పశ్చిమ బెంగాల్ లోని పురూలియా వద్ద మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు, అరవై ఏళ్ళ వయసు ముప్పాఐదేళ్ళకు పైగా ప్రజా ఉద్యమ జీవితంలో వున్న నేతను కేంద్ర బలగాల సాయంతో హత్య గావించి తన ఎన్నికకు పరోక్షంగా సహకరించిన కార్పొరేట్ దొర చిదంబరం ఆండ్ కోకు మమత ఇచ్చిన బహుమానం ఇది.

పశ్చిమ బెంగాల్ లో గత ముప్పైఏళ్ళకు పైగా అధికారంలో పాతుకుపోయి ఫాసిస్ట్ గా మారిన మార్క్శిస్ట్ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా జంగల్ మహల్ లో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి సింగూర్ మొదలుగా గల విధ్వంసకర పారిశ్రామికీకరణను ప్రజా ఉద్యమం ద్వార పోరాడి పెట్టుబడిదారుల గుండెల్లో బల్లెంలా మారిన కిషన్జీ @ మల్లోజుల కోటేశ్వర రావును హత్య చేసి కాంగ్రెస్ ఋణం తీర్చుకుంది మమత..

భారత దేశ ప్రజా ఉద్యమ చరిత్రలో సుదీర్ఘ కాలం తన పోరాట రూపాలతో ప్రజలలో మమేకమై అత్యంత ఆధునిక సాంకేతిక మిలటరీ పరిజ్ఞానానికి కూడా చిక్కకుండా జంగల్ మహల్గా పిలిచే లాల్ఘర్, సింగూర్, పురూలియా ప్రాంతాలలో బలమైన ప్రజా ఊద్యమాన్ని నిర్మించి పాశవిక ఫాసిస్ట్ రాజ్యానికి వ్యతిరేకంగా ఆదివాసీ అణగారిన ప్రజా సైన్యాన్ని నిర్మించి రాజ్య సైనిక బలగాలకు సవాల్ గా నిలిచిన మావోయిస్ట్ నాయకుడు కిషన్జీ..

ఒకవైపు శాంతి చర్చలకు ఆహ్వానిస్తూ మరోవైపు వేలాది కేంద్ర పారా మిలటరీ బలగాలతో ఉద్యమకారులను మట్టుబెట్టేందుకు ముందుకు వస్తున్న మమత చిదంబరంల వ్యూహాన్ని హత్య బయట పెడుతోంది.. ప్రజా ఉద్యమాల పట్ల రాజ్య ఫాసిస్ట్ నిర్బంధాన్ని ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఖండించడాన్ని కూడా సహించలేనంత ఫాసిస్ట్ ముఖాన్ని ఇటీవల మమత బయటపెడుతోంది.. రాజ్యహింసను మేధావులు, రచయితలు, విద్యార్థి, హక్కుల సంఘాలు ఖండిస్తూ ప్రజా చైతన్యాన్ని బలోపేతం చేస్తూ ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరాన్ని హత్య మరో మారు గుర్తు చేస్తోంది...

14, జులై 2010, బుధవారం

చివరకు బలిగొన్నారు..Police firing on Fishermen at Sompeta



ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజానీకంపైకి పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు మత్స్యకార కుటుంబానికి చెందిన వారు మృతి చెందారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వలన సోంపేట, బారువ,పలాస్, మందస మొ.న.నాలుగు మండలాల ప్రజానీకం కాలుష్యబారిన పడతామని, తమ ఉనికికే ప్రమాదకరంగా పరిగణిస్తూ ప్రజలే తమకు తాము స్వచ్చందంగా ముందుకు వచ్చి పోరాటాన్ని చేస్తున్నారు. వీరిని అణచివేసేందుకు రకరకాల పన్నాగాలు పన్నిన ప్రభుత్వం చివరకు ఈ ఉదయం సోంపేట దగ్గర నాగార్జున కన్స్ట్రక్షన్స్ వారు చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకొన్న స్థానికులపై పోలీసులచేత కాల్పులు జరపడంతో నలుగురు చనిపోయారు. ఒకేమారు ఉత్తరాంధ్రలో 10 వరకు థర్మల్, ఒక అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణాలను చేపట్టాలని జూస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడిదారులు ఈ ప్రాంత సస్యశ్యామలమైన భూములను, తీర ప్రాంతంలోని మత్స్య సంపదను నాశనం జేసి ఎవరికోసం ఈ విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. యూరోప్ దేశాలన్నీ వదులుకుంటున్న అణు ప్రాజెక్టులను ఇక్కడ నెలకొల్పడం ఎంతవరకు సమంజసం? ఈ పాలక వర్గాలకు ప్రజల పట్ల ఎంత బాధ్యత వుంటుందో పాతికేళ్ళనాటి భోపాల్ దుర్ఘటన ఇంకా మాయలేదు. కోస్టల్ కారిడార్ పేరుతో అనేక కాలుష్యకారక ఫ్యాక్టరీలను ఏర్పాటుజేయడానికి సెజ్ లకు అనుమతిస్తూ ప్రజలను నిర్వాసితులను జేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడజూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ చేపట్టిన స్వచ్చంద నిరసన కార్యక్రమాలు గత సం.కాలంగా జరుగుతూనే వున్నాయి. నేడు వారి రక్తం రుచి చూడడం దారుణం. దీనిని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి..

Watch thesuchi.com - Sompeta Police Firing - NTV\thesuchi.com - Sompeta Police Firing - NTV in Entertainment  |  View More Free Videos Online at Veoh.com

21, జూన్ 2010, సోమవారం

చెవిటి మూగవాడిపై తీవ్రవాది ముద్ర



ప.బెంగాల్ లోని మిడ్నాపూర్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో అరెస్టు చేయబడ్డ గిరిజన యువకుడు చెవిటి మూగవాడు. కాల్పుల శబ్ధానికి భయపడి దగ్గరలో వున్న తమ ఇంటినుండి తల్లి చేయి పట్టి పరుగుపెడుతున్న మూగ యువకుడి తలకు తుపాకీ గురిపెట్టి పట్టుకుపోయి నక్సలైట్ ముద్రవేసి అరెస్టు చేసారు. ఈ కుఱవాడికి 2004 నుండి వచ్చిన అనారోగ్యానికి చేసిన చికిత్స వివరాలను చూపించి ఆయన మానసిక రోగిగ వైద్యులందించిన వివరాలను చూపించినా వినని ఖాకీ కర్కసం, న్యాయమూర్తుల కళ్ళులేని కబోదితనంను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన వలన ఆ కుఱవాడు మరింత భయాందోళనలకు లోనయి పూర్తిగా మానసిక అనారోగ్యానికి గురౌతాడని, పూర్తిగా మాటలు రాని ఆ యువకుడికి అడిగితే అరుపులు తప్ప జవాబు చెప్పలేడని వేడుకున్నా కనికరించని ఖాకీతనం యొక్క మూర్ఖత్వపు వివరాలు ఈ దిగువ చదవండి.

http://timesofindia.indiatimes.com/india/Cops-parade-deranged-man-as-Maoist/articleshow/6060704.cms
Cops parade deranged man as Maoist
Caesar Mandal, TNN, Jun 18, 2010, 12.47am IST

Tags:toi|ENT|Midnapore|Tarakeshwar|Unlawful Activities Prevention|Anirban Diagnostic Centre Pvt Ltd|Midnapore court|Duli village
SALBONI (WEST MIDNAPORE): The "dreaded" Maoist captured by joint forces on Wednesday the only one apparently caught alive at the encounter site where eight rebels lay dead is a 20-year-old mute and mentally challenged youth from Duli village. No wonder, police haven't been able to make him speak.

In what may cast a shadow on the way the police are rounding up suspects, Rameshwar Murmu has been branded a hardcore Maoist and slapped with the most stringent of charges, including sedition under Unlawful Activities Prevention Act (UAPA).

The Midnapore court on Thursday remanded him in 15 days judicial custody. While on Wednesday, the cops claimed the "captured Maoist" was too stunned at the loss of so many comrades to speak and admitted that he hadn't said a word, Rameshwar's father, Bankim Murmu, cried, "My son can't speak. He may scream if you hit him, but he can't speak a word." The Murmus live right behind Wednesday's encounter site.

Bankim says Rameshwar suffers from congenital epilepsy and developed ENT problems at a very young age leading to loss of speech and hearing. He produced medical records to support his claim. "He can only make barely legible sounds. It affected his behaviour and he lost his mental balance. That is why he could not pursue education beyond class IV," a tearful Bankim told TOI on Thursday.

Bankim owns a mud house and a small plot of land on the edge of Ranjya forest where the bloody encounter took place on Wednesday. His elder son, Ram, works in a factory in Orissa.

Recounting Wednesday's developments that led to his son being captured, Bankim said they woke up to the sound of gunfire behind his house. The family rushed out in the direction of the village to avoid being hit.

"My wife Madina was holding Rameshwar's hand as we ran. The gunfire had woken up other villagers as well and they were running helter-skelter. In the melee, Rameshwar broke free and ran back towards the house. I don't know what was on his mind. My wife ran after him. But before she could reach Rameshwar, police caught him. They put a gun to his head and said they would shoot if anyone took a step forward," he said.

The parents could only watch helplessly as the forces led their son away. "We pleaded with them to let him go. We told them that he is mentally challenged and not involved with Maoists. But they refused to listen," said Madina. They don't know where their son has been taken. Nor do they have the courage to go to the police for fear of being thrashed.

According to medical documents, Rameshwar was treated at several places between 2004 and 2006, including ENT specialists at Tarakeshwar in Hooghly and Midnapore. On June 5, 2006, when Rameshwar was 16, he was taken to Anirban Diagnostic Centre Pvt Ltd in Midnapore town (ID B-6884, checked by Dr N Adhikari).

Other villagers, like Sudha Soren and Lakshmi Murmu, confirmed that Rameshwar was mentally challenged. "He never behaved like a normal kid. Now we hear that he has been paraded before TV channels with his hands tied and branded a Maoist," Sudha said.

Rameshwar was bare-bodied and wearing blue shorts when he was caught, an unlikely dress for a guerrilla. Police insist Rameshwar was present alongside senior Maoist leaders Bikash and Akash. "After the gunfight, we caught him hiding behind a hedge. He had a single-barrel gun," a cop said.

13, ఏప్రిల్ 2010, మంగళవారం

అరుంధతి రాయ్ పై కేసును ఖండిద్దాం



చతీస్ ఘర్ రాష్ట్రానికి చెందిన విశ్వజిత్ మిత్రా మావోయిస్టులతో మాటాడి వ్యాసం రాసినందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ పై కేసు వేసారు. న్యాయవ్యవస్థపై ఆ వ్యాసంలో ఆమె చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తు పిటిషన్ వేసారు. కానీ, నేటి వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడం తప్పెలా అవుతుంది. ఆ ప్రాంతమంతా యుద్ధ భూమి గా మార్చి మీడియాను సైతం అనుమతించక, ప్రవేటు సైన్యాలతో, పారామిలటరీ బలగాలతో ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తేవడం నేరమెలా అవుతుంది. ఆ రాష్ట్రంలోని Special Security Act వంటి కౄర చట్టాన్ని అడ్డుపెట్టుకొని మాటాడేవారి గొంతునొక్కే ప్రయత్నం తప్ప మరోటి కాదు. ఇలాంటి మేధావి వర్గం, ప్రజాస్వామిక శక్తులపైనే యిలా దాడులకు సమాయత్తమవుతున్నారంటే యింక సామాన్యుల గతేంకాను? అందుకే దీనిని అందరం ఖండించాల్సిన అవసరం వుంది.

12, మార్చి 2010, శుక్రవారం

మరో మారు బూటకపు హత్యలు



ఈరోజు ప్రకటించబడ్డ రెండు ఎదురుకాల్పుల సంఘటనలు పాలుతాగే పసివాడికి కూడా అవి బూటకం అని తెలిసేట్టున్నాయి. అంత సులువుగా ఆ స్థాయి నాయకులు ఎదురుకాల్పులలో మరణించారన్నది నమ్మశక్యంగా లేదు. పూణేలో కొద్దిరోజులక్రితం అరెస్టు చేసి తీసుకువచ్చి ఇక్కడ చంపిపడవేసినట్లుగా కనిపిస్తున్నాయి. గత ముఫ్ఫైయేళ్ళుగా ప్రజా జీవితంలో మమేకమైన నాయకుణ్ణి పట్టుకున్నప్పుడు కనీసం ప్రాణాలతో వుంచినా తమకు ముప్పుగా భావించి, భయపడి చంపివేయడం, వారు తెలంగాణా బిడ్డలై వుండటం, వారికి ఓ హెచ్చరికలా దీనిని చూపించడానికి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి చేసిన రాజకీయ హత్యలే యివి.

అందుకే ఈ కట్టుకథనాలు యిటీవల ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో కూడా encounter meaning బూటకపు ఎదురుకాల్పులుగా అర్థంచెప్పబడింది.