అనుభవంలోకి వస్తేనే కానీ వ్యవస్థ లోని నిరంకుశత్వం బోధపడదు. అన్నాహజారే లాంటి వాళ్ళు ఇన్నాళ్ళు వ్యవస్థలోని భాగాలుగా NGO సంస్థల ప్రతినిధులుగా ఏదో బాగు చేసేస్తున్నామన్న భ్రమలలో తాముండి జనాలను మభ్యపెట్టారు. ప్రజలను ఉద్యమాలనుండి వేరు చేయడానికి తమ వంతు కృషి చేసారు. ప్రజాపోరాటాలను వ్యతిరేకించారు. సంస్కరణ వాదంతో కేన్సర్ వ్యాధికి పలాస్త్రీ వైద్యం చేయబూనారు. అలాగే రాజ్యహింసకు వ్యతిరేకంగా జరిగే పోరాట రూపాలను తీవ్రవాద ముద్ర వేయడంలో దోహదపడ్డారు. దీంతో కార్పొరేట్ పాలకులకు తమ కౄర పాలనకు వెన్ను దన్ను లభించడంతో ఇటువంటి వారిని తమ మీడియా ద్వారా ఆకాశానికెత్తేసారు. అలాగే వీళ్ళ ద్వారా ప్రజల పోరాట పటిమను అణచివేయడానికి సంక్షేమ పథకాల ముసుగులో లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి ముసుగులో దోచుకున్నారు. వ్యవస్థలోని ఉపరితలాంశాలను చూపుతూ మూలాలను దాచిపెట్టే ప్రయత్నాలకు వెన్నుదన్నుగా నిలిచారు. దాంతో వీళ్ళకి రామన్ మెగసేసేలు, భారత భూషణాలు లభించేసరికి తమను తాము హీరోలమనుకున్నారు.
పాలక వర్గాలకు వ్యతిరేకంగా మాటాడితేనే ఏమవుతుందో, ఆఖరికి 'సత్యాగ్రహం' లాంటిది చేద్దామన్నా, నిరసన తెలుపడానికి నలుగురు కూడుదామన్నా అనుమతులు దొరకకపోవడం అరెస్టులు చేయడానికి సైతం రాజ్యం ముందుకు వస్తుండడటంతో ఇన్నాళ్ళు రాని అసహనం, కోపం ఆక్రోశం బయటపెడ్తున్నారు. న్యాయవాదులు, మాజీ ఐపిఎస్ లకు కాళ్ళూ చేతులు ఆడటంలేదు. ఇన్నేళ్ళుగా సామాన్య గిరిజనం, బహుజనం అనుభవించిన నిరంకుశత్వం ఎంత తీవ్రమైనదో తెలిసివస్తోందా?
తాము అవినీతి పరులుగా పదిమందిలో పాలకవర్గాన్ని నిలుపుదామనుకుంటే మీరూ గురివింద గింజలే అని చూపుతున్న పాలకవర్గాన్ని చూస్తే నవ్వొస్తోంది..మరో వైపు అసహ్యమేస్తోంది..