యుక్త వయసులో ఈ పేరు వింటే ఆ ముఖమెప్పుడూ చూడకపోయినా ఒక ఉద్వేగం కలిగేది. పీపుల్స్ వార్ పార్టీ పేరు రేడియోలో వినని రోజంటూ వుండేది కాదు. ఆంద్రప్రదేశ్ నుండి ఉత్తర భారతం వైపు ప్రజా ఉద్యమాన్ని అడుగులు వేయించిన మహా యోధుడు ప్రజా యుద్ధ వీరుడు. అంతిమ దశలో అనారోగ్య కారణాల వలన యుద్ధభూమినుండి మరలి వచ్చినా ఆయన ఆచరణ సైద్ధాంతిక దృక్పధం ఆలోచనా ధార భారత ప్రజాతంత్ర విప్లవ కార్యాచరణకు ఆయుధాలే.
12, ఏప్రిల్ 2013, శుక్రవారం
జోహార్ కొండపల్లి సీతారామయ్య..
యుక్త వయసులో ఈ పేరు వింటే ఆ ముఖమెప్పుడూ చూడకపోయినా ఒక ఉద్వేగం కలిగేది. పీపుల్స్ వార్ పార్టీ పేరు రేడియోలో వినని రోజంటూ వుండేది కాదు. ఆంద్రప్రదేశ్ నుండి ఉత్తర భారతం వైపు ప్రజా ఉద్యమాన్ని అడుగులు వేయించిన మహా యోధుడు ప్రజా యుద్ధ వీరుడు. అంతిమ దశలో అనారోగ్య కారణాల వలన యుద్ధభూమినుండి మరలి వచ్చినా ఆయన ఆచరణ సైద్ధాంతిక దృక్పధం ఆలోచనా ధార భారత ప్రజాతంత్ర విప్లవ కార్యాచరణకు ఆయుధాలే.
13, ఫిబ్రవరి 2013, బుధవారం
రాజ్యం - హిందూ కార్పొరేట్ ఫాసిస్ట్ ముఖం..
వరుస ఉరి శిక్షల అమలుతో రాజ్యం తామింత కాలం దాచుకున్న లౌకిక ప్రజాతంత్ర ముసుగును తొలగిస్తోంది. ఓట్ల కోసం ఎంతకైనా తెగించే ధోరణితో ముందుకు దూసుకు వస్తోంది. తన విదేశీ ముఖాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుంభమేళాకు హాజరయ్యేందుకు సిద్దపడుతూంది. ఈ దేశాన్ని ఒక వైపు సామ్రాజ్యవాద అనుకూల శక్తులకు ధారపోస్తూ విదేశీ వ్యాపార సంస్థలకు పూర్తిగా తాకట్టుపెడుతూ మరోవైపు సనాతన హిందూ వేషాన్ని ముసుగుగా చూపిస్తూ తిరిగి అధికారాన్ని చేపట్టాలని చూస్తోంది. ప్రతిపక్షానికి ఏ అవకాశాన్నీ వదలకుండా ఓట్లు దండుకునేందుకు దూకుడుగా వస్తోంది. ఇంతకాలం మైనారిటీ అనుకూల వాదిగా వున్న ముద్ర తొలగిపోయినా తనకెదురులేదన్న దిశగా కదులుతోంది.
ఒకవైపు మూడోసారి స్వరాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన హిందూ ఫాసిస్ట్ తానే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకుంటూ వస్తున్న తరుణాన దానిని ఎదుర్కొనేందుకు తద్వార తన యువరాజుకు పట్టం కట్టేందుకే ఈ హత్యాకాండ సాగిస్తోంది. అధికార దాహానికిది పరాకాష్ట. ప్రజలకు వేరే ఆప్షన్ లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగానే ఇంత నీచంగా కనీస ప్రజాస్వమ్య రాజనీతిని న్యాయ పరమైన సూత్రాలను కూడా లెక్క చేయకుండా ఉగ్రవాద ముద్రతో ప్రజల నోరు నొక్కుతూ వరుస హత్యలకు పాల్పడుతోంది. దీనిని ఏదో తమ విజయంగా అమాయకంగా సంబరాలు చేసుకుంటే ప్రజలకు తమ నట్టింట్లోకి ఈ గోముఖ వ్యాఘ్రాలు ప్రవేశించి తమ కాళ్ళకింద నేలను, ప్రాణాలను హరిస్తాయన్న ఎరుక కోల్పోకూడదు.
ప్రజాస్వామ్య ముసుగుతో నేరుగా సైనిక పాలనే సాగుతున్నది. ముమ్మాటికీ నిజం. ఇది పోలీసు రాజ్యం. ఒకవైపు మధ్య భారతదేశమంతా సైనిక కవాతు చేస్తూ ఆదివాసీ ప్రజలను అత్యంత కౄరంగా
హింసిస్తూవారి తరతరాల హక్కులను స్వేచ్చా స్వాతంత్ర్యాలను హరిస్తూ ఖాళీ చేయిస్తూ సహజ వనరులను
కొల్లగొట్టడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.
ప్రశ్నించే వేదిక ఏదైనా అది ఆఖరికి అంతర్జాలమైనా వారి గొంతునొక్కే కఠిన నిర్ణయాలు పాలకులు తీసుకుంటున్నారంటే ఇంక ప్రజలకు ఏ అవకాశముంది?? కావున దీనిని అతి జాగరూకతతో నివారించి మన హక్కులను కాపాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ద్వారా ఈ దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరిదీ.
6, డిసెంబర్ 2012, గురువారం
మాయా ములాయంల దళారీ దగాకోరుతనం..
విదేశీ చిల్లర పెట్టుబడులను మన దేశీయ మార్కెట్లోకి అనుమతించే బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందడానికి పరోక్షంగా సహకరించిన మాయావతి, ములాయం సింగ్ లు తమ దేశ ద్రోహత్వాన్ని కళ్ళబొల్లి కబుర్లతో కప్పిపుచ్చుకోలేరు..
ప్రతిసారీ కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం సంకట స్థితిలో పడ్డప్పుడూ ఇలాంటి అటూ ఇటూ కాని పార్టీలతో నెగ్గుకొస్తున్నది కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం. ఒక వైపు ప్రజల పట్ల ఎంతో బాధ్యత వున్నట్టు ప్రవర్తిస్తూ వీళ్ళు లోపాయకారీ ఒప్పందాలతో సామ్రాజ్యవాద దేశాల హుకుంను ఇక్కడ అమలు చేయడానికి తోడ్పడుతున్నారు. ఇటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి. సి.బి.ఐ. బూచిని చూపుతూ రాజకీయ నాయకుల అవినీతిని తమ వ్యాపార లావా దేవీలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. అయినా ఈ పాలక పక్షాలన్నీ ఒక తానులోని గుడ్డలే కదా!!
వీళ్ళకు ప్రజల బాగోగుల పట్టవు. దేశ ఆర్థిక స్వావలంబన పట్ల నిజాయతీగా కృషి చేసే విధానాలమీ లేవు. దేశాన్ని తాకట్టు పెట్టి తమ స్వంత ఆస్తులను కూడబెట్టుకునే వ్యాపార దళారీ తత్వమే. కావున ఈ దళారీ పాలక వర్గాలను తప్పక నిలదీయాల్సిన అవసరముంది.
వీళ్ళకు ప్రజల బాగోగుల పట్టవు. దేశ ఆర్థిక స్వావలంబన పట్ల నిజాయతీగా కృషి చేసే విధానాలమీ లేవు. దేశాన్ని తాకట్టు పెట్టి తమ స్వంత ఆస్తులను కూడబెట్టుకునే వ్యాపార దళారీ తత్వమే. కావున ఈ దళారీ పాలక వర్గాలను తప్పక నిలదీయాల్సిన అవసరముంది.
19, అక్టోబర్ 2012, శుక్రవారం
గేట్లన్నీ బార్లా తెరచి యింకా సరిహద్దులేల???
ఈరోజు ఓ గంట క్రితం సాక్షి టీవీలో రాజకీయ పార్టీల విరాళాలు వసూళ్ళపై చర్చలో పాల్గొంటూ ప్రొ.హరగోపాల్ ఓ మాటన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి విదేశీ కంపెనీలకు ఈ దేశ వనరులను దోచుకొనే అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇంక పక్క దేశం వాడు వచ్చి ఏదో చేసేస్తాడని నమ్మిస్తూ సరిహద్దులను సైన్యంతో కాపలా కాయడం అవసరమా?? అని అడిగారు..
ఈ ప్రశ్న చాలా ఆలోచించదగ్గదే. విదేశీ కంపెనీలు వేదాంత తదితరమైనవి మన అడవులను, సహజ వనరులను ఎటువంటి జంకూ గొంకూ లేకుండా కొల్లగొడుతూ ఈ దేశ సంపదను ఎత్తుకెళ్ళి పోతుంటే యింకా చైనా వాడో, పాకిస్తాన్ వాడో ఈ దేశంపై దండేత్తుతాడని సైన్యాన్ని మేపుతూ సరిహద్దు రేఖలు గీచుకొని కూచోవడం అవసరమా?? ఎవడికి దొరికింది వాడు దోచుకుపోతుండడానికి చిల్లర దుఖాణాలతో పాటుగా అమ్మజూపుతున్న ప్రభుత్వాలకి ఈ దేశ సరిహద్దులంటూ ఇంత ప్రజా ధనం దుర్వినియోగం అవసరమా??
ఎక్కడికక్కడ ప్రజలను నిర్వాశితులును చేస్తూ ప్రశ్నించే వారిపై రక రకాల చట్టాల పేరుతో అరెస్టులు మరికొన్ని చోట్ల జనంపై కాల్పులు జరుపుతు ప్రాణాలు తీస్తున్న రాజ్యం ఈ కుహనా సరిహద్దు రేఖలను చూపి మనల్ని భ్రమలలో వుంచుతున్నాయి. విదేశీ కంపెనీలు, కార్పొరేటు సంస్థలు తమ వ్యాపార లావాదేవీలను నిరభ్యంతరంగా చేసుకోవడానికి తలుపులు బార్లా తెరిచి యిదే అభివృద్దని చెప్తున్న ప్రభుత్వ మోసకారితనాన్ని గ్రహించి నిలదీయాల్సిన సమయమిది.
12, సెప్టెంబర్ 2012, బుధవారం
అన్నా హజారే ఎవరి ప్రతినిధి??
పెట్టుబడిదారీ దోపిడీకి మానవత్వపు ముసుగు తొడిగిన ఫోర్డ్ మరియు రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లు స్పాన్సర్ చేసిన రామన్ మేగసేసే అవార్డు గ్రహీతలు ముగ్గురు ఈ ఉద్యమాన్ని నడిపే వారిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ సంస్థల నేపథ్యం తెలుసుకోవాలంటే ఈ వ్యాసం తప్పక చదవాలి.
అన్నాహజారే, అరవింద్ కేజ్రివాల్, కిరణ్ బేడీల వెనక వున్న మద్దతు గురించి తప్పక తెలుసుకోవాలి. అరవింద్ కేజ్రీవాల్ కి ఉన్న అనేక స్వచ్చంద సంస్థలలో ఒక దానికి ఫోర్డ్ ఫౌండేషన్ ధారాళంగా నిధులు ఇస్తుంది. కిరణ్ బేడీ నడిపే స్వచ్చంద సంస్థకి కోకా కోలా, లేమన్ బ్రదర్స్ నిధులను ఇస్తున్నాయి.
అన్నా హజారే గాంధేయవాదినని చెప్పుకుంటాడు. కానీ అతను ప్రతిపాదిస్తున్న జన్ లోక్ పాల్ బిల్లు గాంధేయ వాదానికి వ్యతిరేకమైనది, ప్రమాదకరమైనది. ఆమధ్య యూరోప్, అమెరికాలను ఒక ఊపు ఊపిన వాల్ స్ట్రీట్ ముట్టడి ఉద్యమానికి భిన్నంగా ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తుల, ఆర్థిక సంస్కరణల ప్రభావంతో అతలాకుతలమవుతున్న జనజీవనం గురించి ఒక్క మాట కూడా మాటాడని అన్నా అలాగే కార్పొరేట్ అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించి, రాజకీయ నాయకుల పట్ల ప్రజల ఆగ్రహాన్ని సాకుగా చేసుకుని ప్రభుత్వ అధికారాలు మరింత నీరు గార్చాలని, ప్రైవేటు పెట్టుబడులకు అనుగుణంగా సంస్కరణలను వేగవంతం చేయడానికి తోడ్పడేందుకు ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇక్కడ మరో విషయం రెండువేల ఎనిమిదిలో అన్నాకు విశిష్ట ప్రజాసేవకు ప్రపంచ బ్యాంకు అవార్డు నివ్వడం యాధృచ్చికం కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం తమ విధానానికి సరిగ్గా సరిపోయిందని వాషింగ్టన్ నుంచి ప్రపంచ బ్యాంకు ప్రకటన ఇచ్చింది.
యిలా రాజ్యం యొక్క సంక్షేమ పథకాలను నీరుగారుస్తూ ఆర్థిక సంస్కరణల పేరుతో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న విదేశీ పెట్టుబడి సంస్థల కొమ్ము కాసేందుకు, ఆయా సంస్థలకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావడానికి, వున్న ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి సెజ్ లు వంటి సామంత రాజ్యాల ఏర్పాటుకు ఓ సన్నాహక, మద్ధతుకు ముందస్తు ప్రక్రియగా ప్రజల మైండ్ సెట్ ను మార్చే ఉద్యమంగా దీనిని కార్పొరేట్ మీడియా సహకారంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల మౌలిక సమస్యల పట్ల ఏమాత్రం సానుభూతిలేని వీరి ఉద్యమం ఓ ఫార్సు. జనం కూడూ గుడ్డ, స్థానం కోల్పోయి ఎక్కడికక్కడ తమ భూమి, వున్న ఊళ్ళను విడిచి వలస బాట పట్టే విధంగా జన జీవనం అతలాకుతలం కాబడుతుంటే, దేశ సంపదను, సహజ వనరులను కొల్లగొట్టేందుకు పెద్ద ఎత్తున ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించకుండా నటిస్తూ తాము ఈ దేశానికి నిజాయితీ పరులుగా ఫోజులిస్తూ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు మద్ధతుగా దీనిని ముందుకు తెచ్చారు.
ఈ సందర్భంగా రాజకీయ అవినీతిని కూడా తప్పక ఖండించాలి. అది అవినీతికి మూల విరాట్టే, కాదనను. కానీ, ఈ దేశ సహజ సంపదను మానవ వనరులను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న కార్పొరేట్ రంగాన్ని ప్రశ్నించి నిలువరించే ఉద్యమంగా ఇది ముందుకు రావాల్సిన అవసరముంది. అవకాశ వాద మధ్యతరగతి ప్రజల మనోభావాలను ప్రభావితం చేస్తూ అసలు అవినీతి మూల విరాట్టును వదిలేసి పైపై మెరుగులను ఆశించే ఇట్లాంటి ఉద్యమాల వలన ఏమాత్రం ఉపయోగముండదు. వ్యవస్థ సమూల మార్పునకు గురికాకుండా ఇలాంటి ఆయింట్ మెంటు ఉద్యమాల వలన జరిగే మార్పేమీ వుండదు.
30, ఆగస్టు 2012, గురువారం
మానని గాయం గుజరాత్...
గోధ్రా రైలు దుర్ఘటన తరువాత రోజు నుండి వరుసగా వారం దినాలకు పైగా గుజరాత్ ముస్లింలపై జరిగిన దారుణ మాన ప్రాణ ఆస్తి హనన కాండపై ప్రత్యేక కోర్టు నిన్న వెలువరించిన తీర్పు ఆహ్వానిద్దాం. వీరికి రేపు శిక్షలు ప్రకటించే అవకాశముంది. ఇదంతా వార్తా పత్రికలలో చదివిన విషయమే. అక్కడే ఇంకో విషయముంది. ఈ మొత్తం మారణ కాండకు నేతృత్వం వహించిన అప్పుడు ఇప్పుడు వున్న సి.ఎం. ఈ మారణకాండకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ప్రకటించడం. అంటే దీనికి తానే పూర్తి బాధ్యత వహించినట్టు భావిద్దామా? అటు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి అధికారంలో వున్న వాడిపై చర్య తీసుకునే క్రమంలో లేదన్నది స్పష్టమౌతున్నది. ఓటు బ్యాంకు రాజకీయాలు నడపడంలో రెండు పార్టీలు దొందూ దొందె. రెండు వేలమందికి పైగా ఈ దేశ ప్రజలు ఊచకోతకు గురి కాబడితే ఏళ్ళ తరబడి దర్యాప్తుల పేరుతో కాలం గడుపుతూ మానని గాయంపై కారం చల్లే ప్రక్రియ జరుగుతోంది. కడుపులో శూలాలు దించి గర్భస్థ శిశువులను బయటకు లాగిన ఉన్మాదులొక్కరూ శిక్షింపబడకపోవడం ఈ దేశ ప్రజాస్వామ్య న్యాయవ్యవస్థ యొక్క దుర్నీతిని తెలియజేస్తోంది. భయపెట్టి, ప్రలోభ పెట్టి బాధితులను సాక్షులను తారు మారు చేసి ఒక ఎం.పీ.కుటుంబం మొత్తం తగలబెట్టిన కేసునే తగలబెట్టిన న్యాయం మనది. యిలా రోజు రోజుకి దిగజారిపోతున్న అధికార న్యాయ వ్యవస్థలు బాధితులకు న్యాయం చేస్తాయన్నది మృగ తృష్ణ కాదా?
మీడియాలో ఓ దోషిని తీసుకు వెళ్తుండగా వాడి పిల్ల ఏడుస్తున్న ఫోటో వేసి సానుభూతి పొందే అవకాశాన్నిస్తున్నారు. అంటే కేసు పట్ల మీడియ వైఖరి కూడా తెలుస్తోంది. అటువంటి ఎంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు, అలాగే వారి తల్లి దండ్రులు వారి కళ్ళముందే ఈ దారుణ మారణకాండలో హత్య చేయబడ్డారు? దానినుండి మానసికంగా దూరం చేయడానికి జరిగే కుట్రకాదా? ఇక్కడ మీడియా కూడా హైందవ ఫాసిస్ట్ వర్గ కార్పొరేట్ చేతుల్లో వుందన్నది సుస్పష్టం.
18, జులై 2012, బుధవారం
కా.గోరు మాధవరావు అమర్ రహే...
అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధమ అధ్యక్షునిగా పనిచేసిన కా.గోరు మాధవరావు గారు ఈ రోజు సాయంత్రం తన స్వంత గ్రామం జింకిభద్రలో (సోంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా) అస్వస్థతతో కన్నుమూసారు. ఆయన తన జీవిత కాలమంతా విప్లవ ప్రజా పంథానే నమ్మారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం నుండి మొదలైన ఆయన విప్లవాచరణ ఆ తరువాత కొండపల్లి సీతారామయ్య గారి నేతృత్వంలోని పీపుల్స్ వార్ పార్టీలో క్రియాశీలకంగా విప్లవాచరణలో తన సహచరిణితో పాటుగా పాల్గొన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామ క్రమంలో మావోయిస్టు పార్టీ ఆద్వర్యంలో కూడా అదే తీరున ఉద్యమాలకాలంబనగా కృషి చేసారు. పార్టీ ప్రచురణలైన దిక్సూచీ ప్రచురణలకు చిరునామాగా ఆయన అడ్రసునే వుండేది.
ఎన్ని రకాలుగా నిర్బంధాలు అమలు చేసినా అకుంఠిత దీక్షతో, నిబద్ధతతో విప్లవం పట్ల దృఢ నమ్మకంతో చివరి వరకు వున్నారు. పోలీసులు ఆయనను ఆ వయసులో కూడా పిలిచి భ్రమలలో ముంచెత్తే ప్రయత్నంగా అనేక మార్లు కౌన్సిలింగ్ నిర్వహించే ప్రయత్నంచేస్తే వారికి తిరిగి విప్లవాచరణ గురించి చెప్పి వచ్చిన ఉద్యమాభిమాని కామ్రేడ్ గోరు మాధవరావు.
ఎనభై ఏళ్ళు వచ్చాయి యింకా మీరు సమావేశాలకు హాజరు కావడం, సందేశాలివ్వడం ఎలా సాధ్యమవుతుంది కామ్రేడ్ అని ఎవరైనా అంటే నాడు నాటు తుపాకులతో మొదలైన ప్రస్థానం ఆరోజుల్లో వర్షం పడితే పేలని తుపాకులతో నానా అవస్థలు పడిన కాలం నుండి నేడు అత్యంతాధునిక ఆయుధాలు కలిగిన ప్రజా గెరిల్లా సైన్యంగా రూపాంతరం చెందినాం కదా మనం యింతకంటే స్ఫూర్తి ఏం కావాలి నాకనేవారు. ఎల్లప్పుడూ ఒకే రకమైన ఆలోచనతో, భారత దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవానికి తన వంతు ఆచరణతో కృషి చేసిన కా.గోరు మాధవరావు గారి విప్లవాచరణ అందరికీ ఆదర్శప్రాయం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

