17, సెప్టెంబర్ 2011, శనివారం

మోడీ గారి దూకుడు..భావి బిజెపి వారి ప్రధాని అభ్యర్థిగా తనను తాను ప్రకటించుకుంటూ దూకుడుగా దూసుకు వస్తున్న నరేంద్ర మోడీ ఈరోజు మన తెలుగు పత్రికలకు సైతం ఇచ్చిన భారీ ప్రకటనలు చూస్తుంటే ఈయనగారికి ప్రజల సొమ్ము పట్ల వున్న బాధ్యత అర్థమవుతోంది...తన పుట్టిన రోజును సధ్బావనా దివస్ గా జరుపుకోమని ఆర్డరేస్తూ దీక్షను చేపట్టడం ఎవరి సద్భావన కోసం...చేసిన మారణకాండ మచ్చను చెరుపుకొనే ప్రయత్నంలో భాగంగా జాతీయ నాయకునిగా అవతారమెత్త జూస్తుంటే ఈయన గారి చిలక పలుకు వింటూంటే బంగారు కడియం - ముసలి పులి కథ గుర్తుకు వస్తోంది....

మరో ఫాసిస్ట్ పాలన వైపు మరలకుండా తగు జాగ్రత్త వహించాల్సిన అవసరమెంతైనా వుంది....వేలాది మంది ప్రాణాలను బలిగొన్న వారికి ఈ దేశంలో ఏ శిక్షా పడదని, నెత్తురు మరకలను కడుగుకొనేందుకు బూటకపు ఎన్నికల మేళా తోడ్పడుతున్నంత కాలం ఈ విషాదం వెంటాడుతూనే వుంటుంది...ఈ హిట్లర్ అంశ వున్న వాళ్ళను ఎంతలా నిరోధిస్తే అంత మంచిది దేశానికి....
,