31, డిసెంబర్ 2010, శుక్రవారం

మరపు రాని మనకాలం వీరుడు సద్దాం

నవ్వుతూ
తలవంచక
గుండెల్నిండా ఊపిరితో
ఎత్తిపట్టిన చాతీతో
నిటారుగా నిలిచిన వెన్నెముకతో
కాలు తన నేలపై గట్టిగా అదిమి పట్టి
శతృవు గుండెల్లో బెదురుపుట్టిస్తూ
తన జాతి పరువుకోసం,
పంతం కోసం ఒక్కడై,
తను ఒక్కడే వీరుడై,
కోల్పోయిన దానిని చివరి నిమిషంలో
అంతటా జేజేలు ద్వారా పొందిన
ఒకే ఒక్క వీరుని మరణం
ది గ్రేట్ సద్దాం హుస్సేన్ అబ్ద్ అలి మజ్ది తిక్రితి
మన కాలం వీరుడు...
అందుకో మా జోహార్లు సద్దాం

అగ్ర రాజ్యపు దురహంకారానికి నిలువెత్తు సాక్ష్యం
నీ నేలపై ఒలికిన లక్షలాది మంది క్రొన్నెత్తురు
దాని పాపం ఊరికే పోదులే..
ఈ కుహనా ప్రజాస్వామ్యవాదులు,
స్వేచ్చావాదులు
నీ నవ్వు ముందు బలాదూర్ కాకపోరు
నువ్వెత్తి పట్టిన మొండి ధైర్యమే మాకు ఆదర్శం
అబ్బురపరిచిన నీ మొక్కవోని ధీరత్వం
ఎప్పటికీ ఈ నేలపై స్వాతంత్ర్య కాంక్ష
కలిగిన వారి చేతిలో
ఝెండాగా ఎగురుతూనే వుంటుంది..
బాగ్ధాద్ నెలవంక సాక్షిగా
ఇది శాశ్వతం, సత్యం..
(సరిగ్గా నాలుగేళ్ళ క్రితం నిన్నటి రోజున సద్దాం పాశ్చాత్య దురహంకారుల చేతిలో ఉరితీయబడ్డాడు)

27, డిసెంబర్ 2010, సోమవారం

బలగాలు తరలింపు తెలంగాణాకే ఎందుకు?పారామిలటరీ బలగాల మోహరింపు తెలంగాణా ప్రాంతానికే పరిమితం చేస్తూ తెలంగాణా ప్రజల గుండెలపై తుపాకులెక్కుపెట్టడాన్ని చూస్తుంటే డిసెంబర్ ఆఖరు తరువాత వారి ఆశలపై నీళ్ళు జల్లేందుకు సిద్ధమైన కార్యాచరణతో పాలకవర్గం వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి తద్వారా వారిని తీవ్ర నిర్బంధంతో అణచబట్టడానికి ఉద్యుక్తులవుతున్నారని అర్థమవ్వని వారెవ్వరైనా వున్నారా?

ఉద్యమ క్రెడిట్ ను ఏ ఒక్కరో కొల్లగొట్టుకుపోకుండా వుండటానికి ఈ రోజు ఎన్నడూ గొంతెత్తి ఎరుగని కాంగేయులు దీక్ష చేపట్టడం హాస్యాస్పదం కాదా?

జైళ్ళలో మగ్గుతున్న విద్యార్థులను పరామర్శించని ఈ నాయకులంత నేడు వారిపై వున్న కేసులను ఎత్తివేయమని గోలచేయడం వెనక కుట్ర కానరాదా? కేసుల సంఖ్య ప్రకటిస్తూ ఎత్తివేసినవన్నీ సాధారణ కేసులే తప్ప వారిపై పెట్టిన తీవ్రమైన కుట్రకేసులగురించి మాటాడని ప్రభుత్వం ఇంతకుముందెన్నడూ లేనివిధంగా న్యాయపరమైన చిక్కులు గురించి మాటాడుతూ తప్పుదోవపట్టిస్తోంది. ప్రజలకు, వారి ఆస్తులకు కోట్ల రూపాయలలో నష్టాన్ని సాగించి, హత్యలు, లూఠీలతో తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన రంగా హత్యానంతరం, రాజీవ్ హత్యానంతరం అధికార పార్టీ గూండాలందరిపై ఎత్తివేసినప్పుడు కానరాని ఈ న్యాయ, నైతిక అంశాలు తెలంగాణా విద్యార్థి, యువజనులపై పెట్టిన తప్పుడు కేసులప్పుడే గుర్తుకు రావడం వీళ్ళ వివక్షకు తార్కాణం కాదా?

తెలంగాణా ప్రజలేమైనా ఉగ్రవాదులా? ఇన్నిన్ని కేసులు, మిలటరీ బలగాల మోహరింపుతో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేయడం ఎంతవరకు సమంజసం?

ఈ పాలకవర్గ నాయకులంతా ముందుగా బలగాల అక్రమ తరలింపును అడ్డుకొని, వాటి ఉపసంహరణకు డిమాండ్ చేస్తూ వారి పదవులనుండి వైదొలగి కేంద్ర, రాష్ట్ర పభుత్వాలపై తీవ్రమైన వత్తిడి తేగలిగితే వీరిని నమ్మొచ్చు. అంతే కానీ దీక్షలతో మభ్య పెట్టజూడడం తెలంగాణా ప్రజలను మోసం జేయజూడడమే...

ఒకపక్క కేసీఆర్ జార్ఖండ్ ఉద్యమం పద్దెనిమిదేళ్ళు సాగింది కాబట్టి అప్పుడే తొందరొద్దు, ఉద్యమాన్ని కొనసాగిస్తూ, చందాల దందాలతో, పదవులతో బేరసారాలతో హీరోగా కొనసాగ జూస్తున్నాడు కాబట్టి ఈయనగారి బండారాన్ని తప్పక బయటపెట్టి ప్రజా ఉద్యామాన్ని నిర్మాణం చేసుకొని పాలక, ప్రతిపక్ష నాయకులను బహిష్కరించి, పూర్తిగా సహాయ నిరాకరణను కొనసాగించి, అమరుల ఆశయాన్ని ఎత్తిపట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరముంది....

25, డిసెంబర్ 2010, శనివారం

ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం..నిన్నటి రాయపూర్ కోర్ట్ తీర్పు హక్కుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ఈ దేశ కార్పొరేట్ రాజ్యాంగం వెలిబుచ్చినదిగా వుంది తప్ప ఒక చంటిపిల్లల డాక్టరుగా పనిచేస్తూ, తన చుట్టూ వున్న పేద గిరిజనులపై జరుగుతున్న అమానుష దాడిని ఖండిస్తూ, వారికి వత్తాసుగా వుంటూ న్యాయస్థానాలలో వారి తరపున పోరాటం చేసే డా.క్టర్ బినాయక్ సేన్ ను గత రెండు సం.లుగా అక్రమ నిర్బంధంలో వుంచి, సుప్రీం ఉత్తర్వులతో బైయిల్ పై విడుదలైన ఓ వృద్ధ డాక్టర్ పై దేశ ద్రోహ నేరం కింద యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా వుండాల్సిన పౌర స్వేచ్చను హరించడమే. రాజ్యాన్ని ప్రశ్నించే హక్కును హరించే కౄర చట్టాల ద్వారా నియంత పాలన సాగించ జూడడం వ్యవస్థ వైఫల్యాన్ని ఒప్పుకోవడమే..

ఆంధ్రప్రదేశ్ లో ఎనభైల ప్రాంతంలో జరిగిన చంటిపిల్లల డాక్టరు, పౌరహక్కుల ఉద్యమ నేత డా.రామనాధం హత్య కేసు ముద్దాయిలు ఇంతవరకు గుర్తింప బడలేదు. అలాగే ఎందరో న్యాయవాదులు, ఉపాధ్యాయులను తమ ప్రైవేటు హంతక ముఠాలచే నిర్దాక్షిణ్యంగా హత్యచేసిన స్థానిక ప్రభుత్వం హక్కుల ఉద్యమాన్ని అణచివేయడంలో ముందుంది. డా.రామనాథం వద్ద అనేకమంది పోలీసు కుటుంబాల చిన్నారులు కూడా వైద్యం పొందేవారు. ఆయన వైద్యం కోసం ఎవరు వచ్చినా తన వృత్తి ధర్మాన్ని నిర్వహించేవారు. అది పౌరుల ప్రాధమిక హక్కుగా పేర్కొనేవారు. ఇలా ఎంతోమంది అణగారిన వర్గాల వైపు నిలబడి మాటాడే వారిని హత్య చేయడమో, జైళ్ళపాల్జేయడమో చేయడం ద్వారా తమ నిరంకుశ, నిర్లజ్జ పాలన కొనసాగించబూనడం ఘోరమైన నేరం. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మనందరం.

ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ఈ ఆన్లైన్ పిటిషన్ లో సంతకం చేయగలరు

15, డిసెంబర్ 2010, బుధవారం

నిజంగా రాడియాకు ఇదంతా సాధ్యమా?
కెన్యాలో పుట్టి , లండన్ లో విద్యాభ్యాసం చేసి తన చాతుర్యంతో ఒక దేశ పాలనా వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదిగిన నీరా రాడియాను అభినందించకుండా ఉండగలమా?

అసలు ఒక కార్పొరేట్ లాబీయిస్టుగుప్పెట్లోకి మొత్తం దేశ పరిపాలనతోపాటు, ఆర్థిక వ్యవహారాలనే తాకట్టుపెట్టబడ్డాయంటే మనమెంత భద్రంగా వున్నామో తేటతెల్లమైంది..

నిజంగా ఈరోజు దేశ ఇంటలిజెన్స్ వ్యవస్థ ప్రధాని తమిళనాడు పర్యటనకు వెళితే టైగర్స్ వలన ముప్పుందని చెప్పారంట. ముప్పు పూర్తిగా అణగదొక్కబడిన వాళ్ళ వలన లేక కరుణ వలనన్నారో.. ఇలా మన మీడియా ద్వారా చీదించారా?

ప్రైవేటు ఆర్థిక దిగ్గజాలైన అంబానీ, టాటాలు తమ వ్యాపారాల కోసం ఎంత దిగజారి పావులు కదుపుతారో ప్రజలకు అర్థమైంది. మరల ఇందులో తమ పరువు పోతుందని కోర్టులకెక్కడమొకటి.

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఈ తీగల ముళ్ళు చుట్టుముట్టాయన్నది మాజీ ప్రధాన న్యాయమూర్తిగారిపై వచ్చిన ఆరోపణలతో అసలు కార్పొరేట్ రంగం ఈ దేశ చతురంగ వ్యవస్థను ఎంతలా దిగజార్చిందో మనకర్థమౌతోంది.

ఈ దేశానికి అంతర్గత భద్రతకు మావోయిస్టుల వలన ముప్పని ఎక్కడ మైకు దొరికితే అక్కడ ఊదర గొట్టే ప్రధానికి ఈ లక్షా డెబ్బై వేలకోట్ల కుంభకోణం ఈ దేశ జవసత్వాలను పీల్చి పిప్పిచేస్తుంటే నోట్లో ఏమడ్డమొచ్చి ఊరకున్నారో?

ఓ పెద్ద రెండు రాష్ట్రాల సం.బడ్జెట్ అంత మొత్తం ఒకరి గుప్పెట్లోకి పోతే అంతర్జాతీయ స్థాయి ఆర్థిక మేధావుల పాలన ఇలా ఏడ్వడానికి వున్న చిదంబర రహస్యమేమిటో?

పార్లమెంటు మొత్తం స్థంభించిపోయి సమస్యలన్నీ గాలికొదిలేయబడి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుతో తలదించుకొనేట్లుంటే ఇక్కడ మౌనం దాల్చి ఎక్కడో యూరోపియన్ దేశంలో నా పార్లమెంటో అని ఏడ్చిన వాణ్ణి ఇతగాన్నే చూసాం..

అటు ప్రతిపక్షం అధికారంలో వున్నప్పటి నుంచి ఇప్పటి అధికార పక్షం వరకు రాడియా నీడ చాటుకు పోవడాన్ని ఇంత మౌనంగా ఈ దేశ ప్రజలు భరిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో వున్నామో కదా?

ఒట్టిపోయిన ఆవుకు మేపు దండగన్నట్లు, చెవిటోడి ముందు శంఖమూదినట్లు ఎన్నని ఏం లాభం..

నిద్రపోయే వారిని లేపగలం కానీ, నిద్ర నటించే వాళ్ళని లేపడం ఎవరి తరం?

మేధావి వర్గం కార్పొరేట్ మాయలో పడింది.
యువత కెరీరిజం మోజులో కూరుకుపోయింది.
సామాన్యజనం ఏ పూట బత్తెం ఆ పూట దేవులాటలో కొట్టుమిట్టాడుతోంది.
కోట్లు దొబ్బుకుపోయేవాడు చల్లగా జారుకుపోతున్నాడు.

ఏ రోజుకారోజు ధరలు ఆకాశం దాటి దూసుకుపోయినా మన సెల్ మోగితే చాలు.. ఓ వంద ఫ్రీ మెసేజ్ లతో ఆడుకుందాం రా!!

9, డిసెంబర్ 2010, గురువారం

మోసపుచ్చిన అపరాత్రి ప్రకటన..తెలంగాణా ప్రజల ఆకాంక్షను గుర్తిస్తున్నట్లు సరిగ్గా ఏడాది క్రితం
అపరాత్రిప్రకటన చేసి, వారిలో ఆశలు రేకెత్తించిన కేంద్రం ఆ తరువాతి పరిణామాలకు, దళారీ పెట్టుబడిదారుల కుయుక్తులకు తలొగ్గి ఏభై నాలుగేళ్ళ సుదీర్ఘ స్వప్నాన్ని కన్న వారి ఆశలపై నీళ్ళు చల్లేట్టు కమిటీలు వేసి తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేయడం ద్వారా అనేక మంది నవ యువతీ యువకుల ఆత్మార్పణకు దారితీసేట్టు చేసి, తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తూ వస్తూంది. రాష్ట్ర అధినాయకత్వ మార్పు ద్వారా మరింత కఠిన వైఖరి తీసుకునే విధంగా ప్రోత్సహిస్తూ తెలంగాణాను పోలీసు రాజ్యంగా మార్చివేయజూస్తోంది. ఉద్యమాలను వ్యతిరేకించే పోలీసు బాసును రాష్ట్రానికి గవర్నర్ గా పంపినప్పుడే కేంద్ర వైఖరి అవగతమైంది. వారి డిసెంబర్ తొమ్మిది ప్రకటన వట్టి మోసపూరితమైనదని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చేయాల్సిన దానికి అసెంబ్లీ తీర్మాణం కావాలన్న ప్రకటన వలన వారి దాటవేత ధోరణి వ్యక్తమైంది. అవకాశవాద రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు అందరి ముందు తెలంగాణాకు మద్ధతు ప్రకటించిన వారే ఈ ప్రకటన వెలువడ్డ తర్వాత వారి వారి ప్రాంతీయ ధోరణులు బయటపెట్టి మరింత వేదనకు గురిచేసారు. మీడియాకూడా రకరకాల వ్యాఖ్యానాలతో తమ పెట్టుబడుల మూలాలను కాపాడుకునే ప్రయత్నాలను చేస్తూ వస్తోంది. ముందుండి నడుపుతున్న నాయకత్వంలో కూడా వున్న అవకాశవాదం కారణంగా ఉద్యమం అటూ ఇటూ ఊగిసలాడుతూ యువతరాన్ని తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేస్తోంది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ముందుకు వచ్చి దళారీలను అడ్డుకొని ఉద్యమాన్ని నిలబెట్టి వుండకపోతే ఇప్పటికే ఉద్యమ నెలబాలుడిని ఈ రాజకీయ రాహువులు మింగిపారేసేవి. ఈ నాలుగు వందలమంది ఆత్మార్పణ బూడిద పాలయ్యేది.

తెలంగాణ ప్రజలను మరెంతో కాలం మోసం చేయలేరని, వారి సహనాన్ని పరీక్షించకుండా నాటి ప్రకటనకు కట్టుబడి వారి కలలను సాకారం చేయగలరని ఆశిద్ధాం. ఏమైనా ప్రజా ఉద్యమం ద్వారానే వత్తిడి పెంచగలమని గ్రహించి ఐక్య పోరాటాల ద్వారా తెలంగాణా సాధనకు కృషిచేయగలరని నాయకత్వాన్ని కోరుతూ..

2, డిసెంబర్ 2010, గురువారం

డిసెంబర్ రెండుడిసెంబర్ రెండు
భారత విప్లవోద్యమ చరిత్రలో ఈ రోజు

చరిత్రను అటూ ఇటూగా విడదీసిన రోజు

పీడిత ప్రజల విముక్తి కోసం,

సమసమాజ నిర్మాణంకోసం,
సామ్రాజ్యవాద కబంద హస్తాలనుండి భారత దేశ విముక్తి కోసం
తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్న విప్లవ నాయకులను
కుట్రతో
, కుతంత్రంతో

అత్యంత కిరాతకంగా హత్యచేసి ఉద్యమాన్ని
తుడిచి పెట్టేసామన్న సంబరం
పాలక హంతక ముఠాలకు మిగలనివ్వని రోజు
వారి చావుతో కోల్పోయింది ముగ్గురినే కానీ

వేలాదిగా మారిన విముక్తి సైన్యం ఏర్పాటుకు తోవతీసిన రోజు

వీరుడు మరణిస్తే వేలాదిగా పుట్టుకొస్తాడన్నదానికి కొండ గుర్తు...

అందుకే డిసెంబర్ రెండు
నెత్తుటితో ఎగరేసిన ఝెండా గుర్తు..
(కా.శ్యాం, మహేశ్, మురళి ల అమరత్వాన్ని గుర్తుచేసుకుంటూ)
వారి అమరత్వంపై వివరణ చూడగలరు

30, నవంబర్ 2010, మంగళవారం

ప్రజల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యం?
పార్లమెంటరీ రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టాయో తాజా రాష్ట్ర పరిణామాలు ఋజువు చేస్తున్నాయి. ప్రజలు ఓట్లు వేసాక ఇంక తమ చేతిలో ఏ అధికారమూ లేక దొంగలు దొంగలు దోచినది పంచుకుంటుంటే చూస్తూ మరో టర్మ్ వచ్చేదాక వేచి చూసి మరల మరో కొత్త దొంగల ముఠాను ఎన్నుకోవడానికి తయారు కావడమే తప్ప మరో మార్గం లేని నిస్సహాయత.

23, నవంబర్ 2010, మంగళవారం

పౌరహక్కుల పురుషోత్తం అమర్ రహే..


పౌరహక్కుల పురుషోత్తంగా జనం గుండెల్లో దాగిన పురుషోత్తం హత్యగావి౦పబడి నేటికి దశాబ్దం అయింది. కానీ ఆయనను హత్యచేసినవాళ్ళు నేటికీ గుర్తింపబడలేదు. ఇదే రోజు ఆయనతో మా జిల్లాలో హక్కుల కార్యకర్త అరెస్టు గురించి ఆయనతో మాటాడిన గంటలోనే గుర్తుతెలియని (పోలీసుల అండతో) కిరాతక హంతక ముఠా ఆయనపై కత్తులతో దాడి చేసి ఆయన ఇంటికి దగ్గరలోనే హత్య చేసారన్న వార్త. హక్కుల కార్యకర్తలపై వరుసగా దాడులు జరిగాయి ఆ పాలనలో. గొ౦తులేని వారి తరపున నిలబడి రాజ్యాన్ని ప్రశ్నించడం నేరంగా మార్చిన రోజులు అవి. ప్రజల తరపున మాటాడే వారిని లేకుండా చేయడం ద్వారా భయానక వాతావరణాన్ని కల్పించి తమ నిరంకుశ పాలనను కొనసాగించే ప్రయత్నం చేసారు నాయుడుగారు. రాజ్యం, పోలీసుల అండతో ప్రైవేటు హ౦తక ముఠాలు తయారై బహిరంగ హత్యలు చేసాయి. నేటికీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ హత్యలెవరు చేశారన్నది పాలక వర్గం గుర్తించలేదు.

ఆంధ్ర
ప్రదేశ్ పౌరహక్కుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఆయన రాష్ట్రంలో నాడు ఏమూల జరిగిన హక్కుల ఉల్లంఘనలపైనైనా వెంటనే స్పందించేవారు. తను హక్కుల కార్యకర్తగా, కమ్యూనిజాన్ని నమ్మిన వ్యక్తిగా తన జీవన విధానాన్ని నిబద్ధతతో సాగించి ఉద్యమకారులకు ఆదర్శ మూర్తిగా నిలిచిన పురుషోత్తంకు జోహార్లు..

12, నవంబర్ 2010, శుక్రవారం

దొరా ప్రజలతో కలిసి పనిజేయవా?
కెసియార్ నిన్న కెకె తో సాగించిన మంతనాల అనంతరం చేసిన వ్యాఖ్యలు తెలంగాణా ఉద్యమకారుల మనసుపై కారుమబ్బులు కమ్మేట్టు చేసాయి. కాంగ్రెస్ ను బలోపేతం చేసే కొత్త ఎజెండాతో ముందుకు వస్తున్న ఈ దొరగారి ప్రణాళిక ఎప్పుడూ దొరసాని పాదాల చుట్టూ తిరుగుతూ వుండటం తీరని అవమానం. తప్పక దీనిని ఎదుర్కోవాలి. ఈ మోసకారి రాజకీయ ఊసరవెల్లిని ఉద్యమాల ఉధృతం ద్వారానే పడగొట్టాలి. అసలు ఈయన కాంగ్రెస్ ను బలోపేతం జేయడమేంటి? అదేమైనా బలహీనంగా వుందా? ఓట్లు గుంజుకునే కార్యక్రమం ద్వారా తను, తన కుటుంబాన్ని బలోపేతం జేసుకుంటున్న ఈ దళారీ దొరగాడి ఎత్తులను చిత్తు జేయకపోతే ముందు ముందు మరింత విద్రోహానికి వెనుదీయడు. ఇప్పటికే పలు వ్యాపార సంబంధాలతో, వాటిని కాపాడుకునే ఎత్తుగడలతో వున్న ఈయన జిత్తులమారితనాన్ని ఎండగట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఇది. ప్రజలంతా ఏకతాటిపై నిలిచి తమ ఆకాంక్షను ప్రస్ఫుటంగా ముందుకు తెస్తున్న వేళ తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠం ముందు తాకట్టు పెట్టే యత్నానికి ఒడిగట్టడం దారుణం. తప్పక వీడి ముక్కు నేలరాయాల్సిందే...

5, నవంబర్ 2010, శుక్రవారం

ఒబామా రాకను ఎందుకు వ్యతిరేకించాలి?

బారక్ ఒబామా ఎన్నికైన రోజున అందరి మనసులలో ఏదో మార్పు పట్ల ఆశ..
మూడో ప్రపంచ దేశాల ప్రజలలో తమ భవిత పట్ల ఏదో ఊరట..
తమ వాడిలా అగుపిస్తున్న మనిషి, మాటల మనిషే కాదు చేతల పనివాడుగా కలిగించిన ఓదార్పు కొద్ది రోజులకే నిట్టూర్పుగా మారింది..

రంగు కాదు అక్కడ తెల్లగృహంలోని సింహాసనం ఎవరి చేతనైనా అదే మీట నొక్కిస్తుంది అన్నది స్పష్టమైపోయింది త్వరలోనే..
తీవ్ర నిర్బంధాన్ని, ప్రపంచ వ్యాప్తంగా తమపై జరుగుతున్న దుష్ప్రచారానికి విరామం దొరికి తమ గూడు పదిలమవుతుందని ఆశించిన ముస్లిం ప్రజానీకం, పాలస్తీనా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశస్తులకు అమెరికా ఓ భూతంగానే మిగులుతుందని తొందరలోనే గ్రహింపుకొచ్చింది.

ఇంక భారతీయులకుః అణు పరిహార బిల్లుతో కొడి దీపంగా మిగిలిన సార్వభౌమత్వమనే ఊహ అడుగంటింది. వెన్నెముక లేని స్థానిక నాయకత్వం గుడ్డిగా తల ఊపి చంకలు గుద్దుకుంది. ఏ పక్షమూ ప్రజల పక్షం కాదని నిరూపించారు.

ఇక్కడి తమ ఐ.ఎం.ఎఫ్.ఏజెంటు నాయకత్వ పాలన కొనసాగుతున్న తీరును సమీక్షించడానికి వస్తున్నందుకు వ్యతిరేకిద్దాం...

తన అండతో ఇక్కడి ఉద్యమాలపై సాగుతున్న నిర్బంధాన్ని, ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నందుకు, అవినీతికి చట్టబద్దత కల్పిస్తున్న పాలకులకు వత్తాసుగా వస్తున్నందుకు వ్యతిరేకిద్దాం...

ఔట్ సోర్సింగ్ కు నో అంటు మనకు తలుపులు మూసినందుకు తప్పక గో బాక్ ఒబామా అనాలి..

లక్షల కోట్ల రూపాయల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొనేందుకే వస్తున్నాడని పేర్కొంటున్న మీడియా ఆ ఒప్పందాలు ఎవరికి లాభం చేకూరుస్తాయన్నది చెప్పక తమ అవకాశవాదాన్ని బయట పెట్టుకుంటున్నాయి. ఇప్పటికే సకల దరిద్ర దురదృష్ట జాతకులుగా వున్న వ్యవసాయ రంగాన్ని మరింత అడుగంటించే దానిలో భాగంగా విదేశీ వ్యవసాయ దిరుబడుల ఒప్పందాలను తిరగరాయడానికి వస్తున్న అధినేతను తప్పక వెళ్ళిపొమ్మందాం...

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పాలస్తీనా, ఇరాక్, ఇరాన్, టర్కీ, క్యూబా మొ.న దేశాలపై అమలవుతున్న తీవ్ర నిర్బంధం, మానవ హననం ఈయన గారి హయాంలో కూడా ఆగకుండా జరుగుతున్నందుకు...

చేతిలో అణుబాంబు మీట పెట్టుకొని ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, స్వేచ్చా స్వాతంత్ర్యాల గురించి వల్లించే ఈ దెయ్యాన్ని రావద్దందాం..

గోబాక్ ఒబామా గోబాక్..

28, అక్టోబర్ 2010, గురువారం

నలభై ఏళ్ళ తరువాత వర్ఘీస్ బూటకపు ఎన్ కౌంటర్ పై తీర్పు..
కేరళ లోని సి.బి.ఐ.కోర్టు నేడు వర్ఘీస్ బూటకపు ఎన్ కౌంటర్ పై తీర్పునిస్తూ నాటి డిఎస్పీగా పనిచేసి ఐ.జీ.గా రిటైరైన లక్ష్మణన్ కు యావజ్జీవ కారాగార వాస శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది.

నలభైఏళ్ళ క్రితం వర్ఘీస్ అనే కుఱవాడిని వాయనాడ్ అడవుల్లో చేతులు వెనక్కి కట్టి కాల్చివేసిన కేసుపై న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. ఇదే కేసులో ముద్దాయియైన విజయన్ అనే డిజీపిని benefit of doubt కింద విడిచిపెట్టింది. వీళ్ళిద్దరూ నాడు అనేక బూటకపు ఎదురుకాల్పులకు పాల్పడ్డారని, నక్సలైట్ ముద్రవేసి ఇంజనీరింగ్ విద్యార్థి రాజన్ నుకూడా మాయం చేసారన్న ఆరోపణలున్నాయి. నేటికి రాజన్ కేసు మిస్టరీగానే మిగిలింది. విజయన్ ను వదిలేయడాన్ని వర్ఘీస్ కుటుంబ సబ్యులు తప్పుబట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ.జీ.కి మరణదండనకు సిఫారసు చేసారంటే ఈయన గారి అధికార దుర్వినియోగం, కృరత్వం ఎంతో తెలుస్తోంది.

మన రాష్ట్రంలోనూ ఇలాంటి హత్యలకు పాల్పడిన వాళ్ళు అనేక వందలమంది వున్నారు. వాళ్ళకు ఆక్సిలరీ ప్రమోషన్ లిచ్చిన పాలక వర్గాన్ని కూడా తప్పక న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. న్యాయస్థానాలు ఇలాంటి కేసులను ఇన్ని సం.లు నాన్చడం వలన దోషులు కొంతమంది శిక్షనుండి తప్పించుకునే అవకాశం మెండు. ఈయన ఆదేశాలను పాటించిన CRPF constable చనిపోయాడు. అలాగే విజయన్ సరైన సాక్ష్యాలు లేవంటూ బయటపడగలిగాడు. వీళ్ళ గురించి రాజన్ తండ్రి రాసిన నాన్న అనే పుస్తకంలో చదవొచ్చు. వీళ్ళు ఎంతలా ఆనాడు బరితెగించారో ఆయన మాటలద్వారా తెలుస్తుంది. నాటి కేరళ ముఖ్యమంత్రి అచ్యుతరామన్ గురించికూడా.

ఇలాంటి కౄర పోలీసు అధికారులకు ఈ తీర్పు ఓ గుణపాఠం కావాలి.

ఎదురుకాల్పులపై హత్యాకేసు నమోదు చేసి న్యాయస్థానం విచారణ చేపట్టాల్సిన అవసరముంది.

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన జతిన్ దాస్ స్మృతిలో..తొలినాటి స్వాతంత్ర్య వీరులలో చెప్పుకోదగిన వారు జతిన్ దాస్. జైలులోని అసౌకర్యాలపై, అసమానతలపై పోరాడుతూ ఆమరణ దీక్ష చేస్తూ 63వ రోజు నాడు అమరుడైన ఏకైక ఖైదీ జతిన్ దాస్.

జతిన్ దాస్ కోల్ కతాలో అక్టోబర్ 27, 1904లో జన్మించారు. అనుశీలన్ సమితి అనే బెంగాలీ విప్లవ సంస్థలో పని చేసారు. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నారు. 1925 లో తను బి.ఏ.చదువుతున్నప్పుడు తన రాజకీయ అభిప్రాయాలపై బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి మెమెన్సింగ్ జైలులో ఉంచగా నాటి జైలు పరిస్థితులపై ఆమరణ దీక్ష చేయగా జైలు సూపరింటేండెంట్ క్షమాపణ చెప్పడంతో ఇరవై రోజుల తరువాత దీక్ష విరమించారు. ఆ తరువాత షహీద్ భగత్ సింగ్ నకు బాంబు తయారు చేసిచ్చిన కారణం చూపి లాహోర్ కుట్రకేసులో జూన్ 14, 1929న అరెస్ట్ చేసారు.

నాటి లాహోర్ జైలులోని ఘోర పరిస్థితులపై మిగతా విప్లవకారులతోపాటు తాను జూలై 13, 1929 నాడు మొదలుపెట్టిన ఆమరణ దీక్షను పట్టుసడలకుండా చివరివరకు కొనసాగించి, తీవ్రనిర్బంధ పరిస్థితులనెదుర్కొని సెప్టెంబర్ 13, 1929 న అమరుడైనాడు. ఆయన పార్ఠివ దేహాన్ని లాహోర్ నుండి కలకత్తాకు రైలులో తరలించగా వేలాది జనం నీరాజనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. జతిన్ దాస్ అంధించిన పోరాట స్ఫూర్తిని నేటి యువతరం అందిపుచ్చుకొని దేశం కోసం నేడు మరో స్వాతంత్ర్య పోరాటాన్నే జరపాల్సి వుంది. ఆయన జన్మదినం నిన్న జరుపుకొని నివాళులర్పించిన అనేక మంది యువతరానికి కృతజ్నతా పూర్వకంగా ఈ సంస్మరణ..

ఆమరణ దీక్షకు, పోరాట స్ఫూర్తికి నిర్వచనమైన కా.జతిన్ దాస్ అమర్ రహే..

10, అక్టోబర్ 2010, ఆదివారం

తెలంగాణా దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ఫ్రంట్ ను ఆహ్వానిద్దాం..డిసెంబరు 9 ప్రకటనతో తెలంగాణా వచ్చేసిందన్న భావం ఏర్పడి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్న ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆంధ్రా లాబీయింగ్ కు తలొగ్గి శ్రీక్రిష్ణ కమిటీ పేరుతో చిదంబరంగారు సృష్టించిన మాయలో పడి ఉమ్ములో చిక్కుకున్న ఈగలా మారిన తెరాస వైఖరితో అనేకమంది విద్యార్థి యువజనుల ఆత్మ బలిదానాలను బలిపెట్టే విధంగా మార్చిన అన్ని రాజకీయ పక్షాల దొరతనాలకు వ్యతిరేకంగా ప్రజా యుద్ధ నౌక, తెలంగాణా పోరుబిడ్డ గద్దర్ నేతృత్వంలో ముందుకు వచ్చిన తెలంగాణా ప్రజా ఫ్రంట్ నాలుగు కోట్ల మంది ఆశలకు అణగారిన ప్రజల ఆశలకు కొత్త వూపిరిలూదగలదన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.

డిసెంబరు తరువాత భూకంపాల్ని సృష్టించేస్తాం, అంతవరకు కడుపుబ్బరాన్ని అట్టిపెట్టుకోండని మాయ మాటలు చెపుతున్న కె.సి.ఆర్.నమ్మకద్రోహాన్ని ఉతికి ఆరేయాల్సిన సమయంలోనే ఫ్రంట్ ముందుకు రావడం హర్షణీయం. దీక్షను మధ్యలో వదిలేసి మోసం చేయబోతే విద్యార్థిలోకం తెగించి పోరాడడంతో వెలువడిన డిసెంబరు 9 ప్రకటనను అమలు చేయించాల్సిన తరుణంలో కాంగ్రెస్ కు ముఖ్యంగా కేంద్రంలోని నాయకత్వంనకు అడుగులకు మడుగులొత్తే విధంగా తయారై, పచ్చి సమైక్య వాది జగడపాటికి ఐ లవ్ యూ చెప్పడంవంటి వ్యాపార భాగస్వామ్య జిత్తులమారితనంతో, తన దొర దర్పం ప్రదర్శించాలనుకుంటున్న కె.సి.ఆర్.కు చెక్ పెట్టడానికి ఈ ఫ్రంట్ ఉద్యమించాలని కోరుకుందాం.

నాకు ఆంధ్రా, తెలంగాణా రెండు కళ్ళు, వ్యాపారాలకు సమైక్యాంధ్ర మూడో కన్నులాంటి ప్రకటనలతో ముందుకుపోతున్న బాబు కూటమి కుయుక్తులను అడ్డుకోవాల్సిన అవసరముంది. తెలంగాణా కోసం అమరులవుతున్న విద్యార్థి, యువజనుల పట్ల కనీస సానుభూతి లేని కాంగ్రెస్ లీడర్లు, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించనని మొండిగా వున్న హోం మంత్రిని నిలదీయాల్సిన వారు ఇప్పుడు అమరులకు సాయమందించే పేరుతో దొంగ ఏడుపులేడుస్తున్న మూడు రంగుల పంచెగాళ్ళను మెడలు వంచాల్సిన అవసరముంది.

ఖచ్చితంగా తెలంగాణా ఎం.పీలందరిచే రాజీనామా చేయిస్తే కేంద్రం దిగివచ్చి పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశముందన్న దానిని పక్కకు పెట్టి, మొన్నటి ఉపఎన్నికలలో ప్రజల తీర్పును గుర్తించే విధంగా పాలకులపై వొత్తిడి తెచ్చే ఉద్యమాన్ని చేపట్టక నిద్దరోతున్న రాజకీయ బేరగాళ్ళను ప్రజాకోర్టుల ముందుంచాల్సిన విధంగా ఉద్యమించి తెలంగాణా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి సమైక్యంగా ఉద్యమించి, తమలో వున్న భేదాభిప్రాయాలను చిన్నవిగా గుర్తించి ముందుకు పోవాలని ఆశిద్దాం. బహిరంగ వేదికలపై తమ అభిప్రాయ భేదాలను ప్రదర్శించకుండా కట్టడి చేయాల్సిన అవసరముందని విజ్నప్తి చేస్తున్నాం.

రండి కలసి పోరాడాడాండి..

4, అక్టోబర్ 2010, సోమవారం

కుష్టు దేహంపై తెల్ల వస్త్రం ఎంతకాలం కప్పగలవు???

కామన్ వెల్త్ క్రీడల నిర్వహణలో భాగంగా ఢిల్లీ నగరంలోని సుమారు అరవై వేలమంది బిచ్చగాళ్ళను, ఫుట్ పాత్ వ్యాపారులను దూరప్రాంతాలకు తరలించారన్న వార్త పట్ల వివిధ స్వచ్చంద సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలలో కేవలం 2,2oo మందికి మాత్రమే వుండేందుకు వీలుంది. మిగిలిన వారిని బలవంతంగా రైళ్ళు ఎక్కించి పక్క పట్టణాలకు తరలించారు. దీనిపై మానవహక్కుల కార్యకర్తలు ఇలా స్పందించారు "నగర సుందరీకరణ, పట్టణ పునరుద్దఱణ కార్యక్రమాల్లో భాగంగా బిచ్చగాళ్ళను తరలించే పధకాన్ని అమలు చేశారు. అధికారులు తొలుత పేదవారిని నేరస్తులుగా చేశారు. తరువాత వారిని కనపడకుండా చేశారు.'' అని ఐజిఎస్‌ఎస్‌ఎస్‌కు చెందిన సింగ్‌ తెలిపారు. ''ఇది చాలా విచారించదగ్గ పరిణామం. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక పౌరుడు నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలిపొమ్మని నీవు ఎలా వత్తిడి తెస్తావు? ఇది నగర పౌరుని ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే.'' అని ఆయ అన్నారు".

ఈ దేశంలో ఇది కొత్త కాదు. చంద్రబాబు పాలనా కాలంలో బిల్ క్లింటన్ పర్యటన సమయంలో కూడా రోడ్లపక్కనున్న కాలువలపై కూడా తెల్లని వస్త్రాలు కప్పి తమ కుళ్ళును దాచే ప్రయత్నం చేసారు.

పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించే పనిలో విఫలమై ఇలా పై పూతల ద్వారా ఇతర దేశాలవారి ముందు గొప్పలకోసం తంటాలు పడుతున్న మన అంతర్జాతీయ స్థాయి ఆర్థిక నిపుణులైన పాలకుల వారు తమ తెల్లబారిన గెడ్డాలకు రంగువెసినంత మాత్రాన ముడుతలు పడ్డ చర్మాన్ని కప్పుకోగలరా? ఈ కుష్టు రోగాన్ని తెల్ల బట్ట మాటున ఎన్నాళ్ళు దాయగలరు? అసలు ఈ దేశ ఆర్థిక పరిస్థితి గురించిగాని, నగరాల కంపు బతుకుల గురించి విదేశీయులకు తెలియదా? ఇంత సిగ్గుపడుతూ వీటిని నిర్వహించాల్సిన అవస్రమేమొచ్చింది?

క్రీడల నిర్వహణకు తగలేసిని డబ్బుతో వీరందరికీ పునరావాసం కల్పిస్తే ఎంత సంతోషించేవారు?


వార్త ఆధారంఃhttp://www.visalaandhra.com/national/article-25928

30, సెప్టెంబర్ 2010, గురువారం

హిందూ రాజ్యం!ఇది ముమ్మాటికీ హిందూ రాజ్యంగా నేటి తీర్పుతో ఋజువయ్యింది.

ఓ చారిత్రక కట్టడాన్ని కూల్చివేసినాక, దాని పునాదులు పరిశీలించి అక్కడ ఆనవాళ్ళున్నాయని తీర్పు చెప్పిన ఏకైక న్యాయస్థానం ఎవరికి ప్రాతినిథ్యం వహిస్తుందో చెప్పకనే చెప్పింది..

ఇంక రాజ్యాంగంలో రాసుకున్న లౌకికతత్వం చెరిపేసినట్లయ్యింది...

జరిగిన సంఘటన పట్ల ఏ దృక్పధమూ వ్యక్తం చేయకుండా వేలపేజీలలో పోసిన సిరా రాతలలో ఒక్క పదమైనా గాయపడ్డ హృదయానికి స్వాంతన చేకూర్చేది లేదు కదా? ఇది మరీ అత్యాశేమో?

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఎందుకీ శాంతి జపం?


మనమున్నదిప్పుడు రోజుకో దినాన్ని జరుపుకోవడానికిలా వుంది. లేని దానిని వూహించుకొని భ్రమలలో జీవించడానికి కాకపోతే ఇలా శాంతిదినం, ప్రజాస్వామ్య దినం అంటూ జరుపుకోవడమేమిటి. ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య వైషమ్యాలు పెంపొందింపజేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న అగ్రరాజ్యానికి వంతపాడే UNO ఆఖరుకు శాంతికోసం ఓ దినాన్ని జరుపుకోమనడం ఎంత దౌర్భాగ్యం. హాయిగా గుండెలమీద చేయి వేసి పడుకొనే మనిషి ఎక్కడా కనబడని రోజులివి. దిన దిన గండం నూరేళ్ళాయుష్షులా మనమధ్య పేరుకుపోతున్న అభద్రతా భావానికి కారకులైన వారే శాంతికోసం ప్రతినలుబూనండి, ప్రార్థనలు చేయమనడం హాస్యాస్పదం కాదా? శాంతి ఎలా లభ్యమవుతుందో తెలియదా? మన మధ్యనున్న శాంతిని దూరం చేస్తూ ఏమీ ఎరగనట్లు పాలక వర్గాలు మనలను భ్రమలలో ముంచెత్తుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కావాల్సిన సమతను దూరం చేస్తూ ఏ కొద్దిమందో కోట్లకు పడగలెత్తే కార్యాచరణకు పూనుకొని, దానిని వ్యతిరేకించి సమన్యాయం, సమవాదం, నిజమైన స్వేచ్చా స్వాతంత్ర్యాలకోసం పరితపించే వారిపై ఉక్కుపాదం మోపుతూ, అలజడులకు, ఆందోళనలకు కారకులవుతూ శాంతి జపం చేసే ఈ గోముఖ వ్యాఘ్రాలను సంఘటితంగా ఎదుర్కోకపోతే నిజమైన శాంతి ఎప్పటికీ రాదు అన్నది సత్యం కాదా?

16, సెప్టెంబర్ 2010, గురువారం

మసీదును పునర్నిర్మించలేమా?9/11 సంఘటన తరువాత ఆ ప్రాంతంలో మసీదును పునర్నిర్మించిన అమెరికా ప్రజల ఔదార్యం మనలో ఎందుకులేదు? హిందువులుగా చెప్పుకునే ఓ అరాచక గుంపు బాబ్రీ మసీదును కూలగొట్టి ఇన్నినాళ్ళ తరువాత కూడా అక్కడ మసీదును పునర్నిర్మించలేని మనది మత సామరస్యం కల దేశంగా చెప్పుకోగలమా? ఆ సంఘటనతో దేశంలో పెరిగిన అభధ్రతా భావం ఎలాంటి దారుణ పరిస్థితులకు దారితీసిందో మనకందరికీ అవగహన లేదా? ఒక వర్గంపై పెరిగిన దాడులు, తదనంతర పరిణామాలు ఎంతటి అల్లకల్లోలాన్ని, అంతర్గత వైరుద్యాలకు గురిచేసిందో తెలిసినదే? అయినా మతాన్ని ఎవరికి వారు అనుసరించే మార్గంగా వదిలేయకుండా దానిని ఓటు బ్యాంకుగా వాడుకోజూస్తున్న రాజకీయ పార్టీల వలన కలుగుతున్న అంతర్గత అభద్రతా భావం మనుషుల మధ్య ఎడం పెంచిందే తప్ప సామరస్యం మాటలకే పరిమితం చేయడం నిజం కాదా? కావున కూలగొట్టిన చోట వారి ప్రార్థనా మందిరాన్ని పునర్నిర్మించి భారతీయతను చాటుకోలేమా? ఈ నా శీర్షికే చాలా కోపం తెప్పించి వుండొచ్చు. కానీ ఓకమారు పునరాలోచించగలమేమోనని...

13, సెప్టెంబర్ 2010, సోమవారం

పాకిస్తాన్ విప్లవతేజం కా. నజీర్ అబ్బాసి
విప్లవకారులను ఏ దేశ ప్రభుత్వాలైనా ఒకేలా హత్య చేయడం ఇక్కడ చూడొచ్చు. పాకిస్తాన్ నియంత జియావుల్ హక్ కాలంలో ఐ.ఎస్.ఐ. ఏజెంట్లచే అరెస్ట్ చేయబడిన షహీద్ నజీర్ అబ్బాసీ వారి చిత్రహింసలకు గురై ఆగస్ట్ 9 1980 వ సం.లో వాళ్ళ కస్టడీలో మరణించారు. ఆయన దేహమంతా పగిలిన సీసాతో పొడిచి హింసించిన గుర్తులున్నాయి. బెలూచిస్తాన్ లో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించిన నజీర్ మరణానంతరం డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆవిర్భవించింది. ఆయన అరెస్టుకు మరణానికి కారణమైన నాటి ISI అధికారి బ్రిగేడియర్ ఇంతియాజ్ బిల్లా పై అక్కడ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం FIR నమోదు చేసి విచారణ జరపడానికి చర్యలు తీసుకున్నా బెనజీర్ కాలంలో కొంత ముందుకు నడిచినా అది ఆ తరువాత కొనసాగలేదు. ఇప్పటి ఆర్మీ జనరల్ కియానీ తదితరులు అడ్డుకొన్నారు. నజీర్ కుటుంబాన్నంతటినీ అరెస్టుగావించారు. ఆయన సహచరి ఈ కేసును తిరిగి విచారణ చేపట్టవలసిందిగా నేటి సుప్రీం న్యాయమూర్తిని కోరుతోంది. సింధ్ ప్రాంతంలోని వామపక్షవాదులంతా గత సం.భారీ ర్యాలీ నిర్వహించారు.

రాజ్యం ఎక్కడైనా ఒకేలా ప్రవర్తిస్తుందనడానికి ఇదో తార్కాణం. జుల్ఫికర్ అలీ భుట్టో కాలంలో కూడా ప్రభుత్వం అనేకమంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడమో, మాయం చేయడమో చేసిందని నజీర్ చెప్పారు.

చర్చలకు ఆహ్వానిస్తూ కా.ఆజాద్ ను హత్యచేసిన చిదంబరం అండ్ కో ఇప్పటికీ జవాబు చెప్పే స్థితిలో లేదు. ప్రజాస్వామ్య ముసుగులో కొనసాగుతున్న నయా వలస రాజ్యం నుండి ఇంతకంటే జవాబుదారీతనం ఆశించగలమా?

ఇక్కడ Com.Nazir Abbasi పై JNU Prof.చమన్ లాల్ గారి నోట్సు చదవగలరు..

Comrade Nazir Abbasi Shaheed
by Jadam Sindhu on Sunday, September 12, 2010 at 2:19pm

Comrade Nazir Abbasi fell to brutal ISI torture on August 9, 1980, during the regime of military dictator Ziaul-Haque.

Comrade Nazir Abbasi is one of the icons of communist movement in Pakistan. He was born on April 10, 1953, in a lower middle class family at Tando Allahyar in Sindh. In his early youth, he joined a hunger strike of Baldia Employees Union at Tando Allahyar and was arrested for it. During his jail days, he came in contact with CPP general secretary Jam Saqi, Dr Aizaz Nazir, Professor Jamal Naqvi and some other progressive intellectuals, and became a communist.

Comrade Nazir was one of the key figures behind the Patt Feeder peasant movement in Balochistan in 1976, organising and educating the local people about how to resist the local landowners who were out to displace them from the lands they had been cultivating for decades. The resistance also paved the way for agricultural workers’ and sharecroppers’ unity, leading to the formation of Balochistan Bazgar Committee, on the pattern of the Sindh Hari Committee.

In the same year, Nazir became vice president of the Pakistan Federal Union of Students, with Raziq Bugti (later assassinated) as its president. In this capacity, Nazir played a seminal role in the unity of students and his efforts bore fruit when a number of student organisations --- the Sindh National Students Federation, Baloch Students Organisation and Pakhtun Students Federation, among others --- agreed to form a single united forum of progressive students. This was what came to be known as the Democratic Students Federation (DSF) later --- established shortly after Comrade Nazir’s martyrdom.

On July 4, 1977, after the dismissal of the Z A Bhutto government, usurper General Ziaul-Haque proclaimed Martial Law in the country, which involved complete ban on political parties and suspension of constitutional rights. In a letter addressed from underground to the delegates of a students convention in 1979, Nazir Abbasi wrote: “General Ziaul-Haque is terrified by the people’s consciousness and believes that like Iran, the people’s power may also defeat the dictatorship in Pakistan.”

Before his last arrest, Comrade Nazir had spent a good part of his adult life in prison under the notorious Defence of Pakistan Rules.

On July 30, 1980, Nazir was arrested from Karachi, while he was underground, along with his friends Suhail Sangi (now a journalist), Badar Abro and Kamal Warsi. The ISI mercenaries then took him to a military interrogation camp in Mauripur and brutally tortured him for running a campaign against dictatorship. In the ISI torture camp, Nazir breathed his last on August 9, 1980, when he was only 27. The extent of the torture meted out to him was testified by an official of the Edhi Foundation, who said Nazir Abbasi’s dead body had so many injuries that it seemed as if someone had attacked every part of his body with a broken glass bottle.

Comrade Nazir was buried in the Sakhi Hasan graveyard in Hyderabad Sindh.

These assassins were led by Brigadier Imtiaz Billa, then a colonel and in charge of the ISI operations in Sindh. Billa had been infamous for having started a period of extreme torture of political workers in Sindh.

Addressing a press conference at the Karachi Press Club on August 8, Comrade Nazir’s widow, Begum Hamida Ghangro pointed out how Brigadier Billa is still roaming at large, flaunting his credentials about torturing many Sindhi and Baloch political workers to death. Professor Jamal Naqvi and Kamal Warsi, who were arrested at that time along with Nazir Abbasi, accompanied her. Begum Hamida said the likes of Billa and his cruel ISI subordinates continue to hunt the Sindhi and Baloch political workers even today, and they can be taught a suitable lesson by bringing Billa and his associates to justice.

One notes that when Ziaul-Haque, angry over the moves to unify the students movement, ordered Nazir Abbasi’s arrest, Begum Hamida Ghanghro was already in jail.

Begum Hamida also recalled that the Pakistan Peoples Party (PPP) had once made the promise to bring to justice all the culprits who had killed Nazir Abbasi. Though an FIR was filed on August 17, 1980, an investigation started much later. The court case commenced during the last stint of Benazir Bhutto’s rule, but the proceedings stopped after a few hearings and then the issue was put on the backburner when her regime was toppled. Now it seems that the leaders of the PPP have conveniently forgotten her promise. The general belief is that any attempt to get Billa and others punished would evoke protest from General Kiyani and several others.

On the 30th anniversary of Comrade Nazir Abbasi’s martyrdom, progressive political workers also recalled how even the Zulfiqar Ali Bhutto’s regime had jailed scores of student leaders and did not spare their family members either. In case of Nazir Abbasi himself, when the police failed to apprehend him for months together, Bhutto’s regime got imprisoned Comrade Nazir’s mother, father, brothers and sisters in Tando Allahyar Jail.

Addressing the press at Karachi, Begum Hamida also made an appeal to the Chief Justice, Iftikhar Mohammad Chaudhari, to take suo moto action on the 1980 FIR.

(This note is originally written by Prof. Chaman Lal,Jawaharlal Nehru University, New Delhi, India).
http://www.demotix.com/news/leftists-sindh-demand-reopening-nazir-abbasis-murder-case

2, సెప్టెంబర్ 2010, గురువారం

ఇంతకీ ప్రతిపక్షం ఎవరు?మొన్నటి అణు పరిహార బిల్లు ఆమోదించడంలో కాంగేయులు, కాషాయులు
ఒకరిపై ఒకరు పోటీ పడి బిల్లును ఆమోదించారు. ఏదో ప్రజల పక్షాన మాట్లాడినట్లుగా నాలుగు రోజులు అది మార్చి, ఇది మార్చి అని చెప్పుకొని చివరకు పెద్దగా ఏ మార్పూ లేకుండానే అమెరికోడు గీసిన గీత మధ్యలో నిలబడి జోహార్ హుజూర్ అన్నారిద్దరూ. ఈ మద్యలో సందట్లో సడేమియాలాగా సిపిఎం నేతలు ఇలాంటి బిల్లులను నిర్ద్వందంగా వ్యతిరేకించాల్సింది పోయి పరిహారం వేలకోట్లలోకి పెంచమని విన్నపాలు వినిపించారు. ఎలాగూ వీరి ఓటుతో పనిలేదు కాబట్టి ఎవడూ వినిపించుకోలేదు. ఈ బిల్లు వలన విదేశీ సంస్థలు మన దేశంలో అణువ్యాపారానికి అడ్డంకులు తొలగించుకున్నాయి. మన దురదృష్టంకొద్దీ ఏమైనా జరిగితే భోపాల్ లో లాగా అతి తక్కువ పరిమణంలో పరిహారాన్ని దులపరించి పోవచ్చు. అసలు ప్రాణలరించేది, పర్యావరణాన్ని విపరీతంగా దెబ్బతీసేది, మానవాళి ఉనికికే ప్రమాదకరమైన అణువ్యాప్తికి ఇలా ఆమోదముద్ర వేయడం ఎవరి ప్రయోజనాల కోసం? ఇన్నాళ్ళుగా ఏదో విధంగా బతుకీడుస్తున్న జనావళికి ఈ కొత్త ముప్పును గుండెలపైకి తెచ్చారు. భోపాల్ దుర్ఘటన తరువాత ఆ విదేశీయునికి చంకల్లోకెక్కించుకొని సాగనంపిన ఈ పాలకులు మన ప్రాణాలకు ఎలా బాధ్యత వహిస్తారని ఆశించగలం?

అందుకే వీళ్ళకి మనమే నిజమైన ప్రతిపక్షం కావాల్సిన అవసరమెంతయినా వుందన్నది అందరికీ గ్రహింపులోకి రావాల్సి వుంది..

26, ఆగస్టు 2010, గురువారం

రాహుల్జీ మీకు మా సోంపేట అగుపడలేదా?Upcoming Prime Minister రాహుల్జీ తమ ద్వంద్వ వైఖరిని ఇలా వెల్లడించుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన అలీఘడ్ కాల్పులపై స్పందిస్తూ రైతులకు అన్యాయం జరిగిందని వారిని సముదాయించే ప్రయత్నం చేసారు. ఇవాల్టికివాల ఒడిస్సా లోని నియాంగిరీ కోంధ్ లగురించి అభిమానంగా మాట్లాడుతూ తాను ఢిల్లీలో వున్న వారి సైనికుడిగా ప్రకటించుకున్నారు. ఇంతవరకు బాగానే వుంది. దీనిలో తప్పు పట్టడానికేమీ కనిపించదు. కానీ ఈ రెండు రాష్ట్రాల ఏలికలు ప్రతిపక్ష పార్టీవారు. అక్కడ తమ పార్టీ లేకపోవడంతో ప్రజల పట్ల ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందీ యువరాజుగారికి. అదే మన రాష్ట్రంలో ఇటీవల జరిగిన సోంపేట రైతులపై కాల్పులపై ఎందుచేత స్పందించలేదో సారూ. తమ పార్టీ అధికారంలో వున్న దగ్గర ప్రభుత్వ వైఖరిపై కూడా ఇలానే స్పందిస్తే అభినందనీయులే..
source:http://ibnlive.in.com/news/rahul-reaches-hotbed-of-vedanta-controversy/129631-37.html

24, ఆగస్టు 2010, మంగళవారం

షహీద్ రాజ్ గురును స్మరించుకుందాంఈ రోజు షహీద్ రాజ్ గురు జన్మదినం. భారతదేశ విముక్తి కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి అర్పించిన నాటి యువకిశోరాలను స్మరించుకొనడం నేటి తరం బాధ్యత. వారి త్యాగాలను మరువకుండా వుండటం ద్వారా మనల్ని మనం నిరంతరం చెక్ చేసుకునే ఓ కార్యం గుర్తెరిగి వుంటుంది. వారి ఆశయాలు నేటికీ సజీవంగా వుండి, వారి పోరాటాన్ని కొనసాగించుతూన్న నేటితరం వారిని అక్కున చేర్చుకోవడం వారికి నిజమైన నివాళి.

జోహార్ కా.రాజ్ గురు..
ఇంక్విలాబ్ జిందాబాద్..

23, ఆగస్టు 2010, సోమవారం

కర్కరేను చంపిందెవరు?

ముంబయి దాడుల సంఘటనలో హత్యగావింపబడిన ATS chief కర్కరేను చంపిందెవరో ఓ ముంబయి మాజీ పోలీసధికారి ఈ పుస్తకంలో చర్చించారు. ఆ పుస్తకంపై సమీక్షను ఇక్కడ చూడవచ్చు. నిజానికి భారతదేశంలో టెఱరిజాన్ని పెంచి పోషిస్తున్నదెవరో దీని ద్వారా అర్థమవుతుంది. వర్ణవ్యవస్థ వేళ్ళు పాలకవర్గాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అవగతమవుతుంది. ఓ నిజాయితీగా పనిచేసిన అధికారికి దక్కిన పురస్కారం చావు. ఇది మింగుడుపడడం కొంత కష్టమైనా ఏదీ పట్టించుకోని నేటి తరానికి ఇది ఓ సామాన్య విషయమే కావచ్చుననుకుంటా!
Who Killed Karkare? The Real Face Of
Terrorism In India

By M Zeyaul Haque

26 October, 2009
The Milli Gazette

Who Killed Karkare? The Real Face Of Terrorism In India
Author: SM Mushrif
Price: Rs 300/ USD 25
Pages: 319
Publisher: Pharos Media (www.pharosmedia.com), New Delhi

A new book curiously titled Who Killed Karkare? says a nationwide network of Hindutva terror that has its tentacles spread up to Nepal and Israel is out to destroy the India most Indians have known for ages and to remould it into some kind of Afghanistan under the Taliban.

The writer, a former IG Police of Maharashtra, SM Mushrif, has reconstructed a fearsome picture out of former Maharashtra ATS chief Hemant Karkare’s chargesheet against alleged Hindutva terrorists like Lt. Col. Purohit, Sadhvi Pragyasingh Thakur and others.

The chargesheet pointed towards a mind-boggling nationwide conspiracy with international support to destabilise the constitutional order and the secular democratic Indian state that upholds it, to be replaced by a Hindutva state run according to a new Constitution. For that the conspirators were prepared for a massive bloodbath, using bomb attacks on religious places to trigger an anti-Muslim holocaust.

Mushrif, who has over three decades of diligent policing behind him and whose feats include exposing the Telgi scam, has made an elaborate case out of nearly a dozen blasts over a large area of the country conducted by Hindutva terror groups of different stripes. His case: a section of India’s intelligence services, a miniscule group in the armed forces and a section of different state police forces have been compromised and infiltrated by these elements, a development that bodes ill for the future of the country.

In Hemant Karkare’s net (of investigations, of course) many big and small fishes of VHP, RSS, Bajrang Dal and Sanatan Sanstha (which has been found to be involved in Diwali-eve blasts in Goa last week) had been trapped. Serving and retired army officers, academics, serving and retired officials of India’s premier intelligence service were ensnared in Karkare’s fishing net. The menacing power of the latter groups, inspired by sustained anti-Muslim hate campaigns of the last six decades, gave the plot a sinister and highly destructive character.

Among the plans unearthed by Karkare was a blueprint for the assassination of 70 prominent Indians who could by a hindrance to the project of Hindutva. Interestingly, most of the persons marked for elimination would, naturally, be Hindus because it is they who primarily run the dispensation. The conspirators were also unhappy with organisations whose Hindutva they suspected to be less virulent than desired.

Mushrif, who very well knows the power of the Intelligence Bureau (IB) to make or mar lives and careers, says he is prepared to face the consequences of hostility of this power hub. He musters “evidence” to show that the IB has regularly been interfering with regular police investigations to let Hindutva terrorists slip out of the net and replace them with random Muslim youth. To fudge the issues further obliging police officers in the states would not mind exterminating a few Muslim youth to be branded posthumously as “terrorists”.

There are quite a few number of such cases where such extra-judicial killing of Muslim youth has turned out to be false police encounters. All this is done to cover tracks of Hindutva terror. Mushrif says a “Brahminist” network that has its origins in Maharashtra, and is closely knit across political parties, government services, including IB, and other vital sectors of life is behind the terror that seeks to destroy the secular, democratic state. He hastens to clarify that very few Brahminists are Brahmins. Many are from other high Hindu castes, some from middle and lower castes.

Most Brahmins are fair-minded and would not like to associate themselves with hate ideologies. Hemant Karkare, too, was a Brahmin, Mushrif says. So is Mushrif’s son-in-law.

It is pertinent to note that “Brahminism” and “Brahminical order” first appeared in Dalit protest vocabulary in the Dalit uprising movement in Maharashtra towards the turn of the 20th century. Mushrif, who appropriates part of this vocabulary for the present discourse, says that Maharashtra still remains the centre of this ideology that, among other things, has the dubious distinction of killing the Father of the Nation.

The power establishment that really runs the affairs of this country (Mushrif says it is not Sonia Gandhi, Manmohan Singh or Rahul Gandhi) does not want to expose the Hindutva terrorists. One example is the blasts in Samjhauta Express, which the IB said was carried out by Pakistan’s ISI. Mushrif quotes a report in The Times of India that said, “the Centre had blamed the ISI on the basis of the IB’s findings.” However, during a narco-analysis test under Karkare, Lt. Col. Purohit had admitted having supplied the RDX used in the blast. The IB, which draws its power from its proximity to the Prime Minister (its director briefs the PM every morning for half an hour), did not want Karkare’s investigation that blew the cover off the IB’s shenanigans, to continue.

Once Karkare was removed from the scene, the IB moved in to fill his position with KP Raghuvanshi, a pliant police officer with extremely low credibility among Muslims for his record of letting off known Hindutva terrorists and implicating innocent Muslim youth even in bomb attack cases on mosques.

There are quite a few interesting vignettes here, like Raghuvanshi and Col. Purohit’s association with Abhinav Bharat in Maharashtra, whose hand was evident in a series of blasts across the country. It has old connections with men like Veer Damodar Savarkar (whose relative Himani Savarkar leads the Abhinav Bharat movement), Dr Munje, who led the Hindu Mahasabha, and other Hindutva luminaries. It is at the Bhonsala Military Academy run by these groups that Purohit trained police officers, including Raghuvanshi. Mushrif asks a pertinent question: Will Raghuvanshi pursue the investigation against Purohit, his guru? A plausible answer is, perhaps no. Already charges have been dropped by a special court under MCOCA against 11 accused, including Purohit, on the grounds of insufficient evidence produced in the court by the prosecution.

This was just the beginning of the undoing of Karkare’s painstaking investigation. Mushrif says slowly the system is working to undo all of Karkare’s work and let off the terrorists who over the years destroyed scores of lives and wreaked irreparable economic damage. The ATS team under Karkare had pointed out VHP leader Praveen Togadia’s role in the blasts. The ATS under Raghuvanshi dropped the investigation against him saying (please hold your laughter) they do not know who Togadia is!

A number of investigations have been thus sabotaged by the powers that be and the tracks of the Hinduta terrorists duly covered. The 319-page book is crammed with such information.

But what about who killed Karkare? Mushrif says two teams were at work on 26/11 – one which did the maximum damage, and was from outside. The smaller team took advantage of the confusion of the moment and acted only on the relatively small CST-CAMA-Rangbhavan stretch that killed Karkare. It was a desi unit that wanted Karkare and his men out of the way.


source: http://www.countercurrents.org/haque261009.htm

20, ఆగస్టు 2010, శుక్రవారం

రాజీవ్ గాంధీ - శ్రీలంక తమిళులురాజీవ్ గాంధీ ప్రథాన మంత్రిగా తీసుకున్న నిర్ణయాలలో ఆత్మహత్యాసదృశ్యమైనది Indian Peace Keeping Force to Sri Lanka. ఎందుచేతనంటే అక్కడి తమిళుల పట్ల లంకేయ పాలక వర్గం దాష్ఠీకానికి వ్యతిరేకంగా కొన్ని దశాబ్ధాలుగా జరుగుతున్న రాజకీయ, సైనిక పోరాటాలపై భారత దేశం మద్ధతుగా నిలబడాల్సింది పోయి వారిపైకి సైన్యాన్ని పంపడం చరిత్రలో క్షమించరానిదిగా మిగిలిపోయింది. దీని ద్వారా అక్కడి తమిళ ప్రజలలొ భారత్ పై నెలకొన్న నిరసన ఆ తరువాత రాజీవ్ హత్య వరకు దారితీసింది. IPKF ను పంపించడం ద్వారా ఉపఖండంలో పెద్దన్న పాత్ర పోషించడానికి, తద్వారా తమ చుట్టూ వున్న చిన్న దేశాలలో తామంటే ఒక రకమైన భయాన్ని నెలకొల్పడానికి వాడుకోజూడడం రాజకీయంగా తీవ్రమైన నిర్ణయం. మన ప్రజాస్వామ్య ముసుగులోని చినుగును బయటపెట్టింది. వెళ్ళిన సైన్యం అక్కడ ఒడిగట్టిన దారుణాలు ఎంత తీవ్ర పరిణామాలకు దారితీసాయోనన్నది ఓ గుణపాఠం. తమిళుల ఇళ్ళను తగలబెట్టడం, స్త్రీలను అత్యాచారానికి గురిచేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, యువకులను హత్యగావించడం ద్వారా స్వజాతి జనులపైనే ఇలాంటి Genocide కు పాల్పడ్డ దేశంగా మిగిలాం. ఈ దారుణ సైనిక అకృత్యాల తరువాత LTTE మరింత సైనికంగా బలపడింది. ఆ తరువాత అమెరికా, ఇజ్రాయెల్, భారత్ ల సైనిక సహకారంతో ఏడాది క్రితం వాళ్ళు సైనికంగా ఓడిపోయుండొచ్చు. కానీ వారి మనసులపై ఏర్పడ్డ గాయం మాననిది.

16, ఆగస్టు 2010, సోమవారం

ప్రజల ప్రాణాలరిస్తే పతకాలుఇటీవల సోంపేటలో అకారణంగా ప్రజల ప్రాణాలరించిన పోలీసులకు ఉత్తమ పోలీసు అధికారులుగా అవార్డులిచ్చారంటే పాలక వర్గం ఎవరి పక్షాన వుందో అర్థం చేసుకోవచ్చు. గొడవంతా సద్దుమణిగి ప్రజలు తిరుగు ముఖం పడుతున్న సమయంలో సోంపేట ఎస్.ఐ. కాల్పులు జరిపినట్లు ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయనకు, సి.ఐ.కు మరి 11 మంది అదే స్టేషన్ పోలీసులకు ఉత్తమ అధికారులుగాను, శ్రీకాకుళం జిల్లా అవార్డులలో సగం వరకు టెక్కలి డివిజన్ వాళ్ళకే ఇచ్చారంటే ఈ కాల్పులు, గొడవలకు పాలకుల వత్తాసు వున్నదని అర్థమవుతోంది. ప్రజలపై అణచివేత ఎంత కౄరంగా చేస్తే ఆ అధికారులకు పతకాలు, ప్రమోషన్లు వుంటాయని దీనిద్వారా ప్రభుత్వం స్పష్టం చేయదల్చుకుంది. కాల్పులకు పాల్పడ్డ వారిపై కనీస విచారణయినా చేపట్టకుండా ఇలా పతకాలతో సత్కరించడం మన ప్రజాస్వామ్యమా?

ఇంత పెద్ద ఎత్తున అలజడి జరిగిన సంఘటనపై న్యాయవిచారణ కనీసం ఓ న్యాయమూర్తితో జరపమన్నా సరే కలెక్టర్ కింది స్థాయి అధికారి జాయింట్ కలెక్టర్ ను నియమించారంటే దీనిని నీరుగార్చే యత్నంలో స్థానిక మంత్రి వర్యుల ప్రమేయానికి ప్రభుత్వం ఎంతలా తలవొగ్గిందో తెలుస్తోంది. ప్రజల నిరసనను న్యాయస్థానాలైనా పట్టించుకొని కొంతలో కొంత ఊరటనివ్వకపోతే ఈ దళారి పాలకులకు పట్టపగ్గాలుంటాయా? ఈ ప్రాజెక్టుకు అనుమతికోసం వేసిన ఉపసంఘం విన్నపాన్ని కేంద్రమంత్రి జైరాం రమేష్ నిర్ద్వందంగా తోసిపుచ్చడం కాస్తా ఊరటనిచ్చింది.

14, ఆగస్టు 2010, శనివారం

పంద్రాగస్టుకు ముందే ప్రపంచబ్యాంకు ముందు జోలెఉన్న సహజవనరులను విదేశి కంపెనీలకు చౌకగా అమ్మిపెడుతూ, దేశంలోని అపార మానవ శ్రమను తగిన రీతిలో వినియోగించుకోలేక, చేసిన ప్రతిదానిలోను కుంభకోణాలకు పాల్పడుతూ ఆఖరికి శవపేటికలలో కూడా అవినీతి చెయ్యి చాపిన ఈ దౌర్భాగ్య దళారీ పాలితులు రేపుదయం మువ్వన్నెల జెండా ఎగరేయకముందే తమ పంచె విప్పి ప్రపంచ బ్యాంకు ముందు జోలె పరిచిన సంగతి మనకు సిగ్గుచేటు కాదా? ఉన్న ఒక్క బహుళార్థక సాధక ప్రాజెక్టును ఈ పేరుతో అమ్మబెడుతున్నారు. ఇందులో ఎవరి వాటా ఎంతో మునుముందు తెలుస్తుంది. అర్థరాత్రి వచ్చిన స్వాతంత్ర్యం ఇంకా తొలి వేకువ కోడి కూతకు ఆమడ దూరంలో వున్న వైనం ఎంత అవమానకరం. ఇదిలావుండగా నాటి విప్లవ వీరులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురులను నేటికీ మన పాఠ్య పుస్తకాలలో బ్రిటిష్ వాడు వేసిన టెఱరిస్టు ముద్రతోనే పిల్లలకు NCERT books, CBSE syllabus లలోను కొనసాగిస్తున్నారంటే విప్లవమంటే వీరికి వున్న భయాన్ని తెలియజేస్తూ, వారి ఎడల వీరు చూపెడుతున్నది కుహనా గౌరవంగానే పరిగణించాలి. ఈ విషయాన్ని తప్పక అంతా ఖండించాలి. ఎందరో త్యాగధనులు తమ నిష్కామ కర్మ తో పోరాడి సాధించిన స్వేచ్చను నేడీ ధనమదాంధులు నిస్సిగ్గుగా అమ్మజూపడాన్ని వ్యతిరేకిస్తూ మరో స్వాతంత్ర్య పోరాటానికి సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమయ్యిందని గుర్తెరగుతారని ఆకాంక్షిస్తూ..

11, ఆగస్టు 2010, బుధవారం

భారత మావోయిస్టులు - అరుంధతీరాయ్

ఈ వీడియోలో భారత మావోయిస్టులపై అరుంధతీరాయ్ తన నోట్సును చదివి వినిపించారు..


source:http://www.guardian.co.uk/books/video/2010/mar/27/arundhati-roy-maoists-india

7, ఆగస్టు 2010, శనివారం

ఆపరేషన్ లేఖలు..

ఆజాద్ హత్య కావడానికి కారణం ఆయన స్వామి అగ్నివేశ్ ను పార్టీ లేఖ ద్వారా కలవడానికి వచ్చిన క్రమాన్ని SIB వాళ్ళు వాడుకొని ఆయనను జర్నలిస్టు పాండేను encounter చేసారని అంటున్నారు. ఈ రోజు ఢిల్లీలో ప్రెస్ క్లబ్ లో వరవరరావు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఆ ఘటన మరువక ముందే ఇటీవల అదే స్థాయి నాయకుడైన వారణాశి సుబ్రమణ్యం ను అరెస్టు చేసారని, ఆ తరువాత ఆయన కూడా నేనూ లేఖను అందజేయడానికి వెళితే పోలీసుల ట్రాప్ లోంచి తప్పించుకొని బయటపడ్డానని, ఇకముందు ప్రభుత్వం చర్చల ప్రతిపాదనలపై మీడియా ద్వారానే స్పందించాలని కోరారు. అసలు ఈ లేఖల గొడవేంటి? స్వామి అగ్నివేశ్ కున్న సామాజిక హోదా ఏంటి? ఆయన కోరగానే ఉత్తరాలు పట్టుకొని కేంద్ర కమిటీ స్తాయి నాయకులు పరుగెత్తడమేంటి? ఏమాత్రం టెక్నికల్ జాగ్రత్తలు తీసుకోక పోవడమేంటి? చర్చలకు వెంపర్లాడటమెందుకు? ఆంధ్రాలో జరిగినది అప్పుడే మర్చిపోయారా? ఈ అనుభవాన్ని శతృవు చాలా ఈజీగా వాడుకోజూస్తుంటే గుడ్డిగా ముందుకు పోవడంలో ఆంతర్యమేమిటి? పార్టీలో వున్న మేధావి వర్గాన్ని కోల్పోతే ఆ తరువాత పార్టీ గాడితప్పదా? ఓ పక్క తీవ్రమైన యుద్ధానికి రాజ్యం సన్నాహాలు చేస్తుంటే, ప్రజా స్వామ్యవాదులను, మేధావి వర్గాన్ని దానికి వ్యతిరేకంగా కూడగడుతు, ప్రజలను నిర్బంధ వ్యతిరేకంగా తయారుచేసుకొనే కార్యక్రమాలను తీవ్రతరం చేయాల్సిన తరుణంలో నాయకత్వాన్ని గుడ్డిగా లేఖలతో పంపడమేంటి? దానికి వత్తాసుగా ఈ ఆంధ్రా మేధావులు ఇంటర్వ్యూలు ఇవ్వడం? ఓ సామాన్య ఉద్యమాభిమానిగా ఈ ప్రశ్నలు వెన్నాడుతున్నాయి..

27, జులై 2010, మంగళవారం

దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమొకా రాజ్యమా??
జరిగినవి ఓ 12 నియోజక వర్గాలలో ఉప ఎన్నికలు..
కానీ ఈ మూణ్ణాళ్ళు మద్యం ఏరులై పారింది..
నిస్సిగ్గుగా కుల సంఘాల దగ్గరనుండి వార్డు ఆకు లీడర్ల వరకు విపరీతంగా డబ్బు సంచులు ముట్టాయి..
కార్లలో, ఆటోలలో ఇదిగో పట్టుకున్నాం, అదుగో పట్టుకున్నాం అన్నారే తప్ప ఇదంతా ఎలా జరిగిపోయిందో నీరసించిన వాళ్ళు చెప్పాలి..
ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 40 శాతం లేనిది సాయంత్రానికి 60 దాటిపోతుంది.. ఈ చక్రపొంగలి ఎలాగో ఎన్నికల సుబ్బారావులకే ఎరుక..
మొన్నటి వరకు ఓటేసిన వారి ఓటు చీటీ గల్లంతు..
మీటనొక్కితే కుంయిమనకుండానే వెళ్ళిపోతున్న ఓటు..
వీపుపైన లాఠీ వాతతో మొఱోమని వేసిన వాడేడుపు...
నా ఓటెవడు వేసాడురా అని గట్టిగా అడగలేని వాడు ---- నోరూ మూసుకొని పోవాల్సిందే...
ఇదిగో బంగారు పల్లెం.. ఇందులో వుంది -------ముఖం చూసుకో రేప్పొద్దున్న...
ప్రజాస్వామ్యమా మూడు చీర్లు ఆరు చీకులతో వర్థిల్లు...
ఎందుకురా పిచ్చి తండ్రులారా ఆత్మ హననాలు, మీ బలిదానాలు...
మీ ఒంటిని తాకి పునీతమైన అగ్ని జ్వాలలు చివరకు వీళ్ళకు బీడీ ముట్టించుకునేందుకు తప్ప ఎందుకు కొరగాలే...

అంతా ఓట్ల మాయ... నోట్ల మాయ...

జై కొట్టిన వాడి చేతికి అరిగిన చిప్ప...

కానీ ఇలా మూడు మూడు రోజులకి ఎన్నికలొస్తే జనం నోళ్ళుకొట్టి సంపాదించి దాచిన దొంగ బంగారం, డబ్బు తప్పక బయటకు వస్తుంది...

ఎన్నికలూ జిందాబాద్...

24, జులై 2010, శనివారం

షహీద్ చంద్రశేఖర్ అజాద్ అమర్ రహేనిన్న భారతదేశం గర్వించదగ్గ విప్లవ మూర్తులలో ఒకరైన షహీద్ చంద్రశేఖర్ అజాద్ 105 వ జన్మదినం. అంతా బాబ్లీ గందరగోళంలో పడి ఎవరూ గుర్తుచేసుకో లేకపోయినారు. అయినా శత్రువుకు తలవంచని వీరుడైన కా.అజాద్ ను గుర్తుచేసే ధైర్యం ఎంతమందికి వుంటుందీ కాలం. మారుతున్న విలువలు, అవసరాల నేపథ్యంలో ముందుతరాల వారి త్యాగాలను గుర్తుచేయడం ద్వారా వారి స్ఫూర్తి ఎటువైపు దారితీస్తుందోనన్న బెంగ ఈ కాలం నాయకులలో వుంటుంది. తాము పాలిస్తున్న విధానాలకు, నాటి వలసవాద విధానాలకు తేడా లేకపోవడంతో ఇలాంటి వీరుల పేరునే స్మరించే అర్హత లేదన్న ఎరుక కూడా కారణం కావచ్చు. అయినా కా.షహీద్ భగత్ సింగ్ కు ముఖ్య అనుచరుడిగా, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నిర్మాతగా, శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన కా.చంద్రశేఖర్ అజాద్ ను మరొకమారు గుర్తుచేసుకొని ఆయన ఆశయాల సాధనలో భాగమవుతున్న ఉద్యమాలను అక్కున చేరుద్దాం.

అమర్ రహే కా.అజాద్...

15, జులై 2010, గురువారం

మిత్రులారా.. ఇప్పుడేమంటారు?రాజ్య స్వభావంపై మనకున్న భ్రమలను చెదరగొట్టే వరస సంఘటనల సమాహారం

బషీర్ బాగ్ కాల్పులు..

ముదిగొండ కాల్పులు..

సింగూరు, నందిగ్రాంల అణచివేత..

కాల్దారిలో రైతులపై కాల్పులు..

నిన్నటి సోంపేట కాల్పులు..

ఇలా రోడ్డురోలర్ నమూనాలో జరపతలపెట్టిన అభివృద్ధి పేరుతో రాజ్యం తన రక్కసి స్వభావాన్ని దాపరికం లేకుండా బయటపెడుతున్నా ఇదో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా కీర్తిస్తున్న వర్గం తన స్వభావాన్ని ముసుగుతీస్తున్నట్లుగానే గ్రహించాలి.

ప్రజలే నాశనమైన తరువాత ఎవరిని ఉద్ధరిస్తారు?

ఎవరి సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నారో నిన్నటి సంఘటనతో తేటతెల్లమైంది.

ఇక్కడ మరో విషయం పోలీసుల స్వభావాన్ని నిన్న మరింతగా వారు తెలియజేసారు. తాము ఓ కీలుబొమ్మలమే తప్ప తాము వచ్చిన వర్గ దృక్పధం కోల్పోయి నిండా చీర లేని ఆడువారిపై కూడా ప్లాస్టిక్ లాఠీలతో చావబాదుతూ చుట్టుముట్టి వారిని దారుణంగా హింసించడాన్ని కళ్ళారా చూసిన తరువాత కూడా ఏమనాలి?

నిన్నటి వరకు శాంతియుతంగానే ర్యాలీలతోను, ధర్నాలతోను, నిరాహార దీక్షలతోను, కోర్టులలో కేసులు వేసి, ప్రభుత్వానికి విన్నపాలను సమర్పించిన ప్రజలు చివరకు అన్ని దారులు మూసుకుపోయి తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదాన్ని అడ్డుకునే క్రమంలో ఉత్త చేతులతో కాళ్ళకు దండాలు పెట్టి అయ్యా అని బతిమాలినా వారిని కనికరించని వారిపై నిరాయుధంగానే ప్రతిఘటిస్తే వారిపై నేరుగా కాల్పులకు ఎగబడ్డ వారిని వెంటేసుకొచ్చిన రాజ్య ప్రతినిధులను ఎవరి ప్రతినిధులుగా గుర్తిద్దాం?

ఈ సంఘటనలతో ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా వున్న ఉద్దానం తన పూర్వ రూపువైపు ఉద్యమాల వనంగా మారితే అది ఎవరి తప్పు?

ఎవరు ఉగ్రవాదో చెప్తారా?

14, జులై 2010, బుధవారం

చివరకు బలిగొన్నారు..Police firing on Fishermen at Sompetaఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజానీకంపైకి పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు మత్స్యకార కుటుంబానికి చెందిన వారు మృతి చెందారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వలన సోంపేట, బారువ,పలాస్, మందస మొ.న.నాలుగు మండలాల ప్రజానీకం కాలుష్యబారిన పడతామని, తమ ఉనికికే ప్రమాదకరంగా పరిగణిస్తూ ప్రజలే తమకు తాము స్వచ్చందంగా ముందుకు వచ్చి పోరాటాన్ని చేస్తున్నారు. వీరిని అణచివేసేందుకు రకరకాల పన్నాగాలు పన్నిన ప్రభుత్వం చివరకు ఈ ఉదయం సోంపేట దగ్గర నాగార్జున కన్స్ట్రక్షన్స్ వారు చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకొన్న స్థానికులపై పోలీసులచేత కాల్పులు జరపడంతో నలుగురు చనిపోయారు. ఒకేమారు ఉత్తరాంధ్రలో 10 వరకు థర్మల్, ఒక అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణాలను చేపట్టాలని జూస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడిదారులు ఈ ప్రాంత సస్యశ్యామలమైన భూములను, తీర ప్రాంతంలోని మత్స్య సంపదను నాశనం జేసి ఎవరికోసం ఈ విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. యూరోప్ దేశాలన్నీ వదులుకుంటున్న అణు ప్రాజెక్టులను ఇక్కడ నెలకొల్పడం ఎంతవరకు సమంజసం? ఈ పాలక వర్గాలకు ప్రజల పట్ల ఎంత బాధ్యత వుంటుందో పాతికేళ్ళనాటి భోపాల్ దుర్ఘటన ఇంకా మాయలేదు. కోస్టల్ కారిడార్ పేరుతో అనేక కాలుష్యకారక ఫ్యాక్టరీలను ఏర్పాటుజేయడానికి సెజ్ లకు అనుమతిస్తూ ప్రజలను నిర్వాసితులను జేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడజూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ చేపట్టిన స్వచ్చంద నిరసన కార్యక్రమాలు గత సం.కాలంగా జరుగుతూనే వున్నాయి. నేడు వారి రక్తం రుచి చూడడం దారుణం. దీనిని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి..

Watch thesuchi.com - Sompeta Police Firing - NTV\thesuchi.com - Sompeta Police Firing - NTV in Entertainment  |  View More Free Videos Online at Veoh.com

12, జులై 2010, సోమవారం

అంతర్యుద్ధంపై దృశ్యరూపం - గోపాల్ మీనన్

గోపాల్ మీనన్ ఈ చిన్న నిడివి చిత్రంలో మనకు ఏదైతే అంతర్గత భధ్రతకు ముప్పుగా పరిగణిస్తూ యుద్ధం ప్రకటించబడ్డ ప్రాంతాలనుండి అక్కడివారి గొంతులో వారి బాధలను చూపించే ప్రయత్నం చేసారు. మానవత్వం గురించి, హింస గురించి మాటాడుతున్న మేధావులకు కనిపించని కోణం ఇది. ఇందులో ప్రముఖ సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్, ప్రముఖ సినీ నిర్మాత మహేష్ భట్ ల అభిప్రాయాలను పొందుపరిచారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎఱ రాజ్యమొచ్చేస్తుందో అని గగ్గోలు పుట్టించి, ఆ వాతావరణంలో ఈ దేశ సహజ వనరులను విదేశి కంపెనీలకు దోచిపెట్టేందుకు అడ్డులేకుండా జేసుకునే క్రమంలో పేరులోనే విధ్వంసాన్ని నింపుకున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ చేపట్టి స్వంత ప్రజలపైనే యుద్ధాన్ని చేయబూనిన కార్పొరేట్ పాలకవర్గం కుట్రను తప్పక గ్రహించాల్సిన అవసరముంది. తమ పరిపాలనలోని బూటకత్వాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉద్యమకారులు చేసే ప్రతిహింసను భయానకంగా చూపిస్తూ తమ ఘోరకృత్యాలను దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే వర్గానికి చెందిన సామాన్య జనం మధ్య యుద్ధాన్ని పెట్టి తమ వ్యాపారాలు చేసుకునే కుటిల నీతిని అమలుజేస్తున్నారు. దీనిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి.7, జులై 2010, బుధవారం

జర్నలిస్టు పాండే సహచరి బబిత ఆవేదన..

ఈ రోజు ఆంధ్ర జ్యోతి నవ్య పేజీలో మావోయిస్టు అగ్రనేత కా.అజాద్ తో పాటు హత్య చేయబడ్డ జర్నలిస్టు హేమచంద్ర పాండే సహచరి బబిత ఆవేదనను గూర్చి రాసారు. చదవగలరుః

పోలీసు, మావోయిస్టుల వార్‌లో ఎప్పటిలాగే మూడోవాళ్లూ మూల్యం చెల్లించారు. అయితే ఈసారి ఆ గురి ఓ పాత్రికేయుడిని తగిలింది. అతను హేమచంద్రపాండే. అప్పటిదాకా కర్తవ్య నిర్వహణలో ఉన్న పాండే పోలీస్ తూటా తగలగానే చిత్రంగా మావోయిస్ట్‌గా మారిపోయాడు. ఇంతకీ అతను విప్లవకారుడా?సామాజిక కార్యకర్తా? కేవలం జర్నలిస్టేనా? మూడూ కలగలిసిన వ్యక్తా? సహచరికన్నా బాగా చెప్పగలిగిన వారు ఎవరున్నారు? అందుకే ఆయన గురించి భార్య బబిత మాటల్లోనే తెలుసుకుందాం...

హేమచంద్ర కుమావూన్ యూనివర్శిటీలో పిజి చేశాడు. నేనూ అదే యూనివర్శిటీలో డిగ్రీ చదివాను. ఆ పరిచయమే మా మధ్య ప్రేమగా మారింది. 2002 ప్రేమికుల రోజున పెద్దల ఆంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం.ఎవరికి ఏ చిన్న కష్టమొచ్చినా సాయం చేయడానికి ముందుండే వాడు. ఇప్పుడు ఎన్‌జీవోలపై పిహెచ్‌డీ చేస్తున్నాడు. ఆయన్ని పాత్రికేయుడు కాదంటుంటే నవ్వొస్తుంది. మల్టీమీడియా డి ప్లొమా చేసిన నేనూ మొన్నటి దాకా జర్నలిస్ట్‌గానే పని చేశాను.

నన్నూ కాల్చేస్తే పోయేది
మేము మూడున్నరేళ్ల క్రితం ఢిల్లీ వచ్చాం. ఇక్కడ శాస్త్రీనగర్‌లో ఒక చిన్న ఇంటిలో అద్దెకుంటున్నాం. పాత్రికేయుడే కాక ఆయన ఓ సామాజిక కార్యకర్త కూడా. అల్మోరాలో జంగల్ బచావో...ఉత్తరాఖండ్ ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జోక్యం చేసుకునేవారు. అలాంటి మంచి మనిషిని ఇంత దారుణమైన చావు వెంటాడుతుందని కలలో కూడా ఊహించలేదు. అయన్ను చంపినట్టు నన్నూ ఒక్క బుల్లెట్‌తో కాల్చి చంపేస్తే బావుండేది.

ఆ మాటలే చివరివి
నా భర్త నాతో చివరిగా మాట్లాడింది జూన్ 30 సాయంకాలం ఐదు పదిహేనుకి. నాగ్‌పూర్‌కి వెళ్తూ ట్రైన్‌లో ఉన్నాను అని ఫోన్‌లో చెప్పారు. అవే చివరి మాటలు. బహుశా అది చెన్నై లేదా ఎపి ఎక్స్‌ప్రెస్ అయ్యుండాలి. మొత్తానికి ఏదో ఒకదాంట్లో రిజర్వేషన్ చేయించుకున్న దాఖలా కూడా ఉంది.ఆయన ఆ రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకే ఇంటి నుంచి బయలుదేరారు. ఏదో ఇంటర్వ్యూ కోసం నాగపూర్‌కి వెళ్తున్నానని మూడుంపావుకి ట్రైన్ ఉందని, రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పారు. ఏం స్టోరీ ఏంటని నేను వివరాలు అడగలేదు. వృత్తిపరమైన విషయాల్లో జోక్యం చేసుకునే అలవాటు నాకు లేదు. కాబట్టి విషయాన్ని కాజువల్‌గానే తీసుకున్నాను.

అనూహ్యం
తర్వాత చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను. కాంటాక్ట్‌లోకి రాలేదు. నాట్ రీచబుల్ అనే రెస్పాన్స్ తప్ప ఎలాంటి స్పందనా లేదు. తర్వాతి మూడు రోజులూ మనసు మనసులో లేదు. కీడు శంకించడానికీ ఎలాంటి సూచనలూ లేవు. ఆ భరోసాతోనే ధైర్యంగానే ఉన్నా. లోలోపల మాత్రం తెలియని బెంగ...దిగులుతోనే గడిపాను. రెండో తారీఖు కల్లా తిరిగి వస్తానని చెప్పిన మనిషి పత్రికల్లో శవమై కనిపించాడు. 'తెలుగు న్యూస్ పేపర్స్‌లో ఓ ఫొటో వచ్చింది. హేమచంద్రలాగే ఉంద'ని సన్నిహితులు చెబితే అప్పుడు చూశాను...నిజమే! మా ఆయనే....కుప్పకూలిపోయాను. విషయమేంటో అర్థం కాలేదు. చివరకు ఒక హై క్యాడర్ మావోయిస్ట్ లీడర్‌తో పాటు మా ఆయన్నీ మావోయిస్ట్ అనే ముద్రవేసి ఆంధ్రప్రదేశ్ పోలీసలు ఎన్‌కౌంటర్ చేశారని తెలిసింది.

గొంతు నొక్కే ప్రయత్నమే
అయనకి దూరంగా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఆయనలేని ఈ జీవితాన్ని ఎలా....(దుఃఖంతో కాసేపు మౌనం)నాకేమీ అర్థం కావడం లేదు. చేతనైన మంచి చేసుకుంటూ మా బతుకు మేము బతుకుతుంటే మా మీద మావోయిస్ట్‌లనే అనవసరమైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అన్యాయం. అసలు ఇంత వరకు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు. ఎప్పుడూ అరెస్ట్ అవలేదు. బాధ్యత గల ఒక జర్నలిస్ట్‌ని పట్టుకుని అజ్ఞాత నక్సలైట్ అనడం ఎంత అన్యాయం? దీన్ని ఎదుర్కోవడానికి ఏ స్థాయిలోనైనా ఉద్యమిస్తాను. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం కూడా అదే. దీనికి ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్ట్‌లు అందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ హత్యను కేంద్ర మంత్రి చిదంబరం కావాలని చేయించారు. జర్నలిస్ట్‌ల గొంతు నొక్కేయడం కోసమే ఇలాంటి పని చేయిస్తున్నారని నేను భావిస్తున్నాను.

నా అన్నను అన్యాయంగా చంపారు
అన్నయ్య, నేను ఇద్దరమే. అక్కచెల్లెళ్లు లేరు మాకు. తనంటే నాకు ప్రాణం. అంతే గౌరవం కూడా. అన్యాయాన్ని వెలికితీసే మంచి జర్నలిస్ట్. అద్భుతమైన వ్యాసాలు రాసేవాడు. అలాంటి నిఖార్సయిన మనిషిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు.

- రాజీవ్ పాండే (తమ్ముడు) కుటుంబ నేపథ్యం
ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోర్‌ఘడ్ జిల్లా దేవకల్ గ్రామం హేమచంద్ర పాండే స్వస్థలం. మధ్యతరగతి కటుంబం. తల్లీతండ్రులిద్దరూ టీచర్లుగా పనిచేసి రిటైరయ్యారు. హేమచంద్ర తండ్రి దివంగతులవగా తల్లి మాత్రమే ఉన్నారు. తమ్ముడు రాజీవ్ పాండే కూడా నైనిటాల్‌లో ఆరేళ్లుగా అమర్ ఉజాల పత్రికలో పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు.

జూ ఎం.డి. మునీర్,
ఆన్‌లైన్, మంచిర్యాల
http://epaper.andhrajyothy.com/GalleryView.shtml

3, జులై 2010, శనివారం

హిందూలో అజాద్ ఇంటర్వ్యూ

నిన్నటి బూటకపు ఎదురుకాల్పులలో మరణించిన మావోయిస్టు అధికార ప్రతినిధి కా.అజాద్ చర్చలపై చిదంబరం ప్రతిపాదనల గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందూ పత్రిక ఎడిట్ చేసి ప్రచురించిన భాగాలుః

Azad's Interview in Hindu

2, జులై 2010, శుక్రవారం

మరో కట్టు కథమావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్ కుమార్ @ అజాద్ తెల్లవారుఝామున ఎదురుకాల్పులలొ చనిపోయాడన్న మరో కట్టుకథ ఈ రోజు ప్రచారమవుతోంది. ఎదురుకాల్పులు జరిగితే ఎలావుంటుందో చతీస్ఘడ్, ఝార్ఖండ్ లలో అనుభవమవుతోంది. అయినా పాతిక మంది మావోయిస్టులుతో ఆదిలాబాద్ అడవుల్లో కాల్పులు జరిగితే ఒక్క పోలీసుకు గాయంకాకుండా సురక్షితంగా ఎలా బయటపడ్డారు. ఇంతకంటే పెద్ద జోక్ వుంటుందా? మీడియాముందు మాటాడడానికైనా సిగ్గు పడడంలేదు.

ఓవైపు చర్చలకు ఆహ్వానిస్తున్న హోంమంత్రి ఇలా తమకు దొరికిన మేధావివర్గాన్ని హత్యచేసే బదులు వారితో మాటాడితే సమస్య పట్ల సానుకూల వైఖరికి రావొచ్చుకదా? ఒకవైపు ఆపరేషన్ సాగుతూ మరోవైపు చర్చలంటూ మభ్యపెట్టడం ఏం ప్రజాస్వామ్యం? తీవ్రమైన సమస్యగా గుర్తించినప్పుడు దానికి ఓ పరిష్కార మార్గం కోసం ప్రయత్నిస్తున్న నిజాయితీ వుంటే ఇలా సీనియర్ నేతలు దొరికినప్పుడు వారిని అరెస్టు చూపించి అయినా వారితో మాటాడడం వలన ఉపయోగం వుంటుంది. అంతే కానీ చంపుతూ పోతే మరింత మంది ఆజాద్ లు వస్తూనే వుంటారు కానీ సమస్య పరిష్కారం కాదు. ఎవరు ఔననా కాదన్నా వాళ్ళు ఈ దేశంలో ఓ ప్రధాన రాజకీయ స్రవంతికి ప్రతినిధులు. సుమారుగా దేశంలో సగానికి పైగా జిల్లాల్లో ప్రజలను ప్రభావితం చేస్తున్న వాళ్ళు. వారి నాయకత్వాన్ని మట్టుబెట్ట చూడడం వలన అది సమసిపోదు. ఇది చరిత్ర చెపుతున్న సత్యం. ఇప్పటికి గత కొంత కాలంగా ఆ స్థాయి నాయకులను 10 మందికి పైగా చంపినా సమస్య మరింత జఠిలమవుతోందే తప్ప పరిష్కారం వైపు కనుచూపు మేరలో కానరావడం లేదు. కావున ఇది ముమ్మాటికీ పాలకవర్గం కోల్పోయిన ఓ మంచి అవకాశం. ప్రజల సమస్యలపట్ల చిత్తశుద్ధిలేమి వెల్లడవుతోంది.
http://www.ndtv.com/article/india/andhra-pradesh-top-2-maoist-leaders-killed-in-encounter-35061

30, జూన్ 2010, బుధవారం

కాలుతున్న కాశ్మీరంఇటీవల CRPF జవాన్ల కాల్పులలో మరణించిన విద్యార్థికి సంఘీభావంగా మొదలైన ఉద్యమం తమ భూభాగంలో అమలవుతున్న కల్లోల చట్టం వికృత రూపానికి వ్యతిరేకంగా సాగే దిశగా మారి అది ఉత్తర కాశ్మీరం నుండి దక్షిణ కాశ్మీరం వరకు పాకుతూ కాశ్మీరాన్ని అతలాకుతలం చేస్తోంది. కీలుబొమ్మ ప్రభుత్వం చేష్టలుడిగి తిరిగి సైన్యం సహాయాన్ని అర్థించి మరింతగా కల్లోల కారకమవుతోంది. చాన్నాళ్ళుగా కాశ్మీర్ లో జరుగుతున్న బూటకపు ఎదురుకాల్పుల సంఘటనలపై న్యాయాన్ని డిమాండ్ చేస్తున్న ప్రజలపై అక్కడ అమలవుతున్న దమనకాండ బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారు. ఉగ్రవాద నిర్మూలన ముసుగులో పారామిలటరీ దళాలు, సైన్యం చేస్తున్న అకృత్యాలు, యువకుల హత్యలు కొట్టుకుపోతున్నాయి. దీనిపై కాశ్మీరీలు చాన్నాళ్ళుగా తమ అసంతృప్తిని తెలియజేస్తున్నా వారిని పట్టించుకునే వారు లేరు. పాకిస్తాన్ బూచిని చూపించి కల్లోలితప్రాంత చట్టాన్ని అమలుచేస్తుండటంతో స్థానికంగా మాటాడే వారు ఏదో ఒక రూపంలో భయభ్రాంతులకు గురవుతున్నారు. మానవహక్కుల సంఘాలు ఈ చట్టాన్ని తొలగించి, సైన్యాన్ని వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఆందోళనలో భాగంగా CRPF వాళ్ళు పిల్లలు, ఆడవారనే విచక్షణ లేకుండా చావబాదుతూ, కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికె సుమారు 11 మందికి పైగా మరణించారు ఈ వారంలోపల. దీనిపై వెంటనే కేంద్రం స్పందించి తమ బలగాలను అదుపులో వుండేట్టు చూడాల్సిన బాధ్యత వుంది. స్థానిక పోలీసుల వైఫల్యంతో సైన్యం అక్కడ పోలీసు అధికారాలను చెలాయిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇంతవరకు ఆరోపణలకు గురైన ఎదురుకాల్పుల సంఘటనలపై న్యాయ విచారణ జరిపి బాధితులను ఆదుకొనడం ద్వారా వాళ్ళలో విశ్వాశాన్ని పెంపొందంచే కృషి జరగాలి. ఇది అత్యాశకాకూడదు.

21, జూన్ 2010, సోమవారం

చెవిటి మూగవాడిపై తీవ్రవాది ముద్రప.బెంగాల్ లోని మిడ్నాపూర్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో అరెస్టు చేయబడ్డ గిరిజన యువకుడు చెవిటి మూగవాడు. కాల్పుల శబ్ధానికి భయపడి దగ్గరలో వున్న తమ ఇంటినుండి తల్లి చేయి పట్టి పరుగుపెడుతున్న మూగ యువకుడి తలకు తుపాకీ గురిపెట్టి పట్టుకుపోయి నక్సలైట్ ముద్రవేసి అరెస్టు చేసారు. ఈ కుఱవాడికి 2004 నుండి వచ్చిన అనారోగ్యానికి చేసిన చికిత్స వివరాలను చూపించి ఆయన మానసిక రోగిగ వైద్యులందించిన వివరాలను చూపించినా వినని ఖాకీ కర్కసం, న్యాయమూర్తుల కళ్ళులేని కబోదితనంను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన వలన ఆ కుఱవాడు మరింత భయాందోళనలకు లోనయి పూర్తిగా మానసిక అనారోగ్యానికి గురౌతాడని, పూర్తిగా మాటలు రాని ఆ యువకుడికి అడిగితే అరుపులు తప్ప జవాబు చెప్పలేడని వేడుకున్నా కనికరించని ఖాకీతనం యొక్క మూర్ఖత్వపు వివరాలు ఈ దిగువ చదవండి.

http://timesofindia.indiatimes.com/india/Cops-parade-deranged-man-as-Maoist/articleshow/6060704.cms
Cops parade deranged man as Maoist
Caesar Mandal, TNN, Jun 18, 2010, 12.47am IST

Tags:toi|ENT|Midnapore|Tarakeshwar|Unlawful Activities Prevention|Anirban Diagnostic Centre Pvt Ltd|Midnapore court|Duli village
SALBONI (WEST MIDNAPORE): The "dreaded" Maoist captured by joint forces on Wednesday the only one apparently caught alive at the encounter site where eight rebels lay dead is a 20-year-old mute and mentally challenged youth from Duli village. No wonder, police haven't been able to make him speak.

In what may cast a shadow on the way the police are rounding up suspects, Rameshwar Murmu has been branded a hardcore Maoist and slapped with the most stringent of charges, including sedition under Unlawful Activities Prevention Act (UAPA).

The Midnapore court on Thursday remanded him in 15 days judicial custody. While on Wednesday, the cops claimed the "captured Maoist" was too stunned at the loss of so many comrades to speak and admitted that he hadn't said a word, Rameshwar's father, Bankim Murmu, cried, "My son can't speak. He may scream if you hit him, but he can't speak a word." The Murmus live right behind Wednesday's encounter site.

Bankim says Rameshwar suffers from congenital epilepsy and developed ENT problems at a very young age leading to loss of speech and hearing. He produced medical records to support his claim. "He can only make barely legible sounds. It affected his behaviour and he lost his mental balance. That is why he could not pursue education beyond class IV," a tearful Bankim told TOI on Thursday.

Bankim owns a mud house and a small plot of land on the edge of Ranjya forest where the bloody encounter took place on Wednesday. His elder son, Ram, works in a factory in Orissa.

Recounting Wednesday's developments that led to his son being captured, Bankim said they woke up to the sound of gunfire behind his house. The family rushed out in the direction of the village to avoid being hit.

"My wife Madina was holding Rameshwar's hand as we ran. The gunfire had woken up other villagers as well and they were running helter-skelter. In the melee, Rameshwar broke free and ran back towards the house. I don't know what was on his mind. My wife ran after him. But before she could reach Rameshwar, police caught him. They put a gun to his head and said they would shoot if anyone took a step forward," he said.

The parents could only watch helplessly as the forces led their son away. "We pleaded with them to let him go. We told them that he is mentally challenged and not involved with Maoists. But they refused to listen," said Madina. They don't know where their son has been taken. Nor do they have the courage to go to the police for fear of being thrashed.

According to medical documents, Rameshwar was treated at several places between 2004 and 2006, including ENT specialists at Tarakeshwar in Hooghly and Midnapore. On June 5, 2006, when Rameshwar was 16, he was taken to Anirban Diagnostic Centre Pvt Ltd in Midnapore town (ID B-6884, checked by Dr N Adhikari).

Other villagers, like Sudha Soren and Lakshmi Murmu, confirmed that Rameshwar was mentally challenged. "He never behaved like a normal kid. Now we hear that he has been paraded before TV channels with his hands tied and branded a Maoist," Sudha said.

Rameshwar was bare-bodied and wearing blue shorts when he was caught, an unlikely dress for a guerrilla. Police insist Rameshwar was present alongside senior Maoist leaders Bikash and Akash. "After the gunfight, we caught him hiding behind a hedge. He had a single-barrel gun," a cop said.

17, జూన్ 2010, గురువారం

ఇదేనా మానవత్వం?యుద్ధంలో మరణించిన వారిపట్ల ఇలానే ప్రవర్తిస్తారా?
ఇదేనా మీరు ప్రకటించే మానవత్వం?
నిన్న బీహార్ ప.బెంగాల్ సరిహద్దుల్లో జరిగిందన్న ఈ ఎదురుకాల్పుల దృశ్యం చూస్తుంటే ఇది కూడా బూటకపు ఎన్ కౌంటర్ గానే కనిపిస్తోంది. మరణించిన వారంతా సివిల్ దుస్తుల్లోనే వున్నారు. అంతా గిరిజన యువతీ యువకులే.
ఒకవైపు శాంతి కోసం చర్చలకు స్వామి అగ్నివేశ్ ను మధ్యవర్తిగా మంతనాలాడుతూ మరోవైపు దాడులు కొనసాగిస్తారా?
చర్చల వలలో వేసి వారిని తుదముట్టించే పాచికలకోసం వెతుకులాడుతున్నారా?
మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు..

15, జూన్ 2010, మంగళవారం

రాజపక్శే వెర్సస్ ఫొన్సెక - బాక్సింగ్ పోటీచేయించిందంతా చేయించేసి నెత్తుటి మరకలను కడుక్కో జూస్తున్నారు. చివరకు ఇద్దరు రక్త పిపాసుల మధ్య పోటీ నెలకొంది. ఇందులో ఎవడు ఎక్కువ సామ్రాజ్యవాదులకు తొత్తయితే వాడే నెగ్గుతాడని నిరూపించబడింది. ఏరుదాటాక తెప్పతగలేసే రకం ఈ రాజపక్శే. యీయన తన సొంత కుటుంబ సభ్యులనే అధికార గణంగా మార్చుకొని సాధించిన నెత్తుటి కూడుని ఆరగిస్తున్నాడు. మొన్నటి దాకా తన అనుంగు మిత్రుడైన ఫోన్సెకాను కటకటాల వెనక్కి నెట్టి ఉరికంబమెక్కిస్తానని బెదిరిస్తున్నాడు. వాడికి తగిన శాస్తే జరిగింది. కానీ వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పోతుందన్నది నిత్య సత్యం..

7, జూన్ 2010, సోమవారం

ప్రజలపైకి కొత్త పులులు

ఈ నెల 10 న నల్గొండలో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా జరుపతలపెట్టిన సభకు హాజరు కావద్దంటూ విప్లవ రచయిత వరవరరావుకు, సభ నిర్వాహకుడు ఉదయ్ లకు చంపుతామంటూ చత్తీస్ఘడ్ చిరుతల పేరుతో ఫోన్ లో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇలా ప్రజా సంఘాల వారికి ఏదైనా సభ నిర్వహిస్తామంటే దానిని భగ్నం చేసేందుకు, సభకు హాజరయ్యే వారిని బెదిరించేందుకు ఇలా ఫోన్ ల ద్వారా బెదిరించడం, అలాగే ఇంతకు ముందు సుమారు 10 సం.ల క్రితం ఆజం అలీకి కూడా పౌరహక్కుల జిల్లా సదస్సు నిర్వహించేటప్పుడు బెదిరించి ఆ తరువాత హత్య చేయడం జరిగింది. వీటి వెనక వున్నది పోలీసు అధికార యంత్రాంగమేనన్నది బహిరంగ రహస్యం. ఆజం అలీని, పురుషోత్తంలను హత్య చేసింది నయీం అని ఈ మధ్య నయీం తల్లికూడా తన కొడుకును ఎక్కడ దాచారో చెప్పాలంటూ చేసిన ప్రకటనలో పేర్కొంది. లొంగిపోయిన మాజీలను ఇలా క్రిమినల్స్ గా తయారు చేసి వాడుకుంటున్న పోలీసు యంత్రాంగం ఇది ఏమి ప్రజాస్వామ్యమో చెప్పాలి. తమకు ఎదురులేకుండా చేయడానికి ఇలా కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ చేయించడం వారికి పరిపాటిగా మారింది. మరల ఈ రెండు రోజులలో కొత్తగా చత్తీస్ఘడ్ చిరుతల పేరుతో మరో అవతారమెత్తారు. గ్రీన్ టైగర్స్, బ్లాక్ టైగర్స్, సీమ టైగర్స్, నల్లతాచులు మొ.న కౄర జంతువుల అవతారాలు అన్నీ అరవిందులవారి రహస్య భటుల దశావతారాలేనని ప్రజలు గ్రహించారన్న విషయం తెలుసుకొని యిలాంటి నీచపు పనులకు పాల్పడరాదని విన్నపం.

source:http://www.andhraprabha.in/state/article-117530

29, మే 2010, శనివారం

వారిపై నెట్టాలని చూస్తారా?నిన్న ప.బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాదానికి మావోయిస్టులే కారణమని అంతా వారిపైకి నెట్టాలని చూసారు. కానీ అది తా్ము చేసింది కాదని వాళ్ళు ప్రకటించారు. యిదంతా అక్కడ రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార యంత్రాంగ వైఫల్యాన్ని వారిపై నెట్టివేస్తె ఒ పనైపోతుంది. మరింత కౄరంగా ఆదివాసీ్లపైనా, వారి్పైనా దాడులు చేసి రాబోయే ఎన్నకల నాటికి అడ్డు లేకుండా చేసుకోవచ్చని సిగ్గు విడిచి ప్రకటించాయి. కానీ మావోలు దీనిని తిప్పి కొట్టారు. ఆ తరువాత రైల్వే మంత్రి గారు ఇది వాళ్ళు చేసి వుంటారనుకున్నాం, కానీ దీనిపై సి.బి.ఐ.దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. ఐఇడిలు వాళ్ళ ఒక్కరి వద్దే వున్నాయా? యిటువంటి విద్రోహ చర్యలు జరుగకుండా తగిన జార్గత్తలు తీసుకోలేరా? రైల్వే ట్రాక్ సిబ్బంది ఏమయ్యారు? ఇది అధికార యంత్రాంగ వైఫల్యాన్ని కప్పి పుచ్చే యత్నం.

ఒకరిపై ఆరోపణ చేసే ముందు అన్ని కోణాలలో పరిశీలించాల్సిన అవసరం వుంది. గుడ్డెద్దు చేలో పడ్డట్లు అధికారం వుంది కదా అని ప్రవర్తించ కూడదు.