వేదన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వేదన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జులై 2010, మంగళవారం

దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమొకా రాజ్యమా??




జరిగినవి ఓ 12 నియోజక వర్గాలలో ఉప ఎన్నికలు..
కానీ ఈ మూణ్ణాళ్ళు మద్యం ఏరులై పారింది..
నిస్సిగ్గుగా కుల సంఘాల దగ్గరనుండి వార్డు ఆకు లీడర్ల వరకు విపరీతంగా డబ్బు సంచులు ముట్టాయి..
కార్లలో, ఆటోలలో ఇదిగో పట్టుకున్నాం, అదుగో పట్టుకున్నాం అన్నారే తప్ప ఇదంతా ఎలా జరిగిపోయిందో నీరసించిన వాళ్ళు చెప్పాలి..
ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 40 శాతం లేనిది సాయంత్రానికి 60 దాటిపోతుంది.. ఈ చక్రపొంగలి ఎలాగో ఎన్నికల సుబ్బారావులకే ఎరుక..
మొన్నటి వరకు ఓటేసిన వారి ఓటు చీటీ గల్లంతు..
మీటనొక్కితే కుంయిమనకుండానే వెళ్ళిపోతున్న ఓటు..
వీపుపైన లాఠీ వాతతో మొఱోమని వేసిన వాడేడుపు...
నా ఓటెవడు వేసాడురా అని గట్టిగా అడగలేని వాడు ---- నోరూ మూసుకొని పోవాల్సిందే...
ఇదిగో బంగారు పల్లెం.. ఇందులో వుంది -------ముఖం చూసుకో రేప్పొద్దున్న...
ప్రజాస్వామ్యమా మూడు చీర్లు ఆరు చీకులతో వర్థిల్లు...
ఎందుకురా పిచ్చి తండ్రులారా ఆత్మ హననాలు, మీ బలిదానాలు...
మీ ఒంటిని తాకి పునీతమైన అగ్ని జ్వాలలు చివరకు వీళ్ళకు బీడీ ముట్టించుకునేందుకు తప్ప ఎందుకు కొరగాలే...

అంతా ఓట్ల మాయ... నోట్ల మాయ...

జై కొట్టిన వాడి చేతికి అరిగిన చిప్ప...

కానీ ఇలా మూడు మూడు రోజులకి ఎన్నికలొస్తే జనం నోళ్ళుకొట్టి సంపాదించి దాచిన దొంగ బంగారం, డబ్బు తప్పక బయటకు వస్తుంది...

ఎన్నికలూ జిందాబాద్...

10, జనవరి 2010, ఆదివారం

కూలిన ఒక్క ఆధారమూ...



ఈనాడు తెలుగు సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి. మన ప్రయాణం ఎటువైపు సాగుతున్నదో? సత్యాన్ని తెలుసుకునే అవకాశం సామాన్యులకు దూరమైన వైనం చూస్తుంటే గుండాగినంతపనౌతోంది. వీళ్ళ వ్యాపార లాభాల మద్య ఇన్నాళ్ళూ ఆధారపడ్డ నాలుగోస్థంభంగా ఆధారపడ్డ దానిని కూడా పునాదులతో కూల్చివేస్తున్నారు. స్వచ్చతను కోల్పోయిన తరువాత ఇంక ప్రజలు వీళ్ళీమి చెప్పినా నమ్మరు. అదుగో పులి కథలా, చివరాఖకి అంతా రాజ్యమన్న పులి నోట్లోకి పయనిస్తున్నాం. పాలకులు ఏది కోరుకుంటున్నారో అదే జరుగుతోంది. ప్రజల విశ్వసనీయతను కోల్పోయేట్లుగా చేసి తద్వారా తమ చీకటి కార్యకలాపాలను కానిచ్చే అవకాశాన్ని చేజేతులా ఇచ్చారు. దీనివలన జరగబోయే దారుణాలు మరింత పచ్చి నెత్తురు వాసనేస్తాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ తమ గురివిందగింజతనాన్ని నిస్సిగ్గుగా బట్టబయలు చేస్తుంటే రాజకీయ దళారులు పగలబడి నవ్వుతున్న వైనం చూసి గుండె తరుక్కుపోతుంది.
ఇకనైనా సమాజంలో తమ స్థానాన్ని, అవసరాన్ని గుర్తెరిగి మెలగుతారని ఆశించడం అత్యాశేనా?