10, జనవరి 2010, ఆదివారం

కూలిన ఒక్క ఆధారమూ...ఈనాడు తెలుగు సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి. మన ప్రయాణం ఎటువైపు సాగుతున్నదో? సత్యాన్ని తెలుసుకునే అవకాశం సామాన్యులకు దూరమైన వైనం చూస్తుంటే గుండాగినంతపనౌతోంది. వీళ్ళ వ్యాపార లాభాల మద్య ఇన్నాళ్ళూ ఆధారపడ్డ నాలుగోస్థంభంగా ఆధారపడ్డ దానిని కూడా పునాదులతో కూల్చివేస్తున్నారు. స్వచ్చతను కోల్పోయిన తరువాత ఇంక ప్రజలు వీళ్ళీమి చెప్పినా నమ్మరు. అదుగో పులి కథలా, చివరాఖకి అంతా రాజ్యమన్న పులి నోట్లోకి పయనిస్తున్నాం. పాలకులు ఏది కోరుకుంటున్నారో అదే జరుగుతోంది. ప్రజల విశ్వసనీయతను కోల్పోయేట్లుగా చేసి తద్వారా తమ చీకటి కార్యకలాపాలను కానిచ్చే అవకాశాన్ని చేజేతులా ఇచ్చారు. దీనివలన జరగబోయే దారుణాలు మరింత పచ్చి నెత్తురు వాసనేస్తాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ తమ గురివిందగింజతనాన్ని నిస్సిగ్గుగా బట్టబయలు చేస్తుంటే రాజకీయ దళారులు పగలబడి నవ్వుతున్న వైనం చూసి గుండె తరుక్కుపోతుంది.
ఇకనైనా సమాజంలో తమ స్థానాన్ని, అవసరాన్ని గుర్తెరిగి మెలగుతారని ఆశించడం అత్యాశేనా?

3 వ్యాఖ్యలు:

  1. ఏం మాట్లాడాలో తెలియని సందర్భం.. మీరన్నట్టుగా ఇవన్నీ పాలకులకి అనుకూల పరిణామాలే..

    ప్రత్యుత్తరంతొలగించు
  2. mundundi musalla pandaga kada appude yemi ayyindi

    ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..