22, జనవరి 2010, శుక్రవారం

మరాఠీ తాలిబన్లు

టాక్సీ డ్రైవర్లకు లైసెన్సులిచ్చేందుకు ఇటివల మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు చూస్తుంటే మనం వున్నది ఫెడరల్ ప్రభుత్వంలోనేనా అనిపిస్తోంది. మరాఠీ భాష మాట్లాడటం వచ్చితీరాలని, చదవడం, రాయడం కూడా రావాలని, కనీసం 15 సం.లు నివాసముండే ధృవపత్రం చూపాలన్న నిబంధనలు రూపొందించింది. ఇందులో మరాఠీని compulsory చేయడం చూస్తుంటే చౌహాన్ గారి ఆలోచనలు శివసేన, నవనిర్మాణ సేనలకు ఏమాత్రం తీసిపోనట్లుగా వుండి, తాలిబాన్ మూర్ఖ శిఖామణులు గుర్తుకురాకమానరు. భారతదేశ రాజ్యాంగసూత్రాలకు వ్యతిరేకంగా ఇటువంటి చట్టాలు చేయడం చూస్తుంటే స్థానిక రాజకీయ పార్టీల, నాయకుల మనుగడకోసం వీళ్ళు ఎంతకైనా తెగిస్తారని అనిపిస్తోంది.

2 కామెంట్‌లు:

  1. ఈ టపా చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించటం అనే సామెత గుర్తు వస్తే తప్పు లేదు.

    రిప్లయితొలగించండి
  2. @oremunaః నాకు మీలా దయ్యాలతో పరిచయం లేదు లెండి. మీకు అంత వేదం వినిపించినందుకు చాలా ఆనందంగా వుంది.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..