22, జనవరి 2010, శుక్రవారం

మీ రక్తాన్ని ధారపోయండి – మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను – నేతాజీ

Subhas_Bose

నేతాజీ సుభాష్ చంద్రబోస్ - భారత స్వాతంత్ర్య సమరంలో ఒక పోరాట అధ్యాయం. భారత ప్రజల స్వేచ్చా కాంక్షకు  ప్రతిరూపం. తను చేసినది ఎన్ని విమర్శలకు గురైనా తన దేశ బానిస  విముక్తి కోసమే పోరాడిన వీరయోధుడిగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు. జరిగిన చరిత్రంతా అందరూ ఎరిగినదే. గాంధీ తన మాట జవదాటని నెహ్రూని భావి భారత నాయకుడుగా ప్రతిష్ఠించే పనిలో మరో నాయకున్ని ఎదగనివ్వని క్రమంలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించిన వాడు నేతాజీ. మొదటినుండి గాంధీ బ్రిటిష్ వారితో లాబీయింగ్ ద్వారా నాయకత్వ మార్పునకు ప్రయత్నించడంతో 2వ ప్రపంచ యుద్ధకాలంలో బలహీనపడ్డ బ్రిటిష్ రాజ్ ను చావు దెబ్బకొట్టి భారత దేశ బానిస సంకెళ్ళను తెంచడానికి నాజీ సేనలతో జతకట్టి అజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి భారత సైన్యాధ్యక్షుడు నేతాజీ. చరిత్రలో ఆయన ధీరోదాత్తతను మరుగునపరిచే కుట్రలు యింకా జరుగునూనే వున్నాయి. ఈనాటికీ తన మరణ రహస్యం కప్పబడి వుంది. ఇది భారత పాలకవర్గాల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. ఏమైనా కానీ భారతంలో కర్ణుడి పాత్రలా తాను ఓడినా భారత ప్రజల హృదయాలలో తన మేరు గంభీర రూపం చిరస్థాయిగా నిలిచిపోతుంది.(ఈ రోజు నేతాజీ 113వ జయంతి సందర్భంగా)

2 వ్యాఖ్యలు:

 1. చాలా బాగా వ్రాసారు బ్రదర్.
  నేహ్రుని ప్రధానిని చేయడానికి బోసు గారిని ప్రక్కకు తప్పించారు,
  ఇప్పుడు కూడా బోసు గారికి తగిన సత్కారం జరటంలేదు
  నోటు మీద బోసు గారి బొమ్మ పెడితే కమునిస్టులకు ఓట్లు పడతాయని గాంధీ బొమ్మ పెట్టించారు పీవీ
  నోటు మీద గాంధీ ఎందుకు ?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @Apparao Sastri గారు ధన్యవాదాలు సార్. భగత్ సింగ్, నేతాజీ వంటి నాయకుల మరణం వెనక గాంధీ, నెహ్రూల భాగస్వామ్యం వుంది. మీ పోస్టు కూడా బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..