AP girls used for vaccine demo
పై Head lines తో నిన్నటి Deccan Chronicle లో ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో 30 వేలమంది 10 నుండి 14 సం.ల మద్యనున్న గిరిజన బాలికలపై ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలోను, గుజరాత్ లోని వడోదర జిల్లాలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థినులపై సెర్వికల్ కేంసర్ వ్యాధి నిరోధక టీకాలను ప్రయోగాత్మకంగా ఇప్పటికి రెండుమార్లు ఉపయోగించారని రాసారు. ఈ “demonstration project” లక్ష్యం ప్రభుత్వం తన Immunisation prograamme లో వాడుతున్న vaccine లలో దీనిని కూడా కలుపుకునేట్లు ఒప్పించేందుకు.అనగా దీనిని ఒక యూ.ఎస్, కేంద్రంగా ఉత్పత్తి జరుపుతున్న మల్టీ నేషనల్ కంపెనీ వారిదగ్గరనుండి కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడానికి ఒప్పండం కుదుర్చుకోవడానికట. ప్రస్తుతం ఈ vaccine అమ్మకానికి భారత్ లో దొరుకుతోండంట.
ఇప్పటివరకు 24,164 మంది గిరిజన అమ్మాయిలపై ప్రయోగించారు. ఇది 3 డోసులుగా 6 నెలల వ్యవధిలో ఇవ్వాలి. ఇప్పటికి 2 మార్లు ఇవ్వడమైనది. దీని పేరు GARDASIL. ఇది వ్యాధి రాకుండా మత్రమే చూస్తుంది. క్యూర్ చేయదు. NGOPATH (India) అనే సంస్థ తో పాటు ఏఫీ , గుజరాత్ ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రయోగాలు చేస్తున్నారు.
కానీ ఢిల్లీ కేంద్రంగా గల సహేలి మరియు సామా అనే సంస్థలు ఈ వాక్సిం ప్రయోగాలపై పరిశోధించగా ఇది బాలల హక్కుల ఉల్లంఘనగా గుర్తించారు.
“The vaccine,” these activists allege, ‘has been widely administered in the First World and has created several debilitating reactions, including clotting disorders, nervous system disorders and has also has resulted in the death of healthy young girls which caused batches of the drug be withdrawn.”
ఇలా అమాయక గిరిజన బాలికలపై ఇటువంటి వాక్సిం లు ప్రయోగించడం అనైతికం కాదా? వారి ప్రాణాలతో చెలగాటమాడవచ్చా? ఇది పాలక వర్గాల పైశాచిక వ్యాపారధోరణి కాదా?
(Deccan Chronicle Dated 23-01.10 లోని వార్త ఆధారంగా)
అనైతికమే కాదు ! అత్యంత ఘోరం కూడా!
రిప్లయితొలగించండివర్మ గారూ !
రిప్లయితొలగించండినైతికత అనేది నేతిబీరకాయ. దీనిని ఒక్కరుగా అరికట్టలేము. అలాగని ఊరుకోకుండా ఇలా అందరం నిరసన తెలియజేస్తే కొంచమైనా తగ్గుతారేమో ! ఏమీ చెయ్యలేకపోవడం కంటే మేలు కదా ! మంచి ప్రయత్నం. కొనసాగించండి.
మీరన్నది నిజమే కాని ఇంతకన్నా ఘోరమైన చర్యలు ఎన్నో ఉన్నయండి.
రిప్లయితొలగించండిఈ తీరు ఇవ్వాళ్ళ కొత్త గా మొదలవ్వ లేదు.
రిప్లయితొలగించండిమన దేశం మొదటి నించీ వేద జనితమైన ఆయుర్వేదాన్ని, ప్రక్రుతి వైద్యాన్ని, హోమియోపతి ని మన వైద్య విధానం గా నమ్మి ఆచరిస్తున్నది.
ఇవ్వాళ్ళ ఈ సరళీక్రుత ఆర్ధిక విధానాలు అనే పేరు చెప్పి మన దైనందిన జీవితాల లోకి ఈ సో కాల్డ్ నాగరిక దేశాలు చొచుకు వచేస్తున్నాయి.
మన వెన్నెముక లేని ప్రభుత్వం వాళ్ళకి తొత్తులు గా, వాళ్ళ మోచేతి గంజి తాగటమే అధికారిక విధానం గా పాటించినంత కాలం మన బోటి అభివ్రుధి చెందుతున్న దేశాల ప్రజలు వాళ్ళ కి ప్రయోగ శాలలు గాఉపయోగ పడక తప్పదేమో.
ఇంతకు ముందు అంతర్జాతీయ వ్యాపార వేత్త, కోటీశ్వరుడు బిల్ క్లింటన్ మన దేశం లో వ్యాక్సిన్ నిమిత్తం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టటం, మన మీద ప్రేమతో కాదు, వాళ్ళ మందులని ప్రయోగాత్మకం గా మన మీద రుద్దే ఉద్దేస్యం తో నే అనే విమర్శలు అప్పుడు విన్నాము.
వాళ్ళ పరిశోధనలకి (బీటీ వంకాయ విత్తనాలు కానీ, మనుషులకి ఉపయోగించె వ్యాక్సిన్ లు కానీ)మన దేశం ఒక అంతులేని ప్రయోగ శాల గా ఉన్నంత కాలం ఈ అన్యాయాలు తప్పవేమో.
అనైతికత గురించి ప్రజా ప్రయోజన దిశ గా స్వచంద సంస్థలు ఎలుగెత్తి ఘోషిస్తుంటే, ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి వాళ్ళకి సంక్షెమం అందించవలసిన ప్రజా ప్రభుత్వాలు వీళ్ళని ప్రయోగాలకి బలి చేస్తున్నాయి.