9, డిసెంబర్ 2011, శుక్రవారం

డిసెంబరు 9ని మోసపూరిత దినంగా పాటిద్దాంఅమ్మలకన్న అమ్మ సోనియమ్మ పుట్టిన రోజు కానుకగా తెలంగాణా ఇచ్చేస్తామని కేంద్ర గృహమంత్రివర్యులు ప్రకటించి అప్పుడే రెండేళ్ళు పూర్తికావచ్చాయి. మళ్ళి కేక్ రెడి అయిపోయింది.. వందలాది మంది విద్యార్థుల, ఉద్యమకారుల పీకలు కోసి నెత్తురంటిన చాకుతో ఈరోజు మరల అమ్మగారి పుట్టిన రోజుకు ముస్తాబవుతోంది. ఇంత పచ్చి మోసపూరిత, దగాకోరు పాలక వర్గానికి వత్తాసుగా ఉద్యమ పార్టీలమని చెప్పుకుంటూ పబ్బంగడుపుతున్న నారకత్వం, అటు అధికార ప్రతిపక్ష వర్గాలలో వున్న తెలంగాణా నపుంసక నాయకత్వం ప్రజలను మోసం జేయడంలో ఎవరికి వారే ముందుంటూ జనం బతుకులను ఆగమాగం జేయడంలో తమదే పైచేయిగా పెత్తనం జేయ జూస్తున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడిన విద్యార్థి యువజన లోకాన్ని తీవ్రమైన నిర్బంధంతో అణచివేసి, ఉద్యోగ సంఘాలంతా చేపట్టిన సకలజనుల సమ్మెను విద్రోహంతో కుప్పకూల్చి పాలకవర్గ తాబేదార్లతో కుమ్మకై ఇప్పుడు అభివృద్ధి మండలి పేరుతో నిధులను దొబ్బి నొక్కేయడాన్కి ప్రయత్నిస్తున్నారు. ఇలా ఆరు దశాబ్ధాల తెలంగాణా ప్రజల ఆకాంక్షను సొమ్ము చేసుకుంటున్న మోసపూరిత రాజకీయ నాయకత్వం నుండి ప్రజా ఉద్యమాన్ని రక్షించుకొని ఉధృతం చేసే బాధ్యతను విద్యార్థి యువజన వర్గం చేపట్టాల్సిన అవసరం నేడు మరింతగా బలపడుతోంది. కావున ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యతను ప్రజాస్వామిక, మేధావి, విద్యార్థి, యువజన, కార్మిక, ఉద్యోగ, రైతు సోదరులంతా కలగల్సి చేపట్టి అమరుల స్వప్నాన్ని నెరవేర్చడానికి ప్రతిన బూనుతూ డిసెంబరు 9 మోసాన్ని ప్రపంచమంతా చాటి చెప్పాలని కోరుకుంటు..

జైతెలంగాణా...

తెలంగాణా పోరులో అమరులైన వారికి జోహార్లు...

అమరుల ఆశయాలను కొనసాగిద్దాం...

జాతుల విముక్తి పోరాటాలు వర్థిల్లాలి....