8, జనవరి 2010, శుక్రవారం

మీడియా - నడమ౦త్రపు సిరికి విషపుత్రిక

ఆనాడు మహాకవి అన్నట్టుగా పత్రికలు పెట్టుబడికి విషపుత్రికలులా మీడియా కూడా పెట్టుబడికి, నడమంత్రపు సిరి అయిన రియలెస్టేట్ వ్యాపారులకు పుట్టిన విషపుత్రికలుగా ప్రజల సున్నిత భావాలపై దాడి చేస్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. తమ రేటింగ్ పెంచుకోవడానికి ఎన్నెన్ని వెధవ వేషాలు వేయాలో వేస్తున్నాయి.
ఈ రోజు రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోవడానికి ఈ మీడియా కథనాలే కారణం. ఎప్పుడో 4 నెలల క్రితం ప్రచురించబడ్డ వార్తను చూపించి గంటలకొద్ది దానిపై విశ్లేషణలు ప్రచారం చేస్తూ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి, గూండాల దాడులను ప్రోత్సహించిన వైనం అత్యంత విషాదకరం. దాడులు జరుగుతున్నాయన్న విషయాన్ని ఎంతో exciting గా ఆ యాంకర్ చెప్పడం చూస్తుంటే వీళ్ళూ వార్తా ప్రసారకులా లేక విషప్పురుగులా అనిపించింది.

బూతు సీన్లతో బుల్లి తెరను నింపి నట్టింట్లో నగ్న నృత్యాలు చేస్తున్నాయి. పసిపాపల స్వేచ్చను హరించె డాన్సు పోటీలు, వారి గొంతులపి ముళ్ళమాటల తో దాడి చేస్తూ, పిచ్చి తల్లిదండ్రుల వెఱి ఆవేశాలను సొమ్ముచేసుకుంటున్నాయి. ఇంతవరకు సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రాం ఒక్కటి లేదు. జరిగిన దానిని గోరంతలు కొండంతలు చేస్తూ, మూర్ఖపు వ్యాఖ్యానాలతో, అతి తెలివి తీర్మాణాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ ఉద్రేకాలను రెచ్చగొడుతు వయాగ్రా మాత్రలలా తయారయ్యాయి. ఈ చానళ్ళ వెనక ఒక్కో దానికీ ఒక్కో రాజకీయ పార్టీల అండదండలున్నాయనడం నగ్న సత్యమే. ప్రజల ధన మాన ప్రాణాలను హరిస్తున్న ఈ ప్రసారాలను నియంత్రించకపోవడం మన రాజకీయ రాబందుల అవకాశవాదాన్ని బయటపెడుతోంది.మరల వీళ్ళలో వీళ్ళే ఆ చానల్ యిలా ఈ చానల్ ఇలా చేసిందని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం. ఈ పోటీ వాతావరణం సమాజాన్ని చెడగొడుతోంది. కావున విజ్నులైన ప్రజలే వీటిని సామాన్య జనానికి అర్థమయ్యేట్లు చెప్పాలి. ప్రతి ప్రింట్ మీడియా వాడు ఒక్కో చానెల్ పెడుతూ ఇబ్బడి ముబ్బడిగా లాభాలార్జిస్తూ ప్రజల మనోభావాలను దేబ్బతీస్తున్నారు. ఇంకా మేలుకోకపోతే సమాజంలో అరాచకం ప్రబలిపోతుంది. తస్మాత్ జాగ్రత జాగ్రత.

2 కామెంట్‌లు:

  1. మన టీవీ చానల్స్ ..మన రేడియో మన పత్రికలూ.. .మన మీడియా

    YSR మరణాన్ని , తెలుగు సినిమా పాటలు జోడిచి పదే పదే చూపించి.. వందకి పైగా చావులకి కారణం ఐంది..
    నిన్న తెలంగాణా ఉద్యమాన్ని అదే రకంగా చూపించి జనాల్లో విద్వంసకర చైతన్యాన్ని పురి కొల్పింది.
    నేడు మళ్లీ ఏదో చెత్త బ్లాగ్ ని ఫోకస్ చేసి..విద్వంసానికి నాంది పలికింది..
    రాష్ట్రం లో దేశం లో జరిగే ప్రతి విద్వంసకర దుశ్చర్యకి పూర్తి భాద్యత మీడియాదే. అది న్యూ చానలే కావొచ్చు.. "అ అంటే అమలాపురం" అని చంటి పిల్లలతో అర్ధనగ్నగా అసభ్యంగా డాన్స్ ప్రోగ్రాములు రూపొందిస్తున్న ఇతర చానెల్స్ కావొచ్చు.. భక్తి పేరుతో మత విశ్వాసాలను తద్వారా మత మౌడ్యాన్ని పెంపోదిస్తున్న భక్తీ చానెల్స్ కావొచ్చు..
    " హాయ్..భారతి "
    హాయ్ whats ur name.. what u do ?
    ఐ అం నిహారికా..ఇంటర్ ఫస్ట్ ఇయర్..
    ఓకే, కూల్.. bf ఉన్నడా..
    లేడు..
    ఆయ్యో లేడా ,,ఏం ఎవ్వరు propose చేయలేదా ?"
    అంటూ పసి పిల్లలకి ఒక ఉతాం ఉచ్చే రేడియో కావొచ్చు..

    నేటి మీడియా
    1) కేవలం డబ్బు కోసమే ఆవిర్భావించటం.
    2) ఒక ఆశయం ఒక దృక్పథం.. ఒక ఆలోచన లేకపోటం
    3) మాస్ మీడియా కి ఉన్న శక్తి ఏంటో తెలియని వాళ్ళు ఆయా మీడియా కి heads గా ఉండటం.
    4) కేవలం డబ్బు ఉంది చానెల్ ఓపెన్ చేయటం తప్ప..ఆ విషయం లో ఎలాంటి చదువు సంధ్యలు లేకపోటం.
    5) సమాజం పై ,, సమాజ పురోగమనం పై.. తమకి ఉన్న భాద్యత తెలికపోవటం.
    6) చెప్పిందే..చూపిన్చిన్దె పదే పదే 24 గంటలు చూపించి.. జనాల ని భావోద్వేగంలోకి.. ఉన్మదంలోకి నెట్టటం.
    7)మళ్లీ తమది భాద్యత కానట్టు.. ఈ ఉన్మాదాన్ని ఇంకో కథనంగా చూపించటం.
    ఎంతటి దుస్థితి !!!!

    రిప్లయితొలగించండి
  2. మన టీవీ చానల్స్ ..మన రేడియో మన పత్రికలూ.. .మన మీడియా

ఆలోచనాత్మకంగా..