27, జులై 2010, మంగళవారం

దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమొకా రాజ్యమా??
జరిగినవి ఓ 12 నియోజక వర్గాలలో ఉప ఎన్నికలు..
కానీ ఈ మూణ్ణాళ్ళు మద్యం ఏరులై పారింది..
నిస్సిగ్గుగా కుల సంఘాల దగ్గరనుండి వార్డు ఆకు లీడర్ల వరకు విపరీతంగా డబ్బు సంచులు ముట్టాయి..
కార్లలో, ఆటోలలో ఇదిగో పట్టుకున్నాం, అదుగో పట్టుకున్నాం అన్నారే తప్ప ఇదంతా ఎలా జరిగిపోయిందో నీరసించిన వాళ్ళు చెప్పాలి..
ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 40 శాతం లేనిది సాయంత్రానికి 60 దాటిపోతుంది.. ఈ చక్రపొంగలి ఎలాగో ఎన్నికల సుబ్బారావులకే ఎరుక..
మొన్నటి వరకు ఓటేసిన వారి ఓటు చీటీ గల్లంతు..
మీటనొక్కితే కుంయిమనకుండానే వెళ్ళిపోతున్న ఓటు..
వీపుపైన లాఠీ వాతతో మొఱోమని వేసిన వాడేడుపు...
నా ఓటెవడు వేసాడురా అని గట్టిగా అడగలేని వాడు ---- నోరూ మూసుకొని పోవాల్సిందే...
ఇదిగో బంగారు పల్లెం.. ఇందులో వుంది -------ముఖం చూసుకో రేప్పొద్దున్న...
ప్రజాస్వామ్యమా మూడు చీర్లు ఆరు చీకులతో వర్థిల్లు...
ఎందుకురా పిచ్చి తండ్రులారా ఆత్మ హననాలు, మీ బలిదానాలు...
మీ ఒంటిని తాకి పునీతమైన అగ్ని జ్వాలలు చివరకు వీళ్ళకు బీడీ ముట్టించుకునేందుకు తప్ప ఎందుకు కొరగాలే...

అంతా ఓట్ల మాయ... నోట్ల మాయ...

జై కొట్టిన వాడి చేతికి అరిగిన చిప్ప...

కానీ ఇలా మూడు మూడు రోజులకి ఎన్నికలొస్తే జనం నోళ్ళుకొట్టి సంపాదించి దాచిన దొంగ బంగారం, డబ్బు తప్పక బయటకు వస్తుంది...

ఎన్నికలూ జిందాబాద్...

3 వ్యాఖ్యలు:

 1. enni maayalu chesina janam evariki vote veyyalano vaarike vestaru.ika pralobapettevaadu pedutune vuntadu,longipoyevaadu longipotune vuntadu.atmabalidaanalu kaadu,chivarivaraku poraadali.jai telangana.gajula

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఎన్నికలూ జిందాబాద్...

  టి.ఆర్.యస్ వాళ్ళు కూడా పంచారా ?

  ఇచ్చినోడిది తప్పా ? తీసుకున్నోడిది తప్పా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పోయిన ఉప ఎన్నికలప్పుడు శ్రీమాన్ రెండు కళ్ళ (నాలుగు కాళ్ళ? ) చంద్ర బాబు నాయుడు గారు సమైక్య వాదాన్ని వదిలేసి జై తెలంగాణా అన్నాడు.

  ఈ ఉప ఎన్నికలప్పుడు నిన్నటి వరకూ నేను మొత్తం ఆంద్ర ప్రదేశ్ కు కాంగ్రెస్ నేతని కాబట్టి తెలంగాణా పై నోరు విప్పకూడదు అంటూ తప్పించుకుంటూ వచ్చిన గున్న ఏనుగు శ్రీనివాస్ నేనే అసలైన తెలంగాణా మొత్తం రాష్ట్ర పీ సి సి అధ్యఖ్యుడిగా చెబ్తున్నా నేను తెలంగాణా వచ్చే వరకు నిద్రపోను బంగారు పళ్ళెం లో తెలంగాణా తెస్తా అంటూ బయటికొచ్చాడు.

  ఉప ఎన్నికలు రాకపోతే ఈ మహాను భావులు ఏసీ గదులు దాటి బయటికి వచ్చేవారా? ఇట్లా నోరు విప్పే వారా?

  కాబట్టి ఎన్నిసార్లు ఎన్నికలు వస్తే మన రాజ కీయాలకు , ప్రజలకు అంత మేలు జరుగుతుంది.
  ఇష్టం లేక పొతే వోట్లు వేయకండి.
  కాని ఎన్నికలను స్వాగతించండి.
  ఎన్నికలు వర్ధిల్లాలి.

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..