7, ఆగస్టు 2010, శనివారం

ఆపరేషన్ లేఖలు..

ఆజాద్ హత్య కావడానికి కారణం ఆయన స్వామి అగ్నివేశ్ ను పార్టీ లేఖ ద్వారా కలవడానికి వచ్చిన క్రమాన్ని SIB వాళ్ళు వాడుకొని ఆయనను జర్నలిస్టు పాండేను encounter చేసారని అంటున్నారు. ఈ రోజు ఢిల్లీలో ప్రెస్ క్లబ్ లో వరవరరావు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఆ ఘటన మరువక ముందే ఇటీవల అదే స్థాయి నాయకుడైన వారణాశి సుబ్రమణ్యం ను అరెస్టు చేసారని, ఆ తరువాత ఆయన కూడా నేనూ లేఖను అందజేయడానికి వెళితే పోలీసుల ట్రాప్ లోంచి తప్పించుకొని బయటపడ్డానని, ఇకముందు ప్రభుత్వం చర్చల ప్రతిపాదనలపై మీడియా ద్వారానే స్పందించాలని కోరారు. అసలు ఈ లేఖల గొడవేంటి? స్వామి అగ్నివేశ్ కున్న సామాజిక హోదా ఏంటి? ఆయన కోరగానే ఉత్తరాలు పట్టుకొని కేంద్ర కమిటీ స్తాయి నాయకులు పరుగెత్తడమేంటి? ఏమాత్రం టెక్నికల్ జాగ్రత్తలు తీసుకోక పోవడమేంటి? చర్చలకు వెంపర్లాడటమెందుకు? ఆంధ్రాలో జరిగినది అప్పుడే మర్చిపోయారా? ఈ అనుభవాన్ని శతృవు చాలా ఈజీగా వాడుకోజూస్తుంటే గుడ్డిగా ముందుకు పోవడంలో ఆంతర్యమేమిటి? పార్టీలో వున్న మేధావి వర్గాన్ని కోల్పోతే ఆ తరువాత పార్టీ గాడితప్పదా? ఓ పక్క తీవ్రమైన యుద్ధానికి రాజ్యం సన్నాహాలు చేస్తుంటే, ప్రజా స్వామ్యవాదులను, మేధావి వర్గాన్ని దానికి వ్యతిరేకంగా కూడగడుతు, ప్రజలను నిర్బంధ వ్యతిరేకంగా తయారుచేసుకొనే కార్యక్రమాలను తీవ్రతరం చేయాల్సిన తరుణంలో నాయకత్వాన్ని గుడ్డిగా లేఖలతో పంపడమేంటి? దానికి వత్తాసుగా ఈ ఆంధ్రా మేధావులు ఇంటర్వ్యూలు ఇవ్వడం? ఓ సామాన్య ఉద్యమాభిమానిగా ఈ ప్రశ్నలు వెన్నాడుతున్నాయి..

1 వ్యాఖ్య:

  1. samasyalu charchala dwaarane pariskaramayyedunte e poraataalu enduku?greenhuntlu enduku?charchala perutho drutarasta kougilini chupadame vaani ettu,kaani manam guddivaallam kaakudadu

    ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..