16, ఆగస్టు 2010, సోమవారం
ప్రజల ప్రాణాలరిస్తే పతకాలు
ఇటీవల సోంపేటలో అకారణంగా ప్రజల ప్రాణాలరించిన పోలీసులకు ఉత్తమ పోలీసు అధికారులుగా అవార్డులిచ్చారంటే పాలక వర్గం ఎవరి పక్షాన వుందో అర్థం చేసుకోవచ్చు. గొడవంతా సద్దుమణిగి ప్రజలు తిరుగు ముఖం పడుతున్న సమయంలో సోంపేట ఎస్.ఐ. కాల్పులు జరిపినట్లు ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయనకు, సి.ఐ.కు మరి 11 మంది అదే స్టేషన్ పోలీసులకు ఉత్తమ అధికారులుగాను, శ్రీకాకుళం జిల్లా అవార్డులలో సగం వరకు టెక్కలి డివిజన్ వాళ్ళకే ఇచ్చారంటే ఈ కాల్పులు, గొడవలకు పాలకుల వత్తాసు వున్నదని అర్థమవుతోంది. ప్రజలపై అణచివేత ఎంత కౄరంగా చేస్తే ఆ అధికారులకు పతకాలు, ప్రమోషన్లు వుంటాయని దీనిద్వారా ప్రభుత్వం స్పష్టం చేయదల్చుకుంది. కాల్పులకు పాల్పడ్డ వారిపై కనీస విచారణయినా చేపట్టకుండా ఇలా పతకాలతో సత్కరించడం మన ప్రజాస్వామ్యమా?
ఇంత పెద్ద ఎత్తున అలజడి జరిగిన సంఘటనపై న్యాయవిచారణ కనీసం ఓ న్యాయమూర్తితో జరపమన్నా సరే కలెక్టర్ కింది స్థాయి అధికారి జాయింట్ కలెక్టర్ ను నియమించారంటే దీనిని నీరుగార్చే యత్నంలో స్థానిక మంత్రి వర్యుల ప్రమేయానికి ప్రభుత్వం ఎంతలా తలవొగ్గిందో తెలుస్తోంది. ప్రజల నిరసనను న్యాయస్థానాలైనా పట్టించుకొని కొంతలో కొంత ఊరటనివ్వకపోతే ఈ దళారి పాలకులకు పట్టపగ్గాలుంటాయా? ఈ ప్రాజెక్టుకు అనుమతికోసం వేసిన ఉపసంఘం విన్నపాన్ని కేంద్రమంత్రి జైరాం రమేష్ నిర్ద్వందంగా తోసిపుచ్చడం కాస్తా ఊరటనిచ్చింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
prajalaku vupagopadepanulu emi chesaarani veellakichharani p.i.l cortlo veste entlavundi?vuttama puraskaralaku criteria emiti,deeniki prajalanu spandinchamani korandi,indian idolke kaadu
రిప్లయితొలగించండిఇది దారుణం, ఖండించాల్సిన విషయం.
రిప్లయితొలగించండికమ్యూనిస్ట్ లు ఈ ఆందోళనను సొమ్ముచేసుకోవడానికి ప్రయత్నించడం కూడా ఖండించాల్సిన విషయం. వీళ్ళ ఉద్యమాలు చేసేదేదో బెంగాల్లో నదిగాం లో చేయొచ్చు కదా.