14, ఆగస్టు 2010, శనివారం
పంద్రాగస్టుకు ముందే ప్రపంచబ్యాంకు ముందు జోలె
ఉన్న సహజవనరులను విదేశి కంపెనీలకు చౌకగా అమ్మిపెడుతూ, దేశంలోని అపార మానవ శ్రమను తగిన రీతిలో వినియోగించుకోలేక, చేసిన ప్రతిదానిలోను కుంభకోణాలకు పాల్పడుతూ ఆఖరికి శవపేటికలలో కూడా అవినీతి చెయ్యి చాపిన ఈ దౌర్భాగ్య దళారీ పాలితులు రేపుదయం మువ్వన్నెల జెండా ఎగరేయకముందే తమ పంచె విప్పి ప్రపంచ బ్యాంకు ముందు జోలె పరిచిన సంగతి మనకు సిగ్గుచేటు కాదా? ఉన్న ఒక్క బహుళార్థక సాధక ప్రాజెక్టును ఈ పేరుతో అమ్మబెడుతున్నారు. ఇందులో ఎవరి వాటా ఎంతో మునుముందు తెలుస్తుంది. అర్థరాత్రి వచ్చిన స్వాతంత్ర్యం ఇంకా తొలి వేకువ కోడి కూతకు ఆమడ దూరంలో వున్న వైనం ఎంత అవమానకరం. ఇదిలావుండగా నాటి విప్లవ వీరులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురులను నేటికీ మన పాఠ్య పుస్తకాలలో బ్రిటిష్ వాడు వేసిన టెఱరిస్టు ముద్రతోనే పిల్లలకు NCERT books, CBSE syllabus లలోను కొనసాగిస్తున్నారంటే విప్లవమంటే వీరికి వున్న భయాన్ని తెలియజేస్తూ, వారి ఎడల వీరు చూపెడుతున్నది కుహనా గౌరవంగానే పరిగణించాలి. ఈ విషయాన్ని తప్పక అంతా ఖండించాలి. ఎందరో త్యాగధనులు తమ నిష్కామ కర్మ తో పోరాడి సాధించిన స్వేచ్చను నేడీ ధనమదాంధులు నిస్సిగ్గుగా అమ్మజూపడాన్ని వ్యతిరేకిస్తూ మరో స్వాతంత్ర్య పోరాటానికి సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమయ్యిందని గుర్తెరగుతారని ఆకాంక్షిస్తూ..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిThank you and Same to you Padmarpita gaaru..
రిప్లయితొలగించండిమీకు 64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి- శిరాకదంబం
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిbharath maataki jaiiiiiiiii....
రిప్లయితొలగించండిnenu kuuda andarilaage-prajalaku paalu,neellu lekunna beerludorike indialo vuntunnanduku-prajalaku pradhamika vaidyaanni duram chesi prajalasommunu corporate hospitalku dochipedtunna indialo vuntunnanduku-naa sodarulaina kaashmirielanu,7 sistersnu bharatasainyam himsistunna maatladakundaa kaneesa maanavatvamlekundaa indialo vuntunnanduku-avineethi,lanchagondithanam prajajeevitamlo okabhaagangaa vunna indialo vuntunnaduku-kallamundu anyaayaalanu prashninche yuvatanu encounterlaperutho champutunna indialo vuntunnanduku-25000mandiki paigaa pranalu teesina unioncarbide companyniki sikshapadaalane dhanikante indian idolku vipareethangaa spandinche prajalunna indialo vuntunnanduku siggupaduthu ,happy indipendenceday
రిప్లయితొలగించండి