14, జులై 2010, బుధవారం

చివరకు బలిగొన్నారు..Police firing on Fishermen at Sompeta



ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజానీకంపైకి పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు మత్స్యకార కుటుంబానికి చెందిన వారు మృతి చెందారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వలన సోంపేట, బారువ,పలాస్, మందస మొ.న.నాలుగు మండలాల ప్రజానీకం కాలుష్యబారిన పడతామని, తమ ఉనికికే ప్రమాదకరంగా పరిగణిస్తూ ప్రజలే తమకు తాము స్వచ్చందంగా ముందుకు వచ్చి పోరాటాన్ని చేస్తున్నారు. వీరిని అణచివేసేందుకు రకరకాల పన్నాగాలు పన్నిన ప్రభుత్వం చివరకు ఈ ఉదయం సోంపేట దగ్గర నాగార్జున కన్స్ట్రక్షన్స్ వారు చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకొన్న స్థానికులపై పోలీసులచేత కాల్పులు జరపడంతో నలుగురు చనిపోయారు. ఒకేమారు ఉత్తరాంధ్రలో 10 వరకు థర్మల్, ఒక అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణాలను చేపట్టాలని జూస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడిదారులు ఈ ప్రాంత సస్యశ్యామలమైన భూములను, తీర ప్రాంతంలోని మత్స్య సంపదను నాశనం జేసి ఎవరికోసం ఈ విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. యూరోప్ దేశాలన్నీ వదులుకుంటున్న అణు ప్రాజెక్టులను ఇక్కడ నెలకొల్పడం ఎంతవరకు సమంజసం? ఈ పాలక వర్గాలకు ప్రజల పట్ల ఎంత బాధ్యత వుంటుందో పాతికేళ్ళనాటి భోపాల్ దుర్ఘటన ఇంకా మాయలేదు. కోస్టల్ కారిడార్ పేరుతో అనేక కాలుష్యకారక ఫ్యాక్టరీలను ఏర్పాటుజేయడానికి సెజ్ లకు అనుమతిస్తూ ప్రజలను నిర్వాసితులను జేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడజూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ చేపట్టిన స్వచ్చంద నిరసన కార్యక్రమాలు గత సం.కాలంగా జరుగుతూనే వున్నాయి. నేడు వారి రక్తం రుచి చూడడం దారుణం. దీనిని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి..

Watch thesuchi.com - Sompeta Police Firing - NTV\thesuchi.com - Sompeta Police Firing - NTV in Entertainment  |  View More Free Videos Online at Veoh.com

3 కామెంట్‌లు:

  1. ఆయుధాలు లేని వారిపై కాల్పులు జరిపితే కండవీటి దొంగ సినిమాలోలాగ ముసుగేసుకుని తుపాకీ పట్టుకుని తిరగడం బెటర్ అనుకుంటారు.

    రిప్లయితొలగించండి
  2. prajalandaru thamaku e projectlu vaddu morro ani antunte kaalpulu jaripaina thama pani chesukovalanukovadam prabhutvadamanakaandaku paraakasta.asalu manadi prajaswamyama?aa musugu veesukonna niyantrutvama?prajala praanalanu bhali theesukune e prabhutvamu oka prabhutvamena?ee kaalpulanu khandistu prabhutvamu aa projectulanu venakki theesukovaalani korutunnamu.gajula

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..