2, జులై 2010, శుక్రవారం

మరో కట్టు కథ



మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్ కుమార్ @ అజాద్ తెల్లవారుఝామున ఎదురుకాల్పులలొ చనిపోయాడన్న మరో కట్టుకథ ఈ రోజు ప్రచారమవుతోంది. ఎదురుకాల్పులు జరిగితే ఎలావుంటుందో చతీస్ఘడ్, ఝార్ఖండ్ లలో అనుభవమవుతోంది. అయినా పాతిక మంది మావోయిస్టులుతో ఆదిలాబాద్ అడవుల్లో కాల్పులు జరిగితే ఒక్క పోలీసుకు గాయంకాకుండా సురక్షితంగా ఎలా బయటపడ్డారు. ఇంతకంటే పెద్ద జోక్ వుంటుందా? మీడియాముందు మాటాడడానికైనా సిగ్గు పడడంలేదు.

ఓవైపు చర్చలకు ఆహ్వానిస్తున్న హోంమంత్రి ఇలా తమకు దొరికిన మేధావివర్గాన్ని హత్యచేసే బదులు వారితో మాటాడితే సమస్య పట్ల సానుకూల వైఖరికి రావొచ్చుకదా? ఒకవైపు ఆపరేషన్ సాగుతూ మరోవైపు చర్చలంటూ మభ్యపెట్టడం ఏం ప్రజాస్వామ్యం? తీవ్రమైన సమస్యగా గుర్తించినప్పుడు దానికి ఓ పరిష్కార మార్గం కోసం ప్రయత్నిస్తున్న నిజాయితీ వుంటే ఇలా సీనియర్ నేతలు దొరికినప్పుడు వారిని అరెస్టు చూపించి అయినా వారితో మాటాడడం వలన ఉపయోగం వుంటుంది. అంతే కానీ చంపుతూ పోతే మరింత మంది ఆజాద్ లు వస్తూనే వుంటారు కానీ సమస్య పరిష్కారం కాదు. ఎవరు ఔననా కాదన్నా వాళ్ళు ఈ దేశంలో ఓ ప్రధాన రాజకీయ స్రవంతికి ప్రతినిధులు. సుమారుగా దేశంలో సగానికి పైగా జిల్లాల్లో ప్రజలను ప్రభావితం చేస్తున్న వాళ్ళు. వారి నాయకత్వాన్ని మట్టుబెట్ట చూడడం వలన అది సమసిపోదు. ఇది చరిత్ర చెపుతున్న సత్యం. ఇప్పటికి గత కొంత కాలంగా ఆ స్థాయి నాయకులను 10 మందికి పైగా చంపినా సమస్య మరింత జఠిలమవుతోందే తప్ప పరిష్కారం వైపు కనుచూపు మేరలో కానరావడం లేదు. కావున ఇది ముమ్మాటికీ పాలకవర్గం కోల్పోయిన ఓ మంచి అవకాశం. ప్రజల సమస్యలపట్ల చిత్తశుద్ధిలేమి వెల్లడవుతోంది.
http://www.ndtv.com/article/india/andhra-pradesh-top-2-maoist-leaders-killed-in-encounter-35061

34 కామెంట్‌లు:

  1. enti maatlaadeadi vaallato?mee vaallu poleesulugaa adavullo tirugutoo unte telisedi meeku.

    రిప్లయితొలగించండి
  2. ఈ దేశంలో ఓ ప్రధాన రాజకీయ స్రవంతికి ప్రతినిధులు. ??????? really ????
    What is the point in talking to them. Just find and kill them. No mercy. Their principles are age old. Communism is an ideology. But it can not implemented practically.

    రిప్లయితొలగించండి
  3. agnaata గారూ సామాన్య పోలీసు బలగాలను తిప్పుతూ అధికారులు, మంత్రులు AC గదుల్లో వుంటున్నారు. వాళ్ళని అడగాలి ఈ ప్రశ్న.
    చర్చలకు ప్రయత్నిస్తున్నామన్న చిదంబరం మాటతో ఆజాద్ స్వామి అగ్నివేశ్ మొ.న మేధావి వర్గంతో సమావేశాలు జరుపుతున్న క్రమంలో పట్టుకొన్నారని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇది మరో మోసం కాదా?

    రిప్లయితొలగించండి
  4. Harish గారూ ఎంతమందిని చంపుతారు. ఈ చంపుడు కార్యక్రమం వలనే ఈ దేశం వృద్ధులతో నిండుతోంది. ప్రశ్నించే వారిని చంపుతూ పోతూ మనలా నోరుమూసుక్కూచునే వాళ్ళ నెత్తిమీదెక్కి పాలిస్తున్నారు.
    కమ్యూనిజం outdated అయితే కన్స్యూమరిజం నేటి నీతా? ప్రతిదానిని సరకును చేసి భారతదేశాన్ని తాకట్టుపెట్టడం newest theory యా. దీన్ని ఆమోదిస్తారా? సమ సమాజం అనాదిగా మానవుని సుదీర్ఘ స్వప్నం. దానికి చేరువయ్యేందుకు నిత్యం మనిషి పడుతున్న తపన. దానిని ఎలా వక్రీకరించినా సామాన్య ప్రజల నుండి దూరం చేయలేరు. కుహనా ప్రజాస్వామ్యం వున్నన్నాళ్ళు అది సజీవం...

    రిప్లయితొలగించండి
  5. "సమ సమాజం అనాదిగా మానవుని సుదీర్ఘ స్వప్నం."

    అయ్యో రామా ! ఇదొక పచ్చి అబద్ధం. మీ "అనాది" ఎన్ని శతాబ్దాలేంటి ? ప్రాచీనగ్రంథాలలో ఎక్కడైనా సమసమాజం గురించి రాశారా ? ఇదంతా మార్క్సుతో మొదలైన పాకీదొడ్డి కాదూ ?

    రిప్లయితొలగించండి
  6. కుమార్ దత్తా అంటే మీ రామరాజ్యం అసమ సమాజం అని ఒప్పుకున్నట్లెనా? మరి దానికోసం ఎందుకు ఆరాటపడటం? ఆయనను దేవుణ్ణి ఎందుకు చేయడం. రాజరిక వ్యవస్థ కంటే ముందున్నవి గణరాజ్యాలని చరిత్ర చదివిన ఎవరికైనా తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. ఈ ప్రపంచంలో నిన్నేవరైనా మొదట మోసం చేశడంటె అతను ఖచ్చిత్తం గా కారల్ మార్క్స్ అని గుర్తుంచుకో. ఎందుకంటె అతను అందరికి పంచి పేట్టింది ఉత్త మాటలు, పడగొట్టింది ప్రపంచ వ్యాప్తం గా అంతో ఇంతో ఉన్న మంచి తనాన్ని, తయారు చేసింది నియంతలను. ఊరకనే రామ రాజ్యం గురించి ప్రశ్నిచటం కాదు? అసలు మీ కమ్యునిస్ట్ రాజకీయ నాయకుల చరిత్ర ఒక సారి చదువుకో తెలుస్తుంది. వారేదొ మంచి వారని అనుకుంట్టున్నావు. లాటిన్ అమేరికా దేశాలలో సాయుధ పోరాటాలు ఎలా విపలం చేందాయో ఒకసారి చదువు. కొన్ని సందర్భాలలో 70% పైన ఉద్యమాలు దెబ్బతిన్నయి కారణం కోవర్ట్ ఆపరేషన్స్. దీనర్థం పైనుంచి కింద వరకు ప్రభుత్వానికి అమ్ముడు పోయారని. ఇటువంటి వారు

    రిప్లయితొలగించండి
  9. medhavi varagamaa. :-o naxals ee medhavulite inka medhavi annavadu tala ekkada pettalo.

    రిప్లయితొలగించండి
  10. //మీ రామరాజ్యం అసమ సమాజం అని ఒప్పుకున్నట్లెనా? మరి దానికోసం ఎందుకు ఆరాటపడటం? //
    చైనా కుళ్ళిపోయిన భావజాలాన్ని 50ఏళ్ళకు పైగా పట్టుకుని ఆస్వాదిస్తున్న చైనా తొత్తుల ఆటవిక రాజ్యం కన్నా 'అసమానమైన రాజ్యం' మేలు కాదా?

    గాయపడిన , కొనప్రాణంతోనున్న కానిస్టేబుళ్ళను, కిందిస్థాయి అధికారులను చిత్రవధ చేసి , పొడిచి, రాళ్ళతో తలలు పచ్చడిచేసి తమ పైశాచిక ప్రవృత్తిని ప్రదర్శించుకుంటున్న ఆటవికులైన మావోల రాజ్యం గురించి రంగుకలలు కనడానికి సామాన్యులకు మీకు లాగా చైనా నుంచి ఫండ్స్ అందటం లేదులే.

    మావోలు తాము దొంగ దాడులు చేస్తూ, పోలీసులు న్యాయపోరాటం చేయాలనడం చాలా చాలా చాలా సమంజసంగానూ , న్యాయబద్ధంగాను వుంది. నిజమే మరి! :P

    రిప్లయితొలగించండి
  11. Moderation enabled? huhh .. How come China ass-lickers can be different than their master-asses?

    రిప్లయితొలగించండి
  12. Srinival & Snkr: మీరు భారత జనాభాలో 20% మందివైపే ఆలోచిస్తున్నారు. మిగిలిన వారు మీగురించి ఆలోచించే రోజు దగ్గరగానే వుంది.
    @kiran: వాళ్ళు నిజమైన సామాజిక మేధావి వర్గం కాబట్టే ప్రజల బాధలకోసం పోరాడుతున్నారు. మిగిలిన వాళ్ళు స్వంత ఆస్తులు ఎలా కూడబెట్టుకోవాలో అని ప్రణాళికలేస్తున్నారు. ఇది నిరంతరం సాగే వైరుధ్యం..

    రిప్లయితొలగించండి
  13. సమత్వం లేకపోతే సమాజంలో న్యాయం లేనట్లని ఎందుకనుకుంటున్నారు ? సమత్వానికీ, సుఖసంతోషాలకీ, న్యాయానికీ అసలు సంబంధమే లేదు. ప్రకృతిలో ఎవరూ సమానులు కారు. మీరు బలవంతంగా ఎవరినీ సమానుల్ని చేయలేరు. అలా చెయ్యాలంటే నిరంతర హింసాకాండ కావాలి. దాని బదులు అసమానత్వమే బెటర్. మనిషికి కావాల్సినది నీతి. సమత్వం కాదు.

    గతించిపోయిన సోవియత్ సోషలిస్ట్ రిపబ్లిక్కులలో ఒక హైయెస్టు లెవల్ ఎంప్లాయీకి ఉద్యోగికీ, ఒక లోయెస్ట్ లెవెల్ ఎంప్లాయీకి మధ్య జీతాల వ్యత్యాసం 8,000 పర్సెంట్ అని మీకు తెలుసా ? ఏం సమసమాజాన్నిసాధించారట వాళ్ళు ? వాళ్ళ అధ్యక్షుడు బ్రెజ్నేవ్ చచ్చిపోయినాక అతను వ్యక్తిగతంగా సేకరించి పెట్టుకున్న 20 విదేశీ కార్లని ఆనాటి సోవియట్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని తెలుసా మీకు ? మరో సోషలిస్టు రిపబ్లిక్కు రుమేనియా అధ్యక్షుడు సీసెస్క్యూ తన ఉమ్మితొట్టిని, పాకీదొడ్డిని కూడా బంగారంతో తయారు చేయించుకున్నాడని తెలుసా మీకు ? మరి మీ సిద్ధాంతం ప్రకారం రుమేనియాలో అందరికీ బంగారు ఉమ్మితొట్లూ, బంగారు పాకీదొడ్లూ ఉండాలి కదా ? లేవేం ? మరో మాట. ఇప్పుడు కమ్యూనిస్టు దేశాన్నని చెప్పుకుంటున్న చైనాలో నిజంగా కమ్యూనిజం ఉందా ? ఆ పేరుతో చెలామణీ అవుతున్న ఒక నిరంకుశ పార్టీ మాత్రమే కనిపిస్తోంది.

    గతంలో తాడేపల్లిగారు ఒకచోట రాయగా చదివాను. (సరిగ్గా ఇవే మాటలు కాదనుకోండి, సారాంశం ఇది. అంతే) "సమానత్వం ప్రకృతిసిద్ధాంతమైతే దాని గురించి మనం వర్రీ అయ్యే పనిలేదు. ఏదో ఒకరోజు సమసమాజం ఏర్పడుతుంది. అది ప్రకృతిసిద్ధాంతం కాకపోతే దాని గురించి అసలు వర్రీ కావాల్సిన పనిలేదు. మనం ఎంత మొత్తుకున్నా అది ఏర్పడదు" అని.

    రిప్లయితొలగించండి
  14. //మీరు భారత జనాభాలో 20% మందివైపే ఆలోచిస్తున్నారు. మిగిలిన వారు మీగురించి ఆలోచించే రోజు దగ్గరగానే వుంది. //

    మీ గురించి బుద్ధివున్నవారిలో 0.1% కూడా సానుభూతితో ఆలోచించడం లేదు, చించరు కూడా. అంతా మీ మేతావులే ఆలోచిస్తున్నారు.
    మీ గురించి బుద్ధివున్నవారిలో 0.1% కూడా సానుభూతితో ఆలోచించడం లేదు, చించరు కూడా. అంతా మీ మేతావులే ఆలోచిస్తున్నారు.

    ఏదో శాపనార్థాలు పెడుతున్నారు, అంటే నేనడిగిన వాటికి సమాధానం లేదన్న మాట! ఈ మాత్రం దానికే సమాధానం లేని వాడివి , ఏదో మైన్లతో , తుపాకులతో పొడిచేస్తాం, దేశాన్ని వుద్ధరిస్తాం అని చెప్పుకుంటే మిమ్మల్ని ఈదేశప్రజలు నమ్మాలా? చదువురాని చత్తీస్ ఘడ్ జార్ఖండ్ కోయలు ,ఆటవికులు మాత్రమే మిమ్ములను నమ్ముతున్నారన్నది గుర్తుంచుకోండి.

    రిప్లయితొలగించండి
  15. నాకు ఈ పోస్టు చదవగానే మీరు రాసిన ఈ వాక్యాలు గుర్తు కొచ్చాయి .
    ---------------------------------------
    జవాన్లు వెళ్ళింది వినోదానికి కాదు. చంపడానికి. మరి చంపడానికి వెళ్ళినవారు చస్తే తప్పేంటి? హింసకు ప్రతిహింస తప్పదు.గత కొంత కాలంగా ఆ రాష్ట్రంలో సల్వాజుడుం పేరుతొ జరుగుతున్నా నరమేధం గురించి తెలీదా? లేక తెలిసి కళ్ళు ముసుకుమ్తున్నారా?

    --------------------------------------------
    మరి ఇక్కడ ఈ ఆజాద్ గారి విషయం లో ఈ వాక్యాలు ఎందుకు వర్తించవు ? వీరు వెళ్ళింది కూడా వినోదానికి కాదు కదా , హింస కోసమే కదా , అందుకే ప్రతిహింస తప్పలేదు .
    పెట్టుబడిదారి వ్యవస్థ ని అంట ని అసహ్యించుకునే మీరు ఇన్ని బ్లాగులు ఎలా నడుపుతున్నారో తెలుసుకోవవచ్చా. మీరు ఉచితం గా వాడుకుంటున్న ఆ అవకాశం ఆ వ్యవస్థ వాళ్ళ వచ్చిందే !

    రిప్లయితొలగించండి
  16. 50ఏళ్ళు పైగా అడవుల్లో బ్రతుకుతూ , ఆటవిక పనులు చేస్తున్న మూకలు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పుకోవడం లాంటి అతితెలివి ప్రదర్శించడం మామూలే. మరి 80% ప్రజల మద్దతుండే వాళ్ళు ఇన్నేళ్ళూ అడవుల్లోనే పడివున్నారెందుకు? ఓ హో! ప్రజలకోసం ప్రజలను చంపటం, బ్రిడ్జిలు కూల్చటం, రైళ్ళు పడగొట్టటం లాంటివి చేస్తున్నారన్న మాట! బాగుంది. మీరు చేస్తున్న ఘనకార్యాలకు మీకు కిరీటాలెట్టి స్మారక స్థూపాలు నిర్మించి ఈ జాతి నివాళులందించాల్సిందే!
    సిగ్గులేకపోతే సరి. ఈ చెత్తకు ఒక బ్లాగు కూడానా! హయ్యో

    రిప్లయితొలగించండి
  17. మీ బ్లాగు ' సహచరుడు ' అనేదానికన్నా ' వనచరుడు ' అని మార్చుకుంటే అతికినట్టు సరిపోతుందని నా సలహా. మేతావులు .. ఆలోచించండి.
    మీ చైనాలో వర్కర్లు జీతాలు చాలక, పీపుల్సు చినా లో సమ్మెహక్కు లేక ఆత్మహత్యలకు తెగబడితే , ఏకంగా 30% జీతాలు పెంచారట! మరి ఇక్కడ అడ్వుల్లో కిట్టుబ్యాగ్గులో చెత్త చైనా సాహిత్యం పెట్టుకుని పూటా జపించే మీలాంటి మేతావులే చెప్పాలి.

    http://www.wnd.com/?pageId=166541

    http://www.chinapost.com.tw/china-business/2010/06/09/260007/New-strike.htm

    China's freedom of speach records.
    http://www.cnd.org/June4th/massacre.html

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. @snkr & srinival గార్లకు మీరు ఇంతలా ఈ సంఘటనపై స్పందించి మీ అభిప్రాయాలను పంచుకొన్నందుకు థాంక్స్. ఏమైనా ఇది బూటకపు ఎదురుకాల్పుల సంఘటనగా ప్రపంచానికంతా తెలిసింది. సాక్ష్యం లేకుండా చేయడానికి దొరికిన జర్లలిస్టు హేమచంద్ర పాండే ను కూడా చంపి, వారే మావోయిస్టుల పేరుతో ఓ లేఖ రాసి మసిపూసి మారేడుకాయ జేయ జూస్తే అది వాళ్ళ నెత్తురంటిన మొఖానికి మరింత తారుపూతగా తయారయ్యింది. నా పోస్టును చదివి మీ స్పందన ద్వారా మీ ఆలోచనలను పంచుకున్నందుకు థాంక్స్. ఏదో ఒక మేర కదలిక కలిగించగలిగినందుకు, తద్వారా ఇంతలా మన జీవితాలను, సమాజాన్ని గూర్చి ఆలోచించగలిగేట్లు చేసినందుకు తృప్తి. అలాగే బతుకులలో మెరుగుకోసమే జరుగుతున్న వివిధ పోరాటాలను తప్పక సపోర్టు చేయలేకుండా వుండలేం. మన మధ్యతరగతి ఆలోచనలకు అందని జీవితాలు చాలా వున్నాయి. వారి గురించి కూడా మీరింతలా ఆలోచింపజేసినందుకు ఈ పోస్ట్ సఫలీకృతమయిందనే భావిస్తున్నా. నేనేదైనా పోజిటివ్ గా తీసుకుంటా? మీరెంత అసహనానికి గురయ్యారో snkr జవాబులలో కనిపించింది. అది చాలు మరల మరల మీరు తప్పక ఆలోచిస్తారు. అంతా కోల్పోతున్న భధ్రమయ జీవితాలు తప్పక ఓ పెద్ద కుదుపునకు దారి తీస్తాయి. ఇది చరిత్ర చెప్పుతున్న సత్యం. అది ప్రస్తుత మావోయిస్టు పార్టీ నాయకత్వంలోనే కాకపోవచ్చు లేదా ప్రత్యామ్నాయ రూపంలోనైనా కావచ్చు. సమాజం చలన శీలం. అంతా ఓ మంచి సమాజాన్ని కోరుకుందాం. దానికోసం జరిగే పోరాటంలో చేస్తున్న త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుందాం. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  20. వందలాది పోలీసులను చంపినపుడేమో ’చంపడానికి వెళ్ళినవారు చస్తే తప్పేంటా’? ఇప్పుడేమో మేధావి వర్గపు హత్యా? ఈ మేతావులు తుపాకులు పట్టుకుని అడవుల్లో ఏం చేస్తున్నట్టు? తపస్సు చేసుకుంటన్నారా? భలే! నవ్వొస్తోంది మేస్టారూ! ఒక మావోయిస్టును చంపగానే మానవత్వాలు, పాజిటివు తింకింగులూ ఠక్కున గుర్తుకొచ్చేస్తాయి. మానవహక్కులనే దివ్యమైన వెలుగు తలచుట్టూ తిరుగుతూ ఉందే!

    మావోయిస్టులు దేన్నైతే ఎదిరిస్తున్నామని చెప్పుకుంటన్నారో ఆ అంశాలపై చర్చ అనవసరం, చాలావరకూ నిర్వివాదాంశాలవి. కానీ వాటిని వాళ్ళు ఎదుర్కొంటున్న విధానం మాత్రం చర్చనీయమే. తుపాకులూ, రాకెట్లూ పట్టుకుని రాజ్యంతో (రాజ్యము, పాలకవర్గమూ లాంటి మూసమాటలు నాకూ వచ్చేస్తున్నై) ఏకంగా యుద్ధానికే దిగారు, వాళ్ళు. యుద్ధమంటే అరాచకమే, చంపడమే యుద్ధనీతి. చీకటి పడగానే యుద్ధం ఆపెయ్యడానికీ, శంఖం ఊదినాకే యుద్ధం మొదలెట్టడానికీ, ఆయుధం లేనివాడిమీద దాడి చెయ్యకుండా ఉండేందుకూ, వీళ్ళది మహాభారత యుద్ధమేమీ కాదు. పోలీసులను చంపేస్తే చంపడానికి వెళ్ళినవారు చస్తే తప్పేంటని అడిగేవాళ్ళు మావోయిస్టులను చంపినపుడు నోరు మూసుకోవాలి. ఈ మావో ఇష్టులు చైనాలో గనక ఇలా తుపాకులు పట్టుకుని తిరిగితే, ఆ అడవుల్లోంచి, మంచు ఎడారుల్లోంచి తియానాన్మెన్ స్క్వేరుకు లాక్కొచ్చి, ట్యాంకుల్తో తొక్కించి పారేసి, పొలాల్లో ఎరువుకింద చల్లి పారేస్తారు. చల్లేసినా మానవహక్కులంటూ ఎవుడూ మాట్టాడ్డు. ఇక్కడ కాబట్టే మానవహక్కులంటూ అల్లరి చెయ్యగలుగుతున్నారు.

    ఇంతకీ, శ్రావ్యగారు రాసిన దానికి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  21. మరి నక్సలైట్ల మార్గం సరైనదేనా? తుపాకీ తో నిజంగా ఏదైన సాధించగలరా? ఇంత వరకు సాధించారా?

    Those who live by gun die by gun

    రిప్లయితొలగించండి
  22. //బూటకపు ఎదురుకాల్పుల సంఘటనగా ప్రపంచానికంతా తెలిసింది.//
    That's what Maoists are dreaming! But what majority of Indians feeling is that the got instance justice from the Police. There is no sympathy for Kasab and so is for Maoists, though some brain-washed people have been denying that for decades, ignoring the facts.

    // సాక్ష్యం లేకుండా చేయడానికి దొరికిన జర్లలిస్టు హేమచంద్ర పాండే ను కూడా చంపి,//
    Though it is unfortunate that the journalist got killed in the shoot-out, it is the price he paid for being sympathisers and propaganda agent. Why should we believe your distorted version? We believe the Police version and that is the fact.
    //నేనేదైనా పోజిటివ్ గా తీసుకుంటా? మీరెంత అసహనానికి గురయ్యారో snkr జవాబులలో కనిపించింది. అది చాలు మరల మరల మీరు తప్పక ఆలోచిస్తారు.//
    సంతోషం. మేము మళ్ళీ ఆలోచిస్తాము, కాని ఎప్పుడూ ఆలోచించడానికి ప్రయత్నించరే అనే కాస్త అసహనం.
    మొదట మీ సిద్ధాంతాలను చైనాలో అణగద్రొక్కబడుతున్న కార్మికులకు, చైనా బొగ్గుగనుల్లో ఇప్పటికీ మగ్గుతున్న వెట్టిచాకిరి జీవితాలను, టాంకులతో అణచబడ్డ స్టూడెంట్ల ఉద్యమాల విషయంలో ఆచరించి చూపండి. ఆతరువాత మీరు పాజిటివో నెగేటివో , అసలు మనుషులో కాదో తేలుతుంది.

    Watch this and imagine your fate in such in-human system in India. :

    http://www.youtube.com/watch?v=mrQqDqOx3KY&feature=related

    రిప్లయితొలగించండి
  23. snkr: మీరు ఇప్పటి చైనా పాలకుల గురించి నాకు చెప్పక్కర్లేదు. కా.మావో అమరత్వం తరువాత అక్కడ ఏలుతున్నది పెట్టుబడిదారీ ఏజెంట్లని ప్రపంచానికంతా తెలుసు. అది అక్కడి ప్రజల వ్యవహారం. వారు తేల్చుకోగలరు. అక్కడినుండి మావోయిస్టులకెవరికీ నిధులు రావట్లేదు. అక్కడి వారిపై భ్రమలున్నది CPM వారికి మాత్రమే.
    ఇంక జరిగిన హత్యలను గూర్చి మీకు సానుభూతి లేకపోవచ్చు. దానికి మీ వర్గ స్వభావం, మీ సామాజిక దృక్పధం తోడుకావచ్చు. అది మీ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. నా బ్లాగు పేరు మార్చుకోమని సలహా ఇచ్చిన శ్రమ తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఇంతలా కదిలించిన అజాద్ నిజంగా అమరుడే...

    రిప్లయితొలగించండి
  24. srinival: అయ్యా పెద్దలు మీరు. మీరు నాపట్ల చూపిన అభిమానానికి సదా కృతజ్నుడ్ని. కామెంటు తొలగించారు. అయినా మైల్ లో చదివాను. అది మీరు నాపట్ల చూపిన ప్రేమగానే భావిస్తాను. మీ మైల్ ఐడి వుంటే రాద్దును. కానీ మరల ఇలా స్పందించాల్సి వచ్చింది. అభ్యంతరం లేకపోతే mail id ఇవ్వగలరు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. శ్రావ్య, చదువరి గార్లకుః ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో సైన్యంతో యుద్ధానికి సన్నద్ధమైన తరువాత తమ ప్రజలను, ఆదివాసీల స్వయం పాలనా హక్కులను, దేశ సహజ వనరులను తమ ప్రాణాలొడ్డి కాపాడేందుకు యుద్దం చేయక తప్పలేదు. ఇంతకు మునుపు కూడా అకారణంగా పోలీసులపై దాడులు చేయలేదు. కావాలని కూంబింగ్ లపేరుతో అడవిలో ఆదివాసీ ప్రజలపై అమలు జరుపుతున్న నిర్బంధాన్ని ఎదుర్కొనె క్రమంలో ఆంబుష్లు చేసారు. యుద్ధం ప్రకటించిందే ప్రభుత్వం. MNC లకు అప్పనంగా దేశ సహజ వనరులను అమ్ముకొనేందుకు కార్పొరేట్ పాలకులు చేస్తున్న కుయుక్తులను ఎదుర్కొనేది ఒక్క మావోయిస్టు పార్టీయే. ముఖాముఖి యుద్ధంలో చనిపోతే అజాద్ గురించి ఇలా రాసుకునే వారం కాదు. అన్యాయంగా అక్రమంగా కాల్చి చంపిన పిరికిపంద చర్యను ఖండించడానికే రాసాను. తాను జీవించిన కాలమంతా ఆదివాసీ ప్రజలనుండి, దేశం మేధావులుగా గుర్తించిన అనేకమంది ప్రజాస్వామ్య వాదులును తన సిద్ధాంత నిబద్ధతతో, ఆచరణతో ఆకట్టుకొని వారిని ప్రజా పోరాటాలను సమర్థించే దిశకు మళ్ళీంచిన ఆజాద్ మరణం తరువాత కూడా మిమ్మల్నందరినీ ఇలా ఆలోచింప జేసినందుకు జోహార్ కా. అజాద్...

    జవాబులు విద్యుత్ సమస్యకారణంగా వెంటనే ఇవ్వలేకపోయాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  26. ఇంతకు మునుపు కూడా అకారణంగా పోలీసులపై దాడులు చేయలేదు. >>
    ---------------------------------------------------
    ఏమిటి ఇది నిజమా ? సంవత్సరాల తరబడి వీళ్ళు చేస్తున్న హత్యాకాండ మీకు కనపడటం లేదా ? మీకు డేటా కావాలంటే లెక్కలతో సహా నేను ఇవ్వగలను . వీళ్ళు చేసిన హత్య కాండ లలో తమ వారిని కోల్పోయిన వారి ఉసురు ఊరికినే పోదు.

    MNC లకు అప్పనంగా దేశ సహజ వనరులను అమ్ముకొనేందుకు కార్పొరేట్ పాలకులు చేస్తున్న కుయుక్తులను ఎదుర్కొనేది ఒక్క మావోయిస్టు పార్టీయే
    ----------------------
    ఇది అన్నిటికన్నా పెద్ద జోకు ఆ MNC ల వల్ల కొద్ది మంది కన్నా ఉపయోగం కలుగుతుందేమో కాని , వీళ్ళ ధనదాహం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు .

    ముఖాముఖి యుద్ధంలో చనిపోతే అజాద్ గురించి ఇలా రాసుకునే వారం కాదు. అన్యాయంగా అక్రమంగా కాల్చి చంపిన పిరికిపంద చర్యను ఖండించడానికే రాసాను.
    ------------------------
    అవునండి నిజమే చెట్ల చాటునుండి ల్యాండ్ మైనులు పేల్చటం , అడవుల్లో నాలుగు వైపులనుండి చుట్టిముట్టి కాల్చి చంపటం , పోలీసు క్వార్టర్ లోకి చొరబడి ముసలి వాళ్ళని కూడా చూడకుండా చంపటం ఇవన్ని నికార్సయిన యుద్దాలు అన్నమాట బాగుంది .

    ఆజాద్ మరణం తరువాత కూడా మిమ్మల్నందరినీ ఇలా ఆలోచింప జేసినందుకు జోహార్ కా. అజాద్...
    -------------------------------------
    అవును నిజమే అతని మరణం తర్వాత కన్నీళ్లు కార్చిన వారు రాస్తున వారి రాతలు చూస్తుంటే ఒక మనిషి మరణం తరవాత సహజం గా కలిగే సానుభూతి కూడా కలగటం లేదు . ఈ రాతలు , ఆలోచన దోరణి చీదర పుట్టిస్తున్నాయి .

    రిప్లయితొలగించండి
  27. manavatvam ekkuvavunna vaade maoist.kanisam edina samasya vacchinappudu mana pakkintivaallaku helpcheste manam maoistula kante goppa.thoti manishiki sahayam cheyadamlo entakaina teginchevade maoist.comments evari meedaina cheyavacchu,mundu issue gurinchi telusukovali,appude arthavanthavamaina charcha vastundi.manam anni samasyalaku spandinchaleka povaccuu,spandinche vallanu samrdiddamu.gajula

    రిప్లయితొలగించండి
  28. gajula గారు నిజం చెప్పారు. పక్కింటివాడి బాధలనే పట్టించుకునే టైం, ఓపిక లేనివాళ్ళం. అలాంటిది తమకు ఏమీ కానీ మనుషుల గురించి తమ బాంధవ్యాలను వదులుకొని తామెంచుకున్న మార్గంలో నిబద్ధతతో పనిచేసే వాళ్ళ హత్య గురించి స్పందించడం మానవత్వంగా గుర్తించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. ఓహ్ సెలెక్టివ్ మానవత్వం లాగ సెలెక్టివ్ కామెంట్లు ప్రచురిస్తున్నారన్న మాట కానీయండి .

    రిప్లయితొలగించండి
  30. Sravya gaaru mee comments prachurinchanu ventane. kaanee net sarigaa connect kaalenattundi. current problem valana marala chusukoledu. paivanne publish chesinavaadini idi cheyadanki naakemi abhyantaram ledu. charchaku duram kaanu.

    nijanga dhanadaaham evarido prajalaku telusu. evari kutumabala nepadhyam ela vundo anta public gaane vundi. lekapote paalaka vargam inka vaaripai dushprachaaram chesedi. asalu inta repression undedi kaadu. prajalalo vaallu nilichevaare kaadu. janajeevana sravantiki duranga vunnadi paalaka vargame. kaasta mee kopanni tagginci aalochinchandi.

    రిప్లయితొలగించండి
  31. ఇదంతా ఎప్పుడు మిస్స్ అయిపొయాను నేను :-))
    శ్రావ్యగారు... బ్లాగర్ లొ ఎదొ సమస్య వుంది ... కొన్ని కామెంట్లు మిస్ అయిపొతున్నయ్ గత రెండు రొజుల నుండి...

    రిప్లయితొలగించండి
  32. క్షమించండి నాకు ప్రాబ్లం ఉంది అని తెలియలేదు , నా తరవాత రాసిన కామెంట్లు ప్రచురించటం చూసి ఆ కామెంట్ రాసాను .
    నాకేమి కోపం ఎందుకండీ నా బాధ అంటా ఒకటే ఎవరు తప్పు చేసినా తప్పే అని చెప్పమంటున్నాను, నక్సల్ నాయకుల ప్రాణాలు ఎంత ముఖ్యమో పోలీసుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అని గుర్తించండి అంటున్నాను అంతే .

    రిప్లయితొలగించండి
  33. evari pranamaina viluvainade.kaakapote evaru endukosam pranalistunnaru anedanimeeda aa thyaganiki saarthakatha vuntundi.andaru amaraveerule.maoistlu jeetam kosamo,promotion kosamo thupaki pattaledu.evaraina edaina samasya gurinchi poradetappudu,aa samasyanu tappakunda pariskarinchala anukunnappudu aa marganni enchukuntaru.sravyagarilo aalochana modalaindi adi tappakunda positiveside vuntundani aasistu gajula

    రిప్లయితొలగించండి
  34. Ikkada andaru tamatama hakkula gurinchi poradutunnatlu kanipistondi. Manchidi. Kaani antakante mundu mana badhyatalu entameraku nirvahistunnamo alochinchadi. Idi chaladu annatlu ekamga hakkula sanghalni erpatuchesukoni maree poradutunnaru. Adikuda ee manavahakkulni harisyunnarantu poradutondi robot meedano, jantuvula meedano kaadu saati manavude manava hakkulni haristunnadanta!! Havva enta sigguchetu!!! Maoist lenapudu prajalu anandamga lera? Police vyavastha raaka mundu samajaniki rakshana Leda? Ani adigite unnai ani cheppaka tappadu. Mari manishiki manishiki Madhya vairam enduku?manaku maname shatruvulamaa? Vipareeta dhoranula valana samajam asamanjasam ga pravartinchadaniki karanamedi? Ee pokadalu ilage konasagite bhavishat pramadamlo lo padinatte. Deeni pai kshetra sthailo charcha jaragali tadvara vache phalitalanu bhavishat taralaku andiste manavudu sampurna paripakvata chendinatle!!!

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..