30, జూన్ 2010, బుధవారం

కాలుతున్న కాశ్మీరంఇటీవల CRPF జవాన్ల కాల్పులలో మరణించిన విద్యార్థికి సంఘీభావంగా మొదలైన ఉద్యమం తమ భూభాగంలో అమలవుతున్న కల్లోల చట్టం వికృత రూపానికి వ్యతిరేకంగా సాగే దిశగా మారి అది ఉత్తర కాశ్మీరం నుండి దక్షిణ కాశ్మీరం వరకు పాకుతూ కాశ్మీరాన్ని అతలాకుతలం చేస్తోంది. కీలుబొమ్మ ప్రభుత్వం చేష్టలుడిగి తిరిగి సైన్యం సహాయాన్ని అర్థించి మరింతగా కల్లోల కారకమవుతోంది. చాన్నాళ్ళుగా కాశ్మీర్ లో జరుగుతున్న బూటకపు ఎదురుకాల్పుల సంఘటనలపై న్యాయాన్ని డిమాండ్ చేస్తున్న ప్రజలపై అక్కడ అమలవుతున్న దమనకాండ బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారు. ఉగ్రవాద నిర్మూలన ముసుగులో పారామిలటరీ దళాలు, సైన్యం చేస్తున్న అకృత్యాలు, యువకుల హత్యలు కొట్టుకుపోతున్నాయి. దీనిపై కాశ్మీరీలు చాన్నాళ్ళుగా తమ అసంతృప్తిని తెలియజేస్తున్నా వారిని పట్టించుకునే వారు లేరు. పాకిస్తాన్ బూచిని చూపించి కల్లోలితప్రాంత చట్టాన్ని అమలుచేస్తుండటంతో స్థానికంగా మాటాడే వారు ఏదో ఒక రూపంలో భయభ్రాంతులకు గురవుతున్నారు. మానవహక్కుల సంఘాలు ఈ చట్టాన్ని తొలగించి, సైన్యాన్ని వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఆందోళనలో భాగంగా CRPF వాళ్ళు పిల్లలు, ఆడవారనే విచక్షణ లేకుండా చావబాదుతూ, కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికె సుమారు 11 మందికి పైగా మరణించారు ఈ వారంలోపల. దీనిపై వెంటనే కేంద్రం స్పందించి తమ బలగాలను అదుపులో వుండేట్టు చూడాల్సిన బాధ్యత వుంది. స్థానిక పోలీసుల వైఫల్యంతో సైన్యం అక్కడ పోలీసు అధికారాలను చెలాయిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇంతవరకు ఆరోపణలకు గురైన ఎదురుకాల్పుల సంఘటనలపై న్యాయ విచారణ జరిపి బాధితులను ఆదుకొనడం ద్వారా వాళ్ళలో విశ్వాశాన్ని పెంపొందంచే కృషి జరగాలి. ఇది అత్యాశకాకూడదు.

7 వ్యాఖ్యలు:

 1. నేను నీబ్లాగు యొక్క ముఖ్య ఉద్దేశం ఎమీటి? ప్రభుత్వాన్ని నిందించటం తప్ప. ఎదో ఎ మీ ఎర్ర రంగు పార్టి వారు అధికారం లో ఉంటె ఇలాంటివి జరగవన్నట్లు రాస్తుంటావు. స్టాలిన్ గారు,మావో గారు, పోల్ పాట్ (కాంబోడియా) అందరు తక్కువ తినలేదు కదా. ఎంత మందిని చంపారో తెలుసుకునేది. మీ ఊరిలో కుచొని పెద్ద పెద్ద పదాలతో "కీలుబొమ్మ ప్రభుత్వం చేష్టలుడిగి " టపాలు రాస్తున్నావు. కాశ్మీరీలు చాన్నాళ్ళుగా తమ అసంతృప్తిని తెలియజేస్తున్నా వారిని పట్టించుకునే వారు లేరు. మరి కాశ్మీరి పండితుల బాధలను ఎవరు పటించుకున్నారు ?
  http://krishna-diary.blogspot.com/2010/06/blog-post_22.html

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "మానవహక్కుల సంఘాలు ఈ చట్టాన్ని తొలగించి, సైన్యాన్ని వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తున్నాయి. " మంచి డిమాండ్, అలాగే అదే మానవహక్కుల సంఘాలు బలవంతం గా బయటకు గెంటబడిన కాశ్మీరి పండితుల కుటుంబాల గురించి, వాళ్లను తుపాకీలతో, మానభంగాలతో బెదిరించిన శాంతికాముకులయిన ఉగ్రవాదుల గురించి, ఎటువంటి డిమాండ్ లు చేస్తున్నాయో, ఇంతకముందు ఎలాంటి డిమాండ్ చేసాయో చెబ్తారా?
  ఓ మరిచేపోయాను, మానవహక్కుల సంఘాలు అంటే, ఉగ్రవాద హక్కుల మరియు నక్సలైట్ హక్కుల సంఘాలు మాత్రమే కదా మన దేశంలో, సారీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. సాంబశివుడు గారూ వాళ్ళంతా ఎందుకు గానీ మన నెహౄ గారి పాలన నుండీ నేటి సోనియా వరకు ఎన్ని ఊచకోతలు జరిగాయో తెలియదా? మనమున్నది ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకోవడానికా? కాశ్మీరీ పండిత కుటుంబం పాలనలోనే ప్రస్తుతం వున్నాం...

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కిష్ణగారూ మానవహక్కుల సంఘాలు, ప్రశ్నించే వారు లేకపోతే ఇప్పుడున్న పాటి స్వేచ్చను కూడా మిగలనివ్వరు మన ప్రజాస్వామ్య పాలకులు...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మానవ హక్కుల సంఘాలు ఉండాల్సిందే, కాకపోతే ఆ so called మానవహక్కుల సంఘాలవాళ్లకు కాశ్మీరి పండితుల దగ్గరకు వచ్చేవరకు నోరు ఎందుకు పెగలదు? కాశ్మీరి పండితులు మానవులు కాదా? నేను ప్రశ్నిస్తున్నది మానవహక్కుల సంఘాల పెరుతో చలామణి అవుతున్న కుహానా హక్కుల వాళ్ల గురించి మాత్రమే!!

  ఇక అక్కడ నుండి ఎప్పుడో వచ్చేసిన నెహ్రూ కుటుంబం, కాశ్మీర్ తో ఎటువంటి సంభంధ బాంధవ్యాలు లేని ఇందిర చేసిన ఘాతుకాలు ఎమయినా ఉంటే, వాటికి సగటు కాశ్మీరి పండితులు భాద్యత వహించాలా? అంటే మన బంగారమ్మ తింగరి పనులకు సగటు ఇటాలియన్ బాధ్యత వహించాలి అంటారు అంతేనా? లేక బంగారమ్మ కూడా కాశ్మీరి కుటుంబం అంటారా?
  చిన్న అనుమానం , మా ప్రవీణ్ అన్నాయ్ ఏమయినా కలలోకి వచ్చాడా ఈ మద్యన?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. దేశమంటే మట్టేనని మనుషులు కాదు అనుకున్నపుడే ఇలాటి అవగాహన పుడుతుంది.కృష్ణ,సాంబ శివుడుల అవగాహన ఇలాంటిదే.అర్దరాత్రి తమ ఇళ్ళవద్దకు సైనిక వాహనాలు ఎందుకొచ్చాయో,బలవంతంగా తమను ఎందుకు అక్కడనుంచి ఖాళీ చేయిస్తున్నారో కూడా తెలియ కుండానే తమ దేశంలోనే కాందీశీకులుగా మారిన దురదృష్టవంతులు కాశ్మీరి పండితులు. సైనిక బలగాల ఛీఫ్ కృష్ణ్రారావ్ ఆతరువాతెప్పుడో పండిట్ లకు తీవ్రవాదుల నుంచి ముప్పు వుందని ప్రకటించేంతవరకు కూడా వారికి ఆ విషయం తెలియదు పాపం. ఆత్మగౌరవం కోసం పోరాడే ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అప్పటి కాశ్మీర్ సైనిక పాలకుల లక్షం.కుట్రకు బలైన పండిట్ల పై చూపె సానుభూతి హక్కుల కోసం పోరాడే వారి పట్ల ద్వేషం గా మార రాదు.ప్రభుత్వాల కళ్ళజొడుల నుంచి సమ్స్యలను చూడకండి అంతా తల కిగ్దులుగా కనిపిస్తుంది.
  _ఎన్ వి సుబ్బారెడ్డి

  ప్రత్యుత్తరంతొలగించు
 7. సుబ్బారెడ్డి గారు, మీ అభిప్రాయం తో ఏకీభవించ లేక పోతున్నదుకు క్షమించండి. ఎవరి అభిప్రాయాలు వారి వి. మేమీ దేశమంటె మట్టి అనుకునే మనుషులం కాదు అని తెలుసుకోంది. సానుభుతి చూపినంత మాత్రాన మీరు సాధించేది ఎమీ ఉంట్టుంది.

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..