ఈ నెల 10 న నల్గొండలో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా జరుపతలపెట్టిన సభకు హాజరు కావద్దంటూ విప్లవ రచయిత వరవరరావుకు, సభ నిర్వాహకుడు ఉదయ్ లకు చంపుతామంటూ చత్తీస్ఘడ్ చిరుతల పేరుతో ఫోన్ లో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇలా ప్రజా సంఘాల వారికి ఏదైనా సభ నిర్వహిస్తామంటే దానిని భగ్నం చేసేందుకు, సభకు హాజరయ్యే వారిని బెదిరించేందుకు ఇలా ఫోన్ ల ద్వారా బెదిరించడం, అలాగే ఇంతకు ముందు సుమారు 10 సం.ల క్రితం ఆజం అలీకి కూడా పౌరహక్కుల జిల్లా సదస్సు నిర్వహించేటప్పుడు బెదిరించి ఆ తరువాత హత్య చేయడం జరిగింది. వీటి వెనక వున్నది పోలీసు అధికార యంత్రాంగమేనన్నది బహిరంగ రహస్యం. ఆజం అలీని, పురుషోత్తంలను హత్య చేసింది నయీం అని ఈ మధ్య నయీం తల్లికూడా తన కొడుకును ఎక్కడ దాచారో చెప్పాలంటూ చేసిన ప్రకటనలో పేర్కొంది. లొంగిపోయిన మాజీలను ఇలా క్రిమినల్స్ గా తయారు చేసి వాడుకుంటున్న పోలీసు యంత్రాంగం ఇది ఏమి ప్రజాస్వామ్యమో చెప్పాలి. తమకు ఎదురులేకుండా చేయడానికి ఇలా కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ చేయించడం వారికి పరిపాటిగా మారింది. మరల ఈ రెండు రోజులలో కొత్తగా చత్తీస్ఘడ్ చిరుతల పేరుతో మరో అవతారమెత్తారు. గ్రీన్ టైగర్స్, బ్లాక్ టైగర్స్, సీమ టైగర్స్, నల్లతాచులు మొ.న కౄర జంతువుల అవతారాలు అన్నీ అరవిందులవారి రహస్య భటుల దశావతారాలేనని ప్రజలు గ్రహించారన్న విషయం తెలుసుకొని యిలాంటి నీచపు పనులకు పాల్పడరాదని విన్నపం.
source:http://www.andhraprabha.in/state/article-117530
అరవిందరావు గారు ఇప్పుడు అక్కడ లేరండి !
రిప్లయితొలగించండిఆయన పనితనం మెచ్చి ప్రస్తుతం చత్తీస్ఘడ్ రాష్ట్రంవారు కోరి పిలిపించుకున్నారు. ఎక్కడ వున్నా ఆ బుద్ధి పోదుకదా? అందుకే చత్తీస్ఘడ్ చిరుతలు పుట్టుకొచ్చాయి.
రిప్లయితొలగించండిOh is It ?
రిప్లయితొలగించండిnijangaa pululu,chirutalu,pamulaite chattisgadlo emi jarugutundo telusu,ivi paper,phone janthuvulu.
రిప్లయితొలగించండి@gajula మీరిచ్చిన ధైర్యానికి ధన్యవాదాలు సార్.
రిప్లయితొలగించండి