16, సెప్టెంబర్ 2010, గురువారం
మసీదును పునర్నిర్మించలేమా?
9/11 సంఘటన తరువాత ఆ ప్రాంతంలో మసీదును పునర్నిర్మించిన అమెరికా ప్రజల ఔదార్యం మనలో ఎందుకులేదు? హిందువులుగా చెప్పుకునే ఓ అరాచక గుంపు బాబ్రీ మసీదును కూలగొట్టి ఇన్నినాళ్ళ తరువాత కూడా అక్కడ మసీదును పునర్నిర్మించలేని మనది మత సామరస్యం కల దేశంగా చెప్పుకోగలమా? ఆ సంఘటనతో దేశంలో పెరిగిన అభధ్రతా భావం ఎలాంటి దారుణ పరిస్థితులకు దారితీసిందో మనకందరికీ అవగహన లేదా? ఒక వర్గంపై పెరిగిన దాడులు, తదనంతర పరిణామాలు ఎంతటి అల్లకల్లోలాన్ని, అంతర్గత వైరుద్యాలకు గురిచేసిందో తెలిసినదే? అయినా మతాన్ని ఎవరికి వారు అనుసరించే మార్గంగా వదిలేయకుండా దానిని ఓటు బ్యాంకుగా వాడుకోజూస్తున్న రాజకీయ పార్టీల వలన కలుగుతున్న అంతర్గత అభద్రతా భావం మనుషుల మధ్య ఎడం పెంచిందే తప్ప సామరస్యం మాటలకే పరిమితం చేయడం నిజం కాదా? కావున కూలగొట్టిన చోట వారి ప్రార్థనా మందిరాన్ని పునర్నిర్మించి భారతీయతను చాటుకోలేమా? ఈ నా శీర్షికే చాలా కోపం తెప్పించి వుండొచ్చు. కానీ ఓకమారు పునరాలోచించగలమేమోనని...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
9/11 సంఘటన తరువాత ఆ ప్రాంతంలో మసీదును పునర్నిర్మించిన అమెరికా ప్రజల ఔదార్యం >>
రిప్లయితొలగించండిWhat a joke... ROFL
మంచి టపా. నాకు ఈ టపా నచ్చడానికి ఇందులోని విషయాలకన్నా, రచయిత హృదయాంతరాళలోంచి వచ్చిన టపా గా కలిగిన భావన కారణం కావచ్చు.
రిప్లయితొలగించండినాకైతే, మసీదు కట్టడం లేక మందిరం నిర్మించడం కన్నా, ఆ రెండింటిలో ఏది జరిగిన తరవాతైనా ఉన్మాదానికి లోనవ్వకుండా ఒక సమాజంగా మనం మత సామరస్యాన్ని ప్రదర్శించగలగితే బావుండనిపుస్తుంది. మెజారిటీ ప్రజలు (రెండు మతాల వారూనూ) జరిగేది నచ్చినా నచ్చక పోయినా పరిణతి చూపిస్తారనే నమ్మకం వుంది.
ఒకవేళ మనం భయపడుతున్నట్టు భావోద్వేగాలతో ఎవరైనా రాజకీయం చేయాలని ప్రత్నిస్తే, దాన్ని విఫలం చేయడం ద్వారా భవిష్యత్తు రాజకీయాలకి మార్గనిర్దేశం చేసే అవకాశం సామాన్య పౌరులు చక్కగా వినియోగించుకుంటారని ఆశిద్దాం.
తేనె తుట్టెని కదిపే కన్నా అలా వదిలేస్తే మంచిది కాదా?
రిప్లయితొలగించండి9/11 సంఘటన తరువాత ఆ ప్రాంతంలో మసీదును పునర్నిర్మించిన అమెరికా ప్రజల ఔదార్యం మనలో ఎందుకులేదు?
రిప్లయితొలగించండి__________________________________________________
They are not rebuilding the mosque on the WTC site. They are building a mosque cum community center 2 blocks ( streets ) away from the site and many Americans are objecting to even that!
బాబ్రీ మసీదును కూలగొట్టి
__________________
If was not a mosque in 1992. It was just a structure. Moreover, the courts are yet to decide whether the mosque was built over the ruins of a temple. If the court feels so, then will you support the construction of the temple?
మీ బొంద.... వాళ్ళు పునర్నిర్మించారా.. ?.. కొత్తది కడుతున్నారు...
రిప్లయితొలగించండిఅక్కడ రామాలయాన్ని నిర్మించలేమా?
రిప్లయితొలగించండిఇకపోతే
>>9/11 సంఘటన తరువాత ఆ ప్రాంతంలో మసీదును పునర్నిర్మించిన అమెరికా ప్రజల ఔదార్యం
??????????????????????
good one !
రిప్లయితొలగించండిమంచు,భరద్వాజ్,కిరణ్ సార్స్ అక్కడ జరిగిన అంత పెద్ద సంఘటన తరువాత వారి మతపరమైన భావాలను గౌరవించే చర్యగా తీసుకున్నా అది. కొత్తదో, పాతది తిరిగి కట్టడమో నాకు అవగాహనలేదు. కానీ గడ్డం వున్నవాళ్ళని, ఖాన్ అన్న పేరున్నవాళ్ళని నిలువెళ్ళా శల్యపరీక్షచేసి కాని తమ దేశానికి రానివ్వని వారు ఇలా చేయడం ఎందుకో ఇది రాయడానికి ప్రేరేపించింది. అలా అని ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాలస్తీనాలపై జరిగిన జరుగుతున్న మారణకాండను మరిచిపోలేము..
రిప్లయితొలగించండిఅది ప్రార్థనామందిరంగా వాడకపోయినా దానిని కూలగొట్టడం ద్వారా వారికి చేసిన గాయం మాన్పలేమా?
చెప్పు దెబ్బలు-పూలదండలు సార్ తేనె తుట్టనయినా అలా వదిలేస్తే అందులోని తేనెను పొందలేం కాదా? ఈ నాటి ఆర్థిక, సామాజిక సంక్షుభిత కాలంలో అంతా కలిసికట్టుగా పనిచేస్తేనే కాదా మనం గట్టిగా నిలబడగలం.. తప్పంటారా? వున్న శ్రమశక్తిని, సహజవనరులను విదేశాలకు కారుచౌకగా అమ్మివేస్తూ దళారి పాలక వర్గాలు మనలో మనకు చిచ్చుపెట్టి అక్రమంగా లక్షలకోట్లు సంపాదిస్తున్నారు. ఈ మంచు తెరలను తొలగించుకోవడం మన చేతులలోనే వుంది. కాదంటారా?
రిప్లయితొలగించండిWeekend Politician & a2zdreams ధన్యవాదాలు. న్యాయస్థానం తీర్పు వెలువడనున్న తరుణంలో దానిని తమ తమ రాజకీయ సోపానంగా వాడుకోజూస్తున్న రాజకీయ క్షుద్రక్రీడాకారులనుండి మనల్ని మనం రక్షించుకోవాల్సిన సమయమిది. నాకై నాకు మందిరాలపైనా, మసీదులపైనా నమ్మకంలేదు. కానీ ఒకరి నమ్మకాన్ని గౌరవించాల్సిన అవసరమిది. ఎవరికి వారు సత్యాన్ని గ్రహించాల్సిన ఆపన్న సమయమిది. మరో సంఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడకూడదని, తద్వారా సామాన్యులు బలవ్వకూడదన్న ఆశతో ఈ నా అభ్యర్థన..
రిప్లయితొలగించండిభాస్కర రామి రెడ్డి సార్ అక్కడ ఇరువర్గాలకు సమ్మతమైనవి రెండూ నిర్మించలేమా?
రిప్లయితొలగించండిఅసలు అమెరికన్స్ అక్కడ నిర్మిస్తున్నారని ఎవరు చెప్పారు??? మీకు సొమ్ముంటే వైట్ హౌస్ పక్కన కూడా రామాలయం నిర్మించొచ్చు...
రిప్లయితొలగించండికానీ గడ్డం వున్నవాళ్ళని, ఖాన్ అన్న పేరున్నవాళ్ళని నిలువెళ్ళా శల్యపరీక్షచేసి కాని తమ దేశానికి రానివ్వని వారు ఇలా చేయడం
రిప్లయితొలగించండి__________________________________________________
Wait a minute - The mosque is being built by New York muslims with funds from various US muslim communities and Saudi Arabia.
So American muslims are building a mosque for themselves and some of the non muslims are, in fact, objecting to that. The American govt is nowhere involved in this, except for the lip service (support)
భాస్కర రామి రెడ్డి సార్ అక్కడ ఇరువర్గాలకు సమ్మతమైనవి రెండూ నిర్మించలేమా?
రిప్లయితొలగించండిమీరు టపాలోనే ఈ మాట చెప్పుంటే బాగుండేది. అమెరికాలో గ్రౌండ్ జీరో వద్ద మసీదు వద్దని 80% పైగా చెప్పారు. అక్కడ వాల్లు మసీదు కడుతున్నారు అంటే దానికి కారణం కారణం వాల్లు ఆస్థలానికి యజమానులు అయ్యి ఉండడమే. That's a private property. అక్కడ వాల్లకు నచ్చింది చేసుకోవచ్చు. చట్టపరంగా ఎవ్వరూ దాన్ని అడ్డుకోలేరు. అయినా సరే దాన్ని అడ్డుకొని తీరతామని మెజారిటీయులు పోరాటం చేస్తున్నారు. మీరు దాని గురించి చదవాలనుకుంటే ఈ వారి అఫిసీల్ బ్లాగును సందర్శించండీ.
No Mosques At Ground Zero
అక్కడ మసీదును సపోర్టు చేసే వారెవ్వరో తెలుసా? లెఫ్టిస్టు మీడియా, లేఫ్టిస్టు జనాలు. వాల్లందరూ పాలస్తీనా ను సపోర్టు చేసిన వారే. అంటే ఇక్కడ కూడా రాజకీయాలు చాలా ఉన్నాయి. ఇమాం చెబుతున్నట్టు ముస్లిములకు పశ్చిమ దేశాలకు మధ్య వారధి నిర్మించడం కాదు. అయినా లెఫ్టిస్టులకు ముస్లిములంటే అంత ప్రేమెందుకు? రాజకీయ అవసరాలు కాదా? మరి మరొకరిని రాజకీయాలు అని వేలెత్తి చూపడమెందుకు?
అది ప్రార్థనామందిరంగా వాడకపోయినా దానిని కూలగొట్టడం ద్వారా వారికి చేసిన గాయం మాన్పలేమా?
రిప్లయితొలగించండి-----
కోట్లాది హిందువులని చంపి చేసిన గాయాలు మీకు కనపడవు, ఎదో ఎక్కడో ఒక మసీదు పడిపోతే, లబలబలాడుతూ పరిగెత్తుకొచ్చేస్తారు, ఏమున్నది సారు, అసలు అన్నీ పడగొట్టేసి చక్కగా మసీదులు కట్టుకుందాం అప్పుడు తీవ్రవాదులు కుడా దేనిమీదా దాడిచేయరు కదా..
పార్లమెంటు మీద దాడిచేశారుగా, దానికి సూచికగా చక్కగా కట్టీసుకుందాం ఓ మసీదు.
>>
అక్కడ జరిగిన అంత పెద్ద సంఘటన తరువాత వారి మతపరమైన భావాలను గౌరవించే చర్యగా తీసుకున్నా అది. కొత్తదో, పాతది తిరిగి కట్టడమో నాకు అవగాహనలే
>>
అదే, వాళ్ళ మతపరమైన భావాలను గౌరవించే చర్యే, గల్ఫ్ నుంచి డబ్బులు తెచ్చి కోట్లాది డాలర్లు (అదే గల్ఫ్ వెళ్ళి ఒక గుడి కట్టు తల తీసివేస్తారు బహిరంగంగా), ఆ దాడిలో చచ్చిపోయిన వారి కుటుంబాలకి ఆ దాడి ఎప్పుడూ గుర్తొచ్చేట్టుగా ఆ పక్కన స్థలంకొని మరీ కడుతున్నారు మసీదు, మీ కమ్యూనిష్ట్ లెక్క ప్రకారం, ఆవే డబ్బులతో లక్షల పేద ముస్లీంల బ్రతుకులు బాగు చేయొచ్చు, అవే డబ్బులతో, కానీ పుండుకి కారం రాయాలిగా.
ఇలాంటిదే హిందువులు చేస్తే, రెచ్చగొట్టే చర్యగా తమలాంటి మేధావులు భావించి, వ్యతిరేకిస్తారు.
ఇటు హిందువులకి రామాలయం కావాలి అంటున్నారు. అటు ముస్లిం ల మసీదు పడగొట్టారు. ఇద్దరికీ సమన్యాయం జరగాలంటే ఒకే రూఫ్ క్రింద రాముడు, రహీము ఉండేటట్లు ఏర్పాట్లు చేయాలి. అందుకు అందరూ కలిసి కృషి చేయాలి. ఒక్క రామాలయం విషయంలోనే నేను బిజెపి ని వ్యతిరేకిస్తాను.
రిప్లయితొలగించండిశ్రీ రామ మందిరం హిందూ స్వాభిమాన చిహ్నం
రిప్లయితొలగించండిమనం స్వసంత్ర్యం పొందిన తర్వాత మౌంట్ భటాన్ రోడ్డు
మహాత్మా గాంధి రోడ్డు గా మార్చగా లేని తప్పు ...!
దేశం లో అనేక చోట్ల ఇంగ్లాండ్ రాణి ఎలిజేబిట్ విగ్రహాలను కూల్చి మన దేశ జాతీయ విరుల స్థూపాలను నిర్మించగా లేని తప్పు
ఒక విదేశీ దురాక్రమదారుడైన బాబరు భవ్య రామ మందిరాన్ని నెల కూల్చి
తన పేర నిర్మించుకున్న శకటాన్ని బాబ్రి మాజిద్ అని పిలవడమే తప్పు
ఓ నా సెక్యులర్ సోదర నీకు నా ప్రశ్నలివే సమాదానం కోసం ఎదురు చూస్తున్నా .....! మీకు ప్రశ్నావళి ఇక్కడ
http://rastrachethana.blogspot.com/2010/05/1.html
marinni
అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం కూడా కొంచెం పరవాలేదు, స్వంత అల్లుడే కాబట్టి.
రిప్లయితొలగించండిమీ తలతిక్క భావనలు, పగటి కలలు అటుంచితే, ఈవెర్రి వాదన సపోర్త్ చేసినవాళ్ళు మీమీ ఆస్థుల్లో సగం లోకల్ మసీదుకు రాసివ్వండి, ఆతరవాత తీరిగా పగటికలలు కనండి.
బాబర్ సుబేదారు అక్కడ వున్న గుడి కూల్చి దానిపైన మసీదు కట్టాడని 1850 లోని బ్రిటిష్ రికార్డ్స్ లో వున్నాయి. ఆర్కియాలజీ వాళ్ళు ఆలయ స్థంభాలను కట్టడం కింద వున్నట్టు గుర్తించారు. విదేశీ దురాక్రమణదారులు పడగొట్టి కట్టుకున్న ఎన్నో మశీధుల్లో అదొక పాడుపడిన మసీదు మాత్రమే, పైగా బాబర్ నామాలో దాని అతను సందర్శించిన ప్రస్తావన కూడా లేదంటారు. అది హిందువులకు తమ శ్రీరాముడు పుట్టిన స్థలం. కాసింత ఇంగితజ్ఞాం వున్న ఎవరికైనా అది ఎవరు ఎవరికి ఇచ్చేయడం న్యాయమో తెలియాలి. రాజ్యాంగం మీద బ్లాగుల్లో వ్యాఖ్యానాలు చేసేవాళ్ళకు ఆమాత్రం తెలియకపోవడం ఆశ్చర్యం.
9/11 ప్లేస్లో మసీద్ కట్టాలని ఓ ముల్లా అనగానే కట్టేసారని అనుకున్నారా! హమ్మ్మ్మ్.. చెగువేరా మీకీ తంపులమారి తగువేలరా? :)
>> భాస్కర రామి రెడ్డి సార్ అక్కడ ఇరువర్గాలకు సమ్మతమైనవి రెండూ నిర్మించలేమా?
రిప్లయితొలగించండిఅలా అని మీరు ఈ పోస్టు వ్రాసే ముందు వ్రాయాల్సింది.
మీకు అక్కడ మసీదు కూలగొట్టడం మూలంగా మాత్రమే భారత దేశ మతసామరశ్యం గుర్తుకు వచ్చింది కానీ , ఇలాంటి విధ్వంశాలు హిందువులపై వారి ప్రార్థనా మందిరాలపై జరిగితే మతసామరశ్యం గుర్తుకు రాదు.
నీహారిక గారు మీ ఆశ సమర్థనీయం. అలా జరిగినట్లైతే సామాన్యుని కల నెరవేరినట్లే..
రిప్లయితొలగించండిభాస్కర్ సార్ మెజారిటీ వర్గం చేసే దాష్టీకాన్ని ఖండించడం తప్పుకాదు. దానికి ప్రతిగా జరిగినదానికి బాధపడక తప్పదు. జరిగేదాని వెనకున్న కారణాలను గుర్తించి వాటిని నివారించే ప్రయత్నం ఎక్కడా కనబడటంలేదు. ఇంకా మూర్ఖంగా ఆలోచిస్తున్న ఇరువర్గాలను చూస్తే జాలేస్తుంది. ఏదో ఒక అశాంతిని సృష్టించి వారి వ్యాపారాలను వేగవంతం చేసుకో జూస్తున్న కార్పొరేట్ పాలకవర్గం వున్నంతకాలం, వారికి వంతపాడె మీడియా ఇవన్నీ మన బుఱలు పాడుచేస్తున్నంత కాలం సామరస్యం అత్యాశే కదా?
రిప్లయితొలగించండిmeeku cheppalsinademumdika meeku feeding abhipraayaalunnaayi kanuka mee abhipraayam maaradu
రిప్లయితొలగించండి9/11 సంఘటన తరువాత ఆ ప్రాంతంలో మసీదును పునర్నిర్మించిన అమెరికా ప్రజల ఔదార్యం మనలో ఎందుకులేదు?
రిప్లయితొలగించండిఅంటె మీరంటున్నది అమెరికా మసిదు కట్టుకొమందని మనము ఇక్కడ వాళ్ళను మసిదు కట్టుకోనివ్వాలనా మీ ఉద్దేశం ....
అప్పుడు twin towers ఉన్న చోట చర్చ కాని ఉంటే వాళ్ళు ఇదే ఔదార్యం చూపిస్తారా ... మనతో పాటు అన్ని మాతాను విలువ ఇస్తున్నా మన దేశంకంటే ఇంకే దేశం గొప్పది కాదు అందుకే నిర్ణయాన్ని కోర్టు కు అప్పగించారు .. హిందువులకు ఉన్న majaority కి అక్కడ దేవాలయాన్ని కట్టుోవడం ఎంత సేపు చెప్పండి .. ఇదే మస్జీద్ పాకిస్తాన్లో ఉంటే ెం జరుగుతుందో చెప్పాల్సి పని లేదనుకుంటాను ......