2, సెప్టెంబర్ 2010, గురువారం

ఇంతకీ ప్రతిపక్షం ఎవరు?మొన్నటి అణు పరిహార బిల్లు ఆమోదించడంలో కాంగేయులు, కాషాయులు
ఒకరిపై ఒకరు పోటీ పడి బిల్లును ఆమోదించారు. ఏదో ప్రజల పక్షాన మాట్లాడినట్లుగా నాలుగు రోజులు అది మార్చి, ఇది మార్చి అని చెప్పుకొని చివరకు పెద్దగా ఏ మార్పూ లేకుండానే అమెరికోడు గీసిన గీత మధ్యలో నిలబడి జోహార్ హుజూర్ అన్నారిద్దరూ. ఈ మద్యలో సందట్లో సడేమియాలాగా సిపిఎం నేతలు ఇలాంటి బిల్లులను నిర్ద్వందంగా వ్యతిరేకించాల్సింది పోయి పరిహారం వేలకోట్లలోకి పెంచమని విన్నపాలు వినిపించారు. ఎలాగూ వీరి ఓటుతో పనిలేదు కాబట్టి ఎవడూ వినిపించుకోలేదు. ఈ బిల్లు వలన విదేశీ సంస్థలు మన దేశంలో అణువ్యాపారానికి అడ్డంకులు తొలగించుకున్నాయి. మన దురదృష్టంకొద్దీ ఏమైనా జరిగితే భోపాల్ లో లాగా అతి తక్కువ పరిమణంలో పరిహారాన్ని దులపరించి పోవచ్చు. అసలు ప్రాణలరించేది, పర్యావరణాన్ని విపరీతంగా దెబ్బతీసేది, మానవాళి ఉనికికే ప్రమాదకరమైన అణువ్యాప్తికి ఇలా ఆమోదముద్ర వేయడం ఎవరి ప్రయోజనాల కోసం? ఇన్నాళ్ళుగా ఏదో విధంగా బతుకీడుస్తున్న జనావళికి ఈ కొత్త ముప్పును గుండెలపైకి తెచ్చారు. భోపాల్ దుర్ఘటన తరువాత ఆ విదేశీయునికి చంకల్లోకెక్కించుకొని సాగనంపిన ఈ పాలకులు మన ప్రాణాలకు ఎలా బాధ్యత వహిస్తారని ఆశించగలం?

అందుకే వీళ్ళకి మనమే నిజమైన ప్రతిపక్షం కావాల్సిన అవసరమెంతయినా వుందన్నది అందరికీ గ్రహింపులోకి రావాల్సి వుంది..

6 వ్యాఖ్యలు:

 1. anna,enduke lolli neevu kuuda anarade 'mera bharat mahaan' ani,e deshamlaa puttinanduku garvincharaade,deeni thalli manaku thindaaniki lekha poyinaa chandrayaanku 425kotlu karchupedtunnamani chaathipongincharaade,a re manadeshamlaa varadaloste pattinchukom gaani paraayideshaaniki saayam chestaamani gonthetthi aruvaraade,anna-yennani cheppalne,nee kaalmoktaa neevu kuuda bharatha maathaki jai,mera bharath mahaan,saare jagaase achha ane.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. gajula మిత్రమా ఇది నీకు లొల్లిగా కనిపిస్తోందా? ఏమైనా నీ బాధను, దేశంపట్ల నీకున్న నిజాయితీ గల ప్రేమను హర్షించకుండా వుండలేను. ఏమీ చేయలేక పోతున్నామన్న ఆవేదన నీ వ్యాఖ్యానంలో కనిపిస్తోంది. కానీ మన భావాన్ని వ్యక్తీకరించడానికి సంకోచం ఎందుకుండాలె? ఏమైనా కొంతమంది మిత్రులనైనా ఆలోచింపజేయడానికి ఉపయోగపడే లొల్లి చేయడంలో తప్పులేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. In many countires the liability is unlimited. It is sad that they want to limit the liability of the supplier and the government of India also in case of a nuclear accident. When the liability is unlimited then we know they will atleast make honest efforts to avoid accidents.

  Good post. You raised an important thing.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. sir, we loosed original politicians like patel,sastry,Chandrasekhar. the politics right now are subordinates for money, sex, caste, religion. ultimately all parties are cheaters.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @vajasaneya:మిత్రమా మీరన్నది నిజమే. కానీ ప్రజలు చైతన్యవంతులై వాళ్ళకు తగిన నాయకత్వాన్ని వారే రూపొందించుకోగలగాలి. ప్రకృతివరణం సహజ ధర్మం కాదా?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కెక్యూబ్ గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

  హారం

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..