21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఎందుకీ శాంతి జపం?


మనమున్నదిప్పుడు రోజుకో దినాన్ని జరుపుకోవడానికిలా వుంది. లేని దానిని వూహించుకొని భ్రమలలో జీవించడానికి కాకపోతే ఇలా శాంతిదినం, ప్రజాస్వామ్య దినం అంటూ జరుపుకోవడమేమిటి. ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య వైషమ్యాలు పెంపొందింపజేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న అగ్రరాజ్యానికి వంతపాడే UNO ఆఖరుకు శాంతికోసం ఓ దినాన్ని జరుపుకోమనడం ఎంత దౌర్భాగ్యం. హాయిగా గుండెలమీద చేయి వేసి పడుకొనే మనిషి ఎక్కడా కనబడని రోజులివి. దిన దిన గండం నూరేళ్ళాయుష్షులా మనమధ్య పేరుకుపోతున్న అభద్రతా భావానికి కారకులైన వారే శాంతికోసం ప్రతినలుబూనండి, ప్రార్థనలు చేయమనడం హాస్యాస్పదం కాదా? శాంతి ఎలా లభ్యమవుతుందో తెలియదా? మన మధ్యనున్న శాంతిని దూరం చేస్తూ ఏమీ ఎరగనట్లు పాలక వర్గాలు మనలను భ్రమలలో ముంచెత్తుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కావాల్సిన సమతను దూరం చేస్తూ ఏ కొద్దిమందో కోట్లకు పడగలెత్తే కార్యాచరణకు పూనుకొని, దానిని వ్యతిరేకించి సమన్యాయం, సమవాదం, నిజమైన స్వేచ్చా స్వాతంత్ర్యాలకోసం పరితపించే వారిపై ఉక్కుపాదం మోపుతూ, అలజడులకు, ఆందోళనలకు కారకులవుతూ శాంతి జపం చేసే ఈ గోముఖ వ్యాఘ్రాలను సంఘటితంగా ఎదుర్కోకపోతే నిజమైన శాంతి ఎప్పటికీ రాదు అన్నది సత్యం కాదా?

3 వ్యాఖ్యలు:

  1. అమెరికా ఇరాక్ మీద దాడి చేసినపుడు ఏమి పీకింది u .n .o ,అప్పుడు శాంతి గుర్తుకురాలేదా ?ప్రపంచములో ప్రజల మద్య శాంతి నెలకొనాలంటే మారాల్సింది పాలకులు ,uno లాంటి సంస్థలు మాత్రమె .

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఇరుపక్షాల వాళ్ళూ తమది ధర్మయుద్ధం అనే అనుకుంటారు.దేవతలు రాక్షసులు ధర్మం తమ పక్షానే ఉందని చెబుతూ యుద్ధం చేసుకున్నారు.అసలు నరహత్య లు హింస తో కూడిన యుద్ధం అనేదే అధర్మం .అహింస పరమ ధర్మం కాబట్టి అహింస తో కూడిన యుద్ధమే ధర్మయుద్ధం అవుతుంది. ఉదాహరణకు గాంధీ గారు నడిపిన స్వాతంత్రోధ్యమం సత్యాగ్రహం నిరాహారదీక్ష లాంటివన్నీ ధర్మపోరాటాలు.

    ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..