31, డిసెంబర్ 2010, శుక్రవారం
మరపు రాని మనకాలం వీరుడు సద్దాం
నవ్వుతూ తలవంచక
గుండెల్నిండా ఊపిరితో
ఎత్తిపట్టిన చాతీతో
నిటారుగా నిలిచిన వెన్నెముకతో
కాలు తన నేలపై గట్టిగా అదిమి పట్టి
శతృవు గుండెల్లో బెదురుపుట్టిస్తూ
తన జాతి పరువుకోసం,
పంతం కోసం ఒక్కడై,
తను ఒక్కడే వీరుడై,
కోల్పోయిన దానిని చివరి నిమిషంలో
అంతటా జేజేలు ద్వారా పొందిన
ఒకే ఒక్క వీరుని మరణం
ది గ్రేట్ సద్దాం హుస్సేన్ అబ్ద్ అలి మజ్ది తిక్రితి
మన కాలం వీరుడు...
అందుకో మా జోహార్లు సద్దాం
అగ్ర రాజ్యపు దురహంకారానికి నిలువెత్తు సాక్ష్యం
నీ నేలపై ఒలికిన లక్షలాది మంది క్రొన్నెత్తురు
దాని పాపం ఊరికే పోదులే..
ఈ కుహనా ప్రజాస్వామ్యవాదులు,
స్వేచ్చావాదులు
నీ నవ్వు ముందు బలాదూర్ కాకపోరు
నువ్వెత్తి పట్టిన మొండి ధైర్యమే మాకు ఆదర్శం
అబ్బురపరిచిన నీ మొక్కవోని ధీరత్వం
ఎప్పటికీ ఈ నేలపై స్వాతంత్ర్య కాంక్ష
కలిగిన వారి చేతిలో
ఝెండాగా ఎగురుతూనే వుంటుంది..
బాగ్ధాద్ నెలవంక సాక్షిగా
ఇది శాశ్వతం, సత్యం..
(సరిగ్గా నాలుగేళ్ళ క్రితం నిన్నటి రోజున సద్దాం పాశ్చాత్య దురహంకారుల చేతిలో ఉరితీయబడ్డాడు)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
sssssssssssssssssssssssssssssssssss
రిప్లయితొలగించండిsaddam true in iraki
రిప్లయితొలగించండిఉస్తాజ్ కెక్యూబ్ ..అనా ఇల్లాల్ ఇంత మజ్బూత్ ముషాఆరఫ్ సద్దాం షుక్రాన్ యా హబిబీ కెక్యుబ్ సార్.
రిప్లయితొలగించండిసద్దాం రియల్ అబ్బాస్ ఇన్ (G.C.C.)
రిప్లయితొలగించండిఅంతటా జేజేలు ద్వారా పొందిన
రిప్లయితొలగించండిఒకే ఒక్క వీరుని మరణం
ది గ్రేట్ సద్దాం హుస్సేన్ అబ్ద్ అలి మజ్ది తిక్రితి
మన కాలం వీరుడు...
అందుకో మా జోహార్లు సద్దాం
నిజంగా సద్దాంను ఒక వీరునిగా చిత్రీకరించే వారున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. హిట్లర్కు ఫాన్స్ ఉన్నారుగా ఇప్పటికీ అని సరిపుచ్చుకోవాల్సిందే.
రిప్లయితొలగించండిఒక జాతి కోసం నిలిచిన వీరుడా? "అమెరికాపై ఆగ్రహం" నిజంగా మనల్ని ఇంతగా గుడ్డి వాళ్ళను చేస్తుందా? కుర్దులు, మిగితా మైనారిటీలను వదిలేద్దాం వాళ్ళు "జాతి" వాళ్ళు కాదు కదా పాపం. జాతి వారయిన ఇరాకీలు నిజంగా సద్దాం కింద సుఖంగా ఉన్నారా? వేరే దేశానికి పారిపోయ్యారని సొంత అల్లుళ్ళను చంపించిన వాడికి నివాళా?
ఒక వ్యక్తిని ఇంతగా పోగిడేప్పుడు వ్యక్తిగతంగా అతనేం చేసాడో బేరీజు వేసుకోవాల్సిన భాద్యత మనది.అంతే కాని మన శత్రువు శత్రువు అని మేచ్చేసుకోవటం ఎంత విజ్ఞత?
నచ్చటం అనేది వ్యక్తిగతమే. కాని ఒక క్రాంతికారుడిగా నియంతను ప్రజా వేదికలపై పొగిడితే వ్యతిరేకించకపోవటమూ తప్పే అని నా భావన. అది మోడీ అయినా కానీండి సద్దాం అయినా కానీండి.
Hi,
రిప్లయితొలగించండిPlz circulate this mail for Telugu Book Readers
It Contains Universal knowledge with so many thoughts
New book realease (Naa Baavanaalochana) Jan 2011
For Contact : 9741005713
Thanks,
Nagaraju G
I don't understand why you are praising Saddam.. I heard as he is a detector..
రిప్లయితొలగించండిపండు సర్ః ఆయనకు ఆయన నియంతయినా ప్రపంచానికంతటికీ నియంతైన అమెరికాను తన చివరి క్షణం వరకు ఎదిరించిన వాడిగా ఆయనను గుర్తిద్దామన్నదే నా భావం.
రిప్లయితొలగించండి