25, డిసెంబర్ 2010, శనివారం

ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం..నిన్నటి రాయపూర్ కోర్ట్ తీర్పు హక్కుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ఈ దేశ కార్పొరేట్ రాజ్యాంగం వెలిబుచ్చినదిగా వుంది తప్ప ఒక చంటిపిల్లల డాక్టరుగా పనిచేస్తూ, తన చుట్టూ వున్న పేద గిరిజనులపై జరుగుతున్న అమానుష దాడిని ఖండిస్తూ, వారికి వత్తాసుగా వుంటూ న్యాయస్థానాలలో వారి తరపున పోరాటం చేసే డా.క్టర్ బినాయక్ సేన్ ను గత రెండు సం.లుగా అక్రమ నిర్బంధంలో వుంచి, సుప్రీం ఉత్తర్వులతో బైయిల్ పై విడుదలైన ఓ వృద్ధ డాక్టర్ పై దేశ ద్రోహ నేరం కింద యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా వుండాల్సిన పౌర స్వేచ్చను హరించడమే. రాజ్యాన్ని ప్రశ్నించే హక్కును హరించే కౄర చట్టాల ద్వారా నియంత పాలన సాగించ జూడడం వ్యవస్థ వైఫల్యాన్ని ఒప్పుకోవడమే..

ఆంధ్రప్రదేశ్ లో ఎనభైల ప్రాంతంలో జరిగిన చంటిపిల్లల డాక్టరు, పౌరహక్కుల ఉద్యమ నేత డా.రామనాధం హత్య కేసు ముద్దాయిలు ఇంతవరకు గుర్తింప బడలేదు. అలాగే ఎందరో న్యాయవాదులు, ఉపాధ్యాయులను తమ ప్రైవేటు హంతక ముఠాలచే నిర్దాక్షిణ్యంగా హత్యచేసిన స్థానిక ప్రభుత్వం హక్కుల ఉద్యమాన్ని అణచివేయడంలో ముందుంది. డా.రామనాథం వద్ద అనేకమంది పోలీసు కుటుంబాల చిన్నారులు కూడా వైద్యం పొందేవారు. ఆయన వైద్యం కోసం ఎవరు వచ్చినా తన వృత్తి ధర్మాన్ని నిర్వహించేవారు. అది పౌరుల ప్రాధమిక హక్కుగా పేర్కొనేవారు. ఇలా ఎంతోమంది అణగారిన వర్గాల వైపు నిలబడి మాటాడే వారిని హత్య చేయడమో, జైళ్ళపాల్జేయడమో చేయడం ద్వారా తమ నిరంకుశ, నిర్లజ్జ పాలన కొనసాగించబూనడం ఘోరమైన నేరం. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మనందరం.

ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ఈ ఆన్లైన్ పిటిషన్ లో సంతకం చేయగలరు

6 వ్యాఖ్యలు:

 1. ఇక్కడ నాడు గాంధీగారిపై మోపబడ్డ దేశద్రోహ నేరంపై ఆయనిచ్చిన స్టేట్ మెంట్ చదవగలరుఃhttp://www.gandhitopia.org/profiles/blogs/on-his-conviction-for-sedition

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అవునండీ నా హృదయం కూడా బినాయక్ గారికోసం ద్రవించింది

  ప్రత్యుత్తరంతొలగించు
 3. క్రిష్ణ గారూ మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ.. మనపై కప్పబడుతున్న ఈ ఇనుపతెరను తప్పక ఐకమత్యంతో పావురాలవలె ఎగరేసుకు పోకపోతే ఈ వేటగాళ్ళ దాడి మరింత ఉధృతమై జన జీవనాన్ని అతలాకుతలం చేస్తుందండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. please watch & subscribe
  http://bookofstaterecords.com/
  for the greatness of telugu people.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చాల మంచి మాట చెప్పారు సార్..మీరు రాసిన తీరు నాకు నచ్చింది

  ప్రత్యుత్తరంతొలగించు
 6. indialo E maatram prajasvaamyam vundantE ilaanti 'sen' la vallE.dr.bhinayaksen nu ventanE vidudala cheyyali,green hunt nu nilipiveyyalani korukuntoo...

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..