2, డిసెంబర్ 2010, గురువారం

డిసెంబర్ రెండుడిసెంబర్ రెండు
భారత విప్లవోద్యమ చరిత్రలో ఈ రోజు

చరిత్రను అటూ ఇటూగా విడదీసిన రోజు

పీడిత ప్రజల విముక్తి కోసం,

సమసమాజ నిర్మాణంకోసం,
సామ్రాజ్యవాద కబంద హస్తాలనుండి భారత దేశ విముక్తి కోసం
తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్న విప్లవ నాయకులను
కుట్రతో
, కుతంత్రంతో

అత్యంత కిరాతకంగా హత్యచేసి ఉద్యమాన్ని
తుడిచి పెట్టేసామన్న సంబరం
పాలక హంతక ముఠాలకు మిగలనివ్వని రోజు
వారి చావుతో కోల్పోయింది ముగ్గురినే కానీ

వేలాదిగా మారిన విముక్తి సైన్యం ఏర్పాటుకు తోవతీసిన రోజు

వీరుడు మరణిస్తే వేలాదిగా పుట్టుకొస్తాడన్నదానికి కొండ గుర్తు...

అందుకే డిసెంబర్ రెండు
నెత్తుటితో ఎగరేసిన ఝెండా గుర్తు..
(కా.శ్యాం, మహేశ్, మురళి ల అమరత్వాన్ని గుర్తుచేసుకుంటూ)
వారి అమరత్వంపై వివరణ చూడగలరు

10 వ్యాఖ్యలు:

 1. saativaarikosam praanaalu vadile meeru,vattikooti kosam paakulaade medhaavulakannaa -chaalaa goppavaaru.mee amartvaaniki laalsalaam chebutoo ...com|shyaam,murali,mahesh ...amarrahe....meeru kalalukanna sama samaajamu raavaalani korukuntoo....

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @gajulaః అమర్ రహే కా.శ్యాం, మురళీ, మహేశ్..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఓ గాజుల గారు మీరు స్పెల్లింగ్ సరిగా తెలియకపోతే కాపీ అన్నా చేసుండాల్సింది . అది vattikooti కాదు vattikuti , పాపం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి గా వాడేస్తున్నారు . ఇక నేనిప్పుడు కూడా గాజుల కోసం పాకులాడుతున్నారు అన్నా అనుకోండి మీకు నాకు తేడా ఏముటుంది అందుకే నేను అనను . కొద్ది గా పోస్టుకు , అలాగే వేరే వాళ్ళు ఏమి రాస్తే మనమేమి రాస్తున్నాం అన్నదానికి సంభంధం ఉంటే బాగుంటుదేమో చూసుకోండి ( నా పేరు వాడారు కాబట్టి చెబుతున్న లేకపొతే మీరే చెత్త రాసుకున్న అదీ ఆ హైబ్రిడ్ భాష లో నాకు చదివే ఓపిక లేదు ) . ఇక కూటి కోసం కోసం కాపోతే మీరు నేను వేసే ఈ వేషాలు అన్ని ఎందుకు చెప్పండి .
  అలాగే ఓ కనపడిన ప్రతి దగ్గర రాసే ముందు ఒక సారి ఆలోచించుకోండి ఈ ఇంటర్నెట్ , మీరు ఫ్రీ గా కామెంట్లు రాసి పడేస్తున్న బ్లాగులు ఇవన్ని పెట్టుబడిదారి వ్యవస్థ లోంచి వచ్చినవే , మీకు లాగా నోటితో చెప్పేది ఒకటి చేతల్లో చేసేది ఒకటి లాంటి వాళ్ళ వాళ్ల కాదు .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @Sravya Vattikuti గారు గాజుల గారన్నది వట్టి కూటి కోసం పాకులాడే మేధావులన్నర్థంగా వుంది. అది మీ ఇంటిపేరును సూచించినట్లుగా భావించినట్లున్నారు. నాకైతే అర్థమైందిలా..
  మీరు ప్రతిసారి బ్లాగులు పెట్టుబడిదారి దేవుళ్ళు ఏదో దయతలచి ఉచితంగా ఇస్తున్నవని రాస్తారు. వారు శ్రమదోపిడీనుండి పొందిన లాభాలలోంచి విదిలించిన గానుగలో గరిటెడనుకుంటున్నా ఈ సౌకర్యం..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కేక్యుబ్ గారు మీరు అంత ఫీల్ అవ్వాల్సింది లేదులెండి , పాపం గాజుల గారు ఇక్కడే కాదు వేరే బ్లాగులో తమ అమూల్యమైన అభిప్రాయం చెప్పారు . వారు మీ మిత్రులేమో అది నాకు సంభందం లేని విషయం నా విషయం నోరు జారితే ఆయనకి సమాధానం చెప్పే హాక్కు నాకు ఉంది !
  మీరు ప్రతిసారి బ్లాగులు పెట్టుబడిదారి దేవుళ్ళు ఏదో దయతలచి ఉచితంగా ఇస్తున్నవని రాస్తారు. వారు శ్రమదోపిడీనుండి పొందిన లాభాలలోంచి విదిలించిన గానుగలో గరిటెడనుకుంటున్నా ఈ సౌకర్యం..
  -------------------------------------
  ఆ సౌకర్యాన్ని నోటి దురుద తీర్చుకునేందుకు వాడుకుంటే నా సమాధానం అదే !

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శ్రావ్య అక్కాయి,
  ఇది మరీ బాగుంది. పాపం పెద్దాయన గాజుల గారిని పట్టుకొని అంత మాట అనేసారు ఏంటి?
  మీరు ముందు వారిని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నారా మిమ్మల్నే అన్నారని? అయిన గాజుల గారు చెప్పింది తినే కూటి కోసం అక్కాయి.చిన్న పిల్ల వాడిక్కి కూడా ఈ విషయం అర్ధం అవుతుంది.
  గుర్తు ఉందా ఆ పై రెండు వాఖ్యాలు ఎవరు వాడారో? భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఇదేనేమో.
  మీరు మరీ ఫన్నీ కాకపొతే మేధావులంతా మీ కోసం ఎందుకు పాకులాడుతారు అండి?

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఆ సౌకర్యాన్ని నోటి దురుద తీర్చుకునేందుకు వాడుకుంటే నా సమాధానం అదే !
  శ్రావ్యగారూ ఆ దురద ఎవరికి ఎక్కువగా వుందో బ్లాగులలో అందరికీ తెలిసినదే. బ్లాగులను చాలా దురదలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నవారున్నారు..
  మాకైతే ఆ దురదలేదు. మీలాగే చాలామంది ఎన్నిసార్లు కామెంట్లలో రెచ్చగొట్టేట్టు రాసినా నా పరిధి దాటి సమాధానమివ్వలేదు. గమనించగలరు..

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అప్పి బొప్పి గారు గాజుల గారు మీకు కొత్త మిత్రులేమో నాకు పాత మిత్రులే . సో మీరు మరీ అంత మీరు మరీ అంత కంగారు పడకండి వారు ఎందుకు ఎందుకో రాసారో నాకు బాగా తెలుసు . మీరు చేసిన పిచ్చి పని నేను చేయలేదు ఎలాగోలా tit for tat అని చెప్పాలంటే మీరు ఇంకో ఛాన్స్ తీసుకోవాలున్కుంటా .
  btw "శ్రావ్య అక్కాయి," నాపేరు తో పిలిస్తే చాలు మీరు ఎక్కువ తోకలు తగిలించాల్సిన అవసరం లేదు .ఒక వేళ ఇది మీ అలవాటు ఐతే పాత కామెంట్లు విషయం లో మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోవాలునకుంటా:)
  As of now bye on this , will talk later on this my blog .

  ప్రత్యుత్తరంతొలగించు
 9. శ్రావ్యగారూ ఆ దురద ఎవరికి ఎక్కువగా వుందో బ్లాగులలో అందరికీ తెలిసినదే. బ్లాగులను చాలా దురదలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నవారున్నారు..
  -=-----------
  Then you are welcome to give a fitting reply for them if you want to do so. And yes no need to explain it to me where I am least bothered.

  మాకైతే ఆ దురదలేదు. మీలాగే చాలామంది ఎన్నిసార్లు కామెంట్లలో రెచ్చగొట్టేట్టు రాసినా నా పరిధి దాటి సమాధానమివ్వలేదు. గమనించగలరు..
  ----
  Can highlight a few of them where I done . I do augue with proper language and correct point if I found something wrong . I don't generalise the things and throw mud like a crying baby you should understand that.

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..