28, అక్టోబర్ 2010, గురువారం

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన జతిన్ దాస్ స్మృతిలో..



తొలినాటి స్వాతంత్ర్య వీరులలో చెప్పుకోదగిన వారు జతిన్ దాస్. జైలులోని అసౌకర్యాలపై, అసమానతలపై పోరాడుతూ ఆమరణ దీక్ష చేస్తూ 63వ రోజు నాడు అమరుడైన ఏకైక ఖైదీ జతిన్ దాస్.

జతిన్ దాస్ కోల్ కతాలో అక్టోబర్ 27, 1904లో జన్మించారు. అనుశీలన్ సమితి అనే బెంగాలీ విప్లవ సంస్థలో పని చేసారు. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నారు. 1925 లో తను బి.ఏ.చదువుతున్నప్పుడు తన రాజకీయ అభిప్రాయాలపై బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి మెమెన్సింగ్ జైలులో ఉంచగా నాటి జైలు పరిస్థితులపై ఆమరణ దీక్ష చేయగా జైలు సూపరింటేండెంట్ క్షమాపణ చెప్పడంతో ఇరవై రోజుల తరువాత దీక్ష విరమించారు. ఆ తరువాత షహీద్ భగత్ సింగ్ నకు బాంబు తయారు చేసిచ్చిన కారణం చూపి లాహోర్ కుట్రకేసులో జూన్ 14, 1929న అరెస్ట్ చేసారు.

నాటి లాహోర్ జైలులోని ఘోర పరిస్థితులపై మిగతా విప్లవకారులతోపాటు తాను జూలై 13, 1929 నాడు మొదలుపెట్టిన ఆమరణ దీక్షను పట్టుసడలకుండా చివరివరకు కొనసాగించి, తీవ్రనిర్బంధ పరిస్థితులనెదుర్కొని సెప్టెంబర్ 13, 1929 న అమరుడైనాడు. ఆయన పార్ఠివ దేహాన్ని లాహోర్ నుండి కలకత్తాకు రైలులో తరలించగా వేలాది జనం నీరాజనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. జతిన్ దాస్ అంధించిన పోరాట స్ఫూర్తిని నేటి యువతరం అందిపుచ్చుకొని దేశం కోసం నేడు మరో స్వాతంత్ర్య పోరాటాన్నే జరపాల్సి వుంది. ఆయన జన్మదినం నిన్న జరుపుకొని నివాళులర్పించిన అనేక మంది యువతరానికి కృతజ్నతా పూర్వకంగా ఈ సంస్మరణ..

ఆమరణ దీక్షకు, పోరాట స్ఫూర్తికి నిర్వచనమైన కా.జతిన్ దాస్ అమర్ రహే..

2 కామెంట్‌లు:

  1. కా |జతిన్ దాస్ అమర్ రహే .నిజంగా ఇటువంటి ఎంతోమంది వీరులను గుర్తిన్చుకోవడము ,గుర్తుచేస్తున్న మీకు కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి
  2. డాక్టర్ గారూ మనకు ఉత్తేజాన్నిచ్చేది ఈ వీరుల సాహసాలే కదా. నిజమైన స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం పోరాడుతున్న వారికి వీరి జ్నాపకాలే ఊపిరి కావాలి. మీ స్పందనకు ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..