10, అక్టోబర్ 2010, ఆదివారం

తెలంగాణా దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ఫ్రంట్ ను ఆహ్వానిద్దాం..డిసెంబరు 9 ప్రకటనతో తెలంగాణా వచ్చేసిందన్న భావం ఏర్పడి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్న ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆంధ్రా లాబీయింగ్ కు తలొగ్గి శ్రీక్రిష్ణ కమిటీ పేరుతో చిదంబరంగారు సృష్టించిన మాయలో పడి ఉమ్ములో చిక్కుకున్న ఈగలా మారిన తెరాస వైఖరితో అనేకమంది విద్యార్థి యువజనుల ఆత్మ బలిదానాలను బలిపెట్టే విధంగా మార్చిన అన్ని రాజకీయ పక్షాల దొరతనాలకు వ్యతిరేకంగా ప్రజా యుద్ధ నౌక, తెలంగాణా పోరుబిడ్డ గద్దర్ నేతృత్వంలో ముందుకు వచ్చిన తెలంగాణా ప్రజా ఫ్రంట్ నాలుగు కోట్ల మంది ఆశలకు అణగారిన ప్రజల ఆశలకు కొత్త వూపిరిలూదగలదన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.

డిసెంబరు తరువాత భూకంపాల్ని సృష్టించేస్తాం, అంతవరకు కడుపుబ్బరాన్ని అట్టిపెట్టుకోండని మాయ మాటలు చెపుతున్న కె.సి.ఆర్.నమ్మకద్రోహాన్ని ఉతికి ఆరేయాల్సిన సమయంలోనే ఫ్రంట్ ముందుకు రావడం హర్షణీయం. దీక్షను మధ్యలో వదిలేసి మోసం చేయబోతే విద్యార్థిలోకం తెగించి పోరాడడంతో వెలువడిన డిసెంబరు 9 ప్రకటనను అమలు చేయించాల్సిన తరుణంలో కాంగ్రెస్ కు ముఖ్యంగా కేంద్రంలోని నాయకత్వంనకు అడుగులకు మడుగులొత్తే విధంగా తయారై, పచ్చి సమైక్య వాది జగడపాటికి ఐ లవ్ యూ చెప్పడంవంటి వ్యాపార భాగస్వామ్య జిత్తులమారితనంతో, తన దొర దర్పం ప్రదర్శించాలనుకుంటున్న కె.సి.ఆర్.కు చెక్ పెట్టడానికి ఈ ఫ్రంట్ ఉద్యమించాలని కోరుకుందాం.

నాకు ఆంధ్రా, తెలంగాణా రెండు కళ్ళు, వ్యాపారాలకు సమైక్యాంధ్ర మూడో కన్నులాంటి ప్రకటనలతో ముందుకుపోతున్న బాబు కూటమి కుయుక్తులను అడ్డుకోవాల్సిన అవసరముంది. తెలంగాణా కోసం అమరులవుతున్న విద్యార్థి, యువజనుల పట్ల కనీస సానుభూతి లేని కాంగ్రెస్ లీడర్లు, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించనని మొండిగా వున్న హోం మంత్రిని నిలదీయాల్సిన వారు ఇప్పుడు అమరులకు సాయమందించే పేరుతో దొంగ ఏడుపులేడుస్తున్న మూడు రంగుల పంచెగాళ్ళను మెడలు వంచాల్సిన అవసరముంది.

ఖచ్చితంగా తెలంగాణా ఎం.పీలందరిచే రాజీనామా చేయిస్తే కేంద్రం దిగివచ్చి పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశముందన్న దానిని పక్కకు పెట్టి, మొన్నటి ఉపఎన్నికలలో ప్రజల తీర్పును గుర్తించే విధంగా పాలకులపై వొత్తిడి తెచ్చే ఉద్యమాన్ని చేపట్టక నిద్దరోతున్న రాజకీయ బేరగాళ్ళను ప్రజాకోర్టుల ముందుంచాల్సిన విధంగా ఉద్యమించి తెలంగాణా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి సమైక్యంగా ఉద్యమించి, తమలో వున్న భేదాభిప్రాయాలను చిన్నవిగా గుర్తించి ముందుకు పోవాలని ఆశిద్దాం. బహిరంగ వేదికలపై తమ అభిప్రాయ భేదాలను ప్రదర్శించకుండా కట్టడి చేయాల్సిన అవసరముందని విజ్నప్తి చేస్తున్నాం.

రండి కలసి పోరాడాడాండి..

14 వ్యాఖ్యలు:

 1. నిన్న మొన్నటి వరకు మంచి నాయకుడు గా కనిపించిన ఆయన మీకు సడన్ గా శత్రువైపోయాడా ? రేపోమాపో హరీష్ రావ్ గారు ఒక కొత్త పార్టీ పెడతారట మరి అప్పుడేమి రాస్తారో మీరు .
  ఇక పోరాటాలు బానే చేస్తున్నారు వీళ్ళు ఇన్ని రోజులు చర్చా కార్యక్రమాల్లో బూతులు మాత్రమే తిట్టుకోనేవాళ్ళు ఇక ఇప్పుడు కొట్టుకుంటున్నారు కూడా చాల అభివృద్ధి సాధించారు మొత్తానికి మన వాళ్ళు .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శ్రావ్య గారు మీరు వెంటనే స్పందించినందుకు థాంక్స్. ఆయన నిన్నటి మొన్నటి వరకు మంచినాయకుడని ఎవరూ కీర్తించలేదు. తప్పులెవరు చేసినా విమర్శించకుండా వెనకేసుకు రావడం ద్రోహమవుతుంది. ఆయన ధోరణిని విద్యార్థులే కాదు నాయకులంతా ముందునుండి ఎండగడుతూనే వున్నారు. సంఘర్షణ లేకుండా సమాజం కొనసాగుతుందా? అన్నదమ్ములైనా, భార్యాభర్తలైనా ఒకరి భావాలు ఒకరికి నచ్చనప్పుడు తగువులాడుకోవడం లేదా? మనిషన్నాక భావ సంఘర్షణ లేకుండా ఇంత అభివృద్ధి సాధించగలమా?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. భలే వాళ్లే మీరు వాళ్ళెవరో అనడమో కాదు వారి ని పోగుడుతూ రాసినవి మీవి బోలెడు కామెంట్లు చూపించగలను . నేనడుగుతుంది మిమ్మల్నే . సంఘర్షణ అంటే నిన్నటి దాకా భుజాలు కలిపి తిరిగిన వాళ్ళు ఇవాళ నానా బూతులు తిట్టుకోవటం , కొట్టుకోవటమా . నేను మాట్లాడుతుంది ఆ సుమంత్ , రఘు కొట్టుకోవటం గురించి . వీళ్ళని మీరు వెనకేసుకొచ్చి , మధ్య కోస్తా వాళ్ళు మోసం చేసారో అని మొత్తుకుంటుంటే నిజం గా అయోమయం గా ఉంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ప్రత్యేకంగా కెసిఆర్ నే పొగుడుతూ రాయలేదెప్పుడూ. మొత్తంగా తెలంగాణా ఉద్యమకారులను దృష్టిలో పెట్టుకొనే రాస్తున్నా. నిన్న మొన్నటివరకు వున్న మైత్రి నేడు ఎందుకు తిట్టుకోవాల్సి వచ్చిందన్నది స్పష్టమే కదా? ఉద్యమ కాలమంతా అలానే నడుస్తుంది. తప్పదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కెక్యూబ్ గారూ,

  మసీదుని పునర్నిమించలేమా అనేంత గొ...ప్ప శాంతియుత టపా రాసిన మీరు అకస్మాత్తుగా పోరాటం చేద్దాం రమ్మంటారేంటీ? పాపం KCR దొరని కూడా దోచుకోనీయలేమా ???

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఒరే నీవ్వు ఖచ్చితంగా వేర్పాటు తివ్రవాదుల వసూళ్ళు ,చందాల గుంపులో ఉంటున్న వెధవన్నర వెధవ్వి అయి ఉంటావు. ?హిందూ భారత రాజ్యం లో ఉంటూ,మా హిందువులు విసిరేసిన ఎంగిలి మెతుకులు తింటూ ,ఈ నేల మీద నిలబడి ఈ హిందూ నేలనే కారు కోతలు కూస్తున్నవేంట్రా?ఖబడ్దార్ ...తోలు వలిచి తిత్తి తీస్తాం...ఒరే నీవు ఇంకోక్కసారి ఎక్కడైనా నాలుగు రోడ్ల "కూడలి" లో నా కంటి కి కనపడ్డావంటే నీ డొక్క చించి నీ పేగులు నీ మెడలో " హారం " గా వేస్తా...
  dammunte naa comments veyyara..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఒరే నీవ్వు ఖచ్చితంగా వేర్పాటు తివ్రవాదుల వసూళ్ళు ,చందాల గుంపులో ఉంటున్న వెధవన్నర వెధవ్వి అయి ఉంటావు. ?హిందూ భారత రాజ్యం లో ఉంటూ,మా హిందువులు విసిరేసిన ఎంగిలి మెతుకులు తింటూ ,ఈ నేల మీద నిలబడి ఈ హిందూ నేలనే కారు కోతలు కూస్తున్నవేంట్రా?ఖబడ్దార్ ...తోలు వలిచి తిత్తి తీస్తాం...ఒరే నీవు ఇంకోక్కసారి ఎక్కడైనా నాలుగు రోడ్ల "కూడలి" లో నా కంటి కి కనపడ్డావంటే నీ డొక్క చించి నీ పేగులు నీ మెడలో " హారం " గా వేస్తా...
  dammunte naa comments veyyara..

  ప్రత్యుత్తరంతొలగించు
 8. rakthacharithra నీ కామెంటు వేయడానికి దమ్మెందుకు బాబు. నీ సొంతపేరుతో రాయలేని నీ దమ్ము తెలుస్తోంది. రక్తచరిత్రలు మాకు కొత్త కాదు. ముందు నీ చరిత్ర నువ్వు తెలుసుకో..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. rakthacharithra నీ లాంటి రియల్ ఎస్టేట్ మాఫియాలకు కాలం చెల్లింది ఇక.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ప్రత్యేక తెలంగాణా సాధించాలన్న తపన ఉండి కూడా, కేసీయార్ దొరతనం పోకడలతో విసిగి పోయి, అపనమ్మకంతో ఉన్న శక్తులకు కొత్త ఫ్రంట్ ఒక గొడుగుగా ముందుకు రావడం సంతోషించదగిన విషయం.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఇదుగో మీరు రాసినదే ఇది http://sahacharudu.blogspot.com/2009/11/blog-post_29.html ఇది, ఇదే కాదు ఒక్కసారి మీ కామెంట్లు వెతికి చూస్తె బోలెడు చోట్ల మీ ప్రేమాభిమానలని , గౌరవాన్ని చూపించినవి బోలెడు గుర్తులు కనపడతాయి . ఇవాళా గద్దర్ కనపడుతున్నాడు రేపు మరెవరో . మీ అభిప్రాయాలని మార్చుకోవద్దని నేను అనడం లేదు , ఇంతోటి భాగ్యానికి వీళ్ళని వెనకేసుకొచ్చి సంభందం లేని వాళ్ళని తిడుతుంటారు అదెందుకు అంటున్నాను .

  ఈ ఒక్క విషయమే కాదు మీరు రాసేవి సగానికి సగం అలానే ఉంటాయి , తెలంగాణా ఉద్యమం మొదలు కాకముందు మీకు యూనివర్సిటీలు ఎందుకూ పని రానివి గా కనిపించాయి , వాటిని మూసిపారేద్దమన్నారు , ఒక సారి ఈ రగడ మొదలయ్యాక వాటి మీద మీ ప్రేమ అమాంతం పెరిగిపోయింది .నేను ఇంతకూ ముందు కూడా అడిగాను ఎప్పుడు పెట్టుబడి దారి వ్యవస్త ని తిడుతూ ఉంటారు, మరి ఇవాళ మీరు ఫ్రీ గా రాసి పడేస్తున్న బ్లాగులు దాని ఫలితమే అలాంటప్పుడు ఎందుకు ఈ సదుపాయాన్ని వాడుకుంటారు ?ఏదైనా సరే వంద శాతం ఒప్పు ఉండదు , అలాగే వంద శాతం తప్పు ఉండదు . మీకు అనుకూలం గా ఉంటే అన్నీ మంచివి లేకపోతె ఎందుకు పనికి రానివి ముందు ఈ దృక్పదాన్ని మార్చుకోండి .

  ప్రత్యుత్తరంతొలగించు
 12. శ్రావ్యగారు నా బ్లాగును బాగా ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు. ఆరోజు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ దీక్షను భగ్నం చేసే దిశగా ప్రయత్నించినందుకు దానికి వ్యతిరేకంగా రాసాను. ఆనాటికి నేనే కాదు తెలంగాణా విద్యార్థి, యువజన మేధావి వర్గం అంతా ఆయన వెంట నడిచింది. మధ్యలో దీక్ష విరమిస్తే అదే కేసీఆర్ దిష్టి బొమ్మ దహనాలు కుడా జరిగి తరిమికోదతామన్నారు. దాంతో తప్పనిసరి దీక్ష కొనసాగించాడు. ఆ తరువాత తెలంగాణాకు అనుకూలంగా ప్రకటనలు వచ్చాయి. ఇంక యునివర్శితీలలో నెలకొన్న స్తబ్ధత మీకు తెలియనిదా. అక్కడ జరిగే పరిశోధనల వలన ఎంత వరకు మన సమాజానికి ఉపయోగం కలుగుతుందో ఎరుకలేదా? ఆవిధంగా ఉన్నవాటిని ప్రశ్నించాను. ఇందులో తప్పేముంది. ఉస్మానియా విద్యార్థులు ఉద్యమంతో ముందుకు రావడాన్ని హర్షించ కుండా ఉండగలమా? ఎక్కడైనా యువజన ఉద్యమాల ద్వారానే పాలకుల పీఠాలు కదిలి కాస్తా మంచి జరుగుతుంది. నా అభిప్రాయాలను మార్చుకోవడం కాదు ఇది. జరుగుతున్నా పరిణామాలను నా అభిప్రాయాలతో బేరీజు వేసుకొనేందుకు ఇలా అందరితో పంచుకుంటున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఇంకో బ్లాగులో "దీనిని అర్థవలస, అర్థభూస్వామ్య, సామ్రాజ్యవాద దళారీ దేశంగా పరిగణిస్తున్నాం" అన్నారు. ఇంత అభివృద్ధి సాధించగలమా అని పైన అడిగారు. కొంపదీసి మనం సాధించింది అభివృద్ధేనని ఒప్పేసుకుంటున్నారా ఏమిటి?

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ఇంకో బ్లాగులో "దీనిని అర్థవలస, అర్థభూస్వామ్య, సామ్రాజ్యవాద దళారీ దేశంగా పరిగణిస్తున్నాం" అన్నారు. ఇంత అభివృద్ధి సాధించగలమా అని పైన అడిగారు. కొంపదీసి మనం సాధించింది అభివృద్ధేనని ఒప్పేసుకుంటున్నారా ఏమిటి?

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..