28, అక్టోబర్ 2010, గురువారం
నలభై ఏళ్ళ తరువాత వర్ఘీస్ బూటకపు ఎన్ కౌంటర్ పై తీర్పు..
కేరళ లోని సి.బి.ఐ.కోర్టు నేడు వర్ఘీస్ బూటకపు ఎన్ కౌంటర్ పై తీర్పునిస్తూ నాటి డిఎస్పీగా పనిచేసి ఐ.జీ.గా రిటైరైన లక్ష్మణన్ కు యావజ్జీవ కారాగార వాస శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది.
నలభైఏళ్ళ క్రితం వర్ఘీస్ అనే కుఱవాడిని వాయనాడ్ అడవుల్లో చేతులు వెనక్కి కట్టి కాల్చివేసిన కేసుపై న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. ఇదే కేసులో ముద్దాయియైన విజయన్ అనే డిజీపిని benefit of doubt కింద విడిచిపెట్టింది. వీళ్ళిద్దరూ నాడు అనేక బూటకపు ఎదురుకాల్పులకు పాల్పడ్డారని, నక్సలైట్ ముద్రవేసి ఇంజనీరింగ్ విద్యార్థి రాజన్ నుకూడా మాయం చేసారన్న ఆరోపణలున్నాయి. నేటికి రాజన్ కేసు మిస్టరీగానే మిగిలింది. విజయన్ ను వదిలేయడాన్ని వర్ఘీస్ కుటుంబ సబ్యులు తప్పుబట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ.జీ.కి మరణదండనకు సిఫారసు చేసారంటే ఈయన గారి అధికార దుర్వినియోగం, కృరత్వం ఎంతో తెలుస్తోంది.
మన రాష్ట్రంలోనూ ఇలాంటి హత్యలకు పాల్పడిన వాళ్ళు అనేక వందలమంది వున్నారు. వాళ్ళకు ఆక్సిలరీ ప్రమోషన్ లిచ్చిన పాలక వర్గాన్ని కూడా తప్పక న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. న్యాయస్థానాలు ఇలాంటి కేసులను ఇన్ని సం.లు నాన్చడం వలన దోషులు కొంతమంది శిక్షనుండి తప్పించుకునే అవకాశం మెండు. ఈయన ఆదేశాలను పాటించిన CRPF constable చనిపోయాడు. అలాగే విజయన్ సరైన సాక్ష్యాలు లేవంటూ బయటపడగలిగాడు. వీళ్ళ గురించి రాజన్ తండ్రి రాసిన నాన్న అనే పుస్తకంలో చదవొచ్చు. వీళ్ళు ఎంతలా ఆనాడు బరితెగించారో ఆయన మాటలద్వారా తెలుస్తుంది. నాటి కేరళ ముఖ్యమంత్రి అచ్యుతరామన్ గురించికూడా.
ఇలాంటి కౄర పోలీసు అధికారులకు ఈ తీర్పు ఓ గుణపాఠం కావాలి.
ఎదురుకాల్పులపై హత్యాకేసు నమోదు చేసి న్యాయస్థానం విచారణ చేపట్టాల్సిన అవసరముంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పోలీసులు ప్రజలకు నిజమైన సేవకులుగా వుండే సమాజాన్ని ,ఎన్కౌంటర్లు లేని(భూటకపు )సమాజాన్ని ,అందరూ సమానమై సహచరించే సమాజాన్ని కోరుకుంటూ .....
రిప్లయితొలగించండిపోలీసులు అవసరంలేని సమాజం కోసం కృషి చేద్దాం.. ఆధిపత్య రహిత మానవ సమాజం నా కల..
రిప్లయితొలగించండి