12, నవంబర్ 2010, శుక్రవారం

దొరా ప్రజలతో కలిసి పనిజేయవా?
కెసియార్ నిన్న కెకె తో సాగించిన మంతనాల అనంతరం చేసిన వ్యాఖ్యలు తెలంగాణా ఉద్యమకారుల మనసుపై కారుమబ్బులు కమ్మేట్టు చేసాయి. కాంగ్రెస్ ను బలోపేతం చేసే కొత్త ఎజెండాతో ముందుకు వస్తున్న ఈ దొరగారి ప్రణాళిక ఎప్పుడూ దొరసాని పాదాల చుట్టూ తిరుగుతూ వుండటం తీరని అవమానం. తప్పక దీనిని ఎదుర్కోవాలి. ఈ మోసకారి రాజకీయ ఊసరవెల్లిని ఉద్యమాల ఉధృతం ద్వారానే పడగొట్టాలి. అసలు ఈయన కాంగ్రెస్ ను బలోపేతం జేయడమేంటి? అదేమైనా బలహీనంగా వుందా? ఓట్లు గుంజుకునే కార్యక్రమం ద్వారా తను, తన కుటుంబాన్ని బలోపేతం జేసుకుంటున్న ఈ దళారీ దొరగాడి ఎత్తులను చిత్తు జేయకపోతే ముందు ముందు మరింత విద్రోహానికి వెనుదీయడు. ఇప్పటికే పలు వ్యాపార సంబంధాలతో, వాటిని కాపాడుకునే ఎత్తుగడలతో వున్న ఈయన జిత్తులమారితనాన్ని ఎండగట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఇది. ప్రజలంతా ఏకతాటిపై నిలిచి తమ ఆకాంక్షను ప్రస్ఫుటంగా ముందుకు తెస్తున్న వేళ తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠం ముందు తాకట్టు పెట్టే యత్నానికి ఒడిగట్టడం దారుణం. తప్పక వీడి ముక్కు నేలరాయాల్సిందే...

4 వ్యాఖ్యలు:

 1. మన పార్లమెంటరీ రాజకీయాలు భ్రష్టు పట్టి పోయాయి.
  ఎ పార్టీకీ, ఎ రాజకీయ నాయకుడికీ ...ఎవరికీ నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, జవాబుదారీ తనం లేదు.

  ప్రజా ఉద్యమం తోనే తెలంగాణా సాధ్యం అన్నది నిర్వివాదాంశం.
  అయితే తెలంగాణా సాధనకు ఈ భ్రష్టుపట్టిన పార్టీల, పార్లమెంటరీ రాజేకీయాల మద్దతు అనివార్యం.
  కాబట్టి కే సి ఆర్ ను అప్పుడే పూర్తిగా బహిష్కరించడం/ఎండగట్టడం సబబు కాదేమో.

  1969 ఉద్యమ అనుభవాల నేపధ్యం లో
  నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాకారం అయ్యేంత వరకూ ఉద్యమకారులంతా పరిణితితో, వ్యూహాత్మకంగా
  అప్రమత్తంగా వ్యవహరించడం ఈనాటి చారిత్రిక అవసరం.
  తెలంగాణా వచ్చాక కేసీఆర్ ఎక్కడికిపోతాడు.?
  అప్పుడు చూడలేమా అతని సంగతి ?

  ప్రస్తుతానికి అతని భ్రష్టు పట్టిన వ్యూహాలను అతడిని అనుసరించనివ్వండి.
  దానిని ప్రస్తుతానికి శత్రు వైరుధ్యంగా కాకుండా మిత్ర వైరుధ్యంగా పరిగానించడమే మంచిదని నా భావన .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @Goutham Navayan మీ స్పందనకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలో నిస్సహాయతే ఎక్కువగా వ్యక్తమైంది. ఇలాంటి నాయకులను నమ్ముకుంటే ఎన్నాళ్ళకీ తెలంగాణా రాదు. భ్రష్ఠత్వాన్ని ఆమోదిస్తే ఉద్యమం భ్రష్టుపట్టిపోతుంది. ప్రజలకంటే తాము గొప్పవాళ్ళమని, వాళ్ళకి తాము తప్ప వేరే దిక్కులేదన్న అహంకారం వీళ్ళలో ఎక్కువై, ఇలా మన నిస్సహాయత, నిర్లిప్తత ఇలాంటి దళారీగాళ్ళకు అవకాశాన్నిస్తోంది. శత్రువుని మిత్రుడిగా గౌరవించితే అది మన పునాదినే తవ్విపోస్తది. ఇలాంటి వాళ్ళ వ్యూహాలతో ఇప్పటికె జరిగిన నష్టం చాలదా మిత్రమా?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. NENU GOUTHAM GAARI VAADANATHO EKIBHAVISTUNNANU.IKKADA 100%NIJAAYITHIPARULU RAAJAKEEYAALALO EVAROO LeRU.nijaamnu pogadadamulo ,andhrapaalakulu emicheyyaledu -nijaamE nayamu ani ,cingressnu bhalaparustaamu anE vishayamulo congrss mundari kaallaku bhandamu vEstunnadani,mugguloki dinchutunnadani mEmu ankuntunnamu .e tharaanni(maa)evaroo mosamu cheyyalEru ,maa thaathalu ,thandrulu nastapoindi,mosapoindi chaalu.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మల్లిక్ సార్ కాంగేయులను ముగ్గులోకి దించే సీను ఈయనగారికి లేదు. వాళ్ళు ఆడే డ్రామాలో కేతిగాడు మాత్రమే ఇతగాడు. రాజకీయనాయకులలో నిజాయితీ పరులు లేరుకాబట్టే ఉద్యమాలు వస్తున్నాయి. వాళ్ళని నిలదీస్తున్నాయి. నిలవరిస్తున్నాయి. రాజకీయాలంటేనే ఎలర్జీగా మార్చిన లీడర్లగురించి తెలియదా మనకి. కానీ తానే తెలంగాణా మొనగాడినైనట్లు ప్రవర్తిస్తున్నవాడిని ఎండగట్టాల్సిన అవసముంది. ఆయన స్థానం ఎక్కడో గుర్తుచేస్తుండాల్సిన అవసరముంది. ఇలాంటి వాళ్ళ వల్లనే ఇంతకాలం మోసపోయారు. కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేసిందన్న ఆయన అత్యుత్సాహ ప్రకటన ఎవరిని మెప్పించడానికి. అలా అయితే ఇంత మంది చావుకు కారణంగా ముందు వీడిని, వీడి అనుచరగణాన్ని ఉరితీయాలా వద్దా?

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..