19, అక్టోబర్ 2012, శుక్రవారం

గేట్లన్నీ బార్లా తెరచి యింకా సరిహద్దులేల???

ఈరోజు ఓ గంట క్రితం సాక్షి టీవీలో రాజకీయ పార్టీల విరాళాలు వసూళ్ళపై చర్చలో పాల్గొంటూ ప్రొ.హరగోపాల్ ఓ మాటన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి విదేశీ కంపెనీలకు ఈ దేశ వనరులను దోచుకొనే అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇంక పక్క దేశం వాడు వచ్చి ఏదో చేసేస్తాడని నమ్మిస్తూ సరిహద్దులను సైన్యంతో కాపలా కాయడం అవసరమా?? అని అడిగారు..

ఈ ప్రశ్న చాలా ఆలోచించదగ్గదే. విదేశీ కంపెనీలు వేదాంత తదితరమైనవి మన అడవులను, సహజ వనరులను ఎటువంటి జంకూ గొంకూ లేకుండా కొల్లగొడుతూ ఈ దేశ సంపదను ఎత్తుకెళ్ళి పోతుంటే యింకా చైనా వాడో, పాకిస్తాన్ వాడో ఈ దేశంపై దండేత్తుతాడని సైన్యాన్ని మేపుతూ సరిహద్దు రేఖలు గీచుకొని కూచోవడం అవసరమా?? ఎవడికి దొరికింది వాడు దోచుకుపోతుండడానికి చిల్లర దుఖాణాలతో పాటుగా అమ్మజూపుతున్న ప్రభుత్వాలకి ఈ దేశ సరిహద్దులంటూ ఇంత ప్రజా ధనం దుర్వినియోగం అవసరమా?? 

ఎక్కడికక్కడ ప్రజలను నిర్వాశితులును చేస్తూ ప్రశ్నించే వారిపై రక రకాల చట్టాల పేరుతో అరెస్టులు మరికొన్ని చోట్ల జనంపై కాల్పులు జరుపుతు ప్రాణాలు తీస్తున్న రాజ్యం ఈ కుహనా సరిహద్దు రేఖలను చూపి మనల్ని భ్రమలలో వుంచుతున్నాయి. విదేశీ కంపెనీలు, కార్పొరేటు సంస్థలు తమ వ్యాపార లావాదేవీలను నిరభ్యంతరంగా చేసుకోవడానికి తలుపులు బార్లా తెరిచి యిదే అభివృద్దని చెప్తున్న ప్రభుత్వ మోసకారితనాన్ని గ్రహించి నిలదీయాల్సిన సమయమిది. 

1 వ్యాఖ్య:

  1. వర్మగారు,

    మీదృష్ట్టిలో అభివృద్ది అంటే ఎమిటి? దానిని ఎలా నిర్వచిస్తారు?
    పాకిస్తాన్ లో చాలా మంది మేధావులు భారతదేశం నుంచి విడిపోయి పెద్దతప్పు చేశామని ఎప్పుడో గుర్తించారు. ఇప్పుడు దేశ విదేశలలో ఉండే పాకిస్తాన్ మేధావులందరు వాళ్ల ఆవేదనను వెళ్లగక్కుతూ టి వి షోలలో మాట్లాడు తూంటారు. ఇక ఆదేశంలొ ఉండే సైనిక పాలకులకు మనదేశంలో ఎదో విధంగా గొడవలు చేయటమనేది ఒక పాలసి గా పెట్టుకొని డబ్బులు చేసుకొంట్టున్నారు. అది ఆదేశానికి సంబందించిన వ్యాపార ఫార్ముల.
    చైనా తో మటుకు చిక్కే. దానిని నమ్మటానికేలేదు.

    ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..