మా బువ్వ కుండలో
ఉచ్చబోసి
మా గాదెలోని
ధాన్యాన్ని తగలబెట్టి
మా ఆడాళ్ళను చెరిచి
సహచరులను చంపి
మా గుండెల్లో
గాయం చేసిన
ఈ నేరగాళ్ళెవరో కాదు
ఈ నేలపైనే తయారు కాబడ్డ
త్రాచు పాములు, తేళ్ళ
పేరుతో బుసలుకొడ్తున్న
రాజ్య రక్షక భటులు...
కానరావివి మీ ప్రజాస్వామ్యపు
విశాల నేత్రాలకు....
నెత్తురోడుతూ
బూడిదపాలైన
మా జీవితాలకు
సమాధానం చెప్పగలవా
స్వేచ్చా ప్రియా?
నీ మానవత్వపు అసలు
రంగు ఈ బూడిద కాదా?
ఉచ్చబోసి
మా గాదెలోని
ధాన్యాన్ని తగలబెట్టి
మా ఆడాళ్ళను చెరిచి
సహచరులను చంపి
మా గుండెల్లో
గాయం చేసిన
ఈ నేరగాళ్ళెవరో కాదు
ఈ నేలపైనే తయారు కాబడ్డ
త్రాచు పాములు, తేళ్ళ
పేరుతో బుసలుకొడ్తున్న
రాజ్య రక్షక భటులు...
కానరావివి మీ ప్రజాస్వామ్యపు
విశాల నేత్రాలకు....
నెత్తురోడుతూ
బూడిదపాలైన
మా జీవితాలకు
సమాధానం చెప్పగలవా
స్వేచ్చా ప్రియా?
నీ మానవత్వపు అసలు
రంగు ఈ బూడిద కాదా?
(చత్తీస్ఘడ్ లోని దంతెవాడ దగ్గరి తర్మెట్ల ప్రాంతంలో ఈ నెల 11న ప్రభుత్వ గూండాల దాడిలో బూడిదైన ఆదివాసీ బతుకు చిత్రం..సోర్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆలోచనాత్మకంగా..