21, మార్చి 2011, సోమవారం

యుద్ధము - శాంతి



చారల టోపీ వాడి

దురహంకారానికి

చిహ్నంగా మరో మారు

నేలమట్టమైన మెసపటోమియా

నాగరికత...


స్వతంత్రతను అంగీకరించలేని

'వాడి' దౌష్ట్యానికి

గుర్తుగా నేడు మిగిలిపోయిన

ఇరాక్ ఓ గాయపడ్డ హృదయం

నెత్తురోడుతున్న దేహం...


చివరి శ్వాశ వదుల్తూ

గర్జించిన ఎడారి సింహం

సద్దాం మనకాలపు వీరుడు...


యుద్ధం యుద్ధం

యుద్ధ మూలాలను

తవ్విపోయడానికి

జరగాల్సింది యుద్ధమే...


యుద్ధం లేని శాంతి

అంతరంగాన అశాంతినే

మిగులుస్తుంది....


యుద్ధం వద్దన్న

నినాదం మిన్నంటిన

వేళ 'వాడు' తుపాకీనే

శ్వాశిస్తున్నాడు...


మరి ప్రజలు సాయుధులు

కాకపోతే

వాడు శవాలపై

శాంతి జెండా ఎగరవేయాలని

చూస్తున్నాడు...


ఈ కుట్రను కుతంత్రాన్ని

ప్రజాయుద్ధమే

జయించగలదు...


(నిన్నటికి ఇరాక్ పై అమెరికా దురాక్రమణ జరిగి ఎనిమిదేళ్ళు పూర్తైన సందర్భంగా వైట్ హౌస్ ఎదుట నిరసన ప్రదర్శనలు జరిగాయన్న వార్త చదివి)

2 కామెంట్‌లు:

ఆలోచనాత్మకంగా..