9, డిసెంబర్ 2011, శుక్రవారం

డిసెంబరు 9ని మోసపూరిత దినంగా పాటిద్దాం



అమ్మలకన్న అమ్మ సోనియమ్మ పుట్టిన రోజు కానుకగా తెలంగాణా ఇచ్చేస్తామని కేంద్ర గృహమంత్రివర్యులు ప్రకటించి అప్పుడే రెండేళ్ళు పూర్తికావచ్చాయి. మళ్ళి కేక్ రెడి అయిపోయింది.. వందలాది మంది విద్యార్థుల, ఉద్యమకారుల పీకలు కోసి నెత్తురంటిన చాకుతో ఈరోజు మరల అమ్మగారి పుట్టిన రోజుకు ముస్తాబవుతోంది. ఇంత పచ్చి మోసపూరిత, దగాకోరు పాలక వర్గానికి వత్తాసుగా ఉద్యమ పార్టీలమని చెప్పుకుంటూ పబ్బంగడుపుతున్న నారకత్వం, అటు అధికార ప్రతిపక్ష వర్గాలలో వున్న తెలంగాణా నపుంసక నాయకత్వం ప్రజలను మోసం జేయడంలో ఎవరికి వారే ముందుంటూ జనం బతుకులను ఆగమాగం జేయడంలో తమదే పైచేయిగా పెత్తనం జేయ జూస్తున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడిన విద్యార్థి యువజన లోకాన్ని తీవ్రమైన నిర్బంధంతో అణచివేసి, ఉద్యోగ సంఘాలంతా చేపట్టిన సకలజనుల సమ్మెను విద్రోహంతో కుప్పకూల్చి పాలకవర్గ తాబేదార్లతో కుమ్మకై ఇప్పుడు అభివృద్ధి మండలి పేరుతో నిధులను దొబ్బి నొక్కేయడాన్కి ప్రయత్నిస్తున్నారు. ఇలా ఆరు దశాబ్ధాల తెలంగాణా ప్రజల ఆకాంక్షను సొమ్ము చేసుకుంటున్న మోసపూరిత రాజకీయ నాయకత్వం నుండి ప్రజా ఉద్యమాన్ని రక్షించుకొని ఉధృతం చేసే బాధ్యతను విద్యార్థి యువజన వర్గం చేపట్టాల్సిన అవసరం నేడు మరింతగా బలపడుతోంది. కావున ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యతను ప్రజాస్వామిక, మేధావి, విద్యార్థి, యువజన, కార్మిక, ఉద్యోగ, రైతు సోదరులంతా కలగల్సి చేపట్టి అమరుల స్వప్నాన్ని నెరవేర్చడానికి ప్రతిన బూనుతూ డిసెంబరు 9 మోసాన్ని ప్రపంచమంతా చాటి చెప్పాలని కోరుకుంటు..

జైతెలంగాణా...

తెలంగాణా పోరులో అమరులైన వారికి జోహార్లు...

అమరుల ఆశయాలను కొనసాగిద్దాం...

జాతుల విముక్తి పోరాటాలు వర్థిల్లాలి....

5 కామెంట్‌లు:

  1. సర్,
    మీరంటే గౌరవం నాకు. మీరు కూడా ఇలా వ్రాయటం బాలేదు. నేను అసదుద్దీన్ గారి దగ్గర నుండి హరీష్ రావ్ గారి దాకా అందరితోనూ విడి విడి గా మాట్లాడాను. అందరినీ ఒక వేదిక మీదకి తీసుకు రావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. పబ్లిక్ లో అయితే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడలేరు. అందరూ వస్తాం అనే అంటారు, ఇంత వరకు విడి విడి గా కూర్చోబెట్టి మాట్లాడిన వాళ్ళే కానీ ఒకచోట కూర్చుని మాట్లాడించారా ? ఏకాభిప్రాయం రాకుండా సోనియా మాత్రం ఏం చేస్తారు ? భార్యా భర్తలు విడిపోవాలన్నా కోర్టు ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తుంది. అటువంటిది ఒక రాష్ట్రం విడిపొవాలంటే ఇరువైపులా ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవద్దా ? అన్నీ తెలిసీ మీరు ఇలా వ్రాయటం ఏం న్యాయం ?

    మీరు ఆ ఎనిమిది పార్టీ పెద్దలనీ ఒక వేదిక పైకి తీసుకురండి , ఏకాభిప్రాయం తీసుకురావడమే కాదు "తెలంగాణా" ని సాధించే బాధ్యత నాది. మనమేమీ చేయకుండా అన్నీ సోనియా మీదకి తోసేయాలని చూడటం భావ్యం కాదు.

    రిప్లయితొలగించండి
  2. సోనియమ్మ మీకు కానిండు చిన్నమ్మ
    ఇనుపగజ్జెలమ్మ యితర ప్రజకు
    మీకు తాయిలమ్ము పెట్టబోయెను గాని
    యెదురుగాలి చూచి బెదరి నిలచె

    మోసగించె ననుచు బుసకొట్టు మీరెల్ల
    తప్పకుండ జూపదగు నిరసన
    తమను మోసగించ దలచిన దనువారు
    తప్పకుండ జూపదగు నిరసన

    రిప్లయితొలగించండి
  3. @నీహారిక గారు మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. నేనిక్కడ చెప్పదలచుకున్నది రెండేళ్ళ క్రితం నాటి ప్రకటన గురించి. సోనియా జన్మ దిన కానుకగా తెలంగాణా ఇచ్చేస్తాం అని ప్రకటన చేసిన ఆమే భజన బృందం ఆ తరువాత తోక ముడిచి తరువాత శ్రీక్రిష్ణ కమిటీ వేసి నేడు అభివృద్ధి మండలి ప్రకటనతో ముందుకు వస్తుంటే ఎవరిని అనాలి. ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఆమె కాదా.. కూచోబెట్టి మాటాడాల్సిన బాధ్యత ఎవరిది? అందుకే ఇలా..మీకు నాపట్ల వున్న అభిప్రాయానికి ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  4. కొంచెం ఆలస్యం గా చదివాను ఈ వ్యాసం. అక్షరాలా అది నిజం. అమ్మ భజన తోనే సరిపెట్టే తొత్తులతో తెలంగాణా మాత్రమే కాదు, ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు తగ్గవి ఏమీ జరగవు. పాలకవర్గాలకు, పార్టిలకు,ధనస్వాములకు కల్సివచ్చేవి మాత్రమే చట్టలుగా రూపొందుతాయి. త్యాగశీలి,కీలుబొమ్మ నాటకం కనబడడం లేదా కళ్ళకు? తెలిసీ ఆత్మవంచన -- లేదా ఏదో స్వార్ధం. అంతే. నిహారిక గారి చింతనకు చింతిస్తున్నాను.అమ్మలు, బొమ్మలు,బాబాలు కాదు -- పటిష్ఠమైన వ్యవస్థ నడిపించాలి, పాలనను. gksraja.blogspot.com

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..