28, మే 2013, మంగళవారం

తప్పనిసరైన ప్రతి హింస..

మొన్న చత్తీస్ ఘడ్ లో మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం ఈ దేశానికి తామే రక్షకులుగా బీరాలుపోతూ యువరాజునుండి గల్లీ లీడర్ల వరకు ప్రకటనలు జారీ చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యం గురించి మాటాడే అర్హత వీరికుందా? 

అత్యంత కౄరంగా ఆదివాసీలపై బస్తర్ ప్రాంతంలో దాడులు కొనసాగించి తమ రాచరికానికి, భూస్వామ్య హక్కులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగలపై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రైవేటు సైన్యంగా సల్వాజుడుం పేరుతో గూండాలను కౄరులను తయారు చేసి ఆదివాసీ గూడేలను ఖాళీ చేయించి కాన్సంట్రేషన్ కాంపులలో వేసి వేయికి పైగా గ్రామాలను ఖాళీ చేసి మూడు లక్షలమందికి పైగా ఆదివాసీలను నిర్వాసితులను చేసి ఆదివాసీ మహిళలను దారుణంగా అత్యాచారం చేయించి, వృద్ధులను పిల్లలను వందలాదిమందిని హత్య చేయించి, తాము స్వయంగా నిర్మించుకున్న పాఠశాలలను వైద్యశాలలను కాల్పించి ఇళ్ళను తగులబెట్టించిన మహేంద్ర కర్మను అటు కేంద్రంలోని కాంగ్రెస్ , రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు ప్రోత్సహించి సాయుధ మూకలతో భీభత్సాన్ని సృష్టిస్తే హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్య మేధావి వర్గాలు అనేక విన్నపాలు, పోరాటాలు, చివరికి సుప్రీం కోర్టును ఆశ్రయించి ప్రైవేటు సైన్యం చేస్తున్న దారుణాలను న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్ళగా వారి ఆదేశాలకు తాత్సారం చేస్తూ చివరికి ఈ గూండా సైన్యాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి తిరిగి వారినందరిని SPO లుగా లైసెన్సులిచ్చింది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలకు వ్యతిరేకంగ ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయించిన మహేంద్రకర్మను చివరికి ఆదివాసీ ప్రజాసైన్యం హతమార్చింది. ఇలా ప్రజా పోరాటాలకు వ్యతిరేకంగా ప్రైవేటు లంపెన్ సైన్యాన్ని తయారు చేసి ఉసిగొల్పడం ఇజ్రాయిల్ నుండి నేర్చుకుందీ ప్రజాస్వామ్య ప్రభుత్వం. 

ఉన్నత న్యాయస్థానం సొంత రిపబ్లిక్ లోని ప్రజలపైకి సైన్యాన్ని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యానించినా ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో పారామిలటరీ బలగాలను కోబ్రాలుగా తయారు చేసి జనంపైకి లక్షల సైన్యాన్ని తరలిస్తూ అత్యంత విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు, MNC లకు అప్పనంగా దొబ్బబెట్టి తాము విలాసవంతమైన జీవితాలను మరో ఏడు తరాలుదాకా జీవించేందుకు లక్షల కోట్లరూపాయలు దాచిపెట్టుకునే  రాజకీయ రాబందులను కాపాడే ప్రభుత్వ నాయకత్వంది ప్రజాస్వామ్యమా? వీళ్ళ అల్లుళ్ళు, పిల్లలు, బందుగణమంతా అవినీతి అరాచకాలకు పాల్పడుతూంటే వారిని వెనకేసుకు వస్తూ నిస్సిగ్గుగా పాలన చేసే ఈ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాటాడే అర్హతుందా??

మధ్య భారతదేశాన్ని దోచుకుపోవడమే ప్రధాన ఎజెండాగా పరిపాలన సాగిస్తూ తమ సైన్యాన్ని అత్యంత కౄరంగా వాడుకుంటూ తమ ఉనికి ప్రశ్నార్థకమౌతున్నందుకు పోరుబాటకు సమాయత్తమయ్యే ఆదివాసీ ప్రజలను ఊచ కోత కోస్తున్నప్పుడు వీళ్ళకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?? 

మధ్యతరగతి బుద్ధిజీవులకు హింసకు ప్రతిహింసకు తేడా తెలీకుండా చేస్తూ కార్పొరేట్ అగ్రకుల మీడియా వార్తా ప్రసారాలతో దోపిడీ పాలకవర్గాలకు వత్తాసు పలుకుతోంది. వీళ్ళకూ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది..

ప్రజా పోరాటాలు వర్థిల్లాలి...

6 వ్యాఖ్యలు:

 1. అయ్యా
  హింసతొ మీరు సాధించగలిగింది ఎమీ లేదు. మీలాంటి ధైర్యవంతులు నాయకులైతె బాగుంటుంది.
  రండి, వచ్చి ఎలెక్షన్స్ లొ పాల్గొనండి. అదొక్కటె అతి తేలికైన మార్గం.
  మీలాంటి నాయకుల కొసం దేశం ఎదురు చూస్తుంది. మనకి కావలసింది పేరు అప్పు తెచుకున్న గాంధిలు , అధికారం అడ్డుపెటుకొని లక్షల కోట్లు సంపాదించి మళీ వాటితొ అధికారం లోకి వద్దమనుకొనె దొంగ జగన్లు , అబ్బ అయ్య పెరు చెప్పుకొని వొట్లు అడుక్కునె వెధవలు కాదు.
  ఈ ఆటలొ ఈ వెధవలు బాగా పండిపొయారు. వాళ్లని ఆ ఆటలొనె కొట్టాలి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఎలక్షన్ అంటేనే మావోయిష్టులకు పరమ చిరాకు. ప్రజలకు తమ మంచి యేదో చెడు యేదో తెలుసుకొనే విచక్షణాజ్ఞానం ఉంటుందని వారు నమ్మరు. అటువంటి జ్ఞానం ప్రజలకు ఉండటాన్ని యేమాత్రం అంగీకరించరు కూడా. అతిపవిత్రమైన తుపాకీగొట్టమే రాజ్యాథికార సాథనం అనీ, అలా అథికారానికి వచ్చే హక్కు తమకే ఉందనీ వాళ్ళ నమ్మకం. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసేది పరమపవిత్రహింస. హింస చేసే అధికారం, ప్రశ్నించే అధికారం లాంటి పిచ్చి హక్కులు ప్రజలకు గాని మరెవరికి గాని ఉండవనీ‌ ఉండరాదనీ వారి స్థిరాభిప్రాయం. అందుచేత వార్రికి యెవరూ‌ సలహాలు ఇవ్వరాదు. ఇచ్చి ప్రయోజనము ఉండదు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అయ్యా శ్యామలీయం గారూ మీకు మన ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలుగానే కనిపిస్తున్నట్టుంది. మన దేశంలో ఎన్నికల ద్వారా ఎంత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందో గోచీ కట్టుకోని పసి బుడ్డోడికైనా ఎరుకే. స్కాములు, బెట్టింగులు, మద్యం వ్యాపారులు, గూండాల నేపధ్యంలో జరిగే ఎన్నికలు వాటి ద్వారా ఎన్నుకోబడుతున్న నాయకులు, వారి వారసుల ద్వారా జరుగుతున్న పాలన చూస్తూ కూడా మీరింకా ఈ నేతి బీరకాయలోంచి నెయ్యిని తీసే విఫలయత్నాన్ని ఇంకా కొనసాగిస్తూ వుండటం శోచనీయం. మావోయిస్టులు ఎవరి ప్రశ్నించే అధికారాన్ని కూల్చేసారో సెలవిస్తారా? అసలు ఈ దేశంలో ప్రశ్నించే అధికారాన్ని పాలక వర్గాలు సహిస్తున్నాయా?? రాజకీయ నాయకులు ప్రశ్నిస్తేనే సిబిఐ దాడులు హత్యా యత్నాలు చేసే పాలక వర్గాల విధానం మీకు ఎరుకలో లేదా?? సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించే వారిని బతకనిస్తున్నారా?? ఈ ఎన్నికల మాఫియా భ్రమల నుండి బయటపడండి. మీరేమైనా ఎప్పుడైనా సలహాలు ఇచ్చారా వారికి. ప్రజల నుండి వచ్చే సలహాలు ఆలోచనలను తమ విధి విధానాలలో మార్పులను తీసుకు వచ్చేందుకు విప్లవ పార్టీలెప్పుడూ ముందుంటాయి. లేకపోతే అవి కాలగర్బంలో కలిసిపోతాయి. ఇన్నేళ్ళు ప్రజలలో మనలేవు. విజ్నులైన మీరు కార్పొరేట్ మీడియా వార్తలపైనే ఆధారపడకుండా స్వతంత్రంగా ఆలోచించగలరని మనవి.

   తొలగించు
  2. మీరు చెప్పిన వాటిలో అనేక సత్యాలూ పాక్షికసత్యాలూ ఉన్నాయి.
   కాని విప్లవం పేరుతో మార్పు తీసుకు రావటం అంటే నచ్చని ప్రతీ వ్యక్తినీ, వస్తువునూ, భావజాలాన్నీ హింసాగ్నిలో దగ్ధం చేసెయ్యటమేనా సరైన పధ్ధతి?
   ఇతరులు హింసకూ అరాచకత్వానికి ఒడిగడుతున్నారని అరోపిస్తూ మీరూ దానికే దిగుతున్నారు కదా, మరింత తీవ్రస్థాయిలో.
   అలాంటప్పుడు మిమ్మల్ని మాత్రం యెందుకు నమ్మాలీ? యెందుకు సమర్థించాలీ అన్న ప్రశ్న రాదా చెప్పండి?
   వ్యవస్థలో మార్పు తీసుకుని రావాలన్న మీ‌ ఆకాంక్ష మెచ్చదగినదే.
   కాని మీ విధానం సరైనది కాదని నా అభిప్రాయం.

   తొలగించు
 3. అయ్యా జి కే గారు మీరు అమాయకులు అనుకొంటాను, హింసతో ప్రభుత్వోమ దేన్నీ అన్న సాధించ వోచ్చుఅని నొక్కి చేపుతోన్నదిగా ????????????

  ప్రత్యుత్తరంతొలగించు
 4. No Mr. Vin. I am not sure what is your definition of innocence. And I am not sure if you have patience to understand what I am saying. But I will make an attempt.
  I am lucky enough to experience more than one type of governments and cultures and also lucky enough to interact with people from almost all continents with lot of experiences. As Syamaleeyam said, (and as in movie 'gamyam' too ) our politicians and moists/naxalites/rightwing communist/extreme religious zealots all fall into same category with tiny differences on surface.
  I will give you an example about non-violence and democracy : take LTTE and Tamilian's problems in SriLanka. Since 1970s LTTE killed its own people and others. If they simply pursued non-violence and democratic path, I am sure they would have achieved significant power and rights in SriLanka by now. But no. Picking gun seems easy way out. and that is what they did.
  If power or gun given to un-qualified or irresponsible people, it makes them blind. So, the ONLY easiest way is make people think and inject some commonsense. Though it looks simple, it is most difficult thing. Though picking a gun and shooting seems easiest and quick way out of situation, probably we are marching in reverse direction.

  regards
  Krishna

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..