29, జూన్ 2013, శనివారం

నల్ల సూరీడు..




















 నువ్వలానే గుర్తు నాకు
చూపులలో విస్ఫులింగాలను ప్రతిఫలిస్తూ
పిడికిలెత్తి పోరాట పతాకాన్నెత్తి పట్టినట్టు...

చీకటి ఖండంలో వెలుగులు నింపే
నీ యుద్ధ దరహాసం మెరుస్తున్నట్టు...

ఎందుకో
మరల మరల
అదే మాట మండే సూరీడు మండేలా
అంటూ గుండెల్లో పోటెత్తావు...

కానీ

పాతికేళ్ళు చీకటి కొట్లో దాచిన
వాడి జాత్యహంకారం నీకో శాంతి బహుమతినిచ్చినప్పుడు
చాచిన నీ చేతులు అంటే కోపమొచ్చింది...

నిన్నో స్టాంపును జేసి ఉమ్మినంటించే
వాడి కుట్రను నవ్వుతూ స్వీకరించావని
కోపమొచ్చింది...

అయినా
ఎప్పటికీ నల్ల సూరీడంటే
గుర్తుకొచ్చేది నువ్వే నువ్వే...

(మండేలాకు ప్రేమతో)


3 కామెంట్‌లు:

  1. ఎంత నిజాన్ని చెప్పారు 'కవివర్మ' గారూ. హృదయానికి హత్తుకునేట్టుగా ఉంది.

    రిప్లయితొలగించండి
  2. మీరు రాసే విధానం ఆకట్టుకుంటుంది. I LIKE THIS

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు అనూ గారు, తర్కం సార్..

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..