యుక్త వయసులో ఈ పేరు వింటే ఆ ముఖమెప్పుడూ చూడకపోయినా ఒక ఉద్వేగం కలిగేది. పీపుల్స్ వార్ పార్టీ పేరు రేడియోలో వినని రోజంటూ వుండేది కాదు. ఆంద్రప్రదేశ్ నుండి ఉత్తర భారతం వైపు ప్రజా ఉద్యమాన్ని అడుగులు వేయించిన మహా యోధుడు ప్రజా యుద్ధ వీరుడు. అంతిమ దశలో అనారోగ్య కారణాల వలన యుద్ధభూమినుండి మరలి వచ్చినా ఆయన ఆచరణ సైద్ధాంతిక దృక్పధం ఆలోచనా ధార భారత ప్రజాతంత్ర విప్లవ కార్యాచరణకు ఆయుధాలే.
జోహార్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జోహార్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, ఏప్రిల్ 2013, శుక్రవారం
జోహార్ కొండపల్లి సీతారామయ్య..
యుక్త వయసులో ఈ పేరు వింటే ఆ ముఖమెప్పుడూ చూడకపోయినా ఒక ఉద్వేగం కలిగేది. పీపుల్స్ వార్ పార్టీ పేరు రేడియోలో వినని రోజంటూ వుండేది కాదు. ఆంద్రప్రదేశ్ నుండి ఉత్తర భారతం వైపు ప్రజా ఉద్యమాన్ని అడుగులు వేయించిన మహా యోధుడు ప్రజా యుద్ధ వీరుడు. అంతిమ దశలో అనారోగ్య కారణాల వలన యుద్ధభూమినుండి మరలి వచ్చినా ఆయన ఆచరణ సైద్ధాంతిక దృక్పధం ఆలోచనా ధార భారత ప్రజాతంత్ర విప్లవ కార్యాచరణకు ఆయుధాలే.
24, మార్చి 2010, బుధవారం
పార్వతీపురమా నీ తలపై కుట్రకేసు

కా.కానూ సన్యాల్ ఆత్మహత్య సందర్భంగా పార్వతీపురం కుట్ర కేసు మరల వినిపిస్తోంది. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద కుట్రకేసు. సుమారు 150 మందిపై మోపబడింది. నాటి శ్రేకాకుళ గిరిజన రైతాంగపోరాటంలో పాల్గొన్న, సహానుభూతి చూపించిన, ప్రజాకళాకారులపై ఈ కుట్రకేసు మోపబడింది. ఇందులో కా.సన్యాల్ మొదటిముద్దాయి. ఈ కేసులోనే ఆయన విశాఖ కేంద్ర కారాగారంలో ఏడేళ్ళు మగ్గారు. జైలు జీవితంలోనే ఆయన తన సైద్ధాంతిక దృక్పధంనుండి బయటపడడంతో, జ్యోతిబసు చొరవకూడా తోడై విడుదల చేయబడ్డారు. ఈ కేసులో ముద్దాయిలుగా చూపబడ్డ వారిలో సుమారు ఏభై మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నా సరే వారిని కోర్టుకు హాజరుపరచకుండా మాయం చేసారు నాటి జలగం బలగం. అది ఆ ఉద్యమ హోరు పట్ల రాజ్యం వణికిన విషయాన్ని స్పష్టం చేస్తుంది. నక్సల్బరీ గ్రామంలో మొదలైన నిప్పురవ్వ పార్వతీపురం కొండల్లో అగ్గి రాజేయడం, అది నేడు భారతదేశమంతా అల్లుకొనడం, అమ్ముడుపోయిన మన నాయకత్వం నేడు గజగజలాడుతూ, తమ ముడ్డికింద సింహాసనం కదలబారుతున్న క్రమాన్ని తట్టుకొనలేక అంతర్గత భధ్రత పేరుతో ఆపరేషన్ గ్రీన్ హంట్ ను పరేషాన్ తో మొదలెట్టి గిరిజనాన్ని అతలాకుతలం చేస్తూ, దేశ నడిబొడ్డులో సైనిక కవాతు చేస్తూ తన ఉక్కుపాదాన్ని మోపుతోంది. యిదంతా నాటి కా.చారుమజుందార్, కా.సన్యాల్, కా. జుంగల్ సంతాల్ మొ.న నాయకుల సైద్ధాంతిక స్ఫూర్తితో మొదలిడిన పోరాట రూపాంతరం. నేటికీ నాటి పరిస్థితులలో కానీ, జన జీవనంలోగానీ మార్పు రానితనం పోరాట అవసరాన్ని గుర్తుచేస్తోంది.
ఉద్యమంతో పాటు ఎదగలేకపోవడం, ప్రజల డిమాండ్ కనుగుణంగా మారలేకపోవడం కా>సన్యాల్ ఆత్మహత్యకు కారణం కావొచ్చు. ఏమైనా ఆయన తొలినాటి స్ఫూర్తి ఆచరణీయం. ఆయనకు విప్లవ జోహార్లు..
ఈ లింక్ లో ఈ కుట్రకేసు గురించి చదవొచ్చుఃhttp://books.google.co.in/books?id=9i5sNMNh_uIC&pg=PA598&lpg=PA598&dq=parvathipuram+conspiracy+case&source=bl&ots=XE4Az-DHif&sig=-ZhBsPKI_J2NZCYltCnsjzoK-6s&hl=en&ei=jJCpS9eyB8q4rAf9rqyHAg&sa=X&oi=book_result&ct=result&resnum=6&ved=0CB8Q6AEwBQ#v=onepage&q=parvathipuram%20conspiracy%20case&f=false
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)