10, అక్టోబర్ 2009, శనివారం

రాజ్యం ఉక్కుపాదంలో దిగబడిన ముల్లు మన బాలగోపాల్


కా.బాలగోపాల్ వంటి మేధావిని సమయంలో కోల్పోవడం మనందరి దురదృష్టం. హక్కుల ఉద్యమ చుక్కాని లేని నావ అయ్యింది. రాజ్య హింస నేడు అనేక కొత్త రూపాలలో ప్రజలపై దాడులు చేస్తుంటే తాను ముందుగానే వాటిని తెలుసుకొని అందరిని జాగురూకులనూ చేసిన మహా దార్శనికుడు. ఆయన నిన్నటివరకు మనమధ్య తిరుగాడిన లివింగ్ లెజెండ్. సమకాలిన మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలలో అత్యంత నిబద్ధత కలిగిన వారు. అణగారిన ప్రజల చేతిలో ఎక్కుపెట్టిన విల్లు.
బాలగోపాల్ గారితో నాకు ఎనభై ఏడు నుండి పరిచయం వుంది. డిగ్రీ చదివిన తరువాత అదే వూపులో పౌరహక్కుల సంఘం సభలకు తరచుగా హాజరయ్యేవాడిని. సార్ విశాఖ వస్తారని తెలియగానే వెళ్ళేవాడిని. ఆయన వున్నన్నాళ్ళు కలిసి వుండే వాడిని. వి.ఎస్. కృష్ణా (ఇప్పుడు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి) గారి ఇంటిలో బసచేసేవారు. కృష్ణ జే.ఎన్.యు.నుండి వచ్చిన కొత్తలో చాలా ఇటరెస్టి౦గ్ గా వుండే వాడు. పుస్తకాలు పై చర్చలు జరిగేవి. రోజుల్లో ఎక్కడ ఎదురుకాల్పులు జరిగినా, వరకట్న హత్యలు జరిగినా, దళితులపై దాడులు జరిగినా సార్ వెంటనే వచ్చేవారు. పౌరహక్కుల సంఘానికి తానె అన్నిఅయి పనిచేసేవారు. ఎంతటి ఇ౦టీరియల్ ప్లేస్ అయినా ధైర్యంగా వెళ్ళే వారు. నిజనిర్ధారణ కమిటి పేరుతొ మిగతా సంఘాలను కూడా కలుపుకొని అక్కడి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసేవారు. సమస్య ఎక్కడ వుంటే అక్కడ బాలగోపాల్ వస్తారని అంతా ఎదురుచూసేవారు. పోలీసులకు నిద్ర పట్టేది కాదు. దాంతో తనపై రాజమ౦డ్రిలో దాడి చేసి చ౦పబోయారు. దగ్గరలో వున్న ప్రజలు కాపాడడ౦తో తలపై బలమైన గాయంతో బయటపడ్డారు. తరువాత రాజ్యహింస తో పాటు ఉద్యమ హింసను కూడా వ్యతిరేకించాలనే తీర్మానంతో ఆయన సి.ఎల.సిలో చర్చ పెట్టారు. కాని ఒక బలీయమైన రాజ్యంతో పోరాడుతున్న క్రమంలో ఇన్ఫార్మర్ వ్యవస్థను అమలుచేస్తూ ఉద్యమం మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు తప్పని సరై వాళ్ళని మట్టు పెట్టడంను, రాజ్యం అత్య౦త పాశవికంగా దాడులు చేస్తున్నప్పుడు వారి బలగాలను అడ్డుకోవడానికి పోలీసులనుకూడా మందుపాతరలతో చంపక తప్పని స్థితిని హింసగా పేర్కొనడాన్ని మెజారిటి సభ్యులు వ్యతిరేకించడంతో తాను పౌరహక్కుల సంఘం నుండి బయటకు వచ్చి మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే పోలిసులు సాగించిన కట్టుకథల ఎదురుకాల్పుల స౦ఘటనలకు వెంటనే స్పందించేవారు. రాజ్యానికి ఎప్పుడూ లోకువ కాలేదు. పూర్తికాలం హైకోర్టు న్యాయవాదిగా వుంటూ పేదల పక్షాన అనేక కేసులు వాదిస్తూ వారికి న్యాయాన్నిఅతి తక్కువ ఖర్చులూ అందుబాటులోకి తేవడానికి తన శాయశక్తులా కృషి చేసారు. మద్యన విజయనగరం జిల్లాలోని రాష్ట్రంలోనే అతి పెద్ద జూట్ మిల్లుగా పేరుగాంచిన నెల్లిమర్ల కార్మికుల జీతాలపై వారికి అనుకూలంగా తీర్పు తెచ్చారు. అలాగే లాకప్ డెత్లు ఆనాడు విరివిగా జరిగేవి. ఎవరూ పోలీసులకు వ్యతిరేకంగా మాటాడని రోజుల్లో తాను నిజనిర్ధారణ చేసి అనేక కేసులను హైకోర్టు వరకు తీసుకుపోయి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి దర్యాప్తు జరిగేట్లు చేయడానికి ఆయనే కారణం. అలాగే మరణించిన ఉద్యమకారుల పార్థీ శరీరాలను అతి దయనీయంగా పోలిసులు పాతేస్తూ, కిరోసిన్ పోసి కాల్చేస్తూ చివరి స౦స్కారానికి కూడా వారి బంధువులకు అవకాసం లేకుండా చేసేవారు. అలాగే పోస్టుమార్ట౦ తంతు కూడా వారికి అనుకూలంగా చేసుకునేవారు. వీటిపై కన్నాభిరాన్ గారితో కలిసి హైకోర్టులో పోరాడి సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి పోస్టుమార్టం కూడా నిపుణులైన డాక్టర్ల బృందంతో వీడియో తీస్తూ జరిగేట్టు కృషి చేసారు. గిరిజన ఆదివాసి ప్రా౦తాలలో ప్రతియేడు జరుగుతున్నా విషజ్వరాలపై వారి తరపున అలుపులేని పోరాటం చేసారు. అలాగే ప్రభుత్వం తూర్పు గిరిసీమలలోని బాక్సైటు ఖనిజాన్ని కొల్లగొట్టి ప్రైవేటు కంపెనీలకు అమ్మేదానిపైనా అల్యుమినా ఫ్యాక్టరీ పెడితే కలిగే అనర్దాలపైన తీవ్రమైన పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచారు. అలాగే ద౦డ కారణ్యంలో సల్వాజుడుం పేరుతొ ఆదివాసి తెగలమధ్య పెట్టిన కార్చిచ్చుతో జరుగుతున్నా అమానవీయ హింసకు వ్యతిరేకంగా తను సొంతంగా పర్యటించి వ్యాసాలూ రాసి, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేసి పోరాటం చేస్తున్నారు. రాజ్యం పౌరుల హక్కులను హరి౦చే ప్రతి అంశంను న్యాయస్థాన౦ దృష్టికి తేవడానికి తద్వారా అభాగ్యులకు అ౦డగా నిలవడానికి అహర్నిశలు తన ఆరోగ్యం క్షీణిస్తున్న కృషి చేసిన నిరాడంబర జీవి. ఏనాడు అవార్డుల కోసం ఎదురుచూడని మనిషి. మద్య ఇస్తున్న రామన్ మాగాసేసే అవార్డు గ్రహీతలను చూస్తుంటే నవ్వు వస్తుంది. రాజ్యానికి అనుకూలంగా వున్న వారికి ఇలాంటి సత్కారాలు లభిస్తుంటాయి. అవి రాకపోవడమే బాలగోపాల్ నిబద్ధతకు తార్కాణం. తన చివరి ఉపిరి వరకు పేదల, దళితుల పక్షాన నిలిచి తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మనిషి మరి లేకపోవడం హక్కుల ఉద్యమానికే కాదు శ్రామిక, కార్మిక ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు తాడిత, పీడిత ప్రజలకు తీరని లోటు. ఇది ఇప్పట్లో భర్తీ అయ్యేది కాదు. పూర్తికాలం తనలా జీవితాన్ని అంకితం చేసిన మానవీయ కార్యకర్త, మేధావి ఉద్యమానికి దొరకడం చాలా కష్టం. తాను ప్రొఫెసర్ గానే కొనసాగి, గణితం లోనే పరిశోధనలు సాగించి ఉంటే భారత దేశానికి రంగంలో నోబెల్ తెచ్చేవార౦ట, అంతటి మేధావిని ఇంత తొందరగా కోల్పోవడం మనందరి దురదృష్టం. ఆయన రాజ్యం ఉక్కుపాదంలో దిగబడిన ముల్లు.

21 కామెంట్‌లు:

  1. ఆయన మిత్రులు, సహచరులు రాసిన tributes అన్ని యిక్కడ చూడొచ్చు -
    http://balagopal.org/

    రిప్లయితొలగించండి
  2. చనిపోయిన వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడకూడదు గానీ, మీ ఆఖరి వాక్యానికి మాత్రం నవ్వొస్తోంది. అతిశయోక్తులకైనా కాస్త హద్దుండాలి.

    రిప్లయితొలగించండి
  3. LOL, cant publish my comment .. Can you? Truth always hurts :))

    When you ask for a discussion you should be prepared for criticism too

    రిప్లయితొలగించండి
  4. "రాజ్యహింస రాజ్యహింస రాజ్యహింస...."

    నా చిన్నప్పట్నుంచి వింటున్నానీ ఆవే్దన. కానీ రాజ్యహింసకి మూలాలు ఎందులో ఉన్నాయి ? అని ఆలోచించినవాళ్లెవరూ కనిపించలేదు, దానికి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళతో సహా !

    రాజ్యహింస మూలాలు - మన యావజ్జీవితాన్నీ గుప్పిట్లోకి తెచ్చుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాయి. అన్ని రంగాల్నీ శాసించగల, అన్ని రంగాల మీదా యథేచ్ఛగా శాసనాలు చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్న రాజకీయ నాయకుల్లో ఉన్నాయి. ప్రజలకి ఈ నిరంకుశ ప్రజాస్వామ్య ప్రభుత్వాల నుంచి విముక్తి కావాలి. ఈ ప్రభుత్వ ఏకపాత్రాభినయం నుంచి మోక్షం కావాలి. ప్రజలకీ, ప్రజా సంస్థలకీ ప్రభుత్వజోక్యం పోయి స్వయంప్రతిపత్తి రావాలి. ప్రభుత్వం సర్వం తానే అయి భగవంతుడి అవతారాన్ని ధరించిన ఈ దారుణ నియంతృత్వయుగం అంతం కావాలి. ఇదంతా జఱగాలంటే ఈ ప్రభుత్వాల మీద పెట్టుకున్న పాతకాలపు సోషలిస్టు భ్రమలు తొలగాలి. ప్రజల్లో తమ వ్యక్తిగత శక్తియుక్తుల మీద తమకి విశ్వాసం పెఱగాలి. అన్నీ ప్రభుత్వమే చెయ్యాలనే ధోరణి నుంచి మనం బయటపడాలి.

    -- తాడేపల్లి

    రిప్లయితొలగించండి
  5. Ahhaa ... now lemme see whether you will publish this

    తాను ప్రొఫెసర్ గానే కొనసాగి, గణితం లోనే పరిశోధనలు సాగించి ఉంటే భారత దేశానికి ఆ రంగంలో నోబెల్ తెచ్చేవార౦ట,
    __________________________________________________

    This is funny! అభిమానం ఉండడంలో తప్పులేదు. కానీ అతిశయోక్తులకైనా అర్ధం ఉండాలి.

    రిప్లయితొలగించండి
  6. అనంతపురం జిల్లా ధర్మవరం "వార్త" పత్రిక ఆఫీస్ లో పని చేస్తున్న సుబ్బారెడ్డి గారు కూడా పౌర హక్కుల సంఘం సభ్యులే. అతని సొంత ఊరు కర్నూల్ జిల్లా నల్లకాల్వ గ్రామం. నల్లమల అడవుల్లో చెంచుల జీవితాల గురుంచి అతని బ్లాగ్ http://swechakosam.blogspot.com లో వ్రాసారు. అతను బాలగోపాల్ గారిని కూడా కలిశారేమో. కలిసి ఉంటే బాలగోపాల్ గారితో తన అనుభవం గురించి వ్రాస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  7. కుమార్‌ గారూ,
    మీరు, "తాను ప్రొఫెసర్ గానే కొనసాగి, గణితం లోనే పరిశోధనలు సాగించి ఉంటే భారత దేశానికి ఆ రంగంలో నోబెల్ తెచ్చేవార౦ట, అంతటి మేధావిని ఇంత తొందరగా కోల్పోవడం మనందరి దురదృష్టం." అని రాశారు.
    మీరు ఇన్ని విషయాలు ఇంత అభివృద్ధికరంగా రాస్తూ, "నోబెల్‌" మీదా, "భారత దేశానికి తేవటం" మీదా ఇటువంటి భ్రమలు వుండటం ఎంతో విచారకరం. ఈ పెట్టుబడి దారీ వ్యవస్థలో అటువంటి బహుమతులూ, అవి దేశానికి తేవడంలో వున్న గొప్పా లాంటి చెత్త విషయాలు మీకు తెలియవనే అనుకోవాలా? మామూలు వాళ్ళు ఇలాంటివి రాస్తే పట్టించుకోనక్కర్లేదు. మీలాంటి వాళ్ళు రాస్తేనే, చదవడానికి కష్టంగా వుంటుంది. అవి కుహనా విలువలని ప్రోత్సహిస్తాయి కాబట్టీ.

    రిప్లయితొలగించండి
  8. @మలక్పేటరౌడి: "ఆయన ఢిల్లీలో ఉండగా అంతర్జాతీయ గణిత శాస్త్ర పత్రికలకు సంపాదకుడుగా వ్యవహరించారు, అందులోనే కొనసాగితే గణితంలో నోబెల్‌ ప్రైజు వచ్చేదని తర్వాత కాలంలో ఆయన ప్రొఫెసర్లు చెప్పారు."- వరవరరావు

    రిప్లయితొలగించండి
  9. కమలగారు నాకు వాటిపై భ్రమలు లేవు. కానీ ఎంతోమంది ఆయన గురించి అలా అన్న విషయం రాసాను. నిజానికి ఒబామాకు ఇచ్చిన తరువాత దాని క్రెడిబిలిటీ మరింత దిగజారిందనుకుంటా. రాజకీయమయం, వ్యాపారమయం కాబడ్డ వాటిని కొలమానంగా పేర్కొనడం నా తప్పే. క్షంతవ్యుడిని. ఈ విషయమై నన్ను హెచ్చరించినందుకు ధన్యవాదాలు. ఆయన హక్కుల కార్యకర్తగా ఎంతో మంది జీవితాలలో విషాదాన్ని తుడిచిన మనిషిగా వచ్చిన గుర్తింపుముందు ఇది ఏమాత్రం. ఒకమారు మాకు దగ్గరలోని గిరిజన గ్రామంపై పోలీసులు దాడిచేసి మావోయిస్టులకు సహకరించారని 14 మందిని అక్రమంగా అరెస్టు చేసి 10 రోజులుపైగా కస్టడీలో వుంచితే సార్ కు ఫోం చేసి వివరాలిస్తే వెంటనె హెబియస్ కార్పస్ పిటిషం వేసి వాళ్ళ విడుదలకు మార్గం చూపారు. ఇప్పుడు అలాంటి హెల్ప్ లైం నం, లేక ఈ చివరనున్న మాలాంటి వారికి ఎంత కష్టం. అలాంటి నిబద్ధత కలిగిన వారు మరల ఇంత తొందరగా అగుపిస్తారా?

    రిప్లయితొలగించండి
  10. ఇక్కడ "ముళ్లు" అనే బహువచనం సాభిప్రాయమేనా ? "ముల్లు" అని ఉండాలనుకుంటా ?

    -- తాడేపల్లి

    రిప్లయితొలగించండి
  11. Mahesh,

    This author did not quote Varavararao or the professors in this article.

    May be I can ask a specific question in this matter ( if this comment ever gets published )


    ఇప్పటిదాకా గణితంలో నోబెల్ బహుమతి ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి వచ్చిందో ఈ కమ్యూనిష్టు మేధావులెవరైనా చెప్పగలరా?

    రిప్లయితొలగించండి
  12. Thank you LBS గారు. సార్ చనిపోయిన రోజు నేను ప్రయాణంలో వుండి రెండు రోజుల తరవాత వచ్చాను. ఆ గాభరాలో రాసినప్పుడు అది ఎంత మార్చినా అలా వచ్చింది. మరల ఇప్పుడు ప్రయత్నిస్తే కరెక్టు అయింది. మీ ఆత్మీయ సూచనకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. చాలా బాగా రాశారు, కుమార్ గారూ.
    నోబెల్ ప్రస్తావన గురించి గుడ్డుకీకలు పీకే మేధావుల్లారా, అదొక వ్యక్తీకరణ .. అంతకంటే ఆ ప్రస్తావనలో కెలికి బయటకి తియ్యాల్సిన గూఢార్ధాలేం లేవు.

    రిప్లయితొలగించండి
  14. మలక్ పేట రౌడీ గారికి మీ కామెంటులు ప్రచురణకు అంగీకరించరేమోనని సందేహమెందుకు, నేను 7 నుండి 10 వరకు దూరప్రయాణంలో వుండి బ్లాగుచూడలేదు. అన్నీ ఒకేసారి రావడంలో నాకు కొంత కంప్యూటర్ పరిజ్నాణం తక్కువ కారణంగా మిస్ అయివుండొచ్చు. కానీ నేను మోడరేట్ చేసాక ప్రచురించేవిధంగా ఏర్పాటు తరవాత కొంతమంది అసహనాలు, రెచ్చగొట్టే కామెంట్లు తగ్గాయి. ఇంక మీరు కోరిన వివరణ,
    నోబెల్ ప్రైజులో గణితానికి ప్రత్యేకంగా స్థానం లేకపోయినా ఆ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఇతర రంగంనుండి పొందిన వారు బెట్రాండ్ రస్సెల్(సాహిత్యం), జాం నాష్(ఆరిథిక)యిలా చాలామంది వున్నారు. నోబెల్ తో సమానమైన గణితశాస్త్రజ్నులకిచ్చే ఎబుల్ ప్రైజుకు అర్హుడై వుండేవారు. ఒక వ్యక్తి కృషిని గుర్తించేక్రమంలో అత్యున్నతమైనదానికి అర్హుడుగా పేర్కొనడం అతిసయోక్తి కాదు. అది ఆయనకు మనమిచ్చే గౌరవంనకు సూచికగానే తీసుకుంటారు ఎవరైనా. చర్చనో, లేక విషయా్న్నో పక్కదారి పట్టించే వ్యాఖ్యగా నేను అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  15. కాని ఒక బలీయమైన రాజ్యంతో పోరాడుతున్న క్రమంలో ఇన్ఫార్మర్ వ్యవస్థను అమలుచేస్తూ ఉద్యమం మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు తప్పని సరై వాళ్ళని మట్టు పెట్టడంను, రాజ్యం అత్య౦త పాశవికంగా దాడులు చేస్తున్నప్పుడు వారి బలగాలను అడ్డుకోవడానికి పోలీసులనుకూడా మందుపాతరలతో చంపక తప్పని స్థితిని హింసగా పేర్కొనడాన్ని మెజారిటి సభ్యులు వ్యతిరేకించడంతో తాను పౌరహక్కుల సంఘం నుండి బయటకు వచ్చి మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేసుకున్నారు.
    ===
    This is what makes him great.

    రిప్లయితొలగించండి
  16. Kumkar garu,

    oops sorry again ... I thought it was deliberate.


    ముందు మీరన్న మాట - తాను ప్రొఫెసర్ గానే కొనసాగి, గణితం లోనే పరిశోధనలు సాగించి ఉంటే భారత దేశానికి ఆ రంగంలో నోబెల్ తెచ్చేవార౦ట,

    Note - "ఆ రంగం"

    ఇప్పుడు అంటోంది - "ఆ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఇతర రంగంనుండి పొందిన వారు"

    Note - "ఇతర రంగం"


    ఇక్కడ నేను మిమ్మల్ని అనట్లేదు. దయచేసి అపార్ధం చేసుకోవద్దు. కోట్ చేసిన వరవరరావు లాంటి మేధావులనే అంటున్నా. అందరికీ తెలిసిన ఈ విషయంలోనే మనుషులని పక్కదారి పట్టిస్తుంటే ఇక ఎవరికీ తెలియని అడవుల్లో జరుగుతున్న విషయంలో ఇదేపని చెయ్యట్లేదన్న నమ్మకం ఏమిటి?


    ఇక కొత్తపాళీ గారికి ... వ్యక్తీకరణ! ఆహా!! దానికి పరిమితులుండవు కదా? అయినా దీనికి కుమార్ గారి బ్లాగు పాడు చెయ్యడం దేనికి, బయటే చెప్తా సమాధానం.

    రిప్లయితొలగించండి
  17. Suryudu gaaru ee diguva chupina linklo konni vivaraalu unnaayi. chudagalaru. http://en.wikipedia.org/wiki/Nobel_Prize Lack of a Nobel Prize in Mathematics

    There is no Nobel Prize in Mathematics, which has led to considerable speculation about why Alfred Nobel omitted it.[33][34] Some recipients of the Nobel Prize in other fields also have notable achievements in or have made outstanding contributions to mathematics; for example, Bertrand Russell was awarded the Nobel Prize in Literature (1950) and Max Born and Walther Bothe shared the Nobel Prize in Physics (1954). Some others with advanced credentials in mathematics and/or who are known primarily as mathematicians have been awarded the Bank of Sweden Prize in Economic Sciences in Memory of Alfred Nobel: Kenneth Arrow (1972), Leonid Kantorovich (1975), John Forbes Nash (1994), Clive W. J. Granger (2003), Robert J. Aumann (who shared the 2005 Prize with Thomas C. Schelling), and Roger Myerson and Eric Maskin (2007).
    # ^ Lars Gårding and Lars Hörmander, "Why Is There No Nobel Prize in Mathematics?", Mathematical Intelligencer 7 (1985): 73-74. [They suggest that, primarily, Nobel did not consider Mathematics as "practical" as the other disciplines in which he established Prizes.]
    # ^ John E. Morrill, "Nobel Prize in Mathematics", American Mathematical Monthly 102.10 (December 1995): 888-92. JSTOR doi:10.2307/2975266. (5 pages.) (Restricted access.) [Summary of various speculations about reasons for Nobel's omitting a Prize in Mathematics, including possibly-apocryphal ones.]

    రిప్లయితొలగించండి
  18. Kumar garu,

    As you yourself have said .. "Some recipients of the Nobel Prize in other fields also have notable achievements in or have made outstanding contributions to mathematics"


    Which essentially means that people who for Nobels in the otehr fields ALSO worked on Mathematics. It does not mean that people who did good work in Math got Nobel prizes in the other fields.

    (Even in case of John Nash, he was awarded the Noble for the applications of Gaming theory in Economics, but not for the Gaming theory)

    రిప్లయితొలగించండి
  19. @మలక్పేట రౌడి: మీ గుడ్డుమీద ఈకపీకుడు ఎలా వెళ్తోందో అర్థం కావడం లేదు! are you really trying to make some point about Balagopal through this?

    రిప్లయితొలగించండి
  20. I am NOT trying to make any point on Balagopal. I am only talking about what has been written.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..